పోస్ట్‌లు

పద్యం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మార్గశీషమాసప్రియునికి యేటికోళ్ళు

చిత్రం
మాసానాం మార్గశీర్షోऽహమ్ - అని భగవద్గీత. మార్గశిర మాసం సందర్భంగా, ఈ మాసం అత్యంత ప్రియమైన అంబరమంటిన దేవరకు ఒక ఉత్పలమాల. ఉ|| అంబరవాహినీసుమహితార్చితకుంకుమపాదయుగ్మికిన్ అంబుజనేత్రికిన్ అతివ యంబుజసంభవునింతి మామకున్ అంబరమంటుదేవరకు, అంబకు కందువ కూర్మి గూర్పెడున్ శంబరహంతతండ్రికిని చక్కని స్వామికి టెంకణమ్ములున్. పనిలో పనిగా అందరికీ ఆంగ్లనూతనసంవత్సర శుభకామనలు.

ఛత్రబంధము

చిత్రం
తే. గీ || శ్రీనిధి! మనుజధవ! శ్రీజ! శ్రీనివాస! శ్రీకర! నిగమరచనాధురీణ! శ్రీస! శ్రీధర! మహదఖిలలోకచిత్రకార! శ్రీవచనమాధుర్యవిలోల! శ్రేష్ట! ధీర!

వక్రోక్తి మంగళాచరణము

చిత్రం
రాజానక కుంతలకుడు తన ’వక్రోక్తి జీవితమ్’ అలంకారశాస్త్ర గ్రంథారంభంలో సరస్వతీదేవికి మంగళాచరణం చేస్తున్నాడు. వందే కవీంద్రవక్త్రేందులాస్యమందిరనర్తకీమ్ | దేవీం సూక్తిపరిస్పందసుందరాభినయోऽజ్జ్వలామ్ || అనువాదము: గీ || వందనమ్ములు సుకవిముఖేందుబింబ మందిరనివాసినీలాస్యసుందరికిని, కుంద హసితకు, మధువచః స్పందనంది తోజ్జ్వలాభినయరసనిష్పందినికిని. సవరణ: గీ || వందనమ్ములు సుకవిముఖేందుబింబ మందిరనివాసినీలాస్యసుందరికిని, కుంద హసితకు, మధువచః స్పందతుషిత భాసురాభినయరసనిష్పందినికిని.

వీఁడటే....

చిత్రం
శ్రీ కృష్ణుడు మొట్టమొదటి సారి పల్లె వదిలి నగరానికి బయలుదేరాడు. కంసుని పిలుపు మీద అక్రూరుని తోడుగా మధురానగరానికి బలరాముని జో డుగా సాగింది పయనం. నగరం చేరాడు. నగరంలో వింతలు విశేషాలు చూసుకుంటూ అన్నదమ్ములు వెళుతున్నారు. ఆ ఊళ్ళో అమ్మాయిలు కూడా అప్పుడే యౌవనంలో అడుగుపెట్టి మిసమిసలాడుతున్న మనవాడిని చూశారు. కం || వీటఁ గల చేడె లెల్లను హాటకమణిఘటితతుంగహర్మ్యాగ్రములం గూటువలు గొనుచుఁ జూచిరి పాటించి విశాలవక్షుఁ బద్మదళాక్షున్. రత్నాలు తాపడం చేసిన ఎత్తయిన బంగారుమేడలమీద బాల్కనీల నుండి గుంపులుగా చేరి ఈ అందమైన కృష్ణు ణ్ణి చూశారు ట. ఇప్పుడే అందిన వార్త .  “ పాటించి ” చూశారుటండి. అంటే కళ్ళప్పగించి కాబోలు! సీ || వీఁడటే రక్కసి విగతజీఁవఁగ జన్నుఁ బాలు ద్రావిన మేటిబాలకుండు | వీఁడటే నందుని వెలఁదికి జగతిని ముఖమందుఁ జూపిన ముద్దులాఁడు ! వీఁడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాఁపరీఁడు! వీఁడటే యలయించి వ్రేతల మానంబు సూఱలాడిన లోకసుందరుండు! గీ || వీఁడు లేకున్న పురమటవీ స్థలంబు వీనిఁ బొందని జన్మంబ...

