వీచిక - 6
అపశంకమంకపరివర్తనోచితాశ్చలితాః పురః పతిముపైతుమాత్మజాః |
అనురోదతీవ కరుణేన పత్రిణాం విరుతేన వత్సలతయైష నిమ్నగాః ||
(శిశుపాలవధము - నాలుగవ సర్గ - 47)
అపశంకం = నిశ్చింతగా, అంకపరివర్తనోచితాః = సహజముగ నొడిని తిరుగాడెడు, ఆత్మజాః = బిడ్డలు పురః = ఇప్పుడు, పతిముపైతుం = మగని చేరుటకునై, చలితాః = వెడలినవి (కాగా), కరుణేన = దుఃఖముతో, అనురోదతీ ఇవ = శోకించుచున్నట్టుగా , పత్రిణాం = పక్షుల, విరుతేన = కూజితములతో, ఏష నిమ్నగాః = ఈ శిఖరములు, వత్సలతః = వాత్సల్యముతో (స్థితాః = ఉన్నవి)
తాత్పర్యము: తన ఒళ్ళో ఆడుకునే చిన్ని పిల్లలైన నదీనదులు పెరిగి పెద్దవై, మగడయిన సముద్రుని దగ్గరకు వెళ్ళిపోతుంటే అక్కడి పక్షులు కరుణతో దుఃఖిస్తుంటే వాత్సల్యంతో వాటిని చూస్తున్నట్టు ఉన్నవి రైవతక పర్వత శిఖరాలు.
నా అనువాదం.
కం ||
ఒడి నడయాడెడు బిడ్డలు
అడుగులిడి మగడు కడలిని యందగ బోవన్
వడిపడి విహగము లోయని
సడులిడినట్టుగ అరిమిలి శైలములుండెన్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.