పోస్ట్‌లు

ప్రాకృతం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సేతుబంధం

చిత్రం
సేతుబంధం - ఇది ఒక మహారాష్ట్రీ ప్రాకృత కావ్యం.  సంస్కృతేతర భాషల్లో వాల్మీకి రామాయణం మీద ఆధారితమైన మొట్టమొదటి రచన. ఈ కావ్యాన్ని రచించిన కవి వాకాటక రాజైన రెండవ ప్రవరసేనుడు. దీనికే దశముఖవధమ్ (దహముహవధో) అని పేరు. రామాయణంలో యుద్ధకాండలో రాముడు వానరసేనతో సముద్రతీరానికి చేరి, వారధి నిర్మించడం మొదలు, రావణుని నిర్జించటం వరకూ సాగిన కావ్యం యిది. పదిహేను సర్గల కావ్యం. వాల్మీకి రామాయణం మీద ఆధారపడినప్పటికీ, అద్భుతమైన ప్రాకృతిక వర్ణనలకు, నాయకత్వపు లక్షణాల వివరణకూ, భయాందోళనలు నెలకొన్నప్పుడు జీవుల స్వభావం గురించిన వివరణకూ, అద్భుత పాత్రచిత్రణలకూ, ఇంకా అనేకానేక విషయాలకూ ఈ కావ్యం ప్రసిద్ధి. ఈ కావ్యం గురించిన సమగ్ర అనుశీలనమే ఈ వ్యాసం.   ఉపోద్ఘాతం: పొద్దు పొడుస్తోంది. మనోహరమైన నీలాకాశం. దిక్చక్రము వెలుగులతో ప్రకాశిస్తోంది. భావుకుడైన ఒక ప్రాకృతకవి ఉదయాన శుభకరుడూ, సర్వభూతక్షేమంకరుడునూ అయిన శివుని దర్శించి ప్రార్థిస్తూన్నాడు.   1) ణమహ అ జస్స ఫుడరవం కణ్ఠచ్ఛాఆ ఘడన్త ణఅణగ్గిసిహమ్ | ఫురఇ ఫురిఅట్టహాసం ఉద్ధపడిత్తతిమిరం విఅ దిసాఅక్కమ్ || సంస్కృతఛాయ: నమత చ యస్య స్ఫుటరవం కణ్ఠచ్ఛాయాఘటమాన...

మూడవకన్నుకు మన్నన

చిత్రం
ఓ ప్రాకృతకవి ఈశ్వరుని మూడవకన్నుకు ఇలా జయము చెబుతున్నాడు. రఇకేళిహిఅణిఅసణకరకిసలఅరుద్ధణఅణజుఅలస్స | రుద్దస్స తఇఅణఅణం పబ్బఈ పరిచుంబిఅం జఅఇ || (రతికేళిహృతనివసనకరకిసలయరుద్ధనయనయుగళస్య| రుద్రస్య తృతీయనయనం పార్వతీపరిచుంబితం జయతి||) (రతికేళిలో అపహరించిన వస్త్రములు గలవాడు, చివురుటాకుల చేతులతో నేత్రద్వయం కప్పబడినవాడు అయిన రుద్రునియొక్క - పార్వతిచే చుంబించబడిన ఫాలనేత్రము సర్వోత్కృష్టముగా ఉన్నది!) పై పద్యం యథాతథంగా కాకపోయినా, అదే అర్థంలో (అవే శబ్దాలతోనూ) నా తెనుఁగు పద్యం. కం || అతులితవిరహానంతర రతికేళిహృతనివసనకరకిసలయోన్మీ లితనయనయుగళుఁడౌ హరుఁ సతిపరిచుంబితతృతీయచక్షువు జయమౌ ఈ పద్యంలో చమత్కారం ఇది. సతి రతికేళి సమయంలో సిగ్గుతో ప్రియుని రెండుకళ్ళను, తన చివురుటాకుల చేతులతో మూసింది. అయ్యవారికి మూడుకళ్ళు! మూడవకన్ను తననే చూస్తోంది. ఆ కన్నునెలా మూయాలి? తన పెదవితో మూసింది. (చుంబించింది). ఆ రెండుకళ్ళకు పట్టని అదృష్టం మూడవకంటికి దొరికింది. ఆ కంటికి జయం చెప్పవలసిందే కదా! రుద్రుని ఫాలాక్షం ఎప్పుడూ కోపానికి ప్రతీక అయితే, ఈ కవి శృంగారానికి ఆలంబన చేశాడు!