14, నవంబర్ 2022, సోమవారం

శిశుపాలవధమ్ ఆరవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (51 - 60)

 

౫౧.

విగత వారిధరావరణాః కృచిద్దదృశురుల్లసితాసిలతాసితాః |

క్వచిదివేంద్రగజాజిన కంచుకాః శరది నీరదినీ ర్యదవోదిశః ||

 

శరది యదవః క్వచిత్ విగతవారిధరావరణాః (అత ఏవ) ఉల్లసితాసిలతాసితాః క్వచిత్ నీరదనీః  (అత ఏవ) ఇంద్రగజాఇనకంచుకాః ఇవ దిశః దదృశుః |

 

సర్వంకష

విగతేతి || శరది-యదవః యారవాః యదుశబ్దేన రఘుశబ్దవత్తదపత్యే లక్షణా | న్ననపదశబ్దనామేవ 'తద్రాజస్య బహుషు' ఇతి లుక్సంభవాదితి-క్సచిత్ విగతవారిధరావరణాః : నివృత్త మేఘావరణాః - అత ఏవ ఉల్లసితాః కోశాదుధృతాః - అసిర్లతేవాసిలతా-తద్వత్-ఆసితాః శ్యామాః ఇత్యుపమా క్వచిన్నీరదనీః మేఘవతీః శుభ్రాభ్రపటలచ్చన్న ఇత్యర్థ:-అత ఏవ- ఇంద్ర గజాజిన మైరావతచర్మ తదేవ కంచుకః కూర్పాసకః యాసాంతాః ఇవ స్థితా ఇత్యుత్ప్రేక్షా-దిశః దదృశుః ఉక్తాలంకారయోస్సంసృష్టి:

 

శరది = శరత్కాలమున; యదవః = యాదవులు;  క్వచిత్ = ఒకచోట;  విగతవారిధరావరణాః = జలదరహితమైన; (అత ఏవ = ఇంకనూ) ఉల్లసితాసిలతాసితాః; ఉల్లసిత = ఒర నుండి దూసిన; అసితాః అసిలతా = నల్లనివి, తీవెల వంటి ఖడ్గాల వలె ఒప్పు;   క్వచిత్ = ఒకచోట; నీరదనీః = మేఘములు గల; (అత ఏవ = మరియు) ఇంద్రగజా కంచుకాః ఇవ= ఐరావతము యొక్క చర్మము వంటి ; దిశః = దిశలను; దదృశుః = చూచిరి;

 

శరత్కాలమున యాదవులు ఒకచోట జలదరహితమైన మరియు ఒరనుండి దూసిన ఖడ్గముల వలే నల్లగా తీవెలాగా మెరిసే ఖడ్గం లా ప్రకాశిస్తున్న; ఒకచోట మేఘములు గల; ఐరావతపు చర్మంలా ధవళయుతమైన దిశలను చూచిరి.

 

విశేషములు;

ఈ శ్లోక భావము, వ్యాఖ్యానము కూడా సంక్లిష్టంగా ఉన్నాయి. సరైన భావం ద్యోతకం కావటం లేదు.

నీరదనీః అంటే మేఘయుతః అని వ్యాఖ్యానకారుడు - అంటే మేఘములతో కూడిన అని అర్థం. కానీ ఆ వెంటనే వివిరిస్తూ శుభ్రాభ్రపటలచ్ఛన్నః (శుభ్రమైన ఆకాశముతో కప్పబడిన) అన్నాడు. తాత్పర్యం పొసగటం లేదు.

ఉల్లసితాసిలతాసితాః - ఇక్కడ పాఠంలో అవగ్రహం లేదు. అసిలతా ఇవ సితాః అంటే భావం సరిపోతుంది. తీవె వంటిది, తెల్లనైనది అయిన ఖడ్గం లాంటి; అయితే ఖడ్గం - సాధారణంగా అసితమే. ఇది చిక్కు.

అసితాః అని, శ్యామాః అని వ్యాఖ్యాన కారుడు. శ్యామమంటే నల్లనివి. దిశలు నల్లనివైతే శరత్కాలానికి ఒప్పదు. ఇది ఇక్కడ చిక్కు.

౫౨.

