శిశుపాలవధమ్ ఆరవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (61 - 70)
౬౧.
హినుఋతావపి తాః స్మ భృశస్విదో యువతయః సుతరాముపకారిణి|
ప్రకటయత్యనురాగ మకృత్రిమం స్మరమయం రమయంతి విలాసినః||
స్మరమయం అకృత్రిమం అనురాగం ప్రకటయతి సుతరాముపకారిణి హిమఋతౌ
అపి తాః యువతయః భృశస్విదః విలాసినః రమయంతి స్మ ।
సర్వంకష
హిమఋతావితి । స్మరమయం స్మరాదాగతం - స్మర ప్రయుక్త మిత్యర్థః
- తత ఆగత ఇతి మయట్ ప్రత్యయః - అకృత్రిమం సహజం రాగం ప్రేమ ప్రకటయతి ప్రకటీ కుర్వాణే
తత్కార్యేణ - స్వేదేన ఇతి భావః - ఆతఎవ-సుతరాం ఉపకారిణి - పుంసాం రిరంసౌ
జననాతేభ్యస్సానురాగ ప్రకాశనాచ్చాత్యంతో పకర్తరీ త్యర్థః - ఏనంభూతే హిమఋతౌ హేమంతేపి
- స్వేదసంభావనారహితకాలేపీత్యర్థః - ఋత్యకఇతి సాంహితః ప్రకృతిభావః - భృశం
స్విద్యంతీతి రాగోష్మణే - భృశస్విద ఇతి సాత్త్వికోక్తిః - క్విప్ - హేమంతోపి
రాగిణాం స్వేదహేతురేవ - తద్దేతు రాగహేతుత్వాదితి భావః- తాస్తథావిధాః - యువతయః
విలాసినః ప్రియాన్ - రమయంతి స్మ - హేమంతస్యోద్దీపకత్పాత్ ఇతి పీడాక్షమత్వాద్దీర్ఘః
రాత్రిత్వాచ్ఛ ఉభయేచ్ఛాసదృశ మరమంతేత్యర్థః
స్మరమయం = మన్మథజన్యమైన; అకృత్రిమం = స్వాభావికమైన;
అనురాగం = కాంక్షను;
ప్రకటయతి = వెలిబుచ్చుటకు; సుతరాం =
మిక్కిలి; ఉపకారిణి = సహాయము చేయు; హిమఋతౌ అపి = హేమంత ఋతువులో కూడా; తాః యువతయః = ఆ జవ్వనులు; భృశస్విదః = (సాత్వికభావము
చేత)మిక్కిలి స్వేదము కలవారై; విలాసినః = తమ ప్రియులను; రమయంతి స్మ = ఆనందపరచిరి కదా!
మన్మథజన్యమైన స్వాభావికమైన శృంగారకాంక్షకు మిక్కిలి దోహదం
చేసే ఈ హిమఋతువులో(అంత చలిలో) కూడా జవ్వనులు సాత్వికభావం పెచ్చరిల్లి మిక్కిలిగా
స్వేదాన్ని వెలువరించడమే కాక, తమ ప్రియులను అలరించారు.
౬౨.
