పోస్ట్‌లు

అనువాదం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సీత సమాధానం

కం|| ఉవిద! హృది సదా కరుణము కవిస్మరణభాజి గాథ కమలాశ్రితమే, అవికలసచ్ఛీలి యశము. భువిద్విష! దురిత కరహిత ప్రోక్తులు చాలున్. చ్యుతాక్షరి ఒక ప్రహేళిక. అంటే అక్షరాలతో ఆట. రావణాసురుడు సీతతో అంటున్నాడు. (మొదటి మూడుపాదాలు) అమ్మాయీ! నా హృది సదా కరుణతో ఉన్నది. నా గాథ కవిస్మరణభాజి - కవులచే స్మరించదగినది, నా గాథ కమలాశ్రితము అంటే లక్ష్మీస్వరూపమైనది. నా కీర్తి - అవికల - దోషాలు లేని, సచ్ఛీలి = మంచి శీలము గలది. దీనికి సీత సమాధానం భువిద్విష = భూమికి శత్రువుగా అయిన వాడా! దురితకర హిత = పాపం చేసే వారికి హితమైన ప్రోక్తులు = ప్రసిద్దమైన పలుకులు చాలున్ = చాలును. దురితకరహిత - ఇక్కడ మరొక విధమైన శ్లేష కూడా ఉంది. దురిత = పాపీ "క" రహిత = నీవు పైన చెప్పిన మాటలలో "క" తీసివేస్తే వచ్చే ప్రోక్తులు = పలుకులు చాలున్ = చాలునులే. క తీసివేస్తే ఏమి వస్తుందో చూద్దాం. ఉవిద! హృది సదారుణము = అమ్మాయీ, నా హృదయము దారుణమైనది విస్మరణభాజి గాథ మలాశ్రితమే నా గాథ - విస్మరణభాజి = గుర్తుంచుకోదగ్గది కాదు. నా గాథ మలాశ్రితము = నా కథ మలానికి ఆలవాలమైనది. ఇక యశము అవిలసచ్ఛీలి యశము. అవిలసత్ శీలి...

పద్యసంభాషణ

ఒక సంస్కృతకవికీ అతని మిత్రునికీ సంభాషణ. "కస్త్వం భోః!" "కవిరస్మి" "కాప్యభినవా సూక్తిః పఠేతామ్" "త్యక్త్వా కావ్యకథైవ సంప్రతి మయా" "కస్మాదిదం శ్రూయతామ్" "యః సమ్యగ్వినక్తి దోషగుణయోః సారం స్వయం సత్కవిః సోऽస్మిన్ భావక ఏవ నాస్త్యథ భవేద్దైవాన్న నిర్మత్సరః." అతని ఏడుపు తెలుగులో అనువదిస్తే ఇలా ఏడిచింది. ఉ || "నీవెవడోయి?" "నే కవిని". "నిండుగ నొక్కటి కైత జెప్పుమో యీ?" "విడిపుచ్చినాను కవి యేయను మాటను." "ఎందుకోసమో?" "భావకుడైన దోషగుణ భావమెఱుంగెడు సత్కవెవ్వడో? దైవవశంబునట్టి కవి దక్కిన, మచ్చరి గాకనేరడే?"

రావణాసురుని ఆశ్చర్యం

చిత్రం
ఉ || ఒచ్చెము గాదె నా పగతుడొక్కరుఁడీ జటి యన్న, నందునన్  జచ్చిన వారలందరును సత్తువ బోరిన కచ్చిపోతులే అచ్చరలింటిగొంగ, వెనుకాడని నిద్దురవాఁడు నీటులే  చిచ్చరకంటిచెల్వుని పెను చెన్నగు కౌనులు ఏలనింకనో? నా శత్రువు ఒక తాపసి! అందునా అతని చేత చచ్చిన వారందరూ రాక్షసకులం వీరులు! స్వర్గాన్ని జయించిన ఇంద్రజిత్, కుంభకర్ణుడూ వ్యర్థమైపోయారే! ఈశ్వరుని మెప్పించిన ఈ రావణుని భుజాలు ఎందుకిక? ధిక్.... ఒచ్చెము = అవమానము అచ్చరలింటిగొంగ = అప్సరలున్న నెలవుకు శత్రువు = స్వర్గానికి శత్రువు = ఇంద్రజిత్తు జటి = తాపసి వెనుకాడనినిద్దురవాడు = కుంభకర్ణుడు ఈటులు = వ్యర్థులు చిచ్చరకంటిచెల్వు = నిప్పు కన్ను ఉన్నవానికి ఇష్టుడు = రావణుడు కౌనులు = మూపులు హనుమన్నాటకం అని ఒక ప్రాకృతనాటకంలో రావణాసురుడు రాముణ్ణి చూసి అలా అనుకొంటాడట. ఈ నాటకం ఇప్పుడు దొరికినట్లు లేదు, కానీ అక్కడక్కడా పద్యాలు వేరే కావ్యాలలో దొరుకుతున్నాయి. ఇందులో చమత్కారం ఏమంటే - ఈ పద్యంలో ప్రతి నామవాచకమూ వ్యంజకమై కూర్చుందట. (అంటే ప్రతి నామవాచకానికి జాగ్రత్తగా చూస్తే మరో అర్థం కనిపిస్తుందని సూత్రకారుడు) పైన నా (అచ్చ) తెనుగు సేత. (స్వేచ్ఛానువాదం. యథాతథా...

