7, జనవరి 2024, ఆదివారం

Disclaimer

 


ఈ బ్లాగ్ లో ప్రచురింపబడిన వ్యాసాలు - ఈ బ్లాగు ఓనర్ వి మాత్రమే కావు. ఇవి అందరివి కూడా. ఈ వ్యాసాలను ఎవరైనా వాడుకోవచ్చు. వారి పేరు పెట్టుకుని ప్రచురించుకున్నా అభ్యంతరం లేదు. 🙂 


ఇట్లు,

"భారతి".


14, నవంబర్ 2022, సోమవారం

శిశుపాలవధమ్ ఆరవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - ముగింపు (71 - 79)

 ౭౧.

వపురంబువిహారహిమం శుచినా రుచిరం కమనీయతరా గమితా!

రమణేన రమణ్యచిరాంశులతారుచి రంకమనీయత రాగమితా ||

 

శుచినా అంబువిహారహిమం రుచిరం వపుః గమితా (అత ఏవ) కమనీయతరా అచిరాంశులతారుచిః రాగమితా రమణి రమణేన అంకం అనీయత । 

 

సర్వంకష

ఆథ ఏకేన గ్రీష్మమాహ। వపురితి || శుచినా గ్రీష్మేణ ప్రయోజక కర్త్రాన్ అంబువిహారేణ జలక్రీడయా- హిమం శీతం - అత ఏవ - రుచిర ముజ్జ్వలం వఫుర్దేహం -గమితా ప్రాపితా గతి బుద్ధీత్యాదినా ఆణికర్తుః కర్మత్వం ప్రధాన కర్మణ్యాఖ్యే యేలాదీనా హృత్ వికర్మణా మిత్యభిహితత్వం చ అత ఏవ - కమనీయతరా రమణీయతరా - అచిరాంశుః లతేవ అదిరాంశులతా విద్యుల్లతా తస్యాః రుచిరివ రుచిర్యస్యాస్పా- అచిరాంశులతారుచి రిత్యుపమాద్వయం తథా రాగమనురాగం-ఇతా ప్రాప్తా - ఇణి కర్తరి క్తః - రమణి - రమణేన ప్రియేణ-అంకముత్సంగం అనీయత నీత్వా నీతృ హృకృష్వహామితి నయతే ద్విర్ కర్మకతా - శేషం పూర్పవత్-తోటక వృత్తముక్తమ్ । 

 

శుచినా = గ్రీష్మఋతువు వలనఅంబువిహారహిమం = జలక్రీడచే శుభ్రమై; రుచిరం వపుః = అందమైన గాత్రమును; గమితా = పొందినది; (అత ఏవ = మఱియు) కమనీయతరా = అధికముగా సొగసైనఅచిరాంశులతారుచిః = మెఱపుమేని సొగసుగత్తెరాగమితా = పరవశురాలైన; రమణి = రమణి; రమణేన = ప్రియునియొక్క; అంకం = ఒడినిఅనీయత = చేరెను.

 

గ్రీష్మఋతువందు జలక్రీడలు సలిపి నిర్మలమైన గాత్రముతో శోభించునది, మెఱపుపుమేని సోయగముతో అతిశయించిన సౌందర్యముగలది అయిన రమణి పరవశురాలై ప్రియుని ఒడి చేరింది.

౭౨.

ముదమబ్దభువామపాం మయూరాః సహసాయంత  నదీపపాట లాభే |

అళినా రమతాళినీ శిలీంధ్రే సహ సాయంతన దీపపాటలాభే ||

 

అబ్ధభువాం అపాం లాభే సహసా మయూరాః ముదం ఆయంత నదీపపాట అళినా సహ సాయంతనః దీపపాటల-ఆభే శిలీంధ్రే అళిని అరమత ।

 

సర్వంకష

అథద్వాభ్యాం వర్ష ఋతుం వర్ణయతి - ముదమిత్యాది ॥ అబ్ధభువాం మేఘభవానా - అపాం లాభే వర్షే సతి ఇత్యర్థః - సహసా-మయూరాః ముదమానందం- ఆయంత అలభంత- అయపయగతౌ లుఞ్ - ఆడజాదీనామిత్యడాగమః - ఆటశ్చేతి వృద్ధిః-నదీ పపాట - నద్యః ప్రావహన్నిత్యర్థః - అబపటగతౌ లిట్ - జాతావేకవచనం ఆళినీ భృంగీ ఆళినా భృంగేణ సహ- సాయంభవః సాయంతనః, సాయం చిరమిత్యాదినా ట్యు ప్రత్యయః - తుడాగమశ్చ - సచాసౌ దీపశ్చ తద్వత్పాటలా - ఆభా యస్య సః తస్మిన్ - పాటల ప్రభ ఇత్యుపమాలంకారః - శీలీంధ్రే కందళీకుసుమే అరమత ఆత్రమయూర మోద ప్రాప్యా దనేకర్తృక క్రియాయౌగ పద్యాద్బినా అధికరణ క్రియా సముచ్చయ రూప స్సముచ్చయాలంకారభేదః గుణ క్రియాయౌగత్వం సముచ్చయ ఇతీరిత ఇతి సామాన్య లక్షణం - ఔషచ్ఛందసిక వృత్తమ్ ।

 

అబ్ధభువాం = మేఘములు వర్షించుయెడఅపాం లాభే = నీటి సమృద్ధిచేత;   మయూరాః =  నెమిళ్ళు; సహసా = మిక్కిలి; ముదం = సంతసమునుఆయంత = అందినవి; నదీపపాట = నదీప్రవాహములు నిండి; అళినా సహ = తోటి తుమ్మెదతో; సాయంతనః = సాయంత్రవేళదీపపాటల-ఆభే = దీపములా ఎర్రగా వెలిగే; శిలీంధ్రే = కందళీసుమములో ; అళిని = తుమ్మెదనుఅరమత = సుఖపెట్టినది.

 

మేఘములు వర్షించుసమయంలో నీటిసమృద్ధితో నెమిళ్ళు బాగా ఆనందపడినవి. నదీప్రవాహాలు నిండినవి.  సాయంత్రసమయాన దీపంలా వెలిగిపోతున్న కందళీకుసుమములో తుమ్మెద తోటి తుమ్మెదతో సహా క్రీడించింది.

౭౩.

కుటజాని వీక్ష్య శిఖభిః శిఖిరీంద్రం సమయావనౌ ఘనమదభ్రమరాణి ।

గగనం చ గీతనినదస్య గిరోచ్చైః సమయా వనౌఘన మదభ్రమరాణి ॥

 

శిఖరీంద్రం సమయా అవనౌ ఘనమదభ్రమరాణి కుటజాని వనౌఘనమదభ్రం గగనం చ వీక్ష్య శిఖిభిః గీతనినదస్య సమయా గిరా ఉచ్చైః అరాణి ।

 

సర్వంకష

కుటజానీతి || శిఖిరీంద్రం సమయా రైవతకాదే స్పమీప్యే లభితః పరీతసృమయేత్యాదినా ద్వితీయా - ఆవనౌ ప్రదేశే ఘనమదాః భ్రమరాః యేషు తాని-ఘనమద భ్రమరాణి - కుటజాని కుటజకుసుమాని - వనౌఘేన పయఃపూరేణ - నమంతభ్రాణి మేఘాః యస్మిన్ - తద్వనౌఘనమదభ్రం జీవనం భువనం వనమిత్యమరః - గగనంచ - వీక్ష్య శిఖభిః మయూరైః - గీత నినదస్య గానధ్వనేః - సమయా తుల్యయ్యా తుల్యార్ధైఃరిత్యాదినా వైకిల్బికీ షష్టీ గిరావాచా - కేకయెత్యర్ధః - ఉచ్చైః అరాణి రణితం - రణశబ్దే భా వే లుజ్ - చిణో లుక్ - కుటజావృత్తం - సజసా భవేది హసగౌ కుటజాఖ్యమితిలక్షణాత్ ||

 

శిఖరీంద్రం = పర్వతరాజు రైవతకము; సమయా = సమీపఅవనౌ = ప్రదేశమున; ఘనమదభ్రమరాణి = నిండుగా మత్తెక్కిన తేంట్లుకుటజాని = కోరకసుమాలు; (అత ఏవ = ఇంకా)వనౌఘనమత్ -అభ్రం = జలభారంతో వంగిన మేఘాలు గలగగనం చ =  ఆకాశమును; వీక్ష్య = పరికించి; శిఖిభిః = మయూరాల చేతగీతనినదస్య = గీతనాదాలకుసమయా = సమమైన; గిరా = కేకలతోఉచ్చైః = పెద్దగాఅరాణి = కూయబడుచుండెను ।

 

పర్వతరాజైన రైవతకుని సమీపప్రాంతాన నిండుగా మత్తెక్కిన తేంట్లు, కోరకసుమాలు, జలభారంతో నమ్రమైన మేఘపంక్తులు, ఆకాశము - వీటిని పరికించి మయూరాలు చక్కని సమ్గీతనాదాలకు సమంగా గొంతెత్తి క్రేంకారవములు చేసెను.

౭౪.

అభీష్ట మాసాద్య చిరాయ కాలే సముద్ధృతాశం కమనీ చకాశే |

యోషిన్మనోజన్మసుఖోదయేషు సముద్ధృతా శంకమనీచకాశే||

 

కమనీ యోషిత్ అనీచకాశే కాలే మనోజన్మసుఖోదయేషు ధృతాశం అభీష్టం చిరాయ ఉధ్ధృతాశంకం ఆసాద్య సముత్ చకాశే ।

 

సర్వంకష

అధత్రిభిః శరదం వర్ణయతి || అభీష్టమి త్యాది || కామయతే ఇతి కమనీ కామయిత్రీ కమ్రః కామయితా భీకః కమనః కామమోభిక ఇత్యమరః - కమేః కర్తరి ల్యుటి జీప్ - యోషిత్ - జాతావేకవచనం - ఆనీచాః ఉన్నతాః - కాశాః అశ్వవాలాః యస్మిన్ తస్మిన్ ఆనీచ కాశే - కాలే శరదీత్యర్థః - మనోజన్మ సుఖోదయేషు కామసుఖావిర్భావేషు - ధృతా ఆశా అభిలాషో యే నతం - ధృతాశం అభీష్టం ప్రియం - చిరాయ చిరకాలేన చిరాయ చిరరాత్రా యచిరస్యాద్యా శ్చీరార్ధకా ఇత్యమరః సమ్యక్ - ఉద్దృతా ఉత్సృష్టా - ఆశంకాసం కోచో యస్మిన్ కర్మణి తత్సముధృతా శంకం విస్రబ్ధం యథాతథా - ఆసాద్య ప్రాప్య ముదాసహవర్తత ఇతి సమత్ సానందా సతీ - చకాశే విలలాసేత్యర్థః అత్ర సముచ్చ కాశ ఇతి యోషితః ప్రియ ప్రాప్తినిమి త్తహర్షాఖ్య భావ నిబంధ నాత్ ప్రేయోలంకారః రసభావ తదాభాస తత్ప్రశమనానాం నిబంధనేన రసవత్ ప్రేయ ఊర్జస్వి సమాహితా నీతిలక్షణాత్ - వృత్తముపజాతిః

 

కమనీ = కైపెక్కిన; యోషిత్ = అతివలు; అనీచకాశే కాలే = రెల్లుగడ్డి పెరిగే శరత్ సమయంలోమనోజన్మసుఖోదయేషు = ప్రణయభావములను చివురింపజేయు పతులయెడఅభీష్టం = తమ ఇష్టమును; ధృతాశం = మోహమును కలిగిచిరాయ = ఎంతోకాలముగాఉధ్ధృతాశంకం = సంకోచమును తొలగించిఆసాద్య = (వారిని) సమీపించిసముత్ = ముదముగాచకాశే = క్రీడించిరి;

 

మత్తిలిన యువతీజనము రెల్లుగడ్డి పెరిగే శరత్ సమయంలో ప్రణయభావములకు ఆస్పదమైన పతులయెడ ఇష్టమును, మోహమును కలిగి, చిరకాలముగా ఉన్న సంకోచమును విడచి వారిని చేరి రమించిరి.