కుసుమయన్ ఫలినీరళినీ రవైమదవికాసిభిరాహితహుంకృతిః ।
ఉపవనం నిరభర్త్సయత ప్రియాన్వియువతీర్యువతీశ్శిశిరానిలః ॥
ఉపవనం ఫలినీః కుసుమయన్ మదవికాసిభిరాహితహుంకృతిః అళినీరవైః శిశిరానిలః
ప్రియాన్ వియువతీ యువతీః నిరభర్త్సయత
సర్వంకష
అథ శిశిరం వర్ణయతి - కుసుమయన్నిత్యాది. ఉపవనం వన ఇత్యర్థః
విభక్త్యర్ధేవ్యయీభావః - తృతీయా సప్తమ్యో బహుళమితి వికల్పాదమ్ భావః - ఫలినీః :
ప్రియంగులతాః ప్రియంగుః ఫలినీ ఫలిత్యమరః - కుసుమయన్ కుసుమ వతీః కుర్పన్నిత్యుద్దీపన
సామగ్రీ వర్ణణం -కుసుమాయతే మత్పంత ప్రకృతికాత్ తత్కరోతి తిణ్యంతాల్లబశ్శత్రాదేశః-
ణావిష్ఠవద్భావే విన్మతోర్లుక్ - మదవికాసిభిః మద విజృంభమాణేః -అళినీరవైః
భృంగీఝంకారైః ఆహిత హుంకృతిః కృతహుంకారః - మాధుర్యాదుద్దీపక త్వా దతిశయద్యోతనార్థం
అళినీతి స్త్రీ లింగనిర్దేశః - శిశిరానిలః - ప్రియాన్ - వియువతీః కోపాద్వియుం
జానాః - యాతేశ్శతరిధాతోరువఞాదేశః - ఉగితశ్చేతి జీప్ - యువతీః వధూః - యూనస్తిరితితి
ప్రత్యయః - నిరభత్సన్ యత్ ఆతర్జయత - తర్జ భత్స్యోశ్చౌరాదికయోః అనుదాత్తత్వాదాత్మనేపదం- అత్ర వాయావచేతనే చేతన
ధర్మో నిరభత్సన్ నముత్ప్రేక్షతే - సా చాళినీఝుంకారహుంకారోజ్జీవతేతి రూపక సంకీర్ణా
వ్యంజకా ప్రయోగాద్గమ్యా చ ॥
ఉపవనం = వనప్రాంతములలో; ఫలినీః = ప్రియంగులతలు; కుసుమయన్ = వికసింపజేయుచు; మదవికాసిభిరాహితహుంకృతిః
= మదకారకమైన ఝుమ్మను హుంకృతి గల; అళినీరవైః = తుమ్మెద్ల ఝుంకారనాదము గల; శిశిరానిలః = శిశిర ఋతువు యొక్క
వాయువు; ప్రియాన్ = ప్రియుల; వియువతీ = విరహములో నున్న; యువతీః = యువతులను; నిరభర్త్సయత = భయపెట్టెను.
వనప్రాంతములలో ప్రియంగులతలను వికసింపజేసేది, మదకారకమైన
ఝుమ్మనే నాదాన్ని తేంట్లకు కలిగిస్తూ ఉన్న శిశిరరుతువు యొక్క గాలి ప్రియులయొక్క
విరహంలో ఉన్న యువతులను ప్రణయలోపకారణము చేత భయపెట్టింది.
౬౩.
ఉపచితేషు పరేష్వసమర్థతాం వ్రజతి కాలవశాద్బలవానపి ।
తపసి మందగభస్తి రభీశుమాన్న హి మహాహినుహానికరోభవత్ ॥
కాలవశాత్ బలవానపి పరేషు ఉపచితేషు అసమర్థతాం వ్రజతి హి తపసి
మందగభస్తిరభీశుమాన్ మహాహిమహానికరః న అభవత్ ।
సర్వంకష
ఉపచితేష్వితి || కాలవశాత్ -బలవానపి-పరేషు
శత్రుషు-ఉపచితేషు ప్రవృద్ధేషు సత్సు అసమర్ధతాం దౌర్బల్యం - వ్రజతి-
హి-యస్మాత్ణారణాత్ - తపసి మాఖమాసే-తపా మాఖ ఇత్యమరః - మందగభస్తిః అపటురశ్మిః-
అభిశుమానంశుమాన్ -అభీశు ప్రగ్రహేరశ్మావిత్యమరః - మహతః ఉపచితస్య హిమస్య - హానిం
నాశం కరోతీతి మహాహిమహానికరః -తద్ధేతుర్నాభవత్ । కృఞో హేతుతా చ్ఛీల్య ఇతి హేత్వర్థే
ట ప్రత్యయః. విశేషేణ సామాన్య సమర్థనరూపోర్థాంతర న్యాసాలంకారః |
కాలవశాత్ = కాలప్రభావము చేత;
బలవానపి = బలవంతుడైనా; పరేషు = శత్రువుల; ఉపచితేషు = వృద్ధిలో; అసమర్థతాం = దౌర్బల్యాన్ని;
వ్రజతి = పొందుతాడు; హి = యుక్తమే!; తపసి = మాఘమాసములో; మందగభస్తిరభీశుమాన్ = మందమైన కిరణాలు కలిగిన సూర్యుడు; మహాహిమహానికరః; మహాహిమ = హిమపాతపు రాశులకు; హానికరః =ప్రమాదకారి;
న అభవత్ = కాకపోయెను ।
కాలప్రభావము చేత బలవంతుడైన వాడు కూడా శత్రువుల విషయంలో
అసమర్థుడవుతాడు. అది యుక్తమే! మాఘమాసంలో కిరణాల వేడిమి యొక్క తీవ్రత లేని
దివాకరుడు హిమపాతపు రాశులకు ప్రమాదకారి కాలేకపోయినాడు.
