సంస్కృత సౌరభాలు - 5
బ్రహ్మాండచ్ఛత్రదణ్డః శతధృతిభవనాంభోరుహోనాళదణ్డః క్షోణీనౌకూపదణ్డః క్షరదమరసరిత్పట్టికాకేతుదణ్డః | జ్యోతిశ్చక్రాక్షదణ్డస్త్రిబువన విజయస్థమ్భదణ్డోంఘ్రిదణ్డః శ్రేయస్త్రైవిక్రమస్తే వితరతు విబుధద్వేషిణాం కాలదణ్డః || బ్రహ్మాండచ్ఛత్రదణ్డః = బ్రహ్మాండము అను గొడుగుకు మూలమైన కర్ర శతధృతి భువన అంభోరుహో నాళదణ్డః = బ్రహ్మ పీఠమైన తామరపువ్వు యొక్క నాళము క్షోణీనౌకూపదణ్డః = భూమి అను నావయొక్క తెరచాప కొయ్య క్షరదమరసరిత్పట్టికాకేతుదణ్డః క్షరత్ = జారుచున్న అమరసరిత్ = అమరవాహిని అయిన గంగ (అనెడి) పట్టికా = పట్టుచీరకు కేతుదణ్డః = జెండాకర్ర జ్యోతిశ్చక్రాక్షదణ్డ = జ్యోతిశ్చక్రమునకు ఇరుసు విబుధద్వేషిణాం కాలదణ్డః = బుద్ధిమంతులశత్రువులకు (రక్కసులకు) కాలదండమూ ఐనట్టి త్రైవిక్రమః = త్రివిక్రమావతారుడైన హరి యొక్క త్రిభువనవిజయస్థమ్భదణ్డోంऽఘ్రిద ణ్డః = త్రిభువన విజయసంకేతముగా ఒప్పారిన స్థంభముగా భాసించు పాదము అను ధ్వజము తే = నీకు శ్రేయః = అభివృద్ధి వితరతు = పంచుగాక! ****************************** ************ ఎనిమిది దండాలతో హరికి దండాలు సమర్పించిన ఆ కవి-ప్రవరుడు దండి. దండినః పదలాలిత్యం అని సూక్తి. అపూర...