విలులితామనిలశ్శరదంగనా నవసరోరుహకేసరసంభవామ్ |

వికిరితు పరిహాసవిధిత్సయా హరివధూరివ ధూళిముదక్షిపత్ ||

 

శరదంగనా అనిలవిలులితాం నవసరోరుహకేసరసంభవామ్ ధూళిం పరిహాసవిధిత్సయా హరివధూః వికిరితుం ఉదక్షిపత్ ।

 

సర్వంకష

విలులితామితి || శరదేవాంగనా శరదంగనేతి రూపకమ్ - అనిలవిలులితాం విక్షోభితాం - ఇతస్తతో విక్షిప్తా మిత్యర్థః - సవసరోరుహకేసరసంభవాం-ధూళిం పరాగం-పరిహాసవిధిత్సయా నర్మరీతి చికీర్షయా-డధాతేః సన్నంతాత్, స్త్రియామప్రత్యయే టాప్ - హరివధూ - వికిరితుం విక్షేప్తుమివ 'తుముణ్వులౌ క్రియాయాం క్రియార్థాయా'మితి తుమున్ ప్రత్యయః- ౠతఇద్దాతో రితీకారః - ఉదక్షిపత్ ప్రేరితవతీ- రూపకోంజీవితేయముత్ప్రేక్షా-కిరతిరయం కీర్యమాణకర్మా - యథాహ - రజః కిరతి మారుతః క్వచిత్త త్తారకోద్దేశ్యకర్మా తథాత్రైవేతి వివేకః |

 

శరదంగనా = శరత్తు వంటి అందమైన అంగనలు;  అనిలవిలులితాం = గాలిచే కదుపబడినవి;  నవసరోరుహకేసరసంభవామ్ = సరస్సున జనించిన క్రొందామరల పరాగము గల;  ధూళిం = ధూళిని;  పరిహాసవిధిత్సయా ఇవ = క్రీడా విలాసముగా;  హరివధూః  = శ్రీకృష్ణుని ప్రేయసులపై; వికిరితుం = చిందునట్లు;  ఉదక్షిపత్ = చల్లిరి.

 

శరత్కాలము వంటి సుందరాంగులు గాలిచే కదుపబడినవి, సరస్సున పుట్టిన క్రొందామరల పుప్పొడిని కలిగిన ధూళిని క్రీడావిలాసముగా శ్రీకృష్ణుని ప్రియురాండ్రపై చిందేట్టు చల్లిరి.

 

విశేషములు

ఈ శ్లోకం అన్నమాచార్య కృతిని గుర్తు తెప్పిస్తున్నది.

 

జగడపు జనవుల జాజర |

సగివల మంచపు జాజర ||

 

మొల్లలు దురుముల ముడిచిన బరువున |

మొల్లపు సరసపు మురిపెమున |

జల్లన బుప్పొడి జాగర బతిపై |

చల్లే రతివలు జాజర ||

౫౩.

హరితపత్రమయీవ మరుద్గణైః స్రగవబద్ధమనోరమపల్లవా|

మధురిపోరభితామ్రముఖీ ముదం దివితతా వితతాన శుకావళిః||

 

అభితామ్రముఖీ శుకావళిః మరుద్గణౖః దివితతా హరితపత్రమయీ స్రగవబధ్ధమనోరమపల్లవాః మధురిపోః ముదం ఇవ వితతాన ।

 

సర్వంకష

హరితేతి || అభితామ్రముఖీ అరుణముఖీ 'స్వాంగాచోపసర్జనాత్' ఇత్యాదినా వికల్పాత్ జీష్-శుకావళి:- మరుద్గణైః - దివితతా హరి ప్రియార్థమాకాశే వితతాహరితానాం. హరిద్వర్ణానాం పత్రాణాం వికారో హరితపత్రమయీ 'టిగ్ ఢాణఞ్' ఇత్యాదినా జీప్ తథా అవబద్ధాః గ్రధితా:- మనోరమాః పల్లవాః యస్యాం సా స్రగివ ఉత్ప్రేక్షా-మధురిపోః శ్రీకృష్ణ స్య-ముదం-వితతాన చకార ఇత్యర్థః

 

అభితామ్రముఖీ = ఎర్రని ముక్కులుగల;  శుకావళిః = రామచిలుకలు; మరుద్గణౖః = దేవతలచేత;  దివితతా = దివినుండి;  హరితపత్రమయీ = పచ్చని రంగు గల;  స్రగవబధ్ధమనోరమపల్లవాః = ఆకులచేత కట్టబడిన మనోహరమైన మాలవలే;  మధురిపోః = మధుసూదనుని; ముదం ఇవ = సమ్తసము కోసమే యన్నట్లు;  వితతాన = కూర్చబడినవి.