రాట్నబంధము

చిత్రం
కం|| శారద! సారస వాహిని! వారిజ లోచని! విరాజ భాసుర! మోహా మారకి! రమా మనోహరి! సారస భవుఁ రాణి! వాణి! సస్వర వరదా!

శ్రీ బంధ కందము

చిత్రం
ఇది ఒక మంగళ బంధము. "శ్రీ" అను అక్షరమున చిత్రకవితగా కందమును అమర్చుట. కం|| శారద! వేద విశారద! రారాజ వదన!కదంబ రాజిత శోణా! భారతి! రమా మనోహరి! సారస భవుఁ రాణి! వాణి! సస్వర వరదా! (బొమ్మపై నొక్కండి)

గొడుగు కలిగి కూడ తడిసినాఁడు.

శంకరాభరణం బ్లాగులో ఈ సమస్య ఆ రోజు ఉదయాన్నే చూశాను. నిజం చెప్పాలంటే కాస్త చప్పగా అనిపించింది. కాలకృత్యాలవీ తీర్చుకుని, రెడీ అయి ఆఫీసుకు బయలుదేరే ముందు పూరణ ముగిద్దాం అన్న ఆలోచన వచ్చింది - సినిమాలలో బృందగానంలో మందతో ఆడుతూ హీరో గొడుగు ఉన్నా తడిచిపోయాడు అని. మొదట సమస్య రాసుకుని, బృంద-మంద అనే ప్రాసతో మొదటిపాదం చేకూర్చాను. చూస్తే, రెండవపాదంగా సమస్య(నాలుగవ పాదాన్ని)నే వాడుకోవచ్చని అనుమానం వచ్చింది. అది ఆలానే ఉంచాను. (కాసిన్ని మార్పులతో) ఇక మూడవపాదం తేలికగానే కుదిరింది. అలా పద్యం తయారయ్యింది. బృంద నాట్య మందు మంద యాడిరి చేత గొడుగు కలిగి; కూడ తడిసినాడు చలన చిత్ర నటుఁడు లలన సరసఁ జేరి. గొడుగు కలిగి కూడ తడిసినాఁడు. ఈ సోది అంతా ఎందుకంటే - ఇలా శ్లోకంలో రెండవపాదం, నాలుగవపాదం ఒకే రకంగా కూర్చిన ప్రయోగం శిశుపాలవధమ్ అన్న సంస్కృత కావ్యంలో, ఆరవ సర్గలో మాఘకవి చేశాడు.  కాన్తాజనేన రహసి ప్రసభం గృహీతః కేశే రతే స్మరసహాసవతోషితేన | ప్రేమ్ణా మనస్సు రజనీష్వపి హైమనీషు కే, శేరతే స్మ రసహాస వతోషితేన || స్మరసహ = మన్మథ వికారం కలిగించు ఆసవ = మద్యముతో తోషితేన = సంతసించిన వారలై రసహాసవతా = హాస్యానురాగ బద...

ఇంద్రధనుస్సు

చిత్రం
ఆ.వె. పుట్టవెడలి నభోభిత్తి బట్టు శక్ర కార్ముకపు బెద్ద పలువన్నెకట్లజెఱ్ఱి దైన నడచెడు కాళ్ళ గుంపనగ గాలి గార్కొని దిగంతముల వాన కాళ్ళు నడిచె” ఆముక్తమాల్యద. 4- 89. ఆముక్త మాల్యదలోని కమనీయమైన పద్యం ఇది. ఇంద్రచాపం - వానకు పుట్టనుండి బయటకు వచ్చి ఆకాశమనే గోడకు ఎగబ్రాకుతున్న రంగురంగుల కట్ల జెర్రి లాగ ఉన్నది. ఆ కట్లజెఱ్ఱి కాళ్ళలాగా అన్ని దిక్కులకూ వర్షధారలు. వర్షమొచ్చినప్పుడే కదా, జెర్రులు తమ కలుగుల్లోనించి బయటకు వచ్చేది! అలా ఈ పద్యం సందర్భోచితమై శోభిల్లుతూంది. ఆ ఇంద్రచాపమే ఈ బ్లాగుకు ప్రేరణ.