౬౪.
అభిషిషేణయిషుం భువనాని యః స్మరమివాఖ్యత లోధ్రరజశ్చయః |
క్షుభిత సైన్యపరాగ విపాండురద్యుతిరయం తిరయన్నుదభూదిశ ||
క్షుభిత సైన్యపరాగః విపాండురద్యుతిః యః లోధ్రరజశ్చయః భువనాని
అభిషిషేణయిషుం స్మరం అఖ్యత ఇవ అయం దిశః తిరయన్ ఉదభూత్
సర్వంకష
అభిషిషేణయిషుమితి ॥ క్షుభితః - ఉద్భూతః - యస్సైన్యపరాగః
సేనారజః - స ఇవ విపాండర ద్యుతిః శుభ్రవర్ణః -అత ఏవ- యోలోధ్ర రజశ్చయః. భువనాని -
అభిషిషేణయిషుం అభిషేణయితుం- సేనయా అభియాతుమిచ్చు మిత్యర్థః - యత్సేనయాభిగమనమరౌతదభిషేణనమిత్యమరః
సత్యాపపాశేత్యాదినా - సేనాశబ్దాచ్చిణి సనాశం సభిక్ష ఉరిత్యు ప్రత్యయః - స్థాదిషు
అభ్యాసేన చాభ్యా సస్యేతి ధాత్వభ్యాసనకారయోషత్వం-స్మరం - ఆఖ్యాతేవ ఆఖ్యాత వాని
వేత్యుత్ప్రేక్షా - చక్షిఞః ఖ్యానా దేశః - అస్యతి వ క్తి ఖ్యాతిభ్యో
ఞాతిచ్చేరఞారేశః అయం లోధ్రరజశ్చయః - దిశః తిరయన్ తిరస్కుర్వన్ తిరశ్శబ్దాత్
తత్కరోతీతి ణ్యంతాల్లట శ్శత్రాదేశః - ణావిష్ఠవద్బావె టి లోపః ఉదభూత్ ఉద్భూతః॥
క్షుభిత = కల్లోలమైన; సైన్యపరాగః = సేనలధూళి వలే;
విపాండురద్యుతిః = తెల్లగా ప్రకాశించే; యః లోధ్రరజశ్చయః = ఏ లొద్దుగు
పూల పరాగములు కలవో; భువనాని
= జగత్తును; అభిషిషేణయిషుం = సేనతో ముట్టడించు; స్మరం అఖ్యత ఇవ = ప్రసిద్ధుడైన
కాముని వలే; అయం =
లోధ్రపరాగములు; దిశ తిరయన్ = దిశలను ఆచ్ఛాదితము చేస్తూ;
ఉదభూత్ = ఉద్భవించెను;
కల్లోలమైన సేనల దండు కదిలేప్పుడు పుట్టే ధూళిలాగా తెల్లగా
మెరిసిపోయే లొద్దుగుపూల పరాగాలు - ఈ జగత్తును కాముడు తనసేనతో ముట్టడిస్తున్నట్టు, దిశలను
కప్పేస్తూ శిశిరకాలంలో నెలకొన్నాయి.
౬౫.