౭౫.

స్తనయోః సమయేన యాంగనానామభినద్దా రసమా న సా రసేన |

పరిరంభరుచిం తతిర్జలానామభినద్దా రసమానసారసేన||

 

రసమానసారసేన సమయేన అంగనానాం స్తనయోః జలానాం తతిః అభినద్ధా; హారసమా సా రసేన పరిరంభరుచిం న అభినత్

 

సర్వంకష

స్తనయోరితి || రసమానాః కూజనశీలాః తాచ్చీల్య వయోవచనశక్తిషు దానశితినా నశ్ ప్రత్యయః - రసతేః పరస్మై పదిరత్వాత్ నశానచ్ ప్రత్యయః తే చ సారసాః పక్షి విశేషాః యస్మిన్ తేన రసమానసారసేన - సమయేన శరత్కాలే ఇత్యర్థః -సారసా నామ అత్రైవ సంభవాత్ - సారసో మైధునీ కామీ గోనర్దః పుష్కరాహ్వయ ఇతి యాదవః = అంగనానాం- స్తనయోః జలానాం - యా తతిః శారదోష్ణ జన్మాస్వేదోదబిందుసందోహః - అభితః -నద్దాబద్ధా-నహ్యతే రభిపూర్వాత్కర్మణి క్తః నహోధ ఇతిధత్వం - హార సమాయుక్తా హారతుల్యా కుచమండల మండనాయమానేతి భావః సా జలతతిః రసేన రాగేణ హేతునా బలీయసేతి భావః-పరిరంభరుచిం ఆలింగనేచ్ఛాం - నాభినత్ నభిభేద - శారదస్వేదస్య అప్యలంకారతయోద్దీపక స్యాత్ జుగుప్పితత్పాత్ నిస్సపత్న శృంగా రోవిజయత ఇత్యర్థః - అతఏవ - రసనిబంధనాత్  రసవదలంకారః - లక్షణం తూక్తం పూర్వశ్లోక ఏవ - ఔపచ్ఛందసికం వృత్తమ్ ।

 

రసమానసారసేన = కలస్వనములు చేయు బెగ్గురుపక్షులసమయేన = శరత్కాలములోఅంగనానాం = లావణ్యవతులస్తనయోః = ఇరు కుచముల; జలానాం తతిః = స్వేదబిందువుల వరుస; అభినద్ధా = పైభాగమున ఏర్పడెనో; హారసమా సా = ముత్యములవంటి ఆ బిందుతతిరసేన = తమకముతో; పరిరంభరుచిం = కౌగిలికాంక్షనున అభినత్ =అడ్డగింపలేదు.

 

బెగ్గురుపక్షుల కలస్వనములతో కూడిన శరత్కాలమున లావణ్యవతుల ఇరు-కుచములపై స్వేదబిందుశ్రేణి సాత్వికభావముచేత ఏర్పడినది. ముత్యాలహారముల వరుస వంటి ఆ స్వేదబిందువుల వరుస, తమకము చేత కౌగిలికాంక్షను అడ్డుకొనలేకపోయినది. (వాతావరణము సుఖకరముగ నుండుట జేసి స్వేదము అడ్డంకి కాలేదని భావము)

౭౬.

జాతప్రీతిర్యా మధురేణానువనాంతం కామే కాంతే సారసికా కాకురుతేన|

తత్సంపర్కం  ప్రాప్య పురా మోహనలీలాం కామేకాంతే సా రసికా కా కురుతే న ||

 

యా అనువనాంతం మధురేణ సారసికా కాకురుతేన కామే కాంతే జాతప్రీతిః రసికా సా కా ఏకాంతే తత్సంపర్కం ప్రాప్య పురా కాం మోహనలీలాం న కురుతే ।

 

సర్వంకష

జాతేతి || యా స్త్రీ - అనువనాంతం వనాంతే - విభక్త్యర్థేవ్యయీభావః మధురేణ శ్రావ్యేణ- సారసికా కురుతేన సారస్య ఏవ సారసికాః సారసాంగనాః - కాత్పూర్వస్యేత్వం - తాసాం కాకురుతేస వికృతరవేణ  కాకుస్త్రియాం వికారో యశ్మోక భీత్యాదిభిః ధ్వనేరిత్యమరః - కాకుశ్చత ద్రుతం చ తేన - కామే కామకల్పే - సింహెూ దేవదత్త ఇతి వదౌణ ప్రయోగః - కాంతే ప్రియే-జాతప్రీతిః జాతస్నేహా అభూత్ - రసికా రసవతీ రాగవతీత్యర్థః అత ఇని ఠనానితి ఠనచ్ ప్రత్యయః - కా స్త్రీ - ఏకాంతే రహసి-తస్య కాంతస్య - సంపర్కం ప్రాప్య పురా పురుషప్రేరణాత్పూర్వమేవ - కాం మోహనలీలాం సురత క్రీ డాం - న కురుతే సర్వాపి స్త్రీ సర్వానపి సురతవిశేషాణ్ - కామతంత్ర ప్రసిద్ధాన్ విస్రబ్ధం చ కారేతి శృంగారస్య పరాకాష్ఠా - ప్రాప్తిరుక్తా - మత్తమయూరీ వృత్తమ్ ॥

 

యా  = ఏ స్త్రీ; అనువనాంతం = వనముల సమీపమున; మధురేణ = శ్రావ్యమైనసారసికా =బెగ్గురుపక్షులకాకు-రుతేన = కలస్వనముచేతకామే = శృంగారమున; కాంతే = ప్రియుని యందుజాతప్రీతిః = ఉదయించిన ఇష్టత కలిగినదోరసికా = రసికురాలైన; సా కా = అట్టి ఏ రసికురాలుఏకాంతే = ఏకాంతమునతత్సంపర్కం = ఆ ప్రియుని పొందునుప్రాప్య = పొంది; పురా = మునుపటికాం మోహనలీలాం = ఆ ప్రణయలీలను; న కురుతే = అవలంబింపదు?

 

ఏ సుదతి ఈ మనోహరమైన అడవి పట్టులందు మధురమైన హంసల కలస్వనముల కూజితములు వినుచూ శృంగారకాంక్షతో ప్రియుని చేరియుండెనో అట్టి రసికురాలైన ఏ స్త్రీ మరల మరల సురతమున ప్రియుని పొందును మునుపటి వలే పొందుటకిచ్ఛగింపదు? (ఏ రసికయువతి అయిననూ ఈ హేమంత ఋతువున చలిగాలులకు వశమై శృంగారకాంక్షతో ప్రియుని చేరుటతథ్యమని భావము)

 

౭౭.

కాన్తాజనేన రహసి ప్రసభం గృహీతః

కేశే రతే స్మరసహాసవతోషితేన |

ప్రేమ్ణా మనస్సు రజనీష్వపి హైమనీషు

కే, శేరతే స్మ రసహాస వతోషితేన ||

 

సర్వంకష

అథేకేన హేమంతమాహ। కాంతేతి | సహత ఇతి సహః - పచార్యచ్ - స్మరస్య సహః స్మరసహః కామోద్దీపక ఇత్యర్థః - తేన ఆసవేన తోషితః తేనస్మరసహా ఏవ తోషితేన - అత ఏవ - రసహాసావస్యస్త ఇతి రసహాసవాన్ తేన రసహాసవతా రాగహాసవతా - అతఏవ - ప్రేమ్ణా - మనస్సు పుంసాం చిత్తేషు అపి తేన వపుషా - వసేః కర్తతరి క్తః వసతి క్షుధో రిడితీ యడాగమః గతిబుద్ధీత్యాదినా - మాత్రే ణ చకారత్వాత్ వర్తమానార్థతా కాంతైవ జనః. తేన కాంత జనేన జాతావేకవచనం- రహసి ప్రసభం బలాత్ - గృహీతకేశే ఆకృష్టశిరోరుహే సురతే హేమంతేభవాః హైమన్యః - తాసు హైమనీషు ఆపి ద్రాఘీయసీశ్చేతి భావః సర్వత్ర  త్రణత లోప శ్చేతి హేమంతశబ్దాదణ్ ప్రత్యయః తకారలోపశ్చ టిడ్డాణ ఇత్యాదినా జీప్ రజనీషు -కే యువానః - శేరతే స్మ-  స్వపంతిస్మ న కేపి ఇత్యర్థః  లబ్స ఇతి భూతే లట్ -ఏతేనాతి భూమిం గత శృంగార ఇతి వ్యజ్యతే వసంతతిలకావృత్తమ్ |

 

స్మరసహ = మన్మథ వికారం కలిగించు; ఆసవ = మద్యముతో; తోషితేన = సంతసించిన వారలై; రసహాసవతా = హాస్యానురాగ బద్ధులై; ప్రేమ్ణా = ప్రేమతో; మనస్సు = పురుషుల చిత్తములలో; ఉషితేన = నివసించు; కాన్తాజనేన = స్త్రీజనము చేత

ప్రసభం = నిర్బంధముగా; రహసి = రహస్యమున; గృహీతకేశే = పొందిన కేశములు కలిగిన (జడను పట్టుకుని); రతే = సురతములో; హైమనీషు = హేమన్త ఋతు సంబంధమైన; రజనీష్వపి = రాత్రులలో కూడా; కే = ఎవరు; శేరతే స్మ = శయనించుదురు?

