వక్రోక్తి మంగళాచరణము



రాజానక కుంతలకుడు తన ’వక్రోక్తి జీవితమ్’ అలంకారశాస్త్ర గ్రంథారంభంలో సరస్వతీదేవికి మంగళాచరణం చేస్తున్నాడు.

వందే కవీంద్రవక్త్రేందులాస్యమందిరనర్తకీమ్ |
దేవీం సూక్తిపరిస్పందసుందరాభినయోऽజ్జ్వలామ్ ||

అనువాదము:
గీ ||
వందనమ్ములు సుకవిముఖేందుబింబ
మందిరనివాసినీలాస్యసుందరికిని,
కుంద హసితకు, మధువచః స్పందనంది
తోజ్జ్వలాభినయరసనిష్పందినికిని.

సవరణ:

గీ ||
వందనమ్ములు సుకవిముఖేందుబింబ
మందిరనివాసినీలాస్యసుందరికిని,
కుంద హసితకు, మధువచః స్పందతుషిత
భాసురాభినయరసనిష్పందినికిని.

కామెంట్‌లు

  1. nice!
    నిష్పంది అంటే ఏంటీ? మూలంలో ఉన్న తూగు అనువాదంలో ఇనుమడించింది

    రిప్లయితొలగించండి
  2. naaraayanaswamy gaaru: సిద్ధే నిర్వృత్త నిష్పన్నే ఇత్యమరః. నిష్పన్నము అంటే సిద్ధింజేయు. నిష్పందిని - సిద్ధింపజేయునది.

    చివరి పాదంలో యతిభంగం ఇప్పుడే చూశాను. సరిచేస్తానండి. :)

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Disclaimer

అశోకుడెవరు? - 1

ధ్రువనక్షత్రం - శింశుమారుడు