శిశిరకాలమపాస్య గుణో౽స్య నః క ఇవ శీతహరస్య కుచోష్మణః |
ఇతి ధియాస్తరుషః పరిరేభిరే ఘనమతో నమతో౽నుమతాన్ ప్రియాః ||
శిశిరకాలమపాస్య శీతహరస్య నః కుచోష్మణః క ఇవ గుణః ఇతి ధియా
అతః ప్రియాః అస్తరుషాః నమతః అనుమతాన్ ఘనం పరిరేభిరే ।
సర్వంకష
శిశిరేతి॥ శిశిరకాలం అపాస్య అపహాయ - శీతంహరతీతి శీతహరః. తస్య
హరతేరమద్యమనత్యచ్ ప్రత్యయః- సః అస్మాకం అస్య కుచోష్మణః కుచోష్ణస్య క ఇవ గుణః కిం
ఫలం -సంపాద్యత ఇతి శేషః-గమ్యమాన క్రియాపేక్షయా కాక్వానిర్దేశః
ఇవశబ్లోవాక్యాలంకారే-ఇతిధియా అతోస్మిన్ శిశిరకాలే - సార్వవిభ క్తికస్తసిః ప్రియాః
కాంతాః ఆస్తరుషోని రస్తరోషాస్సత్యః నమతః ప్రణమతః అమమర్తాన్ స్వప్రియాన్ - ఘనం
నిబిడం-పరిరేభిరే ఆక్లిష్టవత్యః - ఇతి ధియేతి సుఖార్థస్య పరిరంభస్య కుచోష్మ
సాఫల్యార్థ త్వముత్ప్రేక్ష్యతే - వ్యంజకా ప్రయోగాత్ గమ్యత్వం చ ।
శిశిరకాలమపాస్య = శిశిరాన్ని వదిలి;(ఒక్క
శిశిర ఋతువులో కాక) శీతహరస్య = చలిని పోగొట్టే; నః = మాకు; అస్య కుచోష్మణః = ఈ పాలిండ్ల
వేడిమి; క ఇవ గుణః =
ప్రయోజనమేమి?; ఇతి ధియా = అను ఆశంకతో; అతః ప్రియాః = ఇప్పుడు
ప్రియురాండ్రు; అస్తరుషాః
= లజ్జను వదిలి; నమతః = తమ యెదుట నమ్రులైన; అనుమతాన్ = ప్రియులను; ఘనం పరిరేభిరే = గాఢముగా కౌగిలించిరి.
ఒక్క శిశిర ఋతువులో చలిని పోగొట్టటానికి తప్ప, ఇంకే
ఋతువులోనూ మా పయ్యెదల వేడిమికి ఏ ప్రయోజనమూ లేదు. ఇట్లు చింతించిన ప్రియురాండ్రు
లజ్జను వదిలి తమ యెదుట నమ్రులైన ప్రియులను గాఢంగా కౌగిలించుకున్నారు.
(వల్లభదేవుని వ్యాఖ్య ప్రకారం ప్రియురాండ్రు ఏ మాత్రం తల
వొగ్గక ప్రియులను కౌగిలించుకున్నారు.)
౬౬.
అధిలవంగమమీ రజసాధికం మలినితాస్సునునోడళతాళినః |
స్ఫుటమితి ప్రసవేన పురో౽హసత్సపది కుందలతాదళతాళినః||
అధిలవంగం సుమనోదళతాళినః అమీ అళినః రజసా అధికం మలినితా పురః సపది కుందలతా దళతా ప్రసవేన స్ఫుటమితి అహసత్ ।
సర్వంకష
అధిలవంగమితి || లవంగేషు అధిలవంగం-
విభక్త్యర్థే అవ్యయీభావః; సుమనసాం పుష్పాణాం దళేషు తలంతి
ప్రతిష్ఠంతీతి సుమనోదళతాళినః - తల ప్రతిష్ఠాయామిత్యస్మాద్ధాతో రాభీష్ణేతాచ్చీల్యే
వాణిః అమీ అళినో మధుపాః రజసా పరాగేణ ఆర్తవేన చ - అధికం మలినితాః మలీమసాః -