వక్రోక్తి మంగళాచరణము

చిత్రం
రాజానక కుంతలకుడు తన ’వక్రోక్తి జీవితమ్’ అలంకారశాస్త్ర గ్రంథారంభంలో సరస్వతీదేవికి మంగళాచరణం చేస్తున్నాడు. వందే కవీంద్రవక్త్రేందులాస్యమందిరనర్తకీమ్ | దేవీం సూక్తిపరిస్పందసుందరాభినయోऽజ్జ్వలామ్ || అనువాదము: గీ || వందనమ్ములు సుకవిముఖేందుబింబ మందిరనివాసినీలాస్యసుందరికిని, కుంద హసితకు, మధువచః స్పందనంది తోజ్జ్వలాభినయరసనిష్పందినికిని. సవరణ: గీ || వందనమ్ములు సుకవిముఖేందుబింబ మందిరనివాసినీలాస్యసుందరికిని, కుంద హసితకు, మధువచః స్పందతుషిత భాసురాభినయరసనిష్పందినికిని.

ఆనందవర్ధనకృతదేవీశతకము - శ్లోకము

చిత్రం
చిత్రకావ్యం అంటే అధమ కావ్యమని అలంకారజ్ఞులనేకుల యొక్క అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని తొలిసారి ఖండించిన పండితుడు శ్రీమాన్ అప్పయ్యదీక్షితులు. వీరి ’చిత్రమీమాంస’ గ్రంథంలో చిత్రకావ్యంలో వ్యంగ్యము, అప్రధాన వ్యంగ్యము లేకపోయినా, చారుత్వము లేదని చెప్పడానికి వీల్లేదన్నారు. కాబట్టి చిత్రకావ్యము ’చారు’ కావ్యమే, చిత్రకవిత చారుకవితయే. అదలా ఉంటే సాక్షాత్తూ ధ్వని సిద్ధాంత కర్త ఆనందవర్ధనుడు ఒక చిత్రకావ్యాన్ని రచించాడు. ఆ కావ్యం పేరు దేవీశతకమ్. అందులో ఒక శ్లోకం, ఆ శ్లోకానికి అనుసరణ - ఈ క్రింద. సరస్వతి ప్రసాదం మే స్థితిం చిత్తసరస్వతి | సర స్వతి కురు క్షేత్రకురుక్షేత్రసరస్వతి || క్షేత్రకురుక్షేత్రసరస్వతి సరస్వతి = శరీరమనే కురుక్షేత్రమున సరస్వతీ నదివైన ఓ సరస్వతీ ప్రసాదం సర = ప్రసన్నతను పొందుము మే చిత్తసరస్వతి = నా యొక్క చిత్తమనే సముద్రంలో స్థితిమ్ = స్థితిని స్వతి = బాగుగా కురు = చేయుము తెనుగు సేత: కం|| అరయగ దేహం బనదగు కురుభువిని వరనది పగిదిఁ గూర్పుమ శమమున్, కరణపు శరనిధి యందున సరస్వతి! యునికిఁ బనుపున చక్కగ నిమ్మా!    వరనది = సరస్వతి నది కరణపు శరనిధి = చిత్తమనెడు సముద్రము ఉనికిన్ ...

సమాసోక్తి అలంకారం

చిత్రం
"యత్ర ఉక్తౌ గమ్యతే అన్యః అర్థః సా సమాసోక్తిరుదితా" అని సమాసోక్తి లక్షణనిర్వచనమ్.   ఉక్తి - అంటే చెప్పిన మాట. అది ఇంకొక అర్థాన్ని ఆశ్రయిస్తే అది సమాసోక్తి అలంకారం. ఉదా:- రాగ మెసఁగ చకిత రాణి నిశ ముఖము నందుకొనియె ఱేడు చందురుండు. రాలెనంతట తిమిరాంశుకమ్ము. చెలఁగి నిశయుఁ దానిని గమనింప దయ్యె. (నా అనువాదానికి మాతృక క్రింద) ఉపోఢరాగేణ విలోల తారకం తథా గృహీతం శశినా నిశాముఖమ్ | యథా సమస్తం తిమిరాంశుకం తయా పురోऽపి రాగాద్గలితం న లక్షితమ్ || - నిశ అనేది అమ్మాయి పేరు. ఆమె మగని పేరు చందురుడు.చంద్రుడు ఆమె ముఖాన్ని ముద్దాడాలని చేతిలోకి తీసుకోగానే పరవశంతో ఆమె నీలి మేలిముసుగు (నీలజాలికా అన్న వస్త్రాన్ని నవోఢలు ధరిస్తారని కామశాస్త్రం) జారిపోయింది. ఆ అమ్మాయి మైమరపుతో దాన్ని పట్టించుకోలేదు.   తిమిరాంశుకం = నల్లటి వస్త్రము అని ఇక్కడ అర్థము. ముఖము = మోము కానీ ఈ పద్యం చదవగానే స్ఫురించే అర్థం ఇలా ఉంటుంది. ఎఱుపు రంగు చంద్రుడు రాత్రి ఆరంభంలో ఉదయించగానే ఆయన వెలుగుకు తిమిరంతో మిశ్రితమైన నక్షత్రాలు చెదరినై. రాత్రి మాత్రం చందురుడు వచ్చిన ఆనందంతో ఆ విషయం పట్టించుకోలేదు.   ఇక్కడ తి...