 

శీతాకాలపు రాత్రులలో మద్యపానమత్తులై, ప్రియురాండ్రమీద మనసుపడి, ఏ యువకులు రతిసుఖం అనుభవించక, నిదురపోతారు?

౭౮.

గతవతామివ విస్మయముచ్చకైరసకలామలపల్లవలీలయా |

మధుకృతామసకృద్గిరమావళీ రసకలామల పల్లవలీలయా||

 

అసకలామలపల్లవలీలయా విస్మయం గతవతామివ మధుకృతాం లవలీలయా ఆవళీః అసకలాం కలాం గిరం  అసకృత్ ఉచ్చకైః అలపత్ ।

 

సర్వంకష

అథ ఏకేన శిశిరం వర్ణయతి -  గతవతామితి | అసకలామలపల్లవలీలయా అసకలా ఆసమగ్రవికాసిన అమలా నిర్మలాశ్చ యే పల్లవాః- తేషాం లీల తయా - నృత్యరూపయే ఇత్యర్థః - విస్మయం గతవతామివ స్థితానామివ ఉత్ప్రేక్షా - మధుకృతాం మధుకరాణాం సంబంధినీ - లవలీషు లతావిశేశేషు లయో లయనం స్థితిర్యస్యాః సా - లవలీలయా ఆవళిః పంక్తిరసకమలాం రసేన మధ్యాస్వాదేన - కలామవ్యక్తమధురాం - 'ధ్వనౌ తు మధురా స్ఫుటే కలః " ఇత్యమరః - గిరం వాచం అసకృత్ - ఉచ్ఛైరలపత్ - మధుమద హేతుకస్య మధుకరాలాపస్య పల్లవలీలయా జనితవిస్మయహేతుకత్వముత్ప్రేక్షత ఇతి గుణహేతూత్ప్రేక్షా ద్రుతవిలంబితం వృత్తం - ద్రుతవిలంబితమాహ నభౌభరావితి లక్షణాత్ ||

 

అసకలామలపల్లవలీలయా;అసకలాం = పూర్తిగా వికసింపని; అమల పల్లవలీలయా = నిర్మలమైన పల్లవముల లీలచేత; విస్మయం = అబ్బురపాటును; గతవతామివ = పొందినట్లున్నలవలీలయా = తేనెలకు ఆటపట్టయిన కుసుమంపు తీవెలయందు; మధుకృతాం = తేంట్లఆవళీః = శ్రేణి;   రసకలాం = రసోత్కర్షచేత;   కలాం = ఝుంకారపు; గిరం = నాదమునుఅసకృత్ = అల్లనల్లన; ఉచ్చకైః = సానువులలో;   అలపత్ = ఆలాపించెను;

 

నిర్మలమైన బాలపల్లవములచేత విస్మయమంది శిశిరమాసమున లవంగతీవెలయందు వ్రాలిన తుమ్మెదలశ్రేణి రసోత్కర్షచేత ఝుంకారపునాదమును అల్లనల్లన పర్వతసానువులలో ఆలాపించినవి.

౭౯.

కుర్వంతమిత్యతిభరేణ నగానవాచః

పుష్పైర్విరామమళినాం చ న గానవాచః ।

శ్రీమాన్ సమస్తమనుసాను గిరౌ విహర్తుం

బిభ్రత్యచోది స మయూరగిరా విహర్తుమ్ ॥

 

ఇతి పుష్పైః అతిభరేణ అవాచో నగాన్ కుర్వంతం అళినాం గానవాచః చ న విరామం సమస్తం ఋతుం అనుసాను బిభ్రతి ఇహ గిరౌ విహర్తుం శ్రీమాన్ సః మయూరగిరా అచోది

 

సర్వంకష

కుర్వంతమితి || అతీతం పుప్పైరేవాతిభరేణ తత్కృతేన మహాభరేణ తత్కృతేన వా గౌరవేణ నగాన్ వృక్షాన్ అవాంచతి ఇత్యవాచో నమ్రాన్ అంచేరవపూర్వాత్ 'ఋత్విక్' ఇత్యాదినా క్విన్ ప్రత్యయః -  కుర్వంతం అళినాం గాన వాచః గీతధ్వనేః ఝంకారస్య చ న విరామమవిరామం అసమాప్తిం కుర్వంతం సమస్తం ఋతుం సర్వాన్ ఋతూన్ అనుసాను సాసుషు ఇవ ఇత్యర్థః విభక్త్యర్థే అవ్యయీభావః - బిభ్రతి బిభ్రాణే ఇహ గిరౌ రైవతకాద్రౌ విహర్తుం క్రీడితుం శ్రీమాన్ లక్ష్మీ సహితః స హరిః మయూరగిరా కేకయా ఇత్యర్థః - ఆచోది ప్రేరితః - భగవన్నిహ విహరఋతుమనుగృహాణ ఇతి ప్రార్థిత ఇవ ఉత్ప్రేక్షా - వ్యంజకా ప్రయోగాత్ గమ్యా వృత్తముక్తం ।

 

ఇతి  = ఇవ్విధమున; పుష్పైః = విరుల; అతిభరేణ = బరువుచేతనగాన్ = తరువులను; అవాచః = నమ్రములుగాకుర్వంతం = చేయునవిఅళినాం = తుమ్మెదలగానవాచః చ = ఝుంకారములను కూడాన విరామం = అవిరామముగ మ్రోగజేయుచుసమస్తం ఋతుం = అన్ని ఋతువులను; అనుసాను = లోయలలోబిభ్రతి = తాల్చినఇహ గిరౌ = ఈ రైవతక గిరియందు; విహర్తుం = విహరించుటకుశ్రీమాన్ సః = లక్ష్మీసమేతుడైన శ్రీహరిమయూరగిరా = మయూరముల మధురధ్వనిచే; అచోది = ప్రేరితుడాయెను;

 

ఇవ్విధముగా విరులబరువుచేత తరువులను నమ్రములుగా చేయునవి; తుమ్మెదలఝుంకారములను కూడనూ అవిరారముగా మ్రోగించునవి; అయిన సమస్త ఋతువులను లోయలందు కలిగిన ఆ రైవతకగిరులయందు విహరించుటకు లక్ష్మీసమేతుడైన శ్రీహరి మయూరముల మధురధ్వనిచే ప్రేరేపితుడాయెను.

 

********

 

ఇది - మాఘకావ్యము ఆరవ సర్గకు వ్యాఖ్యానము, టీకాసహితము సమాప్తము.  

శిశుపాలవధమ్ ఆరవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (61 - 70)

 ౬౧.

హినుఋతావపి తాః స్మ భృశస్విదో యువతయః సుతరాముపకారిణి|

ప్రకటయత్యనురాగ మకృత్రిమం స్మరమయం రమయంతి విలాసినః||

 

స్మరమయం అకృత్రిమం అనురాగం ప్రకటయతి సుతరాముపకారిణి హిమఋతౌ అపి తాః యువతయః భృశస్విదః విలాసినః రమయంతి స్మ ।

 

సర్వంకష

హిమఋతావితి । స్మరమయం స్మరాదాగతం - స్మర ప్రయుక్త మిత్యర్థః - తత ఆగత ఇతి మయట్ ప్రత్యయః - అకృత్రిమం సహజం రాగం ప్రేమ ప్రకటయతి ప్రకటీ కుర్వాణే తత్కార్యేణ - స్వేదేన ఇతి భావః - ఆతఎవ-సుతరాం ఉపకారిణి - పుంసాం రిరంసౌ జననాతేభ్యస్సానురాగ ప్రకాశనాచ్చాత్యంతో పకర్తరీ త్యర్థః - ఏనంభూతే హిమఋతౌ హేమంతేపి - స్వేదసంభావనారహితకాలేపీత్యర్థః - ఋత్యకఇతి సాంహితః ప్రకృతిభావః - భృశం స్విద్యంతీతి రాగోష్మణే - భృశస్విద ఇతి సాత్త్వికోక్తిః - క్విప్ - హేమంతోపి రాగిణాం స్వేదహేతురేవ - తద్దేతు రాగహేతుత్వాదితి భావః- తాస్తథావిధాః - యువతయః విలాసినః ప్రియాన్ - రమయంతి స్మ - హేమంతస్యోద్దీపకత్పాత్ ఇతి పీడాక్షమత్వాద్దీర్ఘః రాత్రిత్వాచ్ఛ ఉభయేచ్ఛాసదృశ మరమంతేత్యర్థః

 

స్మరమయం = మన్మథజన్యమైనఅకృత్రిమం = స్వాభావికమైనఅనురాగం = కాంక్షనుప్రకటయతి = వెలిబుచ్చుటకు; సుతరాం = మిక్కిలి; ఉపకారిణి = సహాయము చేయుహిమఋతౌ అపి = హేమంత ఋతువులో కూడాతాః యువతయః = ఆ జవ్వనులుభృశస్విదః = (సాత్వికభావము చేత)మిక్కిలి స్వేదము కలవారై; విలాసినః = తమ ప్రియులనురమయంతి స్మ = ఆనందపరచిరి కదా!

 

మన్మథజన్యమైన స్వాభావికమైన శృంగారకాంక్షకు మిక్కిలి దోహదం చేసే ఈ హిమఋతువులో(అంత చలిలో) కూడా జవ్వనులు సాత్వికభావం పెచ్చరిల్లి మిక్కిలిగా స్వేదాన్ని వెలువరించడమే కాక, తమ ప్రియులను అలరించారు.

౬౨.

