ఈ బ్లాగ్ లో ప్రచురింపబడిన వ్యాసాలు - ఈ బ్లాగు ఓనర్ వి మాత్రమే కావు. ఇవి అందరివి కూడా. ఈ వ్యాసాలను ఎవరైనా వాడుకోవచ్చు. వారి పేరు పెట్టుకుని ప్రచురించుకున్నా అభ్యంతరం లేదు. 🙂
అంగదుడు రావణుని వద్దకు సీతను అప్పగించమని రాయబారానికి వచ్చాడు. అంగదుడే ఎందుకు? ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో వాలి రావణుని బంధించి ముప్పుతిప్పలు పెట్టి మూడు సముద్రాలలోముంచాడు. అంతే కాదు ఆ రావణుని తలను తన బాహుమూలల్లో ఇరికించుకుని, తొట్టెలో ఆడుకుంటున్న తన శిశువు అంగదుడికి ఆటబొమ్మలా చూపించాడు. ఆ సందర్భాన ఆ శిశువు ఆ ఆటబొమ్మ (రావణుని తలను) తన చిట్టిపాదాలతో తన్ని ఉన్నాడు. (ఆ శిశువు ఇంకేదైనా చేశాడేమో కూడా. అది తెలీదు.) చిన్నసైజు సీమ ఫాక్షనిజం కథలాంటి ఫ్లాష్ బ్యాక్. ఇంత ఉంది కాబట్టి అంగదుడు వచ్చాడు రాయబారానికి. ఆ సందర్భంలో శ్లోకం. "రే రే రావణః! రావణాః కతి బహూనేతాన్వయం శుశ్రుమః ప్రాగేకం కిల కార్తవీర్యనృపతేర్దోర్దండపిండీకృతమ్ | ఏకం నర్తనదాపితాన్నకవలం దైత్యేంద్రదాసీజనైః ఏకం వక్తుమపి త్రపామహ ఇతి త్వం తేషు కోऽన్యోऽథవా ||" రే రే రావణః; రావణాః = రావణులు; కతి = ఎంతమంది? వయం = మేము; బహూన్ = అనేక పేర్లను శుశ్రుమః = విన్నాను; కార్తవీర్యనృపతేః = కార్తవీర్యుడనే ఓ రాజు చేత; దోర్దండ = బాహువుల చేత; పిండీకృతమ్ = చూర్ణం చేయబడినది; ప్రాక్ ఏకం కిల = మునుపు ఒకటి (ఒక పేరు) అట; ఏకం = మరొకటి...
ప్రతి తరం తన తదనంతర తరానికి వారసత్వంగా - తమ తరం నాటి అంతశ్చేతన యొక్క సారాంశాన్ని, విలువలను, ఆలోచనామృతపు మీగడతరకలను ఏదో రూపేణా అందిస్తూ రావడం మానవజాతికి సహజాతంగా వచ్చిన నేర్పు. ఈ విధమైన వారసత్వపు ప్రదానం సాహిత్యప్రపంచంలో కూడా ప్రతిబింబిస్తున్నది. దీనికి ప్రధానకారణం - ప్రతితరంలో జన్మిస్తున్న పండితులు, సహృదయులు, అద్భుత విమర్శకులు, కవులు ఇత్యాది. ఈ పరంపరలో ప్రస్తుతం మన కాలానికి చెందిన కవి, సహృదయవిమర్శకులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు. వీరి సాహిత్య వ్యాససంపుటి "వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు, మరికొన్న విశేషాంశాలు" పేరుతో ఇప్పుడు లభిస్తున్నది. ఇటువంటి పుస్తకం, ఇంత నాణ్యతతో, ఒక్క స్ఖాలిత్యము, ముద్రారాక్షసము లేకుండా, చక్కని ప్రింట్ తో వెలువడడం ఒక్కరి వల్లనో, ఇద్దరివల్లనో సాధ్యం అయేది కాదనుకుంటాను. ఈ కృషి వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి అంబ సరస్వతి కరుణాకటాక్షాలు ప్రసాదిస్తుంది. శ్రీ ఏల్చూరి వారి ఈ వ్యాససంకలనాన్ని - ఒక పుల్లెల రామచంద్రుడు గారి వ్యాససంకలనం తోనూ, సంస్కృత సాహిత్యం మీద ఆంగ్లంలో అద్భుత విమర్శలు వెలయించిన శ్రీ రాఘవన్ గారి వ్యాసాలతోనూ పోల్చవచ్చు. బహుశా కొన్ని అంశాలలో ఒ...
రాత్రి పూట ఆకాశంలో సరిగ్గా ఉత్తరదిక్కున సన్నగా, మిణుకుమిణుకుమంటూ ఓ నక్షత్రం ఉదయిస్తుంది. ఆ నక్షత్రం చుట్టూ మిగిలిన నక్షత్రాలన్నీ వలయంగా తిరుగుతూ ఉంటాయి. ఇది ధ్రువనక్షత్రమని ఇదివరకు వ్యాసంలో ప్రస్తావనగా ఒకచోట చెప్పుకున్నాం. ధ్రువం - అంటే స్థిరము, నిశ్చలము. ఈ ధ్రువనక్షత్రాన్ని Polaris (α-Ursa Minor) అని పిలుస్తారు. ధ్రువనక్షత్రం ఉదయించినప్పుడే దానికి క్రిందుగా సప్తర్షి మండలం కూడా కనిపిస్తుంది. దీనిని ఆంగ్లంలో "Big Dipper" అన్నారు. ఈ సప్తర్షులు ఏడుగురని మనకు తెలుసు. వీరిలో ముగ్గురు ఒకే సరళరేఖలో, మిగిలిన నలుగురు కలిసి ఒక పెట్టె/గరిటె/శకటం రూపంలో అమరి ఉండటం మనకు తెలుసు. మండలం ధ్రువ నక్షత్రం క్రిందుగా ఉదయించి రాత్రి గతించి తెల్లవారు ఝాము వేళకు ఆ ధ్రువుని పైకి చేరుకుంటుంది. అప్పుడు ఆ సప్తర్షి మండలం ఎలా ఉంటుందో - మాఘుడనే కవి శిశుపాలవధ కావ్యంలో వర్ణించాడు. స్ఫుటతర ముపరిష్టా దల్పమూర్తేః ధ్రువస్య స్ఫురతి సురమునీనాం మండలం వ్యస్తమేతత్ | శకటమివ మహీయః శైశవే శార్ఞపాణేః చపల చరణకాబ్జ ప్రేరణోऽత్తుంగితాగ్రమ్ || (శిశుపాలవధమ్ - 11. 3) బాల్యంలో శ్రీకృష్ణయ్య తన చిట్టిపాదాలలో శకటాసుర...
మీరు ఇలా ప్రకటించడం అభినందనీయం. 🙏🏻
రిప్లయితొలగించండి