సంస్కృతసౌరభాలు - 9
సీతారాములు sweet nothings చెప్పుకుంటున్నారు. కిమపి కిమపి మందం మందమాసక్తియోగాత్ అవిరళిత కపోలం జల్పతోరక్రమేణ | అశిథిలపరిరంభవాపృతేకైకదోష్ణో రవిదిత గతయామా రాత్రిరేవ(వం) వ్యరంసీత్ || ఆసక్తియోగాత్ = సాన్నిహిత్యంగా మెలగుటవలన అవిరళితకపోలమ్ = ఒకరి చెక్కిలి మరొకరితో కలిపి అక్రమేణ = అసంబద్ధముగా మందం మందం కిమపి కిమపి = మెల్లమెల్లగా ఏదేదో జల్పతోః = గుసగుసలు పోవుచూ అశిథిలపరిరంభ = వీడని కౌగిలిలో వ్యాపృత = కుదిరిన ఏకైక దోష్ణోః = ఒకే చేయికలిగినవారలమైన మనకు అవిదితగతయామా = జాములు తెలియకుండగనే రాత్రి: ఏవం = రాత్రి ఆ విధముగా (రాత్రిః ఏవ = రాత్రి కూడా) వ్యరంసీత్ = గడిచెను. భావం: సీతా! మనమిద్దరం చెక్కిలితో చెక్కిలి చేర్చి, మెలమెల్లగా ఏవేవో మాట్లాడుకుంటూ, క్రమంగా పారవశ్యంతో గుసగుసలు వోతూ, కౌగిలిలో మన ఇద్దరి చేతులు ఒకటై జాములు కూడా తెలియకుండా ఆ రాత్రిని కూడా అలానే గడిపాము. గుర్తున్నదా? అప్పటికి రాముని పట్టాభిషేకం గడిచి ఒక యేడాది అయింది. ఆప్తులు, బాంధవులు వారి వారి ఊళ్ళకు తరలి వెళ్ళారు. తల్లులు జనక మహారాజు నిర్వహించే యజ్ఞకార్యానికై వెళ్ళారు. సీత నిండు గర్భిణి. రాముడు ఆమెను కంటిక...