కుసుమయన్ ఫలినీరళినీ రవైమదవికాసిభిరాహితహుంకృతిః ।

ఉపవనం నిరభర్త్సయత ప్రియాన్వియువతీర్యువతీశ్శిశిరానిలః ॥

 

ఉపవనం ఫలినీః కుసుమయన్ మదవికాసిభిరాహితహుంకృతిః అళినీరవైః శిశిరానిలః ప్రియాన్ వియువతీ యువతీః నిరభర్త్సయత

 

సర్వంకష

అథ శిశిరం వర్ణయతి - కుసుమయన్నిత్యాది. ఉపవనం వన ఇత్యర్థః విభక్త్యర్ధేవ్యయీభావః - తృతీయా సప్తమ్యో బహుళమితి వికల్పాదమ్ భావః - ఫలినీః : ప్రియంగులతాః ప్రియంగుః ఫలినీ ఫలిత్యమరః - కుసుమయన్ కుసుమ వతీః కుర్పన్నిత్యుద్దీపన సామగ్రీ వర్ణణం -కుసుమాయతే మత్పంత ప్రకృతికాత్ తత్కరోతి తిణ్యంతాల్లబశ్శత్రాదేశః- ణావిష్ఠవద్భావే విన్మతోర్లుక్ - మదవికాసిభిః మద విజృంభమాణేః -అళినీరవైః భృంగీఝంకారైః ఆహిత హుంకృతిః కృతహుంకారః - మాధుర్యాదుద్దీపక త్వా దతిశయద్యోతనార్థం అళినీతి స్త్రీ లింగనిర్దేశః - శిశిరానిలః - ప్రియాన్ - వియువతీః కోపాద్వియుం జానాః - యాతేశ్శతరిధాతోరువఞాదేశః - ఉగితశ్చేతి జీప్ - యువతీః వధూః - యూనస్తిరితితి ప్రత్యయః - నిరభత్సన్ యత్ ఆతర్జయత - తర్జ భత్స్యోశ్చౌరాదికయోః  అనుదాత్తత్వాదాత్మనేపదం- అత్ర వాయావచేతనే చేతన ధర్మో నిరభత్సన్ నముత్ప్రేక్షతే - సా చాళినీఝుంకారహుంకారోజ్జీవతేతి రూపక సంకీర్ణా వ్యంజకా ప్రయోగాద్గమ్యా చ ॥

 

ఉపవనం = వనప్రాంతములలోఫలినీః = ప్రియంగులతలుకుసుమయన్ = వికసింపజేయుచు; మదవికాసిభిరాహితహుంకృతిః = మదకారకమైన ఝుమ్మను హుంకృతి గలఅళినీరవైః = తుమ్మెద్ల ఝుంకారనాదము గలశిశిరానిలః = శిశిర ఋతువు యొక్క వాయువు; ప్రియాన్ = ప్రియులవియువతీ = విరహములో నున్నయువతీః = యువతులను; నిరభర్త్సయత = భయపెట్టెను.

 

వనప్రాంతములలో ప్రియంగులతలను వికసింపజేసేది, మదకారకమైన ఝుమ్మనే నాదాన్ని తేంట్లకు కలిగిస్తూ ఉన్న శిశిరరుతువు యొక్క గాలి ప్రియులయొక్క విరహంలో ఉన్న యువతులను ప్రణయలోపకారణము చేత భయపెట్టింది.

౬౩.

ఉపచితేషు పరేష్వసమర్థతాం వ్రజతి కాలవశాద్బలవానపి ।

తపసి మందగభస్తి రభీశుమాన్న హి మహాహినుహానికరోభవత్ ॥

 

కాలవశాత్ బలవానపి పరేషు ఉపచితేషు అసమర్థతాం వ్రజతి హి తపసి మందగభస్తిరభీశుమాన్ మహాహిమహానికరః న అభవత్ ।

 

సర్వంకష

ఉపచితేష్వితి || కాలవశాత్ -బలవానపి-పరేషు శత్రుషు-ఉపచితేషు ప్రవృద్ధేషు సత్సు అసమర్ధతాం దౌర్బల్యం - వ్రజతి- హి-యస్మాత్ణారణాత్ - తపసి మాఖమాసే-తపా మాఖ ఇత్యమరః - మందగభస్తిః అపటురశ్మిః- అభిశుమానంశుమాన్ -అభీశు ప్రగ్రహేరశ్మావిత్యమరః - మహతః ఉపచితస్య హిమస్య - హానిం నాశం కరోతీతి మహాహిమహానికరః -తద్ధేతుర్నాభవత్ । కృఞో హేతుతా చ్ఛీల్య ఇతి హేత్వర్థే ట ప్రత్యయః. విశేషేణ సామాన్య సమర్థనరూపోర్థాంతర న్యాసాలంకారః |

 

కాలవశాత్ = కాలప్రభావము చేతబలవానపి = బలవంతుడైనాపరేషు = శత్రువులఉపచితేషు = వృద్ధిలోఅసమర్థతాం = దౌర్బల్యాన్ని; వ్రజతి = పొందుతాడు; హి = యుక్తమే!; తపసి = మాఘమాసములోమందగభస్తిరభీశుమాన్ = మందమైన కిరణాలు కలిగిన సూర్యుడుమహాహిమహానికరః; మహాహిమ = హిమపాతపు రాశులకు; హానికరః =ప్రమాదకారి; న అభవత్ = కాకపోయెను ।

 

కాలప్రభావము చేత బలవంతుడైన వాడు కూడా శత్రువుల విషయంలో అసమర్థుడవుతాడు. అది యుక్తమే! మాఘమాసంలో కిరణాల వేడిమి యొక్క తీవ్రత లేని దివాకరుడు హిమపాతపు రాశులకు ప్రమాదకారి కాలేకపోయినాడు.

౬౪.

అభిషిషేణయిషుం భువనాని యః స్మరమివాఖ్యత లోధ్రరజశ్చయః |

క్షుభిత సైన్యపరాగ విపాండురద్యుతిరయం తిరయన్నుదభూదిశ ||

 

క్షుభిత సైన్యపరాగః విపాండురద్యుతిః యః లోధ్రరజశ్చయః భువనాని అభిషిషేణయిషుం స్మరం అఖ్యత ఇవ అయం దిశః తిరయన్ ఉదభూత్ 

 

సర్వంకష

అభిషిషేణయిషుమితి ॥ క్షుభితః - ఉద్భూతః - యస్సైన్యపరాగః సేనారజః - స ఇవ విపాండర ద్యుతిః శుభ్రవర్ణః -అత ఏవ- యోలోధ్ర రజశ్చయః. భువనాని - అభిషిషేణయిషుం అభిషేణయితుం- సేనయా అభియాతుమిచ్చు మిత్యర్థః -  యత్సేనయాభిగమనమరౌతదభిషేణనమిత్యమరః సత్యాపపాశేత్యాదినా - సేనాశబ్దాచ్చిణి సనాశం సభిక్ష ఉరిత్యు ప్రత్యయః - స్థాదిషు అభ్యాసేన చాభ్యా సస్యేతి ధాత్వభ్యాసనకారయోషత్వం-స్మరం - ఆఖ్యాతేవ ఆఖ్యాత వాని వేత్యుత్ప్రేక్షా - చక్షిఞః ఖ్యానా దేశః - అస్యతి వ క్తి ఖ్యాతిభ్యో ఞాతిచ్చేరఞారేశః అయం లోధ్రరజశ్చయః - దిశః తిరయన్ తిరస్కుర్వన్ తిరశ్శబ్దాత్ తత్కరోతీతి ణ్యంతాల్లట శ్శత్రాదేశః - ణావిష్ఠవద్బావె టి లోపః ఉదభూత్ ఉద్భూతః॥

 

క్షుభిత = కల్లోలమైనసైన్యపరాగః = సేనలధూళి వలేవిపాండురద్యుతిః = తెల్లగా ప్రకాశించేయః లోధ్రరజశ్చయః = ఏ లొద్దుగు పూల పరాగములు కలవోభువనాని = జగత్తును; అభిషిషేణయిషుం = సేనతో ముట్టడించుస్మరం అఖ్యత ఇవ = ప్రసిద్ధుడైన కాముని వలేఅయం = లోధ్రపరాగములు; దిశ తిరయన్ = దిశలను ఆచ్ఛాదితము చేస్తూ; ఉదభూత్ = ఉద్భవించెను;

 

కల్లోలమైన సేనల దండు కదిలేప్పుడు పుట్టే ధూళిలాగా తెల్లగా మెరిసిపోయే లొద్దుగుపూల పరాగాలు - ఈ జగత్తును కాముడు తనసేనతో ముట్టడిస్తున్నట్టు, దిశలను కప్పేస్తూ శిశిరకాలంలో నెలకొన్నాయి.

౬౫.

శిశిరకాలమపాస్య గుణో౽స్య నః క ఇవ శీతహరస్య కుచోష్మణః |

ఇతి ధియాస్తరుషః పరిరేభిరే ఘనమతో నమతో౽నుమతాన్ ప్రియాః ||

 

శిశిరకాలమపాస్య శీతహరస్య నః కుచోష్మణః క ఇవ గుణః ఇతి ధియా అతః ప్రియాః అస్తరుషాః నమతః అనుమతాన్ ఘనం పరిరేభిరే ।

 

సర్వంకష

శిశిరేతి॥ శిశిరకాలం అపాస్య అపహాయ - శీతంహరతీతి శీతహరః. తస్య హరతేరమద్యమనత్యచ్ ప్రత్యయః- సః అస్మాకం అస్య కుచోష్మణః కుచోష్ణస్య క ఇవ గుణః కిం ఫలం -సంపాద్యత ఇతి శేషః-గమ్యమాన క్రియాపేక్షయా కాక్వానిర్దేశః ఇవశబ్లోవాక్యాలంకారే-ఇతిధియా అతోస్మిన్ శిశిరకాలే - సార్వవిభ క్తికస్తసిః ప్రియాః కాంతాః ఆస్తరుషోని రస్తరోషాస్సత్యః నమతః ప్రణమతః అమమర్తాన్ స్వప్రియాన్ - ఘనం నిబిడం-పరిరేభిరే ఆక్లిష్టవత్యః - ఇతి ధియేతి సుఖార్థస్య పరిరంభస్య కుచోష్మ సాఫల్యార్థ త్వముత్ప్రేక్ష్యతే - వ్యంజకా ప్రయోగాత్ గమ్యత్వం చ ।

 

శిశిరకాలమపాస్య = శిశిరాన్ని వదిలి;(ఒక్క శిశిర ఋతువులో కాక) శీతహరస్య = చలిని పోగొట్టేనః = మాకుఅస్య కుచోష్మణః = ఈ పాలిండ్ల వేడిమిక ఇవ గుణః = ప్రయోజనమేమి?; ఇతి ధియా = అను ఆశంకతోఅతః ప్రియాః = ఇప్పుడు ప్రియురాండ్రుఅస్తరుషాః = లజ్జను వదిలి; నమతః = తమ యెదుట నమ్రులైన; అనుమతాన్ = ప్రియులనుఘనం పరిరేభిరే = గాఢముగా కౌగిలించిరి.

 

ఒక్క శిశిర ఋతువులో చలిని పోగొట్టటానికి తప్ప, ఇంకే ఋతువులోనూ మా పయ్యెదల వేడిమికి ఏ ప్రయోజనమూ లేదు. ఇట్లు చింతించిన ప్రియురాండ్రు లజ్జను వదిలి తమ యెదుట నమ్రులైన ప్రియులను గాఢంగా కౌగిలించుకున్నారు.

(వల్లభదేవుని వ్యాఖ్య ప్రకారం ప్రియురాండ్రు ఏ మాత్రం తల వొగ్గక ప్రియులను కౌగిలించుకున్నారు.)

౬౬.

