సంస్కృత సౌరభాలు - 19
కళానిధికలావతీకలిత జూటవాటీలసత్ త్రివిష్టపతరంగిణీ లలితతాండవాడంబరః | మదాంచితవిలోచనో మధురముగ్ధవేషస్సదా పరిస్ఫురతు మానసే గిరిసుతా ऽ నురాగాంకురః || కళానిధి = కళలకు నిలయమైన రేరాజును, కలావతి = కళలే నెలవైన ఉమను, కలిత = కూడి జూటవాటీ = జటలు లసత్ = ప్రకాశించుచుండగా త్రివిష్టపతరంగిణీ = మూడులోకాలలో ప్రవహించే గంగ యొక్క లలితతాండవాడంబరః = సుకుమారమైన అలల నృత్యమునే విలాసముగా కలిగిన వాడు మదాంచితవిలోచనః = మత్తమైన చూపులను కలిగినవాడును గిరిసుతా = గిరితనయయొక్క రాగాంకురః = అనురాగమునకు మొలక ఐన మధురముగ్ధవేషః = మధురము, ముగ్ధము అయిన వేషము కలిగిన అర్ధనారీశ్వరుడు మానసే = మనసునందు సదా = ఎప్పుడూ పరిస్ఫురతు = మెదలుచుండుగాక! ************************************* అందమైన, మనోహరమైన శబ్దాలతో పద్యాన్ని తీర్చి ఈశ్వరుని పేరు పెట్టి పిలువకుండా, గిరితనయ అనురాగానికి మొలక అని ఉద్యోతించి పిలుస్తున్నాడు కవి. రాగము అంటే ఎరుపు రంగు అని రూఢ్యర్థం కూడా ఉంది. అమ్మాయిలో ఎరుపు రంగు సిగ్గుకు సంకేతం అనుకుంటే - గిరితనయ రాగానికి మొలక అంటే - అమ్మాయి సిగ్గులకు మొలక అని మనోహరమైన అర్థం కూడా వస్తుంది. ఈ పద్యానికి తాత్పర్యం వ్రాసిన పండితులు ...