 

శరత్కాలంలో నిర్మలమైన ఆకాశంలో ఎర్రని ముక్కులున్న రామచిలుకల దండు యెగురుతోంది. అది దేవతలు మధుసూదనుని అలరించటం కోసం హరితపత్రాలతో చేసిన మనోహరమైన మాల అన్నట్టు అమరింది.

౫౪.

స్మితసరోరుహనేత్ర సరోజలామతి సితాంగవిహంగహసద్దివమ్|

ఆకలయన్ముదితామివ సర్పతస్సశరదం శరదంతురదిజ్ముఖామ్||

 

సః స్మితసరోరుహనేత్రసరోజలాం అతిసితాంగవిహంగహసద్దివమ్ శరదంతురదిజ్ముఖామ్ శరదం సర్వతః ముదితాం ఇవ అకలయన్ ।

 

సర్వంకష

సహరిః సితాని వికసితాని- సరోరుహాణ్యేవ నేత్రాణియేషు తాని-సరోజలాని యస్యాం తాం తథోక్తాం అతిసితాంగాః ధవళపక్షాః - యే విహంగాః హంసాః తైర్హసంతీ స్మ యమా నేవస్థితా ద్యౌర్యస్యాం తాం తథోక్తాం - శరైః తృణవిశేషైః డంతురాణ్యున్న తదంతాని హాసాత్ ప్రకాశరశనానీతి యావత్ డంత ఉన్నత ఉరజిత్యురచ్ ప్రత్యయోమత్వర్థీయః- తాని దిజ్ముఖాని యస్యాం తాం-శరదంతురదిజ్ముఖాం-శరడం - సర్వతః ముదితామివ అకలయత్ - సర్వత్ర నేత్రవికాస హాసాదిలింగైః హృష్టామివ అమన్యతే ఇత్యర్థః - అత్ర సరోజహంసశరేషు నేత్రహాసదంతత్వారోపణాద్రూపకాలంకారః- తద్వశాత్ ప్రతీయమాన అంగనా భేదాధ్యవసాయాత్ శరది ముదితత్వ ఉత్ప్రేక్ష ఇతి సంకరః!

 

సః = ఆ మాధవుడు;  స్మితసరోరుహనేత్రసరోజలాం = నీట వికసించిన కలువల వంటి లోచనములు గల తటాక జలములను ;  అతిసితాంగవిహంగహసద్దివమ్ = ధవళగాత్రముతో ఒప్పారు హంసలతో స్వర్గాన్ని పరిహసిస్తున్నది;  శరదంతురదిజ్ముఖామ్; శర = రెల్లు గడ్డి అనే; దంతుర = దంతములు గల; దిజ్ముఖామ్ = దిశ అనెడు ముఖము గలదానిని అయిన;  శరదం = శరత్తును;  సర్వతః = ఎల్లెడలా;  ముదితాం ఇవ = అతివ వలే భావించి; అకలయన్ = ప్రసన్నుడాయెను;

 

ఆ మాధవుడు శుభ్రమైన జలాల్లో వికసించిన కలువల్లాంటి స్వచ్ఛమైన జలాలనే నేత్రాలుగానూ, స్వర్గాన్ని పరిహసించే హంసల్లాంట తెల్లని దేహంగానూ, రెల్లుగడ్డిని దంతాలుగానూ, దిశ అనే ముఖాన్ని కలిగిన అందమైన శరత్తు అనే ముదిత గా సంభావించాడు.

౫౫.

(అథ హేమంతం వర్ణయతి)

గజపతిద్వయసీరపి హైమనస్తుహినయన్ సరితః పృషతాంపతిః |

సలిల సంతతి మధ్వగయోషితామతనుతాతనుతాపకృతం దృశామ్ ||

 

గజపతిద్వయసీః అపి సరితః తుహినయన్ హైమనః పృషతాం పతిః అధ్వగయోషితాం దృశాం అతనుతా అపకృతం సలిలసంతతిం అతనుత |

 