అధిలవంగమమీ రజసాధికం మలినితాస్సునునోడళతాళినః |

స్ఫుటమితి ప్రసవేన పురో౽హసత్సపది కుందలతాదళతాళినః||

 

అధిలవంగం సుమనోదళతాళినః అమీ అళినః రజసా అధికం మలినితా  పురః సపది కుందలతా దళతా ప్రసవేన  స్ఫుటమితి అహసత్ ।

 

సర్వంకష

అధిలవంగమితి || లవంగేషు అధిలవంగం- విభక్త్యర్థే అవ్యయీభావః; సుమనసాం పుష్పాణాం దళేషు తలంతి ప్రతిష్ఠంతీతి సుమనోదళతాళినః - తల ప్రతిష్ఠాయామిత్యస్మాద్ధాతో రాభీష్ణేతాచ్చీల్యే వాణిః అమీ అళినో మధుపాః రజసా పరాగేణ ఆర్తవేన చ - అధికం మలినితాః మలీమసాః - పాపినశ్చ కృతాః మలినితా ఇతి హేతోః పురోగ్రే-సపది కుందలతామాఘ్యవల్లీ మాఘ్యం కుందమిత్య మరః - దళతావిక సతా- ప్రసవేన నిజకుసుమేన. ఆహసత్ జహాస - స్ఫుటమిత్యుత్ప్రేక్షాయాం - రజస్వలాంగం తారం కామినం సపత్న్యో హసంతీతి భావః - కుందకుసుమస్య ధావళ్యా ద్దాసత్వేనోత్ప్రేక్షా ||

 

అధిలవంగం = లవంగములసుమనోదళతాళినః = కుసుమపత్రము నాశ్రయించిన; అమీ అళినః = ఈ తేంట్లురజసా = పరాగము చేతఅధికం = మిక్కిలిమలినితా = నలుపును పొందెను ; స్ఫుటం = నిశ్చయము; ఇతి = అని;   పురః = ఎదుట గల; సపది = ఇప్పుడుకుందలతా = కుందలతయొక్కదళతా = మొగ్గల; ప్రసవేన = చివురింపుతో;   అహసత్ = నవ్వెను;

 

లవంగపుష్పాలనాశ్రయించిన తేంట్లు భ్రమరాలు వాటి పరాగంతో మరింత చిక్కని నలుపు రంగును సంతరించుకున్నాయి నిజం అన్నట్టు ఎదుట గల కుందలత తన మొగ్గల చివురింపుతో ఇదుగో ఇప్పుడు నవ్వుతోంది.

౬౭.

ఆతిసురభిరభాజి పుష్పశ్రియామతనుతరతయేవ సంతానకః |

తరుణపరభృత స్స్వ నం రాగిణామతనుత రతయే వసంతానకః||

 

అతిసురభి సంతానకః పుష్పశ్రియాం అతనుతరయేవ అభాజి వసంతానకః తరుణపరభృతః రాగిణాం రతయే స్వనం అతనుత ।

 

సర్వంకష

అథయమకవి శేష గ్రథన కౌతుకితయా కవిః పునః ద్వాదశభిః ఋుతూన్వర్ణయన్నా ద్యైశ్చతుర్భిః వసంతం వర్ణయతి -  అతిసురభిరితి || అతిసురభిరత్యంతసుగంధిః - సుతానకః కల్పవృక్షః.- పుష్పశ్రియాం ప్రసూన సంపదాం - అతనుతరతయా మహత్తర త్వేన - అతను శబ్దాత్తరబంతాత్ తల్ ప్రత్యయః అభాజీవ అభంజీవేత్యుత్ప్రేక్షా - అధోనమ్ర ఇతి భావః భంజేశ్చచిణీతి విభాషానలోపః ఉపదావృద్ధిశ్చిణోలుక్ - వసంతస్యానకోవ వసంతానకః వసంతాగమ దుందుభిరితి రూపకం- తరుణపరభృత స్తరుణ కోకిలః రాగిణాం కామినాం - రతయే రాగవివర్ధనాయ స్వనం - ఆతనుత - మధురం చుకూజ ఇత్యర్థః ప్రభావృత్తం

 

అతిసురభి = అత్యంత పరిమళదాయకమైన; సంతానకః = కల్పవృక్షముపుష్పశ్రియాం = కుసుమసంపద యొక్క; అతనుతరయేవ = అతిశయము చేత; అభాజి = విరిగినది; వసంతానకః = వసంతము యొక్క తప్పెటతరుణపరభృతః = లేకోయిల; రాగిణాం = ప్రణయ అనురక్తులరతయే = శృంగారము కొఱకుస్వనం = నాదమునుఅతనుత = నినదించెను.

 

అత్యంతపరిమళదాయకమైన కల్పవృక్షము, పూలశోభల అతిశయముతో భంజనమైనది. వసంతముయొక్క తప్పెట లేకోయిల - ప్రణయజీవుల శృంగారమును హెచు చేయుటకు తన గానము చేయుచున్నది.

౬౮.

నోజ్ఝితుం యువతిమాననిరాసే దక్షమిష్టమధువాసరసారమ్|

చూతమాళిరళినామతిరాగాదక్షమిష్టమధువాసరసారమ్||

 

అరం ఇష్టమధువాసరసా అళినామ యువతిమాననిరాసే దక్షం మధువాసరసారం చూతం అతిరాగాత్ ఉజ్ఝితుం న అక్షమిష్ట

 

సర్వంకష

నోజ్ఝితుమితి ॥ అరమత్యంతం-ఇష్టేష్వీప్సితేషు - మధుషు మకరందేషు వాసేవ సతౌ రసోరాగో యస్యాస్సా - ఇష్టమధు వాసరసా - మధుపాన ప్రియే త్యర్థః: - అతఏవ - అళినామళిః భృంగశ్రేణిః యువతీ మానని రాసే- దక్షం కుశలం - ఉద్దీపకత్వాదితి భావః - మధు వాసరేషు వసంతదినేషు - సారం శ్రేష్టం - మధువాసరసారం - తత్కాల శ్లాఘ్యమిత్యర్థః చూతం సహకారం అతిరాగాదతి లౌల్యాత్ ఉజ్ఝితుం హాతుం -నాక్షమిష్ట నా సహిష్ట - క్షమేర్బౌవాదికార్లు జ్- స్వాగతావృత్తం - ఉక్తం చ !

 

అరం = అత్యంత ప్రీతికరమైనఇష్టమధువాసరసా = మకరంద రసాన్ని గ్రోలుటకుఅళినామ = తుమ్మెదలశ్రేణియువతిమాననిరాసే దక్షం = యువతుల మానమును భంజించుటకు సమర్థమైమధువాసరసారం = వసంతకాలపు సారము అయిన; చూతం = మావి వృక్షాన్ని; అతిరాగాత్ = గొప్ప మోహముతోఉజ్ఝితుం - విడచుటకున అక్షమిష్ట = ఒప్పలేదు.

 

తమకత్యంత ప్రీతికరమైన మకరందపానము కొరకు తుమ్మెదలశ్రేణి - యువతులమానమును భంజించుటకు సమర్థమైన వసంతకాలపు సారభూతమైన మావివృక్షాన్ని గొప్ప మోహంతో చేరుకుని వదిలి పెట్టుటకు ఇచ్ఛగింపనే లేదు.

౬౯.

జగద్వశీకర్తుమిమాః స్మరస్య ప్రభావనీ కేతనవైజయంతీః |

ఇత్యస్య తేనే కదళీమధుశ్రీః ప్రబావనీ కేతనవైజయంతీః ||

 

ప్రభావనీ ఇతి మధుశ్రీః జగద్వశీకర్తుం ప్రభౌ అస్య స్మరస్య ఆనీకే జయంతీః కేతనవైజయంతీః తనవే ఇమాః కదళీ తేనే ।

 

సర్వంకష

జగదితి || ప్రభావయతీతి ప్రభావనీ సంపాదయిత్రీ - కర్తరిల్యుట్ - ఞీప్-మధుశ్రీః - వసంత లక్ష్మీః కత్రీన్ జగత్ వశీకర్తుం - ప్రభౌ సమర్థే, అస్య స్మరస్య-ఆనీకే సైన్యే - జయంతీః జిత్వరీః - కేతన వైజయంతీః ధ్వజపతాకాః - తనవే కరవాణి - తనోతేః ప్రాప్తకాలే లోట్ - టెరేత్వమిత్యేకారః 'ఏత ఏ' 'ఆడుత్తమస్య పిచ్చ; ఇతి ఆటి ఆటశ్చ ఇతి వృద్ధిః  ఇతి మనీషయేతి శేష:- ఇమాః కదళీః రంభాతరూన్ తేనే వితస్తార 'కదళీ వారణబుశా రంభామోచాంశు మత్ఫలా; ఇత్యమరః కదలీషు కామ వైజయంతీతోత్ప్రేక్షా- వృత్తముపజాతిః ॥

 

ప్రభావనీ ఇతి = ప్రభావవంతమైన; మధుశ్రీః  = వసంతశోభ; జగద్వశీకర్తుం = లోకమును వశపర్చుకొనుటకుప్రభౌ = సమర్థమైఅస్య స్మరస్య = ఈ మన్మథునిఆనీకే = సైన్యమందుజయంతీః = విజయశీలమైన; కేతనవైజయంతీః = ధ్వజపతాకమునుతనవే = స్థాపించెదను; ఇమాః = అని; కదళీ = అరటిబోదెను; తేనే = వ్యాపింపజేసెను..

 

ప్రభావశీలమైన వసంతశోభ లోకమును వశపర్చుకొనుటకు ఉద్యుక్తమై 'మన్మథుని సైన్యమందు విజయశీలమైన ధ్వజపతాక నాటెదను గాక' యని అరటిని లోకమున వ్యాపింపజేసెను.

౭౦.

