చిరంజీవీ! రవీ! అభినందనలు. శారదాంబ కటాక్షం నీకు పరిపూర్ణంగా లభిస్తోంది. చక్కని కృషి నీ పద్యాలలో కనిపిస్తోంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన నూతన ప్రయోగాలతో పాఠకులనింకా ఇంకా అలరింప చేయగలవని నా ప్రగాఢ నమ్మకం.శుభమస్తు.
అంగదుడు రావణుని వద్దకు సీతను అప్పగించమని రాయబారానికి వచ్చాడు. అంగదుడే ఎందుకు? ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో వాలి రావణుని బంధించి ముప్పుతిప్పలు పెట్టి మూడు సముద్రాలలోముంచాడు. అంతే కాదు ఆ రావణుని తలను తన బాహుమూలల్లో ఇరికించుకుని, తొట్టెలో ఆడుకుంటున్న తన శిశువు అంగదుడికి ఆటబొమ్మలా చూపించాడు. ఆ సందర్భాన ఆ శిశువు ఆ ఆటబొమ్మ (రావణుని తలను) తన చిట్టిపాదాలతో తన్ని ఉన్నాడు. (ఆ శిశువు ఇంకేదైనా చేశాడేమో కూడా. అది తెలీదు.) చిన్నసైజు సీమ ఫాక్షనిజం కథలాంటి ఫ్లాష్ బ్యాక్. ఇంత ఉంది కాబట్టి అంగదుడు వచ్చాడు రాయబారానికి. ఆ సందర్భంలో శ్లోకం. "రే రే రావణః! రావణాః కతి బహూనేతాన్వయం శుశ్రుమః ప్రాగేకం కిల కార్తవీర్యనృపతేర్దోర్దండపిండీకృతమ్ | ఏకం నర్తనదాపితాన్నకవలం దైత్యేంద్రదాసీజనైః ఏకం వక్తుమపి త్రపామహ ఇతి త్వం తేషు కోऽన్యోऽథవా ||" రే రే రావణః; రావణాః = రావణులు; కతి = ఎంతమంది? వయం = మేము; బహూన్ = అనేక పేర్లను శుశ్రుమః = విన్నాను; కార్తవీర్యనృపతేః = కార్తవీర్యుడనే ఓ రాజు చేత; దోర్దండ = బాహువుల చేత; పిండీకృతమ్ = చూర్ణం చేయబడినది; ప్రాక్ ఏకం కిల = మునుపు ఒకటి (ఒక పేరు) అట; ఏకం = మరొకటి...
రాత్రి పూట ఆకాశంలో సరిగ్గా ఉత్తరదిక్కున సన్నగా, మిణుకుమిణుకుమంటూ ఓ నక్షత్రం ఉదయిస్తుంది. ఆ నక్షత్రం చుట్టూ మిగిలిన నక్షత్రాలన్నీ వలయంగా తిరుగుతూ ఉంటాయి. ఇది ధ్రువనక్షత్రమని ఇదివరకు వ్యాసంలో ప్రస్తావనగా ఒకచోట చెప్పుకున్నాం. ధ్రువం - అంటే స్థిరము, నిశ్చలము. ఈ ధ్రువనక్షత్రాన్ని Polaris (α-Ursa Minor) అని పిలుస్తారు. ధ్రువనక్షత్రం ఉదయించినప్పుడే దానికి క్రిందుగా సప్తర్షి మండలం కూడా కనిపిస్తుంది. దీనిని ఆంగ్లంలో "Big Dipper" అన్నారు. ఈ సప్తర్షులు ఏడుగురని మనకు తెలుసు. వీరిలో ముగ్గురు ఒకే సరళరేఖలో, మిగిలిన నలుగురు కలిసి ఒక పెట్టె/గరిటె/శకటం రూపంలో అమరి ఉండటం మనకు తెలుసు. మండలం ధ్రువ నక్షత్రం క్రిందుగా ఉదయించి రాత్రి గతించి తెల్లవారు ఝాము వేళకు ఆ ధ్రువుని పైకి చేరుకుంటుంది. అప్పుడు ఆ సప్తర్షి మండలం ఎలా ఉంటుందో - మాఘుడనే కవి శిశుపాలవధ కావ్యంలో వర్ణించాడు. స్ఫుటతర ముపరిష్టా దల్పమూర్తేః ధ్రువస్య స్ఫురతి సురమునీనాం మండలం వ్యస్తమేతత్ | శకటమివ మహీయః శైశవే శార్ఞపాణేః చపల చరణకాబ్జ ప్రేరణోऽత్తుంగితాగ్రమ్ || (శిశుపాలవధమ్ - 11. 3) బాల్యంలో శ్రీకృష్ణయ్య తన చిట్టిపాదాలలో శకటాసుర...
ముకుందవిలాసః అని ఒక శతకం. మొత్తం అంతా సంస్కృతంలో ఉంది. ముందుమాట - కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు వ్రాశారు. అదీ సంస్కృతంలోనే ఉంది.(ఇక్కడి తాత్పర్యాలు నావి) ఇది ముకుందుని లీలలను స్తుతిస్తూన్న స్తుతి కావ్యం. స్తుతికావ్యం కనుక గొప్ప వర్ణనలు, అనూహ్యమైన ఉపమలు, జిగేలుమనే పోకడలు లేవు. అయితే ఆశ్చర్యం గొలిపేదేమంటే - ఇంత సులభంగా, అనాయాసంగా సంస్కృతం వ్రాయవచ్చా అని ప్రతిశ్లోకమూ స్ఫురింపజేస్తుంది. పుస్తకంలో 7 విధాల విలాసాలు ఉన్నాయి. బాల, ప్రౌఢ,దూత, ఆచార్య, సారథి, లీలాలోల, శరణ్యమని వివిధ ముకుందవిలాసాలు. శ్రీవత్సచిహ్న! అన్న నిర్దేశంతో మంగళకరంగా ఈ శతకం ఆరంభం అవుతుంది. బాలముకుందవిలాసం లో రెండవశ్లోకం చూడండి. కారాగృహం స్వతనుకోమలకాంతిపూరై రాపూరయంత మరవిందదళాయతాక్షమ్ ఆనందఖేదజనకం సకృదేవమాతుః గోపాలబాలకముకుందమహం నమామి. కోమలమైనకాంతులతో కూడిన తన గాత్రపు కాంతితో చెరసాలను నింపుతున్న, తామరపూరేకులవంటి వెడదకన్నులవాడు, పుడుతూనే అమ్మకు దుఃఖాన్ని, ఆనందాన్ని పంచిన - గోపాలబాలకుడైన ముకుందుని నమస్కరిస్తున్నాను. వసంతతిలకం ఇది. (శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం - అన్న వేంకటేశ్వరసుప్రభాతపు కోవ). ఈ బాలముకుందవిలాసంలో...
చిరంజీవీ! రవీ!
రిప్లయితొలగించండిఅభినందనలు.
శారదాంబ కటాక్షం నీకు పరిపూర్ణంగా లభిస్తోంది. చక్కని కృషి నీ పద్యాలలో కనిపిస్తోంది. నాకు చాలా ఆనందంగా ఉంది.
అద్భుతమైన నూతన ప్రయోగాలతో పాఠకులనింకా ఇంకా అలరింప చేయగలవని నా ప్రగాఢ నమ్మకం.శుభమస్తు.
నమస్కారం గురువు గారండి. ఇంకా బాగా కృషి చేయాలి. ఇంకా మీరు చూపించిన శ్రీ బంధము నేర్చుకోవలసి ఉంది.
రిప్లయితొలగించండి