సర్వంకష

గజపతీతి || గజపతిః ప్రమాణమాసాం గజపతి ద్వయస్యః మహాగజ ప్రమాణాః ప్రమాణేద్వయసచ్ దఘ్న ఞ్మాత్ర ఇతి ప్రమాణే ద్వయసచ్ ప్రత్యయః । టిడ్డాణ ఇత్యాదినా జీప్ - తాఆపి. సరితస్తుహిసర్యః హిమీకుర్వన్ తత్ కరోతీతి ణ్యంతాల్లటశ్నత్రాదేశః. హేమంతే భవః హైమనః । సర్వత్రాణంత లోపశ్చేతి హేమంతశబ్దాచ్చైషికోణ ప్రత్యయః-త కారలోపశ్పపృషతాం బిందూనాం పతిః వాయుః * పృషంతి బిందు ప్పషతావిత్యమరః- అధ్వానం గచ్ఛంతీత్యధ్వగాః పధికాః | అంతాత్యంతాధ్వదూరపారసర్వానాం తేషు-తద్యోషితాం ప్రోషితభర్తృకాణాం దృశాం అతనుతాపకృతం మహాసంతాపకారిణీం - సలిల సంతతిం. అతనుత- ఉష్ణమశ్రూం ఉత్పాదయామాసేత్యర్థః హేమంతమారుతో విరహిదుస్సహో జనీతి భావః!!

 

గజపతిద్వయసీః అపి = ఏనుగు లా ఎత్తైన ప్రమాణం గలది; (ద్వయశబ్దాన్ని ప్రమాణసూచకం)  సరితః = నదులను;  తుహినయన్ = ఘనీభవింపజేస్తూ;  హైమనః = హేమంత ఋతువు యొక్క;  పృషతాం పతిః = వాయువు;  అధ్వగయోషితాం = ప్రోషితభర్తృకల; దృశాం = కనుల;  అతనుతా = శోభను;  అపకృతం = వికటింపఏస్తూ; సలిలసంతతిం = అశ్రువులను; అతనుత = ఉత్పాదించెను;

 

ఏనుగులను కూడా ముంచెత్తగల ప్రమాణంలో మంచు కురుస్తూ, నదులను గడ్డకట్టిస్తూ, హేమంత ఋతువు తాలూకు గాలి ప్రోషితభర్తృకల కనుల శోభను అపకృతం చేస్తూ, వారి కళ్ళల్లో వేడి యశ్రువులను జాలువార్చింది.

౫౬.

ఇదమయుక్తమహో మహదేవ యద్వరతనోః స్మరయత్యనిలో౽న్యదా|

స్మృతసయౌవనసోష్మపయోధరాన్ సతుహినస్తు హినస్తు వియోగినః ||

 

అనిలః అన్యదా వియోగినః వరతనోః స్మరయతి ఇదం మహత్ అయుక్తం ఏవ అహో స తుహినః తు స్మృతసయౌవనసోష్మపయోధరాన్ హినస్తు ।

 

సర్వంకష

సర్వదా వియోగినా ముద్దీపక స్యాపి వాయో ర్హేమంతే వైశిష్ట్యమాచష్టే।

ఇదమితి || అనిలో వాయుః అన్యదా అన్యస్మిన్ కాలే- గ్రీష్మాదౌ ఇత్యర్థః - సర్వైకాన్యేత్యాదినా దా ప్రత్యయః - వియోగినః వియుక్తాః । గతిబుద్దీత్యాదినా ఱణికర్తుః కర్మత్వం- వరతనోః వరతనుమిత్యర్థః - ఆధిగర్థేత్యాదినా కర్మణి శేషే షష్ఠీ -స్మరయతీతి యత్ - స్మరతేరాధ్యానేమిత్వాత్ హ్రస్వః ఇదం సారకత్వమపి మహదత్యంతం - ఆయుక్తమేవ- సహకారివిరహాదితి భావ: - అహో - అత్యంతాకించిత్కరత్వాద్విస్మయః - హేమంతే తు హంతృత్వమప్యస్య సంభావిత మిత్యాహ-స్మృతేతి-సతుహినః - హిమసహితః అనిలస్తు స అనిలస్తు స యౌవనాః యౌవనయుక్తాః - అత ఏవ-సోష్మణః సోష్ణాః యే పయోధరాః కుచాః- తే స్మృతాః యై తాన్ - స్మృత సయౌవనసోష్మవయోధరాన్ - వియోగినో వియుక్తాః తథా యుక్తం చానీప్సితమితి కర్మత్వం- హినస్తు హంతువా సంభావనాయాం లోట్ - హేమంతే హిమసహకారాత్ కుచోష్మైక సాధ్యదుఃఖోత్పాదన సామర్ధ్యాత్ వియోగి మారకత్వమపి సంభావ్యతే- తే గ్రీష్మాదౌ తు తాదృక్సహకారి విరహాత్ స్మారకత్వమప్యయుక్తమితి భావః - అమారకే మారకత్వసంబంధోక్తేరతిశయోక్తి భేదః - ఇహసహజకవి ప్రౌశఢోక్తిసిద్ధయో రతిశయయోగ భేదాధ్యవసాయ ఇతిరహస్యమ్

