పోస్ట్‌లు

నైషధీయచరితమ్ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

వీచిక - 7

()... భాషలో ఈ బ్రాకెట్ ల వాడకం ఎప్పుడొచ్చిందో భాషాశాస్త్రజ్ఞులే చెప్పాలి. ఒక అప్రధానమైన విషయాన్ని చెప్పడానికి వీటిని ఉపయోగించటం రివాజు. కుండలీకరణము - అని ఆ ప్రక్రియ పేరు. ఈ గుర్తుకు తెలుగులో ఒక అందమైన పేరును రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ప్రతిపాదించారు.  ఆ పేరు - "చిప్ప గుర్తులు". టెంకాయ చిప్పలను పక్కపక్కన పెట్టి ఊహించుకుంటే ఎంత అందంగా ఉందో కదా! భాషలోని ఈ సంజ్ఞార్థకాన్ని శ్రీహర్షుడనే సంస్కృతప్రౌఢకవి తెలివిగా ఉపయోగించుకుని ఒక శ్లోకం చెప్పాడు.  శ్రీహర్షనైషధమ్ లో మొదటి అధ్యాయంలో నలుని కీర్తి, ప్రతాపాలను వర్ణిస్తున్నాడు. తదోజసః తద్యశసః స్థితావిమౌ వృథేతి చిత్తే కురుతే యదా యదా | తనోతి భానోః పరివేషకైతవాత్ తదా విధిః కుణ్డలానాం విధోరపి || తదోజసః = అతని ప్రతాపానికి, తద్యశసః = ఆతని కీర్తికిన్నీ, ఇమౌ = ఈ సూర్యచంద్రులిద్దరూ, వృథా ఇతి = సరికారు అని, చిత్తే = మనసులో, యదా యదా కురుతే = ఎప్పుడు (భావం) కలుగుతుందో,  తదా = అలాంటప్పుడు, విధిః = బ్రహ్మ, భానోః, విధోరపి = సూర్య చంద్రుల, పరివేష కైతవాత్ = వలయములు అన్న మిషతో, కుణ్డలానాం = కుండలరేఖను, తనోతి = చేయుచున్నాడు. తాత్పర్యము: ఆ...

సంస్కృతసౌరభాలు - ౩

చిత్రం
కలశే నిజహేతుదండజః కిము చక్రభ్రమకారితాగుణః | స తదుచ్ఛకుచౌ భవన్ ప్రభాఝరచక్రభ్రమ మాతనోతి యత్ || నిజహేతుదండజః నిజ = తనదైన హేతు = నిమిత్తకారణమైన దండజ = కట్టెవలన బుట్టిన చక్రభ్రమకారితా= కుమ్మరి చక్రము త్రిప్పుటను చేసెడి గుణః = ధర్మము కలశే = కుండయందు కిము సంక్రాంతః = సంక్రమించినదా ఏమి? యత్ = ఏలనన సః = ఆ కుండ తదుచ్చకుచౌ = ఆ దమయంతి యొక్క ఉన్నతమైన పయోధరములుగా భవన్ = అగుచు ప్రభాఝరచక్రభ్రమమ్ = కాంతిప్రవాహమందు చక్ర(వాక పక్షులా అను) భ్రమను ఆతనోతి = కలిగించుచున్నది. ****************************************** శ్లోకం తాత్పర్యం వ్రాసినా సాధారణంగా అర్థం కా(లే)దు. ఖంగారు పడకండి. ఇదొక నారికేళపాకం. ఈ నారికేళానికి పీచు కూడా పీకాలి. నిదానంగా చూద్దాం. ****************************************** సంస్కృతాధ్యయనంలో పంచమహాకావ్యాల వరుస ఇది. కాళిదాసు రఘువంశం, కుమారసంభవం, భారవి కిరాతార్జునీయం, మాఘుని శిశుపాలవధమ్, శ్రీహర్షుని నైషధీయచరితమ్. కాళిదాసు కమనీయకవిత్వానికి కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. శబ్దమూ, అర్థమూ మహా స్వారస్యంతో కూడి జిలుగులు చిమ్మే కవిత్వం అది. భారవి కవిత్వం కాస్త ప్రౌఢం. భారవేరర్థగౌరవమ్ ...

నైషధీయ చరితమ్ ద్వితీయ సర్గ - తాత్పర్యం - నా నోట్సు.

శ్రీహర్షుని నైషధీయచరితమ్ ద్వితీయ సర్గకు నేను వ్రాసుకున్న నోట్సు. హంస చేష్టలు. నలుని వలన విముక్తి పొందిన ఆ హంస మాటలచే వర్ణింపనలవి గాని ఆనందమును, లోకాధిపతియైన మహావిష్ణువు వలన మోక్షము పొంది వాగతీతమైన మహానందమును పొందిన ద్విజులవలెఁ బడసెను. అటుపైనది మహారాజు చేత నలుగుటవలన పైకి రేగిన ఈకలు గల తన శరీరమును విదల్చుకొన్నది. మిట్టపల్లములైన తన ఱెక్కలను ముక్కుచేత సరిచేసుకున్నది. నలుని వలన విముక్తి పొందిన క్షణమందే, ఒకపాదముచేత ఱెక్కలమూల యొక్క మధ్యభాగాన పైనకు జొనిపిన మోకాలుతో తొందరగ తలను గోకుకొనుచూ నివాస స్థలమునకు వెళ్ళినది. నేర్పుగా ఱెక్కలనే వనదుర్గమందు దాగి చుఱుకుగా కుట్టుతున్న పురుగులను తన వాడి ముక్కు కొసల చేత వారిస్తూ దురద (కండూతి)ను బాపుకొన్నది. ఆ హంసను ఇతర హంసలు చుట్టుముట్టినవి. మహారాజు చేత నలిగిన ఈ హంస శరీరమునందు కలిగిన మార్పులనవి గమనించి బిగ్గరగా కూజిస్తూ మింటికెగిరినవి.ఆ హంస నలుని వీడి సరస్సు వద్దకెళ్ళింది. అక్కడ నాచు చేత కప్పబడిన అడుగు భాగము కలిగి, శివభక్తుని లక్షణాలతో శోభిస్తూ, చేత తుమ్మెదలవంటి రుద్రాక్షలను మాలగా ధరించిన నలుని చేయిని చెంగలువగా భ్రమించి తిరిగి ఆ చేయి వద్దకేగినది. చాలా...