19, జులై 2010, సోమవారం

గృహబంధము

నవరంగము లేదా గృహబంధములో శారద నుతి.

కం||
రాజ వినీరద చికురా!
రాజిత రంజిత సరోజ రాజ విహారీ!
రాజిత స్వరశత మధురా!
రాజ సుపూజిత సురభిత రమ్య శుభకరీ!



5 కామెంట్‌లు:

  1. గృహ నిర్బంధము సంతసంబెవరికౌన్? కీర్తిప్రదంబౌనటుల్
    మహిమోపేత కవిత్వ తత్వమును సన్మాన్యుల్ సదా మెచ్చగా
    గృహ నిర్బంధము చేసినావు.ఘనుడా! కీర్తింతు నీ పాండితిన్.
    కుహనా వాదము లేని కార్య వివశా!కూర్మిన్ ననున్ గాంచుమా!

    రిప్లయితొలగించండి
  2. రవి గారు నమస్కారములు.
    మీ " రాట్న బంధం ,శ్రీ బంధ కందము ,గృహ బంధము " అన్ని చదువుతుంటే ఎంతొ ఆనందంగా ఉంది.నిజానికి ఇంత చక్కటి ఛందస్సులు ఉంటాయని నాకు తెలియనే తెలియదు.మీ అందరి నుంచి తెలుసుకో గలుగు తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అసలు రాయడం తెలిస్తె ఎలాగైనా మలిచి రాయవచ్చు అని మాత్రం తెలుస్తోంది . ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  3. @రాజేశ్వరమ్మ గారు: ఇవి ఛందస్సులు కావండి. మామూలుగా మనకు తెలిసిన జాతి, ఉపజాతి, వృత్తాలనే (కందం, తేటగీతి, ఉత్పలమాల వగైరా) కొన్ని నియమాల ఇలా బంధ కవిత్వంగా కూర్చవచ్చు. బాగా పరిశ్రమ చేస్తే, మీరూ చక్కటి రచనలు చేయవచ్చు. ఆపై పెద్దలు ఉన్నారు సరిదిద్దడానికి.

    నేను చాలా చిన్నవాణ్ణండి. నమస్కారాలు తగవు. :))

    రిప్లయితొలగించండి
  4. ఆశీర్వదించి రవి గారికి ! నన్ను అమ్మగా పిలిచి నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి పండితులకు అమ్మను కాగలటం నా పూర్వ జన్మ సుకృతం.ఇక ఛందస్సు అంటే నా ఉద్దేశ్యం " యతి, ప్రాసలు , గణాలు " అని.అవి కుడా ఛందస్సు కాదేమొ తెలియదు ఇంకో మాట చెప్పనా ? మన బ్లాగులొ చాలా వరకు నేనె పెద్ద అందుకని అందరికి అక్కని " అంటే ఇలా మంచి పండితులకు [ నాకు నచ్చిన తెలుగు ] అమ్మని అక్కని అనుకుంటే ఎంతో గర్వంగా ఆనందం గా ఉంది .మీ బ్లాగులొ కొన్ని చదివాను చాలా బాగున్నాయి. మీ రచనా శక్తి ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని ఈ అమ్మ

    రిప్లయితొలగించండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.