 

యత్ అనిలః = ఏ మారుతము; అన్యదా = ఇతర ఋతువులలో;  వియోగినః = విరహులైన పతులకు;  వరతనోః = సుందరాంగులను;  స్మరయతి = స్ఫురింపజేయునో;  ఇదం మహత్ = అట్టిది ఇప్పుడు మిక్కిలి;  అయుక్తం ఏవ = అనుచితమైనది కదా!  అహో = అహో! స తుహినః తు = అట్టి చలిగాలి;   స్మృతసయౌవనసోష్మపయోధరాన్ = యౌవనంలో ప్రియురాండ్ర వేడి పయోధరాలను స్ఫురణకు తెస్తూ;  హినస్తు = చంపుతున్నది కదా!

 

ఏ గాలి వసంత, గ్రీష్మ, వర్షాది ఋతువులలో విరహులైన పతులకు సుందరాంగులైన తమ ప్రేయసులను స్ఫురింపజేస్తుందో అదే గాలి ఇప్పుడు అనుచితంగా - యౌవనంలో ఉన్న ప్రియులకు తమ ప్రేయసుల పయోధరాలను గుర్తుకు తెప్పిస్తూ చంపుతున్నది.

౫౭.

ప్రియతమేన యయా సరుషా స్థితం న సహ సా సహసాపరిరభ్య తమ్ |

శ్లథయితుం క్షణమక్షమతాంగనా న సహసా సహసా కృతవేపథుః ||

 

సరుషా యయా ప్రియతమేన సహ న స్థితం, సా అంగనా సహసా కృతవేపథుః తం సహసా సహసా పరిరభ్య క్షణం శ్లథయితుం న అక్షమత ।

 

సర్వంకష

ప్రియతమేనేతి || అత్రాద్య పర్యాయేన సహసేతి త్రిధావిభాగః అన్యత్ర సహసేత్యేకం పదం-సరుషా సరోషయా- యయా స్త్రీ యా కర్త్ర్యా - ప్రియతమేన సహసస్థితం-నపుంసకే భావేక్త: సాఅంగనా స్త్రీ - సహసామార్గ శీర్ష మాసేన *మార్గశీర్షేన హామార్గ ఇత్యమరః - కృత వేపథుః జనిత కంపా సతీ ట్పితోధుజిత్యథు చ్చత్ ప్రత్యయః తం పూర్పమగణిత మేవ-ప్రియం హసేన సహ వర్తంత ఇతి సహసా-సహాసోసతీ - ఆథో హసః హాసో హాస్యం చేత్యమరః స్వన హసోర్వేతి వికల్పాదప్రత్యయః - సహసా శీఘ్రం స్వరాదినిపాతాదవ్యయం- పరిరభ్య ఆశ్లిష్య క్షణం క్షణమపీత్యర్థః - అన్యథా వైరం స్యా త్ - అత ఏవ సామర్థ్య లభ్యార్థః త్వాత్  పేర ప్రయోగః-శ్లథయితుం - నాక్షమత వైయర్థ్యాత్  శిధిలీకర్తుం నోత్సహతే స్మైత్యర్థః.- మానినీమానభంజన క్షమోయం మాస ఇతి భావః - కలహాంతరితేయం నాయికా - కోపాత్ కాంతం పరానుద్య పశ్చా త్తాపసమన్వితేతి లక్షణాత్ |

 

