రవి గారు నమస్కారములు. మీ " రాట్న బంధం ,శ్రీ బంధ కందము ,గృహ బంధము " అన్ని చదువుతుంటే ఎంతొ ఆనందంగా ఉంది.నిజానికి ఇంత చక్కటి ఛందస్సులు ఉంటాయని నాకు తెలియనే తెలియదు.మీ అందరి నుంచి తెలుసుకో గలుగు తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అసలు రాయడం తెలిస్తె ఎలాగైనా మలిచి రాయవచ్చు అని మాత్రం తెలుస్తోంది . ధన్య వాదములు
@రాజేశ్వరమ్మ గారు: ఇవి ఛందస్సులు కావండి. మామూలుగా మనకు తెలిసిన జాతి, ఉపజాతి, వృత్తాలనే (కందం, తేటగీతి, ఉత్పలమాల వగైరా) కొన్ని నియమాల ఇలా బంధ కవిత్వంగా కూర్చవచ్చు. బాగా పరిశ్రమ చేస్తే, మీరూ చక్కటి రచనలు చేయవచ్చు. ఆపై పెద్దలు ఉన్నారు సరిదిద్దడానికి.
ఆశీర్వదించి రవి గారికి ! నన్ను అమ్మగా పిలిచి నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి పండితులకు అమ్మను కాగలటం నా పూర్వ జన్మ సుకృతం.ఇక ఛందస్సు అంటే నా ఉద్దేశ్యం " యతి, ప్రాసలు , గణాలు " అని.అవి కుడా ఛందస్సు కాదేమొ తెలియదు ఇంకో మాట చెప్పనా ? మన బ్లాగులొ చాలా వరకు నేనె పెద్ద అందుకని అందరికి అక్కని " అంటే ఇలా మంచి పండితులకు [ నాకు నచ్చిన తెలుగు ] అమ్మని అక్కని అనుకుంటే ఎంతో గర్వంగా ఆనందం గా ఉంది .మీ బ్లాగులొ కొన్ని చదివాను చాలా బాగున్నాయి. మీ రచనా శక్తి ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని ఈ అమ్మ
ప్రతి తరం తన తదనంతర తరానికి వారసత్వంగా - తమ తరం నాటి అంతశ్చేతన యొక్క సారాంశాన్ని, విలువలను, ఆలోచనామృతపు మీగడతరకలను ఏదో రూపేణా అందిస్తూ రావడం మానవజాతికి సహజాతంగా వచ్చిన నేర్పు. ఈ విధమైన వారసత్వపు ప్రదానం సాహిత్యప్రపంచంలో కూడా ప్రతిబింబిస్తున్నది. దీనికి ప్రధానకారణం - ప్రతితరంలో జన్మిస్తున్న పండితులు, సహృదయులు, అద్భుత విమర్శకులు, కవులు ఇత్యాది. ఈ పరంపరలో ప్రస్తుతం మన కాలానికి చెందిన కవి, సహృదయవిమర్శకులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు. వీరి సాహిత్య వ్యాససంపుటి "వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు, మరికొన్న విశేషాంశాలు" పేరుతో ఇప్పుడు లభిస్తున్నది. ఇటువంటి పుస్తకం, ఇంత నాణ్యతతో, ఒక్క స్ఖాలిత్యము, ముద్రారాక్షసము లేకుండా, చక్కని ప్రింట్ తో వెలువడడం ఒక్కరి వల్లనో, ఇద్దరివల్లనో సాధ్యం అయేది కాదనుకుంటాను. ఈ కృషి వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి అంబ సరస్వతి కరుణాకటాక్షాలు ప్రసాదిస్తుంది. శ్రీ ఏల్చూరి వారి ఈ వ్యాససంకలనాన్ని - ఒక పుల్లెల రామచంద్రుడు గారి వ్యాససంకలనం తోనూ, సంస్కృత సాహిత్యం మీద ఆంగ్లంలో అద్భుత విమర్శలు వెలయించిన శ్రీ రాఘవన్ గారి వ్యాసాలతోనూ పోల్చవచ్చు. బహుశా కొన్ని అంశాలలో ఒ...
రాత్రి పూట ఆకాశంలో సరిగ్గా ఉత్తరదిక్కున సన్నగా, మిణుకుమిణుకుమంటూ ఓ నక్షత్రం ఉదయిస్తుంది. ఆ నక్షత్రం చుట్టూ మిగిలిన నక్షత్రాలన్నీ వలయంగా తిరుగుతూ ఉంటాయి. ఇది ధ్రువనక్షత్రమని ఇదివరకు వ్యాసంలో ప్రస్తావనగా ఒకచోట చెప్పుకున్నాం. ధ్రువం - అంటే స్థిరము, నిశ్చలము. ఈ ధ్రువనక్షత్రాన్ని Polaris (α-Ursa Minor) అని పిలుస్తారు. ధ్రువనక్షత్రం ఉదయించినప్పుడే దానికి క్రిందుగా సప్తర్షి మండలం కూడా కనిపిస్తుంది. దీనిని ఆంగ్లంలో "Big Dipper" అన్నారు. ఈ సప్తర్షులు ఏడుగురని మనకు తెలుసు. వీరిలో ముగ్గురు ఒకే సరళరేఖలో, మిగిలిన నలుగురు కలిసి ఒక పెట్టె/గరిటె/శకటం రూపంలో అమరి ఉండటం మనకు తెలుసు. మండలం ధ్రువ నక్షత్రం క్రిందుగా ఉదయించి రాత్రి గతించి తెల్లవారు ఝాము వేళకు ఆ ధ్రువుని పైకి చేరుకుంటుంది. అప్పుడు ఆ సప్తర్షి మండలం ఎలా ఉంటుందో - మాఘుడనే కవి శిశుపాలవధ కావ్యంలో వర్ణించాడు. స్ఫుటతర ముపరిష్టా దల్పమూర్తేః ధ్రువస్య స్ఫురతి సురమునీనాం మండలం వ్యస్తమేతత్ | శకటమివ మహీయః శైశవే శార్ఞపాణేః చపల చరణకాబ్జ ప్రేరణోऽత్తుంగితాగ్రమ్ || (శిశుపాలవధమ్ - 11. 3) బాల్యంలో శ్రీకృష్ణయ్య తన చిట్టిపాదాలలో శకటాసుర...