స్మరరాగమయీ వపుస్తమిస్రా పరితస్తార రవేరసత్యవశ్యమ్ |

ప్రియమాప దివాపి కోకిలే స్త్రీ పరితస్తారరవే రసత్యవశ్వమ్||

 

అసతి స్మరరాగమయీ తమిస్రా రవేః వపుః పరితస్తార అవశ్యం పరితః తారరవే కోకిలే రసతి స్త్రీ దివౌ అపి అ-వశ్యం ప్రియంఆప 

 

సర్వంకష

స్మరేతి|| అసతి దుష్టా స్మరేణ కామేన నిమిత్తేన - యః రాగోరమణేచ్ఛా సఏవ తన్మయీ తమిస్రా తమస్తోమః - 'తమిస్రా తిమిరేరోగే తమిస్రా తు తమస్తతౌ కృష్ణపక్షునిశాయాం చ' ఇతి విశ్వః - రవేః-వపుఃమండలం పరితస్తార ఆవవ్రే - అహని రజనీధియం జనయామాస ఇత్యర్థః- పరిపూర్వాత్ తృణాతేర్లిట్ - అవశ్యమ్ - సత్యమిత్యర్థః: కుతః - పరితస్పమంతాత్ - తారరవే ఉచ్చతరధ్వనౌ- కోకిలే రసతి కూజతి పతి ఇత్యుద్దీపక ఉక్తిః- స్త్రీ స్త్రియ ఇత్యర్థః జాతౌ ఏకవచనం- దివాపి దివసేపి సప్తమర్థే అవ్యయః - వశంగతో వశ్యః వశం గతః ఇతి యత్ ప్రత్యయః - నవశ్యః తం అవశ్యం - ఆవశం గతమపి ఇత్యర్థః ప్రియం ప్రేయాంసం - ఆపస్వయమేవాభిససారేత్యర్థః - యదగణయంతమపి ప్రియం దివాపి మానమవిగణయ్య నిషేధం చోల్లంఘ్య సమగచ్చతతత్సత్యం రాగ తిమిర తిరోహిత భాను మండలా భామిన్య ఇతి రూపకానుప్రాణితే యమాప్తి క్రియానిమిత్తా పరితస్తరణ క్రియాస్వరూపో ఉత్ప్రేక్షా - అవశ్యమితి వ్యంజకా ప్రయోగాత్ వాచ్యా ఔపచ్చండసికం వృత్తమ్ ।

 

అసతి = దోషయుక్తమైనస్మరరాగమయీ = ప్రణయకాంక్ష గల; తమిస్రా = అంధకారసమూహము చేతరవేః వపుః = సూర్యమండలము; పరితస్తార = కప్పబడినది; (పగటిపూటనే రాత్రి వాతావరణమేర్పడినది అని భావము) అవశ్యం = నిజమేపరితః = అంతటాతారరవే = యెలుగెత్తిన; కోకిలే = కోకిలయందురసతి (సతి) = కూజితములు ఉండుట వలన; స్త్రీ = యువతులు (జాతి యందేవకవచనము) దివౌ అపి = పగటిపూటనూఅ-వశ్యం = వివశులై; ప్రియంఆప = ప్రియుని చేరిరి;

 

దోషభరితమైన ప్రణయకాంక్షగల అంధకారసమూహము చేత సూర్యమండలము కప్పబడినది. నిజమే. అంతటనూ యెలుగెత్తిన కోకిల కూజితముల వలన మత్తులై స్త్రీగణము పగటిపూటనే వివశులై పతులను చేరిరి.

శిశుపాలవధమ్ ఆరవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (51 - 60)

 

౫౧.

విగత వారిధరావరణాః కృచిద్దదృశురుల్లసితాసిలతాసితాః |

క్వచిదివేంద్రగజాజిన కంచుకాః శరది నీరదినీ ర్యదవోదిశః ||

 

శరది యదవః క్వచిత్ విగతవారిధరావరణాః (అత ఏవ) ఉల్లసితాసిలతాసితాః క్వచిత్ నీరదనీః  (అత ఏవ) ఇంద్రగజాఇనకంచుకాః ఇవ దిశః దదృశుః |

 

సర్వంకష

విగతేతి || శరది-యదవః యారవాః యదుశబ్దేన రఘుశబ్దవత్తదపత్యే లక్షణా | న్ననపదశబ్దనామేవ 'తద్రాజస్య బహుషు' ఇతి లుక్సంభవాదితి-క్సచిత్ విగతవారిధరావరణాః : నివృత్త మేఘావరణాః - అత ఏవ ఉల్లసితాః కోశాదుధృతాః - అసిర్లతేవాసిలతా-తద్వత్-ఆసితాః శ్యామాః ఇత్యుపమా క్వచిన్నీరదనీః మేఘవతీః శుభ్రాభ్రపటలచ్చన్న ఇత్యర్థ:-అత ఏవ- ఇంద్ర గజాజిన మైరావతచర్మ తదేవ కంచుకః కూర్పాసకః యాసాంతాః ఇవ స్థితా ఇత్యుత్ప్రేక్షా-దిశః దదృశుః ఉక్తాలంకారయోస్సంసృష్టి:

 

శరది = శరత్కాలమున; యదవః = యాదవులు;  క్వచిత్ = ఒకచోట;  విగతవారిధరావరణాః = జలదరహితమైన; (అత ఏవ = ఇంకనూ) ఉల్లసితాసిలతాసితాః; ఉల్లసిత = ఒర నుండి దూసిన; అసితాః అసిలతా = నల్లనివి, తీవెల వంటి ఖడ్గాల వలె ఒప్పు;   క్వచిత్ = ఒకచోట; నీరదనీః = మేఘములు గల; (అత ఏవ = మరియు) ఇంద్రగజా కంచుకాః ఇవ= ఐరావతము యొక్క చర్మము వంటి ; దిశః = దిశలను; దదృశుః = చూచిరి;

 

శరత్కాలమున యాదవులు ఒకచోట జలదరహితమైన మరియు ఒరనుండి దూసిన ఖడ్గముల వలే నల్లగా తీవెలాగా మెరిసే ఖడ్గం లా ప్రకాశిస్తున్న; ఒకచోట మేఘములు గల; ఐరావతపు చర్మంలా ధవళయుతమైన దిశలను చూచిరి.

 

విశేషములు;

ఈ శ్లోక భావము, వ్యాఖ్యానము కూడా సంక్లిష్టంగా ఉన్నాయి. సరైన భావం ద్యోతకం కావటం లేదు.

నీరదనీః అంటే మేఘయుతః అని వ్యాఖ్యానకారుడు - అంటే మేఘములతో కూడిన అని అర్థం. కానీ ఆ వెంటనే వివిరిస్తూ శుభ్రాభ్రపటలచ్ఛన్నః (శుభ్రమైన ఆకాశముతో కప్పబడిన) అన్నాడు. తాత్పర్యం పొసగటం లేదు.

ఉల్లసితాసిలతాసితాః - ఇక్కడ పాఠంలో అవగ్రహం లేదు. అసిలతా ఇవ సితాః అంటే భావం సరిపోతుంది. తీవె వంటిది, తెల్లనైనది అయిన ఖడ్గం లాంటి; అయితే ఖడ్గం - సాధారణంగా అసితమే. ఇది చిక్కు.

అసితాః అని, శ్యామాః అని వ్యాఖ్యాన కారుడు. శ్యామమంటే నల్లనివి. దిశలు నల్లనివైతే శరత్కాలానికి ఒప్పదు. ఇది ఇక్కడ చిక్కు.

౫౨.

విలులితామనిలశ్శరదంగనా నవసరోరుహకేసరసంభవామ్ |

వికిరితు పరిహాసవిధిత్సయా హరివధూరివ ధూళిముదక్షిపత్ ||

 

శరదంగనా అనిలవిలులితాం నవసరోరుహకేసరసంభవామ్ ధూళిం పరిహాసవిధిత్సయా హరివధూః వికిరితుం ఉదక్షిపత్ ।

 

సర్వంకష

విలులితామితి || శరదేవాంగనా శరదంగనేతి రూపకమ్ - అనిలవిలులితాం విక్షోభితాం - ఇతస్తతో విక్షిప్తా మిత్యర్థః - సవసరోరుహకేసరసంభవాం-ధూళిం పరాగం-పరిహాసవిధిత్సయా నర్మరీతి చికీర్షయా-డధాతేః సన్నంతాత్, స్త్రియామప్రత్యయే టాప్ - హరివధూ - వికిరితుం విక్షేప్తుమివ 'తుముణ్వులౌ క్రియాయాం క్రియార్థాయా'మితి తుమున్ ప్రత్యయః- ౠతఇద్దాతో రితీకారః - ఉదక్షిపత్ ప్రేరితవతీ- రూపకోంజీవితేయముత్ప్రేక్షా-కిరతిరయం కీర్యమాణకర్మా - యథాహ - రజః కిరతి మారుతః క్వచిత్త త్తారకోద్దేశ్యకర్మా తథాత్రైవేతి వివేకః |

 

శరదంగనా = శరత్తు వంటి అందమైన అంగనలు;  అనిలవిలులితాం = గాలిచే కదుపబడినవి;  నవసరోరుహకేసరసంభవామ్ = సరస్సున జనించిన క్రొందామరల పరాగము గల;  ధూళిం = ధూళిని;  పరిహాసవిధిత్సయా ఇవ = క్రీడా విలాసముగా;  హరివధూః  = శ్రీకృష్ణుని ప్రేయసులపై; వికిరితుం = చిందునట్లు;  ఉదక్షిపత్ = చల్లిరి.

 

శరత్కాలము వంటి సుందరాంగులు గాలిచే కదుపబడినవి, సరస్సున పుట్టిన క్రొందామరల పుప్పొడిని కలిగిన ధూళిని క్రీడావిలాసముగా శ్రీకృష్ణుని ప్రియురాండ్రపై చిందేట్టు చల్లిరి.

 

విశేషములు

ఈ శ్లోకం అన్నమాచార్య కృతిని గుర్తు తెప్పిస్తున్నది.

 

జగడపు జనవుల జాజర |

సగివల మంచపు జాజర ||

 

మొల్లలు దురుముల ముడిచిన బరువున |

మొల్లపు సరసపు మురిపెమున |

జల్లన బుప్పొడి జాగర బతిపై |

చల్లే రతివలు జాజర ||

౫౩.

హరితపత్రమయీవ మరుద్గణైః స్రగవబద్ధమనోరమపల్లవా|

మధురిపోరభితామ్రముఖీ ముదం దివితతా వితతాన శుకావళిః||

 

అభితామ్రముఖీ శుకావళిః మరుద్గణౖః దివితతా హరితపత్రమయీ స్రగవబధ్ధమనోరమపల్లవాః మధురిపోః ముదం ఇవ వితతాన ।

 

సర్వంకష

హరితేతి || అభితామ్రముఖీ అరుణముఖీ 'స్వాంగాచోపసర్జనాత్' ఇత్యాదినా వికల్పాత్ జీష్-శుకావళి:- మరుద్గణైః - దివితతా హరి ప్రియార్థమాకాశే వితతాహరితానాం. హరిద్వర్ణానాం పత్రాణాం వికారో హరితపత్రమయీ 'టిగ్ ఢాణఞ్' ఇత్యాదినా జీప్ తథా అవబద్ధాః గ్రధితా:- మనోరమాః పల్లవాః యస్యాం సా స్రగివ ఉత్ప్రేక్షా-మధురిపోః శ్రీకృష్ణ స్య-ముదం-వితతాన చకార ఇత్యర్థః

 

అభితామ్రముఖీ = ఎర్రని ముక్కులుగల;  శుకావళిః = రామచిలుకలు; మరుద్గణౖః = దేవతలచేత;  దివితతా = దివినుండి;  హరితపత్రమయీ = పచ్చని రంగు గల;  స్రగవబధ్ధమనోరమపల్లవాః = ఆకులచేత కట్టబడిన మనోహరమైన మాలవలే;  మధురిపోః = మధుసూదనుని; ముదం ఇవ = సమ్తసము కోసమే యన్నట్లు;  వితతాన = కూర్చబడినవి.