సరుషా = రోషము చేత;  యయా = ఏ స్త్రీ చేత; ప్రియతమేన సహ = ప్రియునితో కూడి యుండుట;  న స్థితం = జరుగలేదో; సా అంగనా = ఆ సుందరి;  సహసా = మార్గశిరమున; కృతవేపథుః = (శృంగారకాంక్ష చేత కల్గిన) శరీరకంపము చేత; తం = ప్రియుని; సహసా = నవ్వుచూ;  సహసా = ఎప్పుడూ;  పరిరభ్య = ఆలింగనము చేసికొని;  క్షణం = ఒక్క నిముషము కూడా; శ్లథయితుం = (కౌగిలి) సడలించుటకు;  న అక్షమత = ఇచ్ఛగింపలేదు ।

 

ఏ సుందరి పూర్వము రోషముతో ప్రియుని తిరస్కరించి ఉండెనో ఆ సుందరాంగి మార్గశిరమాసమున శృంగారకాంక్షతో కల్గిన శరీరకంపనము చేత ప్రియుని నవ్వుచూ ఎల్లప్పుడూ కౌగిలించుకుని, నిమేషమాత్రము కూడా తన పరిరంభమును సడలించుటకు ఇచ్ఛగింపలేకపోయినది.

 

విశేషములు

శ్లోకం చతుర్థపాదంలో సహసా సహసా అన్న నిబంధన లాటానుప్రాస. శబ్దార్థయోః పౌనరుక్త్యం తాత్పర్యభేదవత్. ఒకే విధమైన శబ్దాన్ని తాత్పర్యభేదంతో ప్రయోగించటం లాటానుప్రాస.

౫౮.

భృశమదూయత యా౽ధరపల్లవక్షతిరనావరణా హిమమారుతైః |

దశనరశ్మిపటేన చ సీతృతైర్నివసితేవ సితేన సునిర్వవౌ||

 

అనావరణా యా అధరపల్లవక్షతిః హిమమారుతైః భృశం అదూయత; సీత్కృతైః సితేన దశనరశ్మిపటేన చ నివసితా ఇవ సునిర్వవౌ |

 

సర్వంకష

భృశమితి ॥ అనావరణా ఆవరణరహితాయా; అధరపల్లవస్య క్షతిః వ్రణః- హిమమారుతైః భృశం - అదూయత ఆతవ్యత - దూఞో దైవాదికాత్ కర్తరి లజ్ సా క్షతిః - యత్తదోర్నిత్య సంబంధః సీతృతైః సీత్కారైః కర్తృభిః - సితేన శుభ్రేణ దశనరశ్మయఏవ పటః - తేన కరణేన నివసితా ఆచ్చాదితేవ - నిపూర్వాద్యసేరాచ్చాదనార్దత్వాత్కర్మణి క్తః - తస్య యడాగమః- సునిర్వవౌ సుష్ఠునిర్వవార -  శీతాళురాచ్ఛాద్యత ఇతి భావః హిమహతాధర వ్రణనిర్వాపణస్య సీత్కారకర్తృకదశసరశ్మిపటాచ్ఛాదన హేతుకత్వో త్ప్రేక్షణాత్ రూపకోత్ప్రేక్షయోస్సంకరః ||

 

అనావరణా = ఆవరణరహితమైన (కప్పి యుండని); యా అధరపల్లవక్షతిః = ఏ పెదవిపైని గాటు; హిమమారుతైః = మంచుగాలితో;  భృశం = మిక్కిలి; అదూయత = నొవ్వబడెనో; (అది) సీత్కృతైః = సీత్కృతములచేత; (అపి చ =ఇంకనూ)  సితేన = స్వచ్ఛములైన;  దశనరశ్మిపటేన = దంతముల కాంతి అను వస్త్రము చేత;   నివసితా ఇవ = కప్పబడినదై;  సునిర్వవౌ = సుఖమును గూర్చెను;

 

ఆవరణరహితములైన ఏ సుందరి అధరపల్లవములపైని వ్రణములు హేమంతఋతువున మంచుగాలితో నొచ్చెనో, ఆ వ్రణములు పరవశపూర్వక సీత్కృతముల చేతను, దంతధవళకాంతుల వస్త్రముల చేతనూ నివారింపబడి సుఖమును గూర్చెను.

౫౯.

