రవి గారు నమస్కారములు. మీ " రాట్న బంధం ,శ్రీ బంధ కందము ,గృహ బంధము " అన్ని చదువుతుంటే ఎంతొ ఆనందంగా ఉంది.నిజానికి ఇంత చక్కటి ఛందస్సులు ఉంటాయని నాకు తెలియనే తెలియదు.మీ అందరి నుంచి తెలుసుకో గలుగు తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అసలు రాయడం తెలిస్తె ఎలాగైనా మలిచి రాయవచ్చు అని మాత్రం తెలుస్తోంది . ధన్య వాదములు
@రాజేశ్వరమ్మ గారు: ఇవి ఛందస్సులు కావండి. మామూలుగా మనకు తెలిసిన జాతి, ఉపజాతి, వృత్తాలనే (కందం, తేటగీతి, ఉత్పలమాల వగైరా) కొన్ని నియమాల ఇలా బంధ కవిత్వంగా కూర్చవచ్చు. బాగా పరిశ్రమ చేస్తే, మీరూ చక్కటి రచనలు చేయవచ్చు. ఆపై పెద్దలు ఉన్నారు సరిదిద్దడానికి.
ఆశీర్వదించి రవి గారికి ! నన్ను అమ్మగా పిలిచి నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి పండితులకు అమ్మను కాగలటం నా పూర్వ జన్మ సుకృతం.ఇక ఛందస్సు అంటే నా ఉద్దేశ్యం " యతి, ప్రాసలు , గణాలు " అని.అవి కుడా ఛందస్సు కాదేమొ తెలియదు ఇంకో మాట చెప్పనా ? మన బ్లాగులొ చాలా వరకు నేనె పెద్ద అందుకని అందరికి అక్కని " అంటే ఇలా మంచి పండితులకు [ నాకు నచ్చిన తెలుగు ] అమ్మని అక్కని అనుకుంటే ఎంతో గర్వంగా ఆనందం గా ఉంది .మీ బ్లాగులొ కొన్ని చదివాను చాలా బాగున్నాయి. మీ రచనా శక్తి ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని ఈ అమ్మ
అంగదుడు రావణుని వద్దకు సీతను అప్పగించమని రాయబారానికి వచ్చాడు. అంగదుడే ఎందుకు? ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో వాలి రావణుని బంధించి ముప్పుతిప్పలు పెట్టి మూడు సముద్రాలలోముంచాడు. అంతే కాదు ఆ రావణుని తలను తన బాహుమూలల్లో ఇరికించుకుని, తొట్టెలో ఆడుకుంటున్న తన శిశువు అంగదుడికి ఆటబొమ్మలా చూపించాడు. ఆ సందర్భాన ఆ శిశువు ఆ ఆటబొమ్మ (రావణుని తలను) తన చిట్టిపాదాలతో తన్ని ఉన్నాడు. (ఆ శిశువు ఇంకేదైనా చేశాడేమో కూడా. అది తెలీదు.) చిన్నసైజు సీమ ఫాక్షనిజం కథలాంటి ఫ్లాష్ బ్యాక్. ఇంత ఉంది కాబట్టి అంగదుడు వచ్చాడు రాయబారానికి. ఆ సందర్భంలో శ్లోకం. "రే రే రావణః! రావణాః కతి బహూనేతాన్వయం శుశ్రుమః ప్రాగేకం కిల కార్తవీర్యనృపతేర్దోర్దండపిండీకృతమ్ | ఏకం నర్తనదాపితాన్నకవలం దైత్యేంద్రదాసీజనైః ఏకం వక్తుమపి త్రపామహ ఇతి త్వం తేషు కోऽన్యోऽథవా ||" రే రే రావణః; రావణాః = రావణులు; కతి = ఎంతమంది? వయం = మేము; బహూన్ = అనేక పేర్లను శుశ్రుమః = విన్నాను; కార్తవీర్యనృపతేః = కార్తవీర్యుడనే ఓ రాజు చేత; దోర్దండ = బాహువుల చేత; పిండీకృతమ్ = చూర్ణం చేయబడినది; ప్రాక్ ఏకం కిల = మునుపు ఒకటి (ఒక పేరు) అట; ఏకం = మరొకటి...
ముకుందవిలాసః అని ఒక శతకం. మొత్తం అంతా సంస్కృతంలో ఉంది. ముందుమాట - కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు వ్రాశారు. అదీ సంస్కృతంలోనే ఉంది.(ఇక్కడి తాత్పర్యాలు నావి) ఇది ముకుందుని లీలలను స్తుతిస్తూన్న స్తుతి కావ్యం. స్తుతికావ్యం కనుక గొప్ప వర్ణనలు, అనూహ్యమైన ఉపమలు, జిగేలుమనే పోకడలు లేవు. అయితే ఆశ్చర్యం గొలిపేదేమంటే - ఇంత సులభంగా, అనాయాసంగా సంస్కృతం వ్రాయవచ్చా అని ప్రతిశ్లోకమూ స్ఫురింపజేస్తుంది. పుస్తకంలో 7 విధాల విలాసాలు ఉన్నాయి. బాల, ప్రౌఢ,దూత, ఆచార్య, సారథి, లీలాలోల, శరణ్యమని వివిధ ముకుందవిలాసాలు. శ్రీవత్సచిహ్న! అన్న నిర్దేశంతో మంగళకరంగా ఈ శతకం ఆరంభం అవుతుంది. బాలముకుందవిలాసం లో రెండవశ్లోకం చూడండి. కారాగృహం స్వతనుకోమలకాంతిపూరై రాపూరయంత మరవిందదళాయతాక్షమ్ ఆనందఖేదజనకం సకృదేవమాతుః గోపాలబాలకముకుందమహం నమామి. కోమలమైనకాంతులతో కూడిన తన గాత్రపు కాంతితో చెరసాలను నింపుతున్న, తామరపూరేకులవంటి వెడదకన్నులవాడు, పుడుతూనే అమ్మకు దుఃఖాన్ని, ఆనందాన్ని పంచిన - గోపాలబాలకుడైన ముకుందుని నమస్కరిస్తున్నాను. వసంతతిలకం ఇది. (శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం - అన్న వేంకటేశ్వరసుప్రభాతపు కోవ). ఈ బాలముకుందవిలాసంలో...