 

శరత్కాలంలో నిర్మలమైన ఆకాశంలో ఎర్రని ముక్కులున్న రామచిలుకల దండు యెగురుతోంది. అది దేవతలు మధుసూదనుని అలరించటం కోసం హరితపత్రాలతో చేసిన మనోహరమైన మాల అన్నట్టు అమరింది.

౫౪.

స్మితసరోరుహనేత్ర సరోజలామతి సితాంగవిహంగహసద్దివమ్|

ఆకలయన్ముదితామివ సర్పతస్సశరదం శరదంతురదిజ్ముఖామ్||

 

సః స్మితసరోరుహనేత్రసరోజలాం అతిసితాంగవిహంగహసద్దివమ్ శరదంతురదిజ్ముఖామ్ శరదం సర్వతః ముదితాం ఇవ అకలయన్ ।

 

సర్వంకష

సహరిః సితాని వికసితాని- సరోరుహాణ్యేవ నేత్రాణియేషు తాని-సరోజలాని యస్యాం తాం తథోక్తాం అతిసితాంగాః ధవళపక్షాః - యే విహంగాః హంసాః తైర్హసంతీ స్మ యమా నేవస్థితా ద్యౌర్యస్యాం తాం తథోక్తాం - శరైః తృణవిశేషైః డంతురాణ్యున్న తదంతాని హాసాత్ ప్రకాశరశనానీతి యావత్ డంత ఉన్నత ఉరజిత్యురచ్ ప్రత్యయోమత్వర్థీయః- తాని దిజ్ముఖాని యస్యాం తాం-శరదంతురదిజ్ముఖాం-శరడం - సర్వతః ముదితామివ అకలయత్ - సర్వత్ర నేత్రవికాస హాసాదిలింగైః హృష్టామివ అమన్యతే ఇత్యర్థః - అత్ర సరోజహంసశరేషు నేత్రహాసదంతత్వారోపణాద్రూపకాలంకారః- తద్వశాత్ ప్రతీయమాన అంగనా భేదాధ్యవసాయాత్ శరది ముదితత్వ ఉత్ప్రేక్ష ఇతి సంకరః!

 

సః = ఆ మాధవుడు;  స్మితసరోరుహనేత్రసరోజలాం = నీట వికసించిన కలువల వంటి లోచనములు గల తటాక జలములను ;  అతిసితాంగవిహంగహసద్దివమ్ = ధవళగాత్రముతో ఒప్పారు హంసలతో స్వర్గాన్ని పరిహసిస్తున్నది;  శరదంతురదిజ్ముఖామ్; శర = రెల్లు గడ్డి అనే; దంతుర = దంతములు గల; దిజ్ముఖామ్ = దిశ అనెడు ముఖము గలదానిని అయిన;  శరదం = శరత్తును;  సర్వతః = ఎల్లెడలా;  ముదితాం ఇవ = అతివ వలే భావించి; అకలయన్ = ప్రసన్నుడాయెను;

 

ఆ మాధవుడు శుభ్రమైన జలాల్లో వికసించిన కలువల్లాంటి స్వచ్ఛమైన జలాలనే నేత్రాలుగానూ, స్వర్గాన్ని పరిహసించే హంసల్లాంట తెల్లని దేహంగానూ, రెల్లుగడ్డిని దంతాలుగానూ, దిశ అనే ముఖాన్ని కలిగిన అందమైన శరత్తు అనే ముదిత గా సంభావించాడు.

౫౫.

(అథ హేమంతం వర్ణయతి)

గజపతిద్వయసీరపి హైమనస్తుహినయన్ సరితః పృషతాంపతిః |

సలిల సంతతి మధ్వగయోషితామతనుతాతనుతాపకృతం దృశామ్ ||

 

గజపతిద్వయసీః అపి సరితః తుహినయన్ హైమనః పృషతాం పతిః అధ్వగయోషితాం దృశాం అతనుతా అపకృతం సలిలసంతతిం అతనుత |

 

సర్వంకష

గజపతీతి || గజపతిః ప్రమాణమాసాం గజపతి ద్వయస్యః మహాగజ ప్రమాణాః ప్రమాణేద్వయసచ్ దఘ్న ఞ్మాత్ర ఇతి ప్రమాణే ద్వయసచ్ ప్రత్యయః । టిడ్డాణ ఇత్యాదినా జీప్ - తాఆపి. సరితస్తుహిసర్యః హిమీకుర్వన్ తత్ కరోతీతి ణ్యంతాల్లటశ్నత్రాదేశః. హేమంతే భవః హైమనః । సర్వత్రాణంత లోపశ్చేతి హేమంతశబ్దాచ్చైషికోణ ప్రత్యయః-త కారలోపశ్పపృషతాం బిందూనాం పతిః వాయుః * పృషంతి బిందు ప్పషతావిత్యమరః- అధ్వానం గచ్ఛంతీత్యధ్వగాః పధికాః | అంతాత్యంతాధ్వదూరపారసర్వానాం తేషు-తద్యోషితాం ప్రోషితభర్తృకాణాం దృశాం అతనుతాపకృతం మహాసంతాపకారిణీం - సలిల సంతతిం. అతనుత- ఉష్ణమశ్రూం ఉత్పాదయామాసేత్యర్థః హేమంతమారుతో విరహిదుస్సహో జనీతి భావః!!

 

గజపతిద్వయసీః అపి = ఏనుగు లా ఎత్తైన ప్రమాణం గలది; (ద్వయశబ్దాన్ని ప్రమాణసూచకం)  సరితః = నదులను;  తుహినయన్ = ఘనీభవింపజేస్తూ;  హైమనః = హేమంత ఋతువు యొక్క;  పృషతాం పతిః = వాయువు;  అధ్వగయోషితాం = ప్రోషితభర్తృకల; దృశాం = కనుల;  అతనుతా = శోభను;  అపకృతం = వికటింపఏస్తూ; సలిలసంతతిం = అశ్రువులను; అతనుత = ఉత్పాదించెను;

 

ఏనుగులను కూడా ముంచెత్తగల ప్రమాణంలో మంచు కురుస్తూ, నదులను గడ్డకట్టిస్తూ, హేమంత ఋతువు తాలూకు గాలి ప్రోషితభర్తృకల కనుల శోభను అపకృతం చేస్తూ, వారి కళ్ళల్లో వేడి యశ్రువులను జాలువార్చింది.

౫౬.

ఇదమయుక్తమహో మహదేవ యద్వరతనోః స్మరయత్యనిలో౽న్యదా|

స్మృతసయౌవనసోష్మపయోధరాన్ సతుహినస్తు హినస్తు వియోగినః ||

 

అనిలః అన్యదా వియోగినః వరతనోః స్మరయతి ఇదం మహత్ అయుక్తం ఏవ అహో స తుహినః తు స్మృతసయౌవనసోష్మపయోధరాన్ హినస్తు ।

 

సర్వంకష

సర్వదా వియోగినా ముద్దీపక స్యాపి వాయో ర్హేమంతే వైశిష్ట్యమాచష్టే।

ఇదమితి || అనిలో వాయుః అన్యదా అన్యస్మిన్ కాలే- గ్రీష్మాదౌ ఇత్యర్థః - సర్వైకాన్యేత్యాదినా దా ప్రత్యయః - వియోగినః వియుక్తాః । గతిబుద్దీత్యాదినా ఱణికర్తుః కర్మత్వం- వరతనోః వరతనుమిత్యర్థః - ఆధిగర్థేత్యాదినా కర్మణి శేషే షష్ఠీ -స్మరయతీతి యత్ - స్మరతేరాధ్యానేమిత్వాత్ హ్రస్వః ఇదం సారకత్వమపి మహదత్యంతం - ఆయుక్తమేవ- సహకారివిరహాదితి భావ: - అహో - అత్యంతాకించిత్కరత్వాద్విస్మయః - హేమంతే తు హంతృత్వమప్యస్య సంభావిత మిత్యాహ-స్మృతేతి-సతుహినః - హిమసహితః అనిలస్తు స అనిలస్తు స యౌవనాః యౌవనయుక్తాః - అత ఏవ-సోష్మణః సోష్ణాః యే పయోధరాః కుచాః- తే స్మృతాః యై తాన్ - స్మృత సయౌవనసోష్మవయోధరాన్ - వియోగినో వియుక్తాః తథా యుక్తం చానీప్సితమితి కర్మత్వం- హినస్తు హంతువా సంభావనాయాం లోట్ - హేమంతే హిమసహకారాత్ కుచోష్మైక సాధ్యదుఃఖోత్పాదన సామర్ధ్యాత్ వియోగి మారకత్వమపి సంభావ్యతే- తే గ్రీష్మాదౌ తు తాదృక్సహకారి విరహాత్ స్మారకత్వమప్యయుక్తమితి భావః - అమారకే మారకత్వసంబంధోక్తేరతిశయోక్తి భేదః - ఇహసహజకవి ప్రౌశఢోక్తిసిద్ధయో రతిశయయోగ భేదాధ్యవసాయ ఇతిరహస్యమ్

 

యత్ అనిలః = ఏ మారుతము; అన్యదా = ఇతర ఋతువులలో;  వియోగినః = విరహులైన పతులకు;  వరతనోః = సుందరాంగులను;  స్మరయతి = స్ఫురింపజేయునో;  ఇదం మహత్ = అట్టిది ఇప్పుడు మిక్కిలి;  అయుక్తం ఏవ = అనుచితమైనది కదా!  అహో = అహో! స తుహినః తు = అట్టి చలిగాలి;   స్మృతసయౌవనసోష్మపయోధరాన్ = యౌవనంలో ప్రియురాండ్ర వేడి పయోధరాలను స్ఫురణకు తెస్తూ;  హినస్తు = చంపుతున్నది కదా!

 

ఏ గాలి వసంత, గ్రీష్మ, వర్షాది ఋతువులలో విరహులైన పతులకు సుందరాంగులైన తమ ప్రేయసులను స్ఫురింపజేస్తుందో అదే గాలి ఇప్పుడు అనుచితంగా - యౌవనంలో ఉన్న ప్రియులకు తమ ప్రేయసుల పయోధరాలను గుర్తుకు తెప్పిస్తూ చంపుతున్నది.

౫౭.

ప్రియతమేన యయా సరుషా స్థితం న సహ సా సహసాపరిరభ్య తమ్ |

శ్లథయితుం క్షణమక్షమతాంగనా న సహసా సహసా కృతవేపథుః ||

 

సరుషా యయా ప్రియతమేన సహ న స్థితం, సా అంగనా సహసా కృతవేపథుః తం సహసా సహసా పరిరభ్య క్షణం శ్లథయితుం న అక్షమత ।

 

సర్వంకష

ప్రియతమేనేతి || అత్రాద్య పర్యాయేన సహసేతి త్రిధావిభాగః అన్యత్ర సహసేత్యేకం పదం-సరుషా సరోషయా- యయా స్త్రీ యా కర్త్ర్యా - ప్రియతమేన సహసస్థితం-నపుంసకే భావేక్త: సాఅంగనా స్త్రీ - సహసామార్గ శీర్ష మాసేన *మార్గశీర్షేన హామార్గ ఇత్యమరః - కృత వేపథుః జనిత కంపా సతీ ట్పితోధుజిత్యథు చ్చత్ ప్రత్యయః తం పూర్పమగణిత మేవ-ప్రియం హసేన సహ వర్తంత ఇతి సహసా-సహాసోసతీ - ఆథో హసః హాసో హాస్యం చేత్యమరః స్వన హసోర్వేతి వికల్పాదప్రత్యయః - సహసా శీఘ్రం స్వరాదినిపాతాదవ్యయం- పరిరభ్య ఆశ్లిష్య క్షణం క్షణమపీత్యర్థః - అన్యథా వైరం స్యా త్ - అత ఏవ సామర్థ్య లభ్యార్థః త్వాత్  పేర ప్రయోగః-శ్లథయితుం - నాక్షమత వైయర్థ్యాత్  శిధిలీకర్తుం నోత్సహతే స్మైత్యర్థః.- మానినీమానభంజన క్షమోయం మాస ఇతి భావః - కలహాంతరితేయం నాయికా - కోపాత్ కాంతం పరానుద్య పశ్చా త్తాపసమన్వితేతి లక్షణాత్ |

 

సరుషా = రోషము చేత;  యయా = ఏ స్త్రీ చేత; ప్రియతమేన సహ = ప్రియునితో కూడి యుండుట;  న స్థితం = జరుగలేదో; సా అంగనా = ఆ సుందరి;  సహసా = మార్గశిరమున; కృతవేపథుః = (శృంగారకాంక్ష చేత కల్గిన) శరీరకంపము చేత; తం = ప్రియుని; సహసా = నవ్వుచూ;  సహసా = ఎప్పుడూ;  పరిరభ్య = ఆలింగనము చేసికొని;  క్షణం = ఒక్క నిముషము కూడా; శ్లథయితుం = (కౌగిలి) సడలించుటకు;  న అక్షమత = ఇచ్ఛగింపలేదు ।

 

ఏ సుందరి పూర్వము రోషముతో ప్రియుని తిరస్కరించి ఉండెనో ఆ సుందరాంగి మార్గశిరమాసమున శృంగారకాంక్షతో కల్గిన శరీరకంపనము చేత ప్రియుని నవ్వుచూ ఎల్లప్పుడూ కౌగిలించుకుని, నిమేషమాత్రము కూడా తన పరిరంభమును సడలించుటకు ఇచ్ఛగింపలేకపోయినది.

 

విశేషములు

శ్లోకం చతుర్థపాదంలో సహసా సహసా అన్న నిబంధన లాటానుప్రాస. శబ్దార్థయోః పౌనరుక్త్యం తాత్పర్యభేదవత్. ఒకే విధమైన శబ్దాన్ని తాత్పర్యభేదంతో ప్రయోగించటం లాటానుప్రాస.

౫౮.

భృశమదూయత యా౽ధరపల్లవక్షతిరనావరణా హిమమారుతైః |

దశనరశ్మిపటేన చ సీతృతైర్నివసితేవ సితేన సునిర్వవౌ||

 

అనావరణా యా అధరపల్లవక్షతిః హిమమారుతైః భృశం అదూయత; సీత్కృతైః సితేన దశనరశ్మిపటేన చ నివసితా ఇవ సునిర్వవౌ |

 

సర్వంకష

భృశమితి ॥ అనావరణా ఆవరణరహితాయా; అధరపల్లవస్య క్షతిః వ్రణః- హిమమారుతైః భృశం - అదూయత ఆతవ్యత - దూఞో దైవాదికాత్ కర్తరి లజ్ సా క్షతిః - యత్తదోర్నిత్య సంబంధః సీతృతైః సీత్కారైః కర్తృభిః - సితేన శుభ్రేణ దశనరశ్మయఏవ పటః - తేన కరణేన నివసితా ఆచ్చాదితేవ - నిపూర్వాద్యసేరాచ్చాదనార్దత్వాత్కర్మణి క్తః - తస్య యడాగమః- సునిర్వవౌ సుష్ఠునిర్వవార -  శీతాళురాచ్ఛాద్యత ఇతి భావః హిమహతాధర వ్రణనిర్వాపణస్య సీత్కారకర్తృకదశసరశ్మిపటాచ్ఛాదన హేతుకత్వో త్ప్రేక్షణాత్ రూపకోత్ప్రేక్షయోస్సంకరః ||

 

అనావరణా = ఆవరణరహితమైన (కప్పి యుండని); యా అధరపల్లవక్షతిః = ఏ పెదవిపైని గాటు; హిమమారుతైః = మంచుగాలితో;  భృశం = మిక్కిలి; అదూయత = నొవ్వబడెనో; (అది) సీత్కృతైః = సీత్కృతములచేత; (అపి చ =ఇంకనూ)  సితేన = స్వచ్ఛములైన;  దశనరశ్మిపటేన = దంతముల కాంతి అను వస్త్రము చేత;   నివసితా ఇవ = కప్పబడినదై;  సునిర్వవౌ = సుఖమును గూర్చెను;

 

ఆవరణరహితములైన ఏ సుందరి అధరపల్లవములపైని వ్రణములు హేమంతఋతువున మంచుగాలితో నొచ్చెనో, ఆ వ్రణములు పరవశపూర్వక సీత్కృతముల చేతను, దంతధవళకాంతుల వస్త్రముల చేతనూ నివారింపబడి సుఖమును గూర్చెను.

౫౯.

వ్రణభృతా సుతనోః కలసీత్కృతస్ఫురితదంతమరీచిమయం దధే |

స్పుట మివావరణం హిమమారుతైః మృదుతయా దుతయాధరలేఖయా ||

 

మృదుతయా హిమమారుతైః దుతయా వ్రణభృతా సుతనోః అధరలేఖయా కలసీత్కృతస్ఫురితదంతమరీచిమయం స్ఫుటమావరణం ఇవ దధే ।

 

సర్వంకష

ఉక్త మేవార్థకం భంగ్యంతరేణాహ॥ ప్రణేతి|| మృదుతయా మార్దవేన హేతునా- హిమమారుతైః దుతయా పీడితయా టుదు ఉపతాప ఇతి ధాతోః భావాదికాత్కర్మణి క్తః - వ్రణభృతాదంతవ్రణభృతా- సుతనోః స్త్రియాః అధరౌ లేఖా ఇవ ఆధరలేఖా - తయా అధర లేఖయా కర్త్యా ణ కలస్సీత్కృతైర్హేతునా స్ఫురితాః ప్రకాశితాః యాః దంత మరీచయః తన్మయం తద్రూపం-స్ఫుటం-ఆవరణమాచ్ఛాదనం-దధ ఇవ ధృతమివ ఉత్ప్రేక్షా - డధాతేః కర్మణి లిట్ ||

 

మృదుతయా =  మార్దవమైన; హిమమారుతైః = మంచుగాలిచేత; దుతయా = నొప్పింపబడిన; వ్రణభృతా = గాటుగల; సుతనోః = సుందరాంగి యొక్క; అధరలేఖయా = పెదవియంచు;  కలసీత్కృతస్ఫురితదంతమరీచిమయం = మధురమైన సీత్కృతములచేత ద్యోతకమవుతున్న దంతకాంతులమయమై;  స్ఫుటమావరణం ఇవ = చక్కని ఆచ్ఛాదన వలె; దధే = తాల్పబడెను.

 

(ఇదివరకటి శ్లోకపు ముచ్చటనే మళ్ళీ ఇంకొక విధంగా చెబుతున్నాడు కవి)

మార్దవమైన మంచుగాలిచేత నొప్పింపబడిన సుందరాంగి పెదవియంచుపైని నొక్కులు ఆమె మధురసీత్కృతముల చేత ద్యోతకమవుతున్న దశనకాంతులమయమై చక్కని ఆచ్ఛాదన గూర్చెను.

౬౦.

ధృతతుషారకణస్య నభస్వతస్తరులతాంగుళితర్జనవిభ్రమాః |

పృథు నిరంతరమిష్ట భుజాంతరం వనితయా౽నితయా న విషేహిరే||

 

ధృతతుషారకణస్య నభస్వతః తరులతాంగుళితర్జనవిభ్రమాః పృథు ఇష్టభుజాంతరం నిరంతరం అనితయా వనితయా న విషేహిరే |

 

సర్వంకష

ధృతేతి | ధృతాః తుషారకణాస్తుహిసశీకరాః యేన తస్య నభస్వతః పవనస్య సంబంధినః -తరులతా ఏవ అంగుళయః - తాభిః యాని తర్జనాని - తాన్యేవ విభ్రమాః విలాసాః - పృథువిశాలం - ఇష్టస్య దయితస్య - భుజాంతరం భుజమధ్యం వక్షస్థలం -నిరంతరం అనితయా గాఢాలింగన మలభమానయేత్యర్థః - ఇణి కర్తరి క్తః వనితయా స్త్రియా - నవిషేహిరే నసోఢాః - విరహిణ్యస్తర్జితా ఇవ నభస్వతో బిభ్యతి ఇతి భావః ॥

 

ధృతతుషారకణస్య = హిమకణములతో కూడిన; నభస్వతః = పవనుడియొక్క; తరులతాంగుళితర్జనవిభ్రమాః = వృక్షములపై వ్యాపించిన తీవెలతో భయపెట్టటం అనే విలాసాలు;   పృథు = విశాలమైన;  ఇష్టభుజాంతరం = ప్రియుని బాహుమూలలను; నిరంతరం = ఎప్పుడూ;  అనితయా = కలుగకుండుటచేత; వనితయా = సుదతులచేత;  న విషేహిరే = విడువబడలేదు;

 

హిమకణాలతో కూడిన మంచుగాలి వృక్షాలను అల్లుకున్న తీవెలను బెదిరిస్తూ భయపెడుతూంది. ఆ కారణాన ముదితలు తమ ప్రియుని విశాలభుజాలను కౌగిలించి పట్టు వీడలేదు.