ఈ బ్లాగ్ లో ప్రచురింపబడిన వ్యాసాలు - ఈ బ్లాగు ఓనర్ వి మాత్రమే కావు. ఇవి అందరివి కూడా. ఈ వ్యాసాలను ఎవరైనా వాడుకోవచ్చు. వారి పేరు పెట్టుకుని ప్రచురించుకున్నా అభ్యంతరం లేదు. 🙂
రాత్రి పూట ఆకాశంలో సరిగ్గా ఉత్తరదిక్కున సన్నగా, మిణుకుమిణుకుమంటూ ఓ నక్షత్రం ఉదయిస్తుంది. ఆ నక్షత్రం చుట్టూ మిగిలిన నక్షత్రాలన్నీ వలయంగా తిరుగుతూ ఉంటాయి. ఇది ధ్రువనక్షత్రమని ఇదివరకు వ్యాసంలో ప్రస్తావనగా ఒకచోట చెప్పుకున్నాం. ధ్రువం - అంటే స్థిరము, నిశ్చలము. ఈ ధ్రువనక్షత్రాన్ని Polaris (α-Ursa Minor) అని పిలుస్తారు. ధ్రువనక్షత్రం ఉదయించినప్పుడే దానికి క్రిందుగా సప్తర్షి మండలం కూడా కనిపిస్తుంది. దీనిని ఆంగ్లంలో "Big Dipper" అన్నారు. ఈ సప్తర్షులు ఏడుగురని మనకు తెలుసు. వీరిలో ముగ్గురు ఒకే సరళరేఖలో, మిగిలిన నలుగురు కలిసి ఒక పెట్టె/గరిటె/శకటం రూపంలో అమరి ఉండటం మనకు తెలుసు. మండలం ధ్రువ నక్షత్రం క్రిందుగా ఉదయించి రాత్రి గతించి తెల్లవారు ఝాము వేళకు ఆ ధ్రువుని పైకి చేరుకుంటుంది. అప్పుడు ఆ సప్తర్షి మండలం ఎలా ఉంటుందో - మాఘుడనే కవి శిశుపాలవధ కావ్యంలో వర్ణించాడు. స్ఫుటతర ముపరిష్టా దల్పమూర్తేః ధ్రువస్య స్ఫురతి సురమునీనాం మండలం వ్యస్తమేతత్ | శకటమివ మహీయః శైశవే శార్ఞపాణేః చపల చరణకాబ్జ ప్రేరణోऽత్తుంగితాగ్రమ్ || (శిశుపాలవధమ్ - 11. 3) బాల్యంలో శ్రీకృష్ణయ్య తన చిట్టిపాదాలలో శకటాసుర...
రెణ్ణెల్ల ముందు ఆఫీసులో ఓ రోజు... తండ్రీ! ఏ ఊళ్ళో న్యూ యియర్ ముందు రోజు రాత్రి అరుపులు కేకలు వినిపించవో; ఏ చోట న్యూ యియర్ ముందు రోజు, తాగి తందనాలాడుతూ జనాలు ఊరేగరో; ఏ ప్రదేశంలో తెచ్చిపెట్టుకున్న సంతోషం ఉండదో; ఎక్కడ మెసేజులతో, ఫోన్ కాల్స్ తో పీక్కుతినడం ఉండదో; ఆ ప్లేస్ పేరు చెప్పవా..ప్లీజ్ అనుకున్నాను. బహుశా ఏ దేవుడికో అది వినబడినట్టుంది. డిసెంబరు 30,31, జనవరి 1 మూడు రోజులు సెలవు కలిసి వచ్చింది. ఫలితంగా - వారణాశి ప్రయాణం. సోలో జర్నీ! భారతదేశపు కాశీ గురించినంత సాహిత్యం బహుశా ప్రపంచంలో ఏ నగరం మీదా, మరే ప్రాంతం మీదా ఉండదు. వేదకాలంలో దివోదాసు, ప్రతర్దనుడి కాలం మొదలుకుని, పౌరాణిక కాలం, ఔరంగజేబు నుండి బ్రిటీషు పరిపాలన కాలాదుల వరకూ నేడూ కూడా కాశీ భారతదేశంలో ప్రతి తరంలో, కాలం తాలూకు మార్పులకు, ఒడిదుడుకులకు, తాత్విక చింతనలకు, కళలకు, సంస్కృతికి, భారతీయతకు సాక్షి. కాశీ లో ఎలాంటి వ్యక్తి అడుగుపెట్టినా అతని ఇష్టానికి తగినట్టు ఏదో ఒక అద్భుతమైన విషయం కనిపించక మానదు. ఆఖరుకు తిండి మీద తప్ప వేరే దేని మీదా ఇంటరెష్టు లేనోడికి కూడా కాశీ చెరిగిపోని మధురమైన అనుభూతి మిగులుస్తుంది, నిస్సందేహంగా. కాశీ అంట...
ప్రస్తావన: ఈ వ్యాసానికి ముందు మరొకసారి ఇదివరకటి " భారతదేశ అస్తవ్యస్త చరిత్ర - మౌలిక ప్రాతిపదికలు - ప్రశ్నలు " - అన్న వ్యాసంలో ముఖ్యమైన అంశాలను పునశ్చరణ చేద్దాం. క్రీ.శ పద్దెనిమిదవ శతాబ్దంలో ఆధునిక భారతదేశచరిత్రను వ్రాయతలపెట్టింది ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి, రాయల్ ఏషియాటిక్ సొసయిటీని స్థాపించిన సర్ విలియమ్ జోన్స్. ఆ సంస్థలో భారతీయులు ఒక్కరూ లేరు. సర్ విలియమ్ జోన్స్ కు భారతదేశంపై, ఈ దేశ ఔన్నత్యంపై, చరిత్రపై ఏమాత్రం సదభిప్రాయం లేదు. అతడు వ్రాయదల్చుకున్నది పాలకుల దృష్టిలోని భారతదేశచరిత్ర మాత్రమే. జోన్స్ కు సంస్కృతం, ఇతర భారతదేశభాషలు రావు. ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలపై ఆతనికి అవగాహన శూన్యం. ఈతడు రాధాకాంత తర్కవాగీశుడనే అతనితో పౌరాణిక రాజవంశావళిని చెప్పించుకున్నాడు. ఆతడు వ్రాసిన చరిత్రకు Sheet anchor - అనామతు గ్రీకు పుస్తకపు అనువాదంలోని సాండ్రోకొట్టసు అనబడే వ్యక్తి. అతణ్ణి మౌర్యచంద్రగుప్తునిగా, క్రీ.పూ. 327 కాలం నాటి వాడిగా ఆతడు నిర్ణయించినాడు. ఆతడు నిర్ణయించిన Sheet anchor ను కోల్ బ్రూక్ తదితర ఉద్యోగులే ఖండించారు. గ్రీకు అలెగ్జాండరూ, భారతదేశ సాండ...
మీరు ఇలా ప్రకటించడం అభినందనీయం. 🙏🏻
రిప్లయితొలగించండి