పోస్ట్‌లు

నేను వ్రాసిన మొదటి సంస్కృత శ్లోకం

కస్యాః ముఖం శర్వమనోనిధానమ్ ? ప్రీత్యా త్రినేత్రస్తు కరోతి కిం తాం ? దృష్ట్వా తు తౌ మోదమవాప్యవాన్ కః ? గౌరీముఖం ; చుమ్బతి ; వాసుదేవః పై శ్లోకంలో దోషం చెప్పిన వారికి ఆ దోషపరిహారం చేసే బాధ్యత కలదు . (11 వ త్రిష్టుప్ ఛందంలోని ‘ ఇంద్రవ్రజ ’ అనే వృత్తం. దీని గణాలు ‘ త-త-జ-గగ(గా) ’ లు. తెలుగులో యతిస్థానం 8. ప్రాసనియమం ఉంది. ) ఆ శ్లోకానికి కంది శంకరయ్య గారి అనువాదం. (గురువు గారు, అది నా ప్రయోగం అని గ్రహించలేదు. అయినా మన్నన దొరికింది కాబట్టి సంతోషం) తే.గీ|| ఎవరి ముఖమును హరుఁడు వీక్షించినాఁడు ? ప్రీతి దాని నేమి యొనర్చెఁ ద్రినయనుండు ? పొంచి దానిని వీక్షించి మురిసె నెవఁడు ? గౌరి ముఖమును ; చుంబించెఁ ; గరివరదుఁడు. తెలుగే బావుంది.. మనస్ఫూర్తిగా.

వీఁడటే....

చిత్రం
శ్రీ కృష్ణుడు మొట్టమొదటి సారి పల్లె వదిలి నగరానికి బయలుదేరాడు. కంసుని పిలుపు మీద అక్రూరుని తోడుగా మధురానగరానికి బలరాముని జో డుగా సాగింది పయనం. నగరం చేరాడు. నగరంలో వింతలు విశేషాలు చూసుకుంటూ అన్నదమ్ములు వెళుతున్నారు. ఆ ఊళ్ళో అమ్మాయిలు కూడా అప్పుడే యౌవనంలో అడుగుపెట్టి మిసమిసలాడుతున్న మనవాడిని చూశారు. కం || వీటఁ గల చేడె లెల్లను హాటకమణిఘటితతుంగహర్మ్యాగ్రములం గూటువలు గొనుచుఁ జూచిరి పాటించి విశాలవక్షుఁ బద్మదళాక్షున్. రత్నాలు తాపడం చేసిన ఎత్తయిన బంగారుమేడలమీద బాల్కనీల నుండి గుంపులుగా చేరి ఈ అందమైన కృష్ణు ణ్ణి చూశారు ట. ఇప్పుడే అందిన వార్త .  “ పాటించి ” చూశారుటండి. అంటే కళ్ళప్పగించి కాబోలు! సీ || వీఁడటే రక్కసి విగతజీఁవఁగ జన్నుఁ బాలు ద్రావిన మేటిబాలకుండు | వీఁడటే నందుని వెలఁదికి జగతిని ముఖమందుఁ జూపిన ముద్దులాఁడు ! వీఁడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాఁపరీఁడు! వీఁడటే యలయించి వ్రేతల మానంబు సూఱలాడిన లోకసుందరుండు! గీ || వీఁడు లేకున్న పురమటవీ స్థలంబు వీనిఁ బొందని జన్మంబ...

తిలకబంధము - వేంకటేశ్వరనుతి

చిత్రం
తే. గీ || వేంకటేశ! శరణు! రమా వినుత! శుభద! వేంకటేశ! శమము గూర్పు విబుధవరద! వేంకటేశ! సురభిరూప వేద వేద్య! వేంకటేశ! సురభిరూప వేద వేద్య! తిలకబంధ లక్షణం మధ్యే శ్లిష్టం పదం జ్ఞేయం పార్శ్వయోశ్చ పదద్వయమ్ | కోణయో రక్షరం శ్లిష్టం తిలకం బన్ధసున్దరమ్ ||

కూపబంధం - వాణీస్తుతి

చిత్రం
ఆ. వె || అ వ్యయీనిధాన అమ్బురుహానన అబ్జ పీఠు జాణ అమిత కరు ణఁ నన్ను గావు ము హరిణ విశాలలోచనా నమ్మి గొలుతు ప్రీణనము పనుగొన .

కూపబంధం - గౌరీస్తుతి

చిత్రం
ఆ. వె || అ ద్రి రాజసూన అమ్బురుహానన అ ర్కదీప్తిశోణ అమిత కరుణఁ నన్ను గావు ము హరిణ విశాలలోచనా నమ్మి గొలుతు ప్రీణనము పనుగొన .

కూపబంధం - లక్ష్మీస్తుతి

చిత్రం
ఆ. వె || అబ్ధిరాజసూన అమ్బురుహానన అబ్జనాభు జాణ అమిత కరుణఁ నన్ను గావుము హరిణవిశాల లోచనా నమ్మి గొలుతు ప్రీణనము పనుగొన. చిత్రం :- (ఈ పద్యానికి గుణదోషవిచారణ చేసి, సూచనలు చెప్పి ప్రోత్సహించిన పెద్దలు శ్రీమాన్ నేమాని రామజోగి సన్యాసి రావు గారికి, గురువుగారు చింతారామకృష్ణారావు గారికీ ప్రణామాలు.)

తేటగీతి గర్భిత చంపకమాల

నా మొదటి గర్భకవిత. చం|| కనుగొనఁ జక్కనౌ సిరియె గాదిలి పత్నియు సింహరూపి యై ప్రణతులఁ గాచునా హరికి; వాణియె భార్య మహాత్ములెన్న గా ధునివలె యబ్ధికిన్ శతధృతుండు-విరించికి; సాంబమూర్తి కి న్ననయముఁ గూర్మిగా వపువు నర్ధము గౌరియుఁ వాసి నొప్పె డిన్. గర్భిత తేటగీతి: సిరియె గాదిలి పత్నియు సింహరూపి హరికి; వాణియె భార్య మహాత్ము లెన్న శతధృతుండు విరించికి; సాంబ మూర్తి వపువు నర్ధము గౌరియుఁ వాసి నొప్పె. పై పద్యాలు రెంటికీ "హరికి వాణియె భార్య మహాత్ము లెన్న" అన్న శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన సమస్య మూలం. తేటగీతి గర్భిత చంపక/ఉత్పల మాల వ్రాయడానికి సూచనలు: ౧. మొదట తేటగీతి పద్యంతో ఆరంభించాలి. ౨. మామూలుగా తేటగీతిలో ప్రతిపాదంలోనూ ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు కావాలి. గర్భిత తేటగీతి మాత్రం ప్రతిపాదమూ "న భ భ ర ల" గణాలతో ఉండాలి. ౩. రెండవ గణం "భ" మొదటి అక్షరం చంపక/ఉత్పల మాల తో యతిమైత్రి చెల్లించాల్సిన స్థానం. గుర్తుపెట్టుకోవాలి. ౩. పాదాంతంలో సమాసాలు కూరిస్తే ఇబ్బంది. ఉదా: "కామదహనుడు" - ఇందులో "కామ" పాదం చివర్లో వచ్చి తరువాతి పాదం "ద...