సంస్కృతసౌరభాలు - 15
 ఇప్పటికి  సరిగ్గా ఒక తరం క్రిందటి ప్రజానీకానికి ఆకాశవాణి తమ జీవితంలో ఒక భాగం.  ఆకాశవాణి తో అణుమాత్రం పరిచయం ఉన్న వారికి ఎవరికైనా ఈ క్రింది పద్యం తెలిసి  తీరుతుంది.   కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చంద్రోజ్జ్వలా  న స్నానం న విలేపనం న కుసుమం నాऽలంకృతా మూర్ధజాః |  వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే  క్షీయన్తేऽఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ||   మనిషికి భుజకీర్తులు, చంద్రు నిలా  ఉజ్జ్వలంగా మెరిసే ముత్యాలహారాలు, స్నానం, గంధలేపనాలు, పువ్వులు,  శిరోజాऽలంకరణలూ శోభనివ్వవు. శాస్త్ర సంస్కారము కలిగిన వాక్కు ఒక్కటే అతడికి  శోభ చేకూరుస్తుంది. అన్ని భూషణాలు నశిస్తాయి కానీ వాగ్భూషణం మాత్రమే  నిజమైన భూషణంగా నిలిచి ఉంటుంది.   బాల్యంలో ఒక వ్యక్తి చుట్టూ ఉన్న  సంఘటనలు, చిన్న చిన్న అంశాలు ఎంత చిన్నవైనా జీవితంలో గొప్ప ప్రభావం  చూపిస్తాయి. ఏ ఉత్తమ సంస్కారానికైనా ఎక్కడో ఒక చోట చిన్న బీజం ఉండక తప్పదు.  చాలామంది జీవితాలలో ఈ పద్యం అలాంటి ఉత్తమ సంస్కారబీజం అయి ఉంటుంది. వారి సంస్కారానికి కారణం ఈ బీజం అని మరిచిపోయి కూడా ఉండవచ్చు గాక.    పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వాల్మీకి రామాయణం గురించి  వ్రా...
 
 