నేటి ఆఫ్ఘనిస్తాన్ లో కాందహార్ వద్ద బమియాన్ అన్న చోట, చాలాకాలంగా ఎన్నో అడుగులు ఎత్తైన బుద్ధుని విగ్రహం ఉండేది. క్రీ.శ. 2001లో ఈ బుద్ధ విగ్రహాన్ని తాలిబాన్లు అనబడే ముష్కరులు డైనమైట్లు పెట్టి పేల్చేశారు. ప్రపంచమంతా ఈ చర్యను గర్హించింది. ఇలా విగ్రహాన్ని కూల్చెయ్యటం అనేది చాలా మొరటుపద్ధతి. ఇదే పనిని ఒకవేళ ఆంగ్లేయులు చేయదల్చుకుని ఉంటే? వారు ఆ పనిని నాజూకుగా చేయగలరు. వారు ఆ విగ్రహాన్ని కాకుండా, ఆ విగ్రహనిర్మాణానికి మూలకారణమైన సంస్కృతిని, ఆ చరిత్రను, భాషను, సాంప్రదాయాలను నామరూపాల్లేకుండా చేసి ఉండేవారు. బౌద్ధం పాటించే సమాజంతోనే, ఆ బుద్ధవిగ్రహాన్ని ’తమది కాద’నిపించి ఉండేవారు. అదీ ఆంగ్లేయుల గొప్పదనం. నీకు చెందని దాన్ని - నీది అనిపించాలన్నా, నీకు చెందిన దాన్ని - నీవే తిరస్కరించేట్టు చేయాలన్నా - ఆంగ్లేయులు కల్పించుకుంటే చాలు. వారు ఆ విషయం లో సిద్ధహస్తులు. లోకోత్తరఖ్యాతి గడించిన వారు. భారతదేశాన్ని దోచుకోవడమే పరమావధిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశానికి వచ్చిన ఈ ప్రబుద్ధులు వ్రాసిన భారతదేశ చరిత్ర వెనుక - ’తమ దోపిడీ’ ని సమర్థించుకోవడమే ప్రధానమైన కారణం. అంటే "ఒరే భారతీయుడా! నీ దేశాన్ని త...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగృహ నిర్బంధము సంతసంబెవరికౌన్? కీర్తిప్రదంబౌనటుల్
రిప్లయితొలగించండిమహిమోపేత కవిత్వ తత్వమును సన్మాన్యుల్ సదా మెచ్చగా
గృహ నిర్బంధము చేసినావు.ఘనుడా! కీర్తింతు నీ పాండితిన్.
కుహనా వాదము లేని కార్య వివశా!కూర్మిన్ ననున్ గాంచుమా!
రవి గారు నమస్కారములు.
రిప్లయితొలగించండిమీ " రాట్న బంధం ,శ్రీ బంధ కందము ,గృహ బంధము " అన్ని చదువుతుంటే ఎంతొ ఆనందంగా ఉంది.నిజానికి ఇంత చక్కటి ఛందస్సులు ఉంటాయని నాకు తెలియనే తెలియదు.మీ అందరి నుంచి తెలుసుకో గలుగు తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అసలు రాయడం తెలిస్తె ఎలాగైనా మలిచి రాయవచ్చు అని మాత్రం తెలుస్తోంది . ధన్య వాదములు
@రాజేశ్వరమ్మ గారు: ఇవి ఛందస్సులు కావండి. మామూలుగా మనకు తెలిసిన జాతి, ఉపజాతి, వృత్తాలనే (కందం, తేటగీతి, ఉత్పలమాల వగైరా) కొన్ని నియమాల ఇలా బంధ కవిత్వంగా కూర్చవచ్చు. బాగా పరిశ్రమ చేస్తే, మీరూ చక్కటి రచనలు చేయవచ్చు. ఆపై పెద్దలు ఉన్నారు సరిదిద్దడానికి.
రిప్లయితొలగించండినేను చాలా చిన్నవాణ్ణండి. నమస్కారాలు తగవు. :))
ఆశీర్వదించి రవి గారికి ! నన్ను అమ్మగా పిలిచి నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి పండితులకు అమ్మను కాగలటం నా పూర్వ జన్మ సుకృతం.ఇక ఛందస్సు అంటే నా ఉద్దేశ్యం " యతి, ప్రాసలు , గణాలు " అని.అవి కుడా ఛందస్సు కాదేమొ తెలియదు ఇంకో మాట చెప్పనా ? మన బ్లాగులొ చాలా వరకు నేనె పెద్ద అందుకని అందరికి అక్కని " అంటే ఇలా మంచి పండితులకు [ నాకు నచ్చిన తెలుగు ] అమ్మని అక్కని అనుకుంటే ఎంతో గర్వంగా ఆనందం గా ఉంది .మీ బ్లాగులొ కొన్ని చదివాను చాలా బాగున్నాయి. మీ రచనా శక్తి ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని ఈ అమ్మ
రిప్లయితొలగించండి