ముకుందవిలాసః అని ఒక శతకం. మొత్తం అంతా సంస్కృతంలో ఉంది. ముందుమాట - కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు వ్రాశారు. అదీ సంస్కృతంలోనే ఉంది.(ఇక్కడి తాత్పర్యాలు నావి) ఇది ముకుందుని లీలలను స్తుతిస్తూన్న స్తుతి కావ్యం. స్తుతికావ్యం కనుక గొప్ప వర్ణనలు, అనూహ్యమైన ఉపమలు, జిగేలుమనే పోకడలు లేవు. అయితే ఆశ్చర్యం గొలిపేదేమంటే - ఇంత సులభంగా, అనాయాసంగా సంస్కృతం వ్రాయవచ్చా అని ప్రతిశ్లోకమూ స్ఫురింపజేస్తుంది. పుస్తకంలో 7 విధాల విలాసాలు ఉన్నాయి. బాల, ప్రౌఢ,దూత, ఆచార్య, సారథి, లీలాలోల, శరణ్యమని వివిధ ముకుందవిలాసాలు. శ్రీవత్సచిహ్న! అన్న నిర్దేశంతో మంగళకరంగా ఈ శతకం ఆరంభం అవుతుంది. బాలముకుందవిలాసం లో రెండవశ్లోకం చూడండి. కారాగృహం స్వతనుకోమలకాంతిపూరై రాపూరయంత మరవిందదళాయతాక్షమ్ ఆనందఖేదజనకం సకృదేవమాతుః గోపాలబాలకముకుందమహం నమామి. కోమలమైనకాంతులతో కూడిన తన గాత్రపు కాంతితో చెరసాలను నింపుతున్న, తామరపూరేకులవంటి వెడదకన్నులవాడు, పుడుతూనే అమ్మకు దుఃఖాన్ని, ఆనందాన్ని పంచిన - గోపాలబాలకుడైన ముకుందుని నమస్కరిస్తున్నాను. వసంతతిలకం ఇది. (శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం - అన్న వేంకటేశ్వరసుప్రభాతపు కోవ). ఈ బాలముకుందవిలాసంలో...
ఈ కామెంట్ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగృహ నిర్బంధము సంతసంబెవరికౌన్? కీర్తిప్రదంబౌనటుల్
రిప్లయితొలగించండిమహిమోపేత కవిత్వ తత్వమును సన్మాన్యుల్ సదా మెచ్చగా
గృహ నిర్బంధము చేసినావు.ఘనుడా! కీర్తింతు నీ పాండితిన్.
కుహనా వాదము లేని కార్య వివశా!కూర్మిన్ ననున్ గాంచుమా!
రవి గారు నమస్కారములు.
రిప్లయితొలగించండిమీ " రాట్న బంధం ,శ్రీ బంధ కందము ,గృహ బంధము " అన్ని చదువుతుంటే ఎంతొ ఆనందంగా ఉంది.నిజానికి ఇంత చక్కటి ఛందస్సులు ఉంటాయని నాకు తెలియనే తెలియదు.మీ అందరి నుంచి తెలుసుకో గలుగు తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అసలు రాయడం తెలిస్తె ఎలాగైనా మలిచి రాయవచ్చు అని మాత్రం తెలుస్తోంది . ధన్య వాదములు
@రాజేశ్వరమ్మ గారు: ఇవి ఛందస్సులు కావండి. మామూలుగా మనకు తెలిసిన జాతి, ఉపజాతి, వృత్తాలనే (కందం, తేటగీతి, ఉత్పలమాల వగైరా) కొన్ని నియమాల ఇలా బంధ కవిత్వంగా కూర్చవచ్చు. బాగా పరిశ్రమ చేస్తే, మీరూ చక్కటి రచనలు చేయవచ్చు. ఆపై పెద్దలు ఉన్నారు సరిదిద్దడానికి.
రిప్లయితొలగించండినేను చాలా చిన్నవాణ్ణండి. నమస్కారాలు తగవు. :))
ఆశీర్వదించి రవి గారికి ! నన్ను అమ్మగా పిలిచి నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి పండితులకు అమ్మను కాగలటం నా పూర్వ జన్మ సుకృతం.ఇక ఛందస్సు అంటే నా ఉద్దేశ్యం " యతి, ప్రాసలు , గణాలు " అని.అవి కుడా ఛందస్సు కాదేమొ తెలియదు ఇంకో మాట చెప్పనా ? మన బ్లాగులొ చాలా వరకు నేనె పెద్ద అందుకని అందరికి అక్కని " అంటే ఇలా మంచి పండితులకు [ నాకు నచ్చిన తెలుగు ] అమ్మని అక్కని అనుకుంటే ఎంతో గర్వంగా ఆనందం గా ఉంది .మీ బ్లాగులొ కొన్ని చదివాను చాలా బాగున్నాయి. మీ రచనా శక్తి ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని ఈ అమ్మ
రిప్లయితొలగించండి