పాపినశ్చ కృతాః మలినితా ఇతి హేతోః పురోగ్రే-సపది కుందలతామాఘ్యవల్లీ మాఘ్యం
కుందమిత్య మరః - దళతావిక సతా- ప్రసవేన నిజకుసుమేన. ఆహసత్ జహాస -
స్ఫుటమిత్యుత్ప్రేక్షాయాం - రజస్వలాంగం తారం కామినం సపత్న్యో హసంతీతి భావః -
కుందకుసుమస్య ధావళ్యా ద్దాసత్వేనోత్ప్రేక్షా ||
అధిలవంగం = లవంగముల; సుమనోదళతాళినః = కుసుమపత్రము నాశ్రయించిన; అమీ అళినః
= ఈ తేంట్లు; రజసా =
పరాగము చేత; అధికం =
మిక్కిలి; మలినితా =
నలుపును పొందెను ; స్ఫుటం = నిశ్చయము; ఇతి
= అని; పురః = ఎదుట
గల; సపది = ఇప్పుడు;
కుందలతా = కుందలతయొక్క; దళతా = మొగ్గల; ప్రసవేన = చివురింపుతో; అహసత్ = నవ్వెను;
లవంగపుష్పాలనాశ్రయించిన తేంట్లు భ్రమరాలు వాటి పరాగంతో మరింత
చిక్కని నలుపు రంగును సంతరించుకున్నాయి నిజం అన్నట్టు ఎదుట గల కుందలత తన మొగ్గల
చివురింపుతో ఇదుగో ఇప్పుడు నవ్వుతోంది.
౬౭.
ఆతిసురభిరభాజి పుష్పశ్రియామతనుతరతయేవ సంతానకః |
తరుణపరభృత స్స్వ నం రాగిణామతనుత రతయే వసంతానకః||
అతిసురభి సంతానకః పుష్పశ్రియాం అతనుతరయేవ అభాజి వసంతానకః
తరుణపరభృతః రాగిణాం రతయే స్వనం అతనుత ।
సర్వంకష
అథయమకవి శేష గ్రథన కౌతుకితయా కవిః పునః ద్వాదశభిః
ఋుతూన్వర్ణయన్నా ద్యైశ్చతుర్భిః వసంతం వర్ణయతి -
అతిసురభిరితి || అతిసురభిరత్యంతసుగంధిః - సుతానకః
కల్పవృక్షః.- పుష్పశ్రియాం ప్రసూన సంపదాం - అతనుతరతయా మహత్తర త్వేన - అతను
శబ్దాత్తరబంతాత్ తల్ ప్రత్యయః అభాజీవ అభంజీవేత్యుత్ప్రేక్షా - అధోనమ్ర ఇతి భావః
భంజేశ్చచిణీతి విభాషానలోపః ఉపదావృద్ధిశ్చిణోలుక్ - వసంతస్యానకోవ వసంతానకః వసంతాగమ
దుందుభిరితి రూపకం- తరుణపరభృత స్తరుణ కోకిలః రాగిణాం కామినాం - రతయే రాగవివర్ధనాయ
స్వనం - ఆతనుత - మధురం చుకూజ ఇత్యర్థః ప్రభావృత్తం
అతిసురభి = అత్యంత పరిమళదాయకమైన; సంతానకః
= కల్పవృక్షము; పుష్పశ్రియాం
= కుసుమసంపద యొక్క; అతనుతరయేవ = అతిశయము చేత; అభాజి = విరిగినది; వసంతానకః = వసంతము యొక్క తప్పెట; తరుణపరభృతః = లేకోయిల; రాగిణాం = ప్రణయ అనురక్తుల;
రతయే = శృంగారము కొఱకు; స్వనం = నాదమును; అతనుత = నినదించెను.
అత్యంతపరిమళదాయకమైన కల్పవృక్షము, పూలశోభల
అతిశయముతో భంజనమైనది. వసంతముయొక్క తప్పెట లేకోయిల - ప్రణయజీవుల శృంగారమును హెచు
చేయుటకు తన గానము చేయుచున్నది.
౬౮.
