పద్యసంభాషణ
ఒక సంస్కృతకవికీ అతని మిత్రునికీ సంభాషణ.
"కస్త్వం భోః!" "కవిరస్మి" "కాప్యభినవా సూక్తిః పఠేతామ్"
"త్యక్త్వా కావ్యకథైవ సంప్రతి మయా" "కస్మాదిదం శ్రూయతామ్"
"యః సమ్యగ్వినక్తి దోషగుణయోః సారం స్వయం సత్కవిః
సోऽస్మిన్ భావక ఏవ నాస్త్యథ భవేద్దైవాన్న నిర్మత్సరః."
అతని ఏడుపు తెలుగులో అనువదిస్తే ఇలా ఏడిచింది.
ఉ ||
"నీవెవడోయి?" "నే కవిని". "నిండుగ నొక్కటి కైత జెప్పుమో
యీ?" "విడిపుచ్చినాను కవి యేయను మాటను." "ఎందుకోసమో?"
"భావకుడైన దోషగుణ భావమెఱుంగెడు సత్కవెవ్వడో?
దైవవశంబునట్టి కవి దక్కిన, మచ్చరి గాకనేరడే?"

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.