మూడవకన్నుకు మన్నన

చిత్రం
ఓ ప్రాకృతకవి ఈశ్వరుని మూడవకన్నుకు ఇలా జయము చెబుతున్నాడు. రఇకేళిహిఅణిఅసణకరకిసలఅరుద్ధణఅణజుఅలస్స | రుద్దస్స తఇఅణఅణం పబ్బఈ పరిచుంబిఅం జఅఇ || (రతికేళిహృతనివసనకరకిసలయరుద్ధనయనయుగళస్య| రుద్రస్య తృతీయనయనం పార్వతీపరిచుంబితం జయతి||) (రతికేళిలో అపహరించిన వస్త్రములు గలవాడు, చివురుటాకుల చేతులతో నేత్రద్వయం కప్పబడినవాడు అయిన రుద్రునియొక్క - పార్వతిచే చుంబించబడిన ఫాలనేత్రము సర్వోత్కృష్టముగా ఉన్నది!) పై పద్యం యథాతథంగా కాకపోయినా, అదే అర్థంలో (అవే శబ్దాలతోనూ) నా తెనుఁగు పద్యం. కం || అతులితవిరహానంతర రతికేళిహృతనివసనకరకిసలయోన్మీ లితనయనయుగళుఁడౌ హరుఁ సతిపరిచుంబితతృతీయచక్షువు జయమౌ ఈ పద్యంలో చమత్కారం ఇది. సతి రతికేళి సమయంలో సిగ్గుతో ప్రియుని రెండుకళ్ళను, తన చివురుటాకుల చేతులతో మూసింది. అయ్యవారికి మూడుకళ్ళు! మూడవకన్ను తననే చూస్తోంది. ఆ కన్నునెలా మూయాలి? తన పెదవితో మూసింది. (చుంబించింది). ఆ రెండుకళ్ళకు పట్టని అదృష్టం మూడవకంటికి దొరికింది. ఆ కంటికి జయం చెప్పవలసిందే కదా! రుద్రుని ఫాలాక్షం ఎప్పుడూ కోపానికి ప్రతీక అయితే, ఈ కవి శృంగారానికి ఆలంబన చేశాడు!

సంస్కృత బోధన, బాలీవుడ్ స్టయిల్లోనట!

’భవతః సమీపే కిమ్ అస్తి? మమ సమీపే మాతా అస్తి..’ బాలీవుడ్ లో అత్యంత ప్రఖ్యాత డవిలాగు అది. ఇంకా గుర్తుకు రాలేదా? 70 లలో పేరున్న ఇద్దరు మహానటుల మధ్య ఓ సినిమా లో చోటుచేసుకున్నదది. ఆ నటులు - అమితాబ్ బచ్చన్, శశి కపూర్ లని ఈ పాటికి మీకు గుర్తొచ్చేసి ఉండాలి. ఆ సినిమా పేరు "దీవార్". "తుమ్హారా పాస్ క్యా హై? మేరే పాస్ మా హై" - ఇది హిందీ డవిలాగు. ఇప్పుడు అహ్మదాబాదులోని, ఏకలవ్య సంస్కృత అకాడెమీ వారు సంస్కృత వ్యాప్తి కోసం ఈ మధ్య ప్రయత్నిస్తున్న పద్ధతి ఇదట. ఆ సంస్థ ఓ పత్రికను కూడా ప్రచురిస్తున్నదట. దాని ప్రతులు నెలకు 500 కాపీలు అమ్ముడవుతున్నాయిష. 190 మంది సభ్యులున్నారట ఆ సంస్థలు. ఇక సినిమా డవిలాగులు చూద్దామా? దీవార్ - ’మమ సమీపే యానం అస్తి, ధనం అస్తి, భవనం అస్తి,సర్వం అస్తి. తవ సమీపే కిం అస్తి? ’ ’మమ సమీపే మాతా అస్తి ’ (మేరే పాస్ గాడి హై, బంగళా హై, పైసే హై...తుమ్హారా పాస్ క్యా హై? మేరే పాస్ మా హై) షోలే - ’కాలియా, తవ కిం భవిష్యసి? మహోదయః, మయా తవ లవణం ఖాదితం ఇదానీం గోలికానం ఖాద ’ (అబ్ తేరా క్యా హోగా, కాలియా? సర్దార్, మైనే ఆప్ కా నమక్ ఖాయా హై తో అబ్ గోలి ఖా) ’పంచశతి పంచశతి ...