నోజ్ఝితుం యువతిమాననిరాసే దక్షమిష్టమధువాసరసారమ్|
చూతమాళిరళినామతిరాగాదక్షమిష్టమధువాసరసారమ్||
అరం ఇష్టమధువాసరసా అళినామ యువతిమాననిరాసే దక్షం మధువాసరసారం
చూతం అతిరాగాత్ ఉజ్ఝితుం న అక్షమిష్ట
సర్వంకష
నోజ్ఝితుమితి ॥ అరమత్యంతం-ఇష్టేష్వీప్సితేషు - మధుషు
మకరందేషు వాసేవ సతౌ రసోరాగో యస్యాస్సా - ఇష్టమధు వాసరసా - మధుపాన ప్రియే త్యర్థః:
- అతఏవ - అళినామళిః భృంగశ్రేణిః యువతీ మానని రాసే- దక్షం కుశలం - ఉద్దీపకత్వాదితి
భావః - మధు వాసరేషు వసంతదినేషు - సారం శ్రేష్టం - మధువాసరసారం - తత్కాల
శ్లాఘ్యమిత్యర్థః చూతం సహకారం అతిరాగాదతి లౌల్యాత్ ఉజ్ఝితుం హాతుం -నాక్షమిష్ట నా
సహిష్ట - క్షమేర్బౌవాదికార్లు జ్- స్వాగతావృత్తం - ఉక్తం చ !
అరం = అత్యంత ప్రీతికరమైన;
ఇష్టమధువాసరసా = మకరంద రసాన్ని గ్రోలుటకు; అళినామ = తుమ్మెదలశ్రేణి; యువతిమాననిరాసే దక్షం = యువతుల
మానమును భంజించుటకు సమర్థమై; మధువాసరసారం = వసంతకాలపు సారము అయిన; చూతం = మావి
వృక్షాన్ని; అతిరాగాత్ = గొప్ప మోహముతో; ఉజ్ఝితుం - విడచుటకు; న అక్షమిష్ట = ఒప్పలేదు.
తమకత్యంత ప్రీతికరమైన మకరందపానము కొరకు తుమ్మెదలశ్రేణి -
యువతులమానమును భంజించుటకు సమర్థమైన వసంతకాలపు సారభూతమైన మావివృక్షాన్ని గొప్ప
మోహంతో చేరుకుని వదిలి పెట్టుటకు ఇచ్ఛగింపనే లేదు.
౬౯.
జగద్వశీకర్తుమిమాః స్మరస్య ప్రభావనీ కేతనవైజయంతీః |
ఇత్యస్య తేనే కదళీమధుశ్రీః ప్రబావనీ కేతనవైజయంతీః ||
ప్రభావనీ ఇతి మధుశ్రీః జగద్వశీకర్తుం ప్రభౌ అస్య స్మరస్య
ఆనీకే జయంతీః కేతనవైజయంతీః తనవే ఇమాః కదళీ తేనే ।
సర్వంకష
జగదితి || ప్రభావయతీతి ప్రభావనీ
సంపాదయిత్రీ - కర్తరిల్యుట్ - ఞీప్-మధుశ్రీః - వసంత లక్ష్మీః కత్రీన్ జగత్
వశీకర్తుం - ప్రభౌ సమర్థే, అస్య స్మరస్య-ఆనీకే సైన్యే -
జయంతీః జిత్వరీః - కేతన వైజయంతీః ధ్వజపతాకాః - తనవే కరవాణి - తనోతేః ప్రాప్తకాలే
లోట్ - టెరేత్వమిత్యేకారః 'ఏత ఏ' 'ఆడుత్తమస్య
పిచ్చ; ఇతి ఆటి ఆటశ్చ ఇతి వృద్ధిః ఇతి మనీషయేతి శేష:- ఇమాః కదళీః రంభాతరూన్ తేనే
వితస్తార 'కదళీ వారణబుశా రంభామోచాంశు మత్ఫలా; ఇత్యమరః కదలీషు కామ వైజయంతీతోత్ప్రేక్షా- వృత్తముపజాతిః ॥
ప్రభావనీ ఇతి = ప్రభావవంతమైన; మధుశ్రీః = వసంతశోభ; జగద్వశీకర్తుం
= లోకమును వశపర్చుకొనుటకు; ప్రభౌ = సమర్థమై; అస్య స్మరస్య = ఈ మన్మథుని;
ఆనీకే = సైన్యమందు;
జయంతీః = విజయశీలమైన; కేతనవైజయంతీః =
ధ్వజపతాకమును; తనవే
= స్థాపించెదను; ఇమాః = అని; కదళీ =
అరటిబోదెను; తేనే = వ్యాపింపజేసెను..