వ్రణభృతా సుతనోః కలసీత్కృతస్ఫురితదంతమరీచిమయం దధే |

స్పుట మివావరణం హిమమారుతైః మృదుతయా దుతయాధరలేఖయా ||

 

మృదుతయా హిమమారుతైః దుతయా వ్రణభృతా సుతనోః అధరలేఖయా కలసీత్కృతస్ఫురితదంతమరీచిమయం స్ఫుటమావరణం ఇవ దధే ।

 

సర్వంకష

ఉక్త మేవార్థకం భంగ్యంతరేణాహ॥ ప్రణేతి|| మృదుతయా మార్దవేన హేతునా- హిమమారుతైః దుతయా పీడితయా టుదు ఉపతాప ఇతి ధాతోః భావాదికాత్కర్మణి క్తః - వ్రణభృతాదంతవ్రణభృతా- సుతనోః స్త్రియాః అధరౌ లేఖా ఇవ ఆధరలేఖా - తయా అధర లేఖయా కర్త్యా ణ కలస్సీత్కృతైర్హేతునా స్ఫురితాః ప్రకాశితాః యాః దంత మరీచయః తన్మయం తద్రూపం-స్ఫుటం-ఆవరణమాచ్ఛాదనం-దధ ఇవ ధృతమివ ఉత్ప్రేక్షా - డధాతేః కర్మణి లిట్ ||

 

మృదుతయా =  మార్దవమైన; హిమమారుతైః = మంచుగాలిచేత; దుతయా = నొప్పింపబడిన; వ్రణభృతా = గాటుగల; సుతనోః = సుందరాంగి యొక్క; అధరలేఖయా = పెదవియంచు;  కలసీత్కృతస్ఫురితదంతమరీచిమయం = మధురమైన సీత్కృతములచేత ద్యోతకమవుతున్న దంతకాంతులమయమై;  స్ఫుటమావరణం ఇవ = చక్కని ఆచ్ఛాదన వలె; దధే = తాల్పబడెను.

 

(ఇదివరకటి శ్లోకపు ముచ్చటనే మళ్ళీ ఇంకొక విధంగా చెబుతున్నాడు కవి)

మార్దవమైన మంచుగాలిచేత నొప్పింపబడిన సుందరాంగి పెదవియంచుపైని నొక్కులు ఆమె మధురసీత్కృతముల చేత ద్యోతకమవుతున్న దశనకాంతులమయమై చక్కని ఆచ్ఛాదన గూర్చెను.

౬౦.

ధృతతుషారకణస్య నభస్వతస్తరులతాంగుళితర్జనవిభ్రమాః |

పృథు నిరంతరమిష్ట భుజాంతరం వనితయా౽నితయా న విషేహిరే||

 

ధృతతుషారకణస్య నభస్వతః తరులతాంగుళితర్జనవిభ్రమాః పృథు ఇష్టభుజాంతరం నిరంతరం అనితయా వనితయా న విషేహిరే |

 

సర్వంకష

ధృతేతి | ధృతాః తుషారకణాస్తుహిసశీకరాః యేన తస్య నభస్వతః పవనస్య సంబంధినః -తరులతా ఏవ అంగుళయః - తాభిః యాని తర్జనాని - తాన్యేవ విభ్రమాః విలాసాః - పృథువిశాలం - ఇష్టస్య దయితస్య - భుజాంతరం భుజమధ్యం వక్షస్థలం -నిరంతరం అనితయా గాఢాలింగన మలభమానయేత్యర్థః - ఇణి కర్తరి క్తః వనితయా స్త్రియా - నవిషేహిరే నసోఢాః - విరహిణ్యస్తర్జితా ఇవ నభస్వతో బిభ్యతి ఇతి భావః ॥

 

ధృతతుషారకణస్య = హిమకణములతో కూడిన; నభస్వతః = పవనుడియొక్క; తరులతాంగుళితర్జనవిభ్రమాః = వృక్షములపై వ్యాపించిన తీవెలతో భయపెట్టటం అనే విలాసాలు;   పృథు = విశాలమైన;  ఇష్టభుజాంతరం = ప్రియుని బాహుమూలలను; నిరంతరం = ఎప్పుడూ;  అనితయా = కలుగకుండుటచేత; వనితయా = సుదతులచేత;  న విషేహిరే = విడువబడలేదు;

 

హిమకణాలతో కూడిన మంచుగాలి వృక్షాలను అల్లుకున్న తీవెలను బెదిరిస్తూ భయపెడుతూంది. ఆ కారణాన ముదితలు తమ ప్రియుని విశాలభుజాలను కౌగిలించి పట్టు వీడలేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.