14, నవంబర్ 2022, సోమవారం

శిశుపాలవధమ్ ఆరవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (31 - 40)

 

౩౧.

జలదపంక్తిరనర్తయదున్మదం కలవిలాపి కలాపికదంబకమ్|

కృతసమార్జనమర్దలమండలధ్వనిజయా నిజయా స్వనసంపదా ||

 

నిజయా స్వనసంపదా కృతసమార్జనమర్దలమండలధ్వనిజయా జలదపంక్తిః ఉన్మదం కలకలాపి కలాపికదంబకం అనర్తయత్ ।

 

సర్వంకష

జలదేతి। నిజయా ఆత్మీయయా-స్వనసంపదా - కృత సమార్జనస్య మార్జనాఖ్య సంస్కారసహితస్య-మర్దల మండలస్య- ధ్వనేర్జయో యయాసా తథోక్తా - సమార్జనం నామ మర్దళానాం ధ్వననార్థం భస్మమృదితాన్నేన పుష్కరలేపనం జలదపంక్తిః - ఉన్మదముత్కటమదం- కలవిలాపి మధురాలాపి - కలాపికదంబకం మయూరబృందం - అనర్తయత్

 

నిజయా  = తమయొక్క; స్వనసంపదా = గర్జనసామర్థ్యము లో; కృతసమార్జనమర్దలమండలధ్వనిజయా; కృతసమార్జన-మర్దల-మండల- ధ్వనిజయా = జరిపిన లయబద్ధమైన డప్పులవాద్యనినాదము లను జయించు మేఘఘర్జన చేత;  జలదపంక్తిః = మేఘమాల;  ఉన్మదం = మిక్కిలి మత్తెక్కిన; కలకలాపి = మధురక్రేంకారనాదము చేయు;  కలాపికదంబకం = నెమళ్ళసమూహమును; అనర్తయత్ = నర్తింపజేసినది ।

 

అకాశమున మేఘగర్జన - స్వసామర్థ్యము చేత మానవులు సంగీతవిశేషముగ జేయు మృదంగలయవిన్యాసములను జయించుచున్నది. అట్టి గర్జన గల మేఘమాల మిక్కిలి మత్తెక్కిన మధురక్రేంకారములు చేయు వనమయూరముల సమూహములను నర్తింపజేసినది.

౩౨.

నవకదంబరజోరుణితాంబరైరధిపురంధ్రి శిలీంధ్ర సుగంధిభిః |

మనసి రాగవతామనురాగితా నవనవా వనవాయుభి రాదధే ||

 

నవకదంబరజోరుణితాంబరైః శిలీంధ్రసుగంధిభిః వనవాయుభిః అధిపురంధ్రి రాగవతాం మనసి నవనవా అనురాగితా ఆదధే ।

 

సర్వంకష

నవేతి! నవకదంబరజోభిః అరుణిత మరుణీకృతం- అంబరమాకాశం యైస్తైః-శిలీంధ్రాణాంకందళికుసుమానాం- యస్సుగంధః సఏషామస్తీతి శిలీంధ్రసుగంధినః తైః -గంధస్యేత్వే తదేకాంత గ్రహణాదరాత్సర్వధనీత్యాదివత్కర్మధారయాదపి ఇని ప్రత్యయాశ్రయణం - కందళ్యాంచ శిలీంధ్రస్స్యా దితి శబ్దార్ణవే - వన వాయుభిః పురంధ్రీషు స్త్రీషు విషయే అధిపురంధ్రి విభక్త్యర్థే అవ్యయీ భావః- రాగవతాం కామినాం - మనసి-నవనవానవ ప్రకారాః ప్రకారే గుణ వచనస్యేతి ద్విర్భావః - కర్మధారయవ ద్బావాత్సు సోలుక్ - అనురాగితా - ఆదదే అనురాగ ఉత్పాదిత ఇతృర్థః।

 

నవకదంబరజోరుణితాంబరైః; నవకదంబరజ = కొత్తగా పూచిన కడిమిపూల పుప్పొడిచేత; అరుణిత = ఎర్రనైన; అంబరైః = ఆకసము తోనూ;  శిలీంధ్రసుగంధిభిః = కందళికుసుమముల సుగంధముతో;వనవాయుభిః = అరణ్యపు గాలులచేత;  అధిపురంధ్రి = స్త్రీల విషయమున;  రాగవతాం = అనురాగమందిన పతుల;  మనసి = మనసునందు;  నవనవా = కొంగ్రొత్త;  అనురాగితా = ప్రణయభావము;  ఆదధే = ఏర్పడినది;

 

మింటకెగసిన క్రొత్తగా పూచిన కడిమిపూల పుప్పొడి యొక్క అరుణిమ చేతనూ, కందళికుసుమముల సుగంధు నిండిన వనవాయువుల చేతనూ స్త్రీల విషయమున అనురాగవంతులైన పురుషుల మనస్సులో కొంగ్రొత్త ప్రణయభావములంకురించినవి.

౩౩.

శమితతాపమపోఢమహీరజః ప్రథమబిందుభిరంబుముచోంభసామ్ |

ప్రవిరళైరచలాంగనమంగనాజనసుగం న సుగంధి న చక్రిరే ||

 

అంబుముచః ప్రవిరలైః అంభసాం ప్రథమబిందుభిః శమితతాపమపోఢమహీరజః సుగంధి అచలాంగనం అంగనాజనసుగం చక్రిరే న న

 

సర్వంకష

శమితేతి || అంబుముచో మేