ఇంద్రధనుస్సు

ఆ.వె.
పుట్టవెడలి నభోభిత్తి బట్టు శక్ర
కార్ముకపు బెద్ద పలువన్నెకట్లజెఱ్ఱి
దైన నడచెడు కాళ్ళ గుంపనగ గాలి
గార్కొని దిగంతముల వాన కాళ్ళు నడిచె”

ఆముక్తమాల్యద. 4- 89.

ఆముక్త మాల్యదలోని కమనీయమైన పద్యం ఇది.



ఇంద్రచాపం - వానకు పుట్టనుండి బయటకు వచ్చి ఆకాశమనే గోడకు ఎగబ్రాకుతున్న రంగురంగుల కట్ల జెర్రి లాగ ఉన్నది. ఆ కట్లజెఱ్ఱి కాళ్ళలాగా అన్ని దిక్కులకూ వర్షధారలు.

వర్షమొచ్చినప్పుడే కదా, జెర్రులు తమ కలుగుల్లోనించి బయటకు వచ్చేది! అలా ఈ పద్యం సందర్భోచితమై శోభిల్లుతూంది.

ఆ ఇంద్రచాపమే ఈ బ్లాగుకు ప్రేరణ.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Disclaimer

అశోకుడెవరు? - 1

ధ్రువనక్షత్రం - శింశుమారుడు