10, సెప్టెంబర్ 2009, గురువారం

సంస్కృత బోధన, బాలీవుడ్ స్టయిల్లోనట!

’భవతః సమీపే కిమ్ అస్తి?
మమ సమీపే మాతా అస్తి..’

బాలీవుడ్ లో అత్యంత ప్రఖ్యాత డవిలాగు అది. ఇంకా గుర్తుకు రాలేదా? 70 లలో పేరున్న ఇద్దరు మహానటుల మధ్య ఓ సినిమా లో చోటుచేసుకున్నదది. ఆ నటులు - అమితాబ్ బచ్చన్, శశి కపూర్ లని ఈ పాటికి మీకు గుర్తొచ్చేసి ఉండాలి.

ఆ సినిమా పేరు "దీవార్". "తుమ్హారా పాస్ క్యా హై? మేరే పాస్ మా హై" - ఇది హిందీ డవిలాగు.

ఇప్పుడు అహ్మదాబాదులోని, ఏకలవ్య సంస్కృత అకాడెమీ వారు సంస్కృత వ్యాప్తి కోసం ఈ మధ్య ప్రయత్నిస్తున్న పద్ధతి ఇదట.

ఆ సంస్థ ఓ పత్రికను కూడా ప్రచురిస్తున్నదట. దాని ప్రతులు నెలకు 500 కాపీలు అమ్ముడవుతున్నాయిష. 190 మంది సభ్యులున్నారట ఆ సంస్థలు.

ఇక సినిమా డవిలాగులు చూద్దామా?

దీవార్ -

’మమ సమీపే యానం అస్తి, ధనం అస్తి, భవనం అస్తి,సర్వం అస్తి. తవ సమీపే కిం అస్తి? ’

’మమ సమీపే మాతా అస్తి ’

(మేరే పాస్ గాడి హై, బంగళా హై, పైసే హై...తుమ్హారా పాస్ క్యా హై?
మేరే పాస్ మా హై)

షోలే -

’కాలియా, తవ కిం భవిష్యసి?
మహోదయః, మయా తవ లవణం ఖాదితం
ఇదానీం గోలికానం ఖాద ’

(అబ్ తేరా క్యా హోగా, కాలియా?
సర్దార్, మైనే ఆప్ కా నమక్ ఖాయా హై
తో అబ్ గోలి ఖా)

’పంచశతి పంచశతి యోజనం దూరం యదా కశ్యన్ బాలకః రోదతి,
తదా, తస్య మాతా వదతి," వత్సా! శయనం కురు అన్యథా గబ్బరః ఆగమిష్యతి" ’

(పచాస్ పచాస్ కోశ్ దూర్ జబ్ కోయి బచ్చా రోతా హై, తబ్ ఉస్కి మా ఉస్కో
కహతీ హై, సోజా, వర్నా గబ్బర్ ఆ జాయెగా)

**********************************************************

టాలీవుడ్డో?

’హే వీరరాఘవార్యా! తవ గృహం ఆగఛ్ఛామి, తవ ప్రాంగణే ఉత్తిష్టామి. తవ గర్భగృహం ప్రవేశయిష్యామి, త్వాం పౌరుషం అస్తిచేత్, తవ ముఖే మూఛం అస్తిచేత్, తవ జన్మం రాయల సీమ ప్రదేశే అభవత్ ఇతి చేత్, ఆగచ్ఛ! ’

’న తు కృపాణేన హి, పరంతు అవలోకనామాత్రేణైవ వధిష్యామి’

(ఒరేయ్ వీరరాఘవరెడ్డి, మీ ఇంటికొచ్చా, మీ గడపకొచ్చా, మీ నట్టింట్లో కొచ్చా.నీకు పౌరుషముంటే, నీ మూతి మీద మీసం ఉంటే, నిన్ను మీ అమ్మ సీమ లో కని ఉంటే, రారా"

కత్తులతో కాదు, కంటి చూపుతో చంపుతా)

పైన అనువాదంలో తప్పులు ఉంటాయి! మన్నించాలి!

- ఒక్కసారి కమిటయితే నా మాట నేనే విన్ను.
- ఒక్క సారి చెబితే వందసార్లు చెప్పినట్టు.

ఇవి ప్రయత్నించాలనుకునే వాళ్ళకు ఎక్సర్ సయిజు.

- ఇతి వార్తాః

**********************************************************

గూగుల్ లో ఓ సంస్కృత సమూహంలో సభ్యుడయినందుకు నాకు నిన్న ఓ వేగు వచ్చింది. ఆ వేగు సారాంశం అది (మొదటి పేరా, టాలీవుడ్డు మినహా). సంస్కృత భాషా ప్రేమికులకు కోపం వస్తే మన్నించగలరు. దీని వెనుక దురుద్దేశ్యం లేదు. నేను కూడా ఒకప్పుడు సంస్కృత విద్యార్థినే.

4 కామెంట్‌లు:

  1. అహం యది ఏకపర్యాయం సంకల్పం అకుర్వన్, తదనంతరం ఆత్మ సందేశమపి అలక్ష్యం కరోమి|
    మయా ఏకపర్యాయం ప్రవచితం వాక్యం, శత పర్యాయ ప్రవచిత సదృశమ్|

    అన్నట్టు ఆ బాలీవుడ్డు వాక్యాల మీద చర్చలు, వాటి వేగులు మరిన్ని వస్తున్నాయి. వాటిలో ఏవైనా ఉత్సుకత రేకెత్తించేవి ఉంటే, మళ్ళీ రాస్తాను.

    రిప్లయితొలగించండి
  2. హ హ హ, అద్భుతంగా చెప్పారండి. మీ హాస్యం చాలా చక్కగా ఉంది.

    రిప్లయితొలగించండి
  3. భవతా లిఖితా వాక్యాని బహు సుందరాణి | అహ మపి కించిత్ సంస్కృతం జానామి | భవంతం బ్ల్లాగం అహం అద్యైవ దృష్టవాన్ అస్మి | సాధు సాధు |

    రిప్లయితొలగించండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.