ముకుందవిలాసః అని ఒక శతకం. మొత్తం అంతా సంస్కృతంలో ఉంది. ముందుమాట - కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు వ్రాశారు. అదీ సంస్కృతంలోనే ఉంది.(ఇక్కడి తాత్పర్యాలు నావి) ఇది ముకుందుని లీలలను స్తుతిస్తూన్న స్తుతి కావ్యం. స్తుతికావ్యం కనుక గొప్ప వర్ణనలు, అనూహ్యమైన ఉపమలు, జిగేలుమనే పోకడలు లేవు. అయితే ఆశ్చర్యం గొలిపేదేమంటే - ఇంత సులభంగా, అనాయాసంగా సంస్కృతం వ్రాయవచ్చా అని ప్రతిశ్లోకమూ స్ఫురింపజేస్తుంది. పుస్తకంలో 7 విధాల విలాసాలు ఉన్నాయి. బాల, ప్రౌఢ,దూత, ఆచార్య, సారథి, లీలాలోల, శరణ్యమని వివిధ ముకుందవిలాసాలు. శ్రీవత్సచిహ్న! అన్న నిర్దేశంతో మంగళకరంగా ఈ శతకం ఆరంభం అవుతుంది. బాలముకుందవిలాసం లో రెండవశ్లోకం చూడండి. కారాగృహం స్వతనుకోమలకాంతిపూరై రాపూరయంత మరవిందదళాయతాక్షమ్ ఆనందఖేదజనకం సకృదేవమాతుః గోపాలబాలకముకుందమహం నమామి. కోమలమైనకాంతులతో కూడిన తన గాత్రపు కాంతితో చెరసాలను నింపుతున్న, తామరపూరేకులవంటి వెడదకన్నులవాడు, పుడుతూనే అమ్మకు దుఃఖాన్ని, ఆనందాన్ని పంచిన - గోపాలబాలకుడైన ముకుందుని నమస్కరిస్తున్నాను. వసంతతిలకం ఇది. (శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం - అన్న వేంకటేశ్వరసుప్రభాతపు కోవ). ఈ బాలముకుందవిలాసంలో...
బావుందండీ, ఇన్నవ అక్షరమే కూడలి లో రావాలి ( మీ పద్యంలో ద, రా) అని నియమం ఏమైనా ఉందా అండీ.
రిప్లయితొలగించండిలేదండి. బొమ్మలో చూపించగలగాలి. అంతే.
రిప్లయితొలగించండిశ్రీ బంధ కందమద్భుత
రిప్లయితొలగించండిమీ బంధ కవిత్వ తత్వ మీవరసి రచిం
చే బంధుర గతి నరయుచు
నీ బందుగులైన కవులు నేర్తురు సుకవీ!
అభినందనలు.