ప్రభావశీలమైన వసంతశోభ లోకమును వశపర్చుకొనుటకు ఉద్యుక్తమై 'మన్మథుని
సైన్యమందు విజయశీలమైన ధ్వజపతాక నాటెదను గాక' యని అరటిని
లోకమున వ్యాపింపజేసెను.
౭౦.
స్మరరాగమయీ వపుస్తమిస్రా పరితస్తార రవేరసత్యవశ్యమ్ |
ప్రియమాప దివాపి కోకిలే స్త్రీ పరితస్తారరవే రసత్యవశ్వమ్||
అసతి స్మరరాగమయీ తమిస్రా రవేః వపుః పరితస్తార అవశ్యం పరితః
తారరవే కోకిలే రసతి స్త్రీ దివౌ అపి అ-వశ్యం ప్రియంఆప
సర్వంకష
స్మరేతి|| అసతి దుష్టా స్మరేణ కామేన
నిమిత్తేన - యః రాగోరమణేచ్ఛా సఏవ తన్మయీ తమిస్రా తమస్తోమః - 'తమిస్రా తిమిరేరోగే తమిస్రా తు తమస్తతౌ కృష్ణపక్షునిశాయాం చ' ఇతి విశ్వః - రవేః-వపుఃమండలం పరితస్తార ఆవవ్రే - అహని రజనీధియం జనయామాస
ఇత్యర్థః- పరిపూర్వాత్ తృణాతేర్లిట్ - అవశ్యమ్ - సత్యమిత్యర్థః: కుతః -
పరితస్పమంతాత్ - తారరవే ఉచ్చతరధ్వనౌ- కోకిలే రసతి కూజతి పతి ఇత్యుద్దీపక ఉక్తిః-
స్త్రీ స్త్రియ ఇత్యర్థః జాతౌ ఏకవచనం- దివాపి దివసేపి సప్తమర్థే అవ్యయః - వశంగతో
వశ్యః వశం గతః ఇతి యత్ ప్రత్యయః - నవశ్యః తం అవశ్యం - ఆవశం గతమపి ఇత్యర్థః ప్రియం
ప్రేయాంసం - ఆపస్వయమేవాభిససారేత్యర్థః - యదగణయంతమపి ప్రియం దివాపి మానమవిగణయ్య
నిషేధం చోల్లంఘ్య సమగచ్చతతత్సత్యం రాగ తిమిర తిరోహిత భాను మండలా భామిన్య ఇతి
రూపకానుప్రాణితే యమాప్తి క్రియానిమిత్తా పరితస్తరణ క్రియాస్వరూపో ఉత్ప్రేక్షా -
అవశ్యమితి వ్యంజకా ప్రయోగాత్ వాచ్యా ఔపచ్చండసికం వృత్తమ్ ।
అసతి = దోషయుక్తమైన; స్మరరాగమయీ = ప్రణయకాంక్ష గల; తమిస్రా =
అంధకారసమూహము చేత; రవేః
వపుః = సూర్యమండలము; పరితస్తార = కప్పబడినది; (పగటిపూటనే రాత్రి వాతావరణమేర్పడినది అని భావము) అవశ్యం = నిజమే; పరితః = అంతటా; తారరవే = యెలుగెత్తిన; కోకిలే = కోకిలయందు; రసతి (సతి) = కూజితములు ఉండుట వలన; స్త్రీ = యువతులు
(జాతి యందేవకవచనము) దివౌ అపి = పగటిపూటనూ;
అ-వశ్యం = వివశులై; ప్రియంఆప =
ప్రియుని చేరిరి;
దోషభరితమైన ప్రణయకాంక్షగల అంధకారసమూహము చేత సూర్యమండలము కప్పబడినది. నిజమే. అంతటనూ యెలుగెత్తిన కోకిల కూజితముల వలన మత్తులై స్త్రీగణము పగటిపూటనే వివశులై పతులను చేరిరి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.