పోస్ట్‌లు

ధ్వని లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మాఘంలో ధ్వనిప్రసంగము

చిత్రం
  శ్రీకృష్ణుడి రథసారథి అయిన దారుకుడు రైవతక పర్వత ప్రాంతాన్ని చూస్తూ, శ్రీకృష్ణునితో చెబుతున్నాడు. ఆచ్ఛాదితాయత దిగంబరముచ్చకైర్గామ్ ఆక్రమ్య సంస్థితముదగ్ర విశాలశృంగమ్ । మూర్ధ్నిం స్ఖలత్తుహినదీధితికోటిమేనమ్ ఉద్వీక్ష్య కో భువి న విస్మయతే నగేశమ్ ॥ ఆచ్ఛాదితాయతదిగంబరం; ఆచ్ఛాదిత = విస్తరించిన; ఆయత = పొడవైన; దిక్ + అంబరం = దిశలును మరియునాకాశమును గలది అయిన; (ఆచ్ఛాదిత = చుట్టుకొనిన; ఆయత = పొడవైన; దిగంబరం = దిక్కులను వస్త్రములు గలవానిని);ఉచ్చకైః = ఉన్నతమై; గాం = భువిని; ఆక్రమ్య = ఆవరించి; సంస్థితం = స్థిరముగా వెలసిన దానిని; ఉదగ్ర = పొడవైన; విశాల = విశాలమైన; శృంగమ్ = శిఖరములు గలదానిని;(ఉదగ్ర = భీకరమైన; విశాల = నిడుపాటి; శృంగమ్ = కొమ్ములు గల; ఉచ్చకైః =  పెద్దదైన; గాం = వృషభమును; ఆక్రమ్య = అధిరోహించి; సంస్థితం = కొలువైన వానిని) మూర్ధ్నిం = శిఖరముపై;  స్ఖలత్ = కరుగు; తుహిన = మంచు యొక్క; దీధితి = ప్రకాశముల; కోటిం = పరంపరను కలిగిన; ఏనమ్ = ఆ యొక్క; నగేశం = పర్వతమును; (మూర్ధ్నిం = తలపై;  స్ఖలత్ = క్షయించు; తుహినదీధితికోటిం = నెలవంకను ; వహించిన; ఏనమ్ = ఆ యొక్క; నగేశం = కైలాసపర్వతవిభుని;) ...

వీచిక - 4

ఒక నీరసమైనదీ, ఎబ్బెట్టయినదీ అయిన చమత్కారశ్లోకం ఈ సారి. ఇది లక్ష్మీనారాయణుల శృంగారవర్ణన. గాథాసప్తశతి లోనిది. విపరీతసురతసమయే బ్రహ్మాణం దృష్ట్వా నాభికమలే | హరేర్దక్షిణనయనం చుంబతి హ్రియాకులే లక్ష్మీ || విపరీతసురతసమయే = పురుషాయితం అనే శృంగారక్రీడలో  నాభికమలే = విష్ణువు నాభికమలంలో బ్రహ్మాణం దృష్ట్వా = బ్రహ్మను చూచి హ్రియాకులే లక్ష్మీ = సిగ్గుపడిన లక్ష్మి హరేః = విష్ణువు యొక్క దక్షిణనయనం = కుడికంటిని చుంబతి = ముద్దాడింది. ముద్దాడింది. అయితే ఏంటి? విష్ణువుకు సూర్యచంద్రులిద్దరూ చెరొక కన్ను. విష్ణుసహస్రనామంలో - "భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిల చంద్రసూర్యౌ చ నేత్రే"- అని ఉంది. యస్య = ఎవని పాదౌ = రెండు పాదాలు భూః = భూమి, నాభిః = బొడ్డు  వియత్ = ఆకాశము, అసుః = శ్వాస అనిలః = వాయుదేవుడు, చ = ఇంకా చంద్రసూర్యౌ = సూర్యచంద్రులు నేత్రౌ = రెండు కళ్ళు" ... ... (సాధారణంగా ద్వంద్వసమాసంలో పూర్వపదం ప్రసిద్ధమైనది, ఉత్తరపదం తక్కువ ప్రసిద్ధమైనదిగా ఉండాలని ఒక వ్యాకరణ నియమం. రామలక్ష్మణులు, భార్యాభర్తలు, తల్లితండ్రులు, ఇలాగ. ఆ వరుసలో సూర్యచంద్రులు అనడం సమంజసం. ఇక్కడ చంద్రస...

సంస్కృతసౌరభాలు - 1

చిత్రం
మధుద్విరేఫః కుసుమైకపాత్రే పపౌ ప్రియాం స్వామనువర్తమానః | శృంగేణ సంస్పర్శ నిమీలితాక్షీం మృగీమకండూయత కృష్ణసారః || ద్విరేఫః = తుమ్మెద, కుసుమైకపాత్రే = పువ్వు అనే ఒక గిన్నెలోని, మధు = తేనెను, స్వాం ప్రియాం = తన ప్రియురాలిని, అనువర్తమానః= అనుసరించి, పపౌ = త్రాగినది. కృష్ణసారః = దుప్పి,సంస్పర్శనిమీలితాక్షీం = తనస్పర్శతో మోహం పొంది కళ్ళు కాస్త మూసుకున్న,మృగీం = ఆడుజింకను, శృంగేణ = కొమ్ముతో, అకండూయత = గోకింది. శివుడు తీక్ష్ణంగా తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సు చేస్తుండగా వసంతం వచ్చింది. అప్పుడు అడవిలో జంతువులను, ప్రకృతిని వర్ణిస్తున్నాడు కవి. ఒక తుమ్మెద, పువ్వు అనే గిన్నెలో తన ప్రియురాలితో కలిసి తేనెను పంచుకుని త్రాగుతూందట. ప్రియురాలిని అనుసరించి - అంటే ప్రియురాలు త్రావిన తేనెను మగతుమ్మెద తాగుతూంది అని - చమత్కారం. అలాగే ఓ దుప్పి, ఇంకో ఆడజింకను గోకుతుందట. ఆ ఆడుజింక కళ్ళు సగం మూసుకుంది. అంటే ఇంకాస్త గోకనీ అని ఆ గోకుడు తాలూకు అనుభవాన్ని ఆస్వాదిస్తూంది. ఇంకా - ఒక ఆడుయేనుగు పుప్పొడితో సువాసన అలముకున్న కొలనులో నీళ్ళను మగయేనుగుకు తొండంలో పట్టి ఇస్తూందట. ఓ హంసేమో సగం కొరికిన...

రావణాసురుని ఆశ్చర్యం

చిత్రం
ఉ || ఒచ్చెము గాదె నా పగతుడొక్కరుఁడీ జటి యన్న, నందునన్  జచ్చిన వారలందరును సత్తువ బోరిన కచ్చిపోతులే అచ్చరలింటిగొంగ, వెనుకాడని నిద్దురవాఁడు నీటులే  చిచ్చరకంటిచెల్వుని పెను చెన్నగు కౌనులు ఏలనింకనో? నా శత్రువు ఒక తాపసి! అందునా అతని చేత చచ్చిన వారందరూ రాక్షసకులం వీరులు! స్వర్గాన్ని జయించిన ఇంద్రజిత్, కుంభకర్ణుడూ వ్యర్థమైపోయారే! ఈశ్వరుని మెప్పించిన ఈ రావణుని భుజాలు ఎందుకిక? ధిక్.... ఒచ్చెము = అవమానము అచ్చరలింటిగొంగ = అప్సరలున్న నెలవుకు శత్రువు = స్వర్గానికి శత్రువు = ఇంద్రజిత్తు జటి = తాపసి వెనుకాడనినిద్దురవాడు = కుంభకర్ణుడు ఈటులు = వ్యర్థులు చిచ్చరకంటిచెల్వు = నిప్పు కన్ను ఉన్నవానికి ఇష్టుడు = రావణుడు కౌనులు = మూపులు హనుమన్నాటకం అని ఒక ప్రాకృతనాటకంలో రావణాసురుడు రాముణ్ణి చూసి అలా అనుకొంటాడట. ఈ నాటకం ఇప్పుడు దొరికినట్లు లేదు, కానీ అక్కడక్కడా పద్యాలు వేరే కావ్యాలలో దొరుకుతున్నాయి. ఇందులో చమత్కారం ఏమంటే - ఈ పద్యంలో ప్రతి నామవాచకమూ వ్యంజకమై కూర్చుందట. (అంటే ప్రతి నామవాచకానికి జాగ్రత్తగా చూస్తే మరో అర్థం కనిపిస్తుందని సూత్రకారుడు) పైన నా (అచ్చ) తెనుగు సేత. (స్వేచ్ఛానువాదం. యథాతథా...