పోస్ట్‌లు

యాత్ర లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

టిబెటన్ స్థూపం.

చిత్రం
బౌద్ధంలో హీనయాన మహాయానాల తరువాత వచ్చిన మతసిద్ధాంతం వజ్రయానం. వజ్రయానంలో బుద్ధుణ్ణి ఒక చారిత్రక వ్యక్తిగా కాక, ఒక అలౌకిక శక్తిగా భావించటం ఉంటుంది. దరిమిలా బుద్ధుని చుట్టూ అనేక బోధిసత్వ అవతారాలు, ఆ అవతారాలకు కొన్ని చిహ్నాలు, ఆ చిహ్నాల చుట్టూ అల్లుకున్న మార్మికత, మండలాలు అనబడే చిత్రాలు, ఆ చిత్రాలకనుగుణంగా ధ్యానపద్ధతులు - ఇలా విలక్షణంగా అల్లుకున్న ప్రత్యేకమైన, ధార్మిక విశ్వాసయుతమైన మతం వజ్రయానం. ఈ విశ్వాసాలకు అనుగుణంగా అవలోకితేశ్వర, మైత్రేయ, వైరోచన, అమితాభ, మహాకాల, అమోఘసిద్ధి, పద్మసంభవ, మంజుశ్రీ ఇత్యాది అద్భుతమైన మూర్తులు, చిక్కని రంగులతో దట్టంగా చిత్రించిన బుద్ధుని అవతారాల బొమ్మలు, ఇంకొన్ని చిహ్నాలు వజ్రయానం లో చోటుచేసుకొని ఇది శాఖోపశాఖలుగా ఎదిగింది. వజ్రయాన మార్మిక బౌద్ధ మూర్తులలో హిందూ దేవతల, దేవుళ్ళు కూడానూ హెచ్చుగానే కనిపిస్తారు. అలాగే బౌద్ధం లో గల కొందరు చారిత్రకవ్యక్తులను బోధిసత్వుని అవతారాలుగా చిత్రించటం ఉంది. ఉదాహరణకు పద్మసంభవుడు ఒక చారిత్రక వ్యక్తి. ఆయన బోధిసత్వుడి అవతారం. లామా కూడా బోధిసత్వుడి అవతారమే. టిబెటన్ బౌద్ధపు ఛాయలు ఇవి. ఈ టిబెటన్ బౌద్ధంలో ఓ చిహ్నం గురించి ఈ వ...

విద్యానగర విహారం

చిత్రం
అనుకోకుండా లైఫ్ లో కొన్ని అవకాశాలు వస్తుంటాయి. అలాంటిదే హఠాత్తుగా ఓ పొద్దున తగిలిన హంపి జర్నీ. (జూలై 2016) మా ఆవిడ కొలీగ్ కారు అనుకోకుండా దొరికింది. డ్రైవరూనూ. ఓ గంటలో అంతా అయిపోయింది. మా వూరి నుంచి బళ్ళారి 100 కి.మీ. అక్కడ నుంచి హంపి 60 కి. మీ.  అయితే దరిద్రమైన రోడ్డు! ఆహ్లాదకరమైన వాతావరణం. ఆషాఢస్య ప్రథమ దివసే..... ఆషాఢం మొదట్రోజు పడమర సూర్యాస్తమయాన మేఘాలు కమ్ముకుంటే ఆ యేడాది వర్షాలు విరివిగా పడతాయట! ఆ రోజంతా అలానే వుంది. బళ్ళారి దాటాక, సండూరు కొండల దగ్గర మరీ అద్భుతంగా వుంది. తెనాలి రామకృష్ణ పండితుడు వర్ణించిన స్వామిమల నే సండూరు అంటారు. ఇక్కడ ప్రముఖమైన కుమారస్వామి దేవాలయం ఉంది. 1. హంపి! ఓ జీవిత కాలపు అనుభవం. రాయలసీమకు నీళ్ళు దొరికి సస్యశ్యామలమైతే అచ్చం హంపి కి ఛాయలా వుంటుంది. అలా ఒకప్పుడు వుండేది కూడా. ఎందుకంటారూ? నేటి పెనుగొండ - నాడు విజయనగరరాజుల రెండవ (చలువ) రాజధాని. రాయలవారి దండ నాయకులు పెమ్మసాని వారు. వారిది తాడిపత్రి. (పెమ్మసాని వారి దేవాలయాలు తాడిపత్రిలో నేటికీ ఉన్నాయి. ఈ దేవాలయాల వల్ల తాడిపత్రిని రెండవ హంపి అంటారు) వారి వద్దకూ విజయనగర రాజుల రాకపోకలు ఉండేవి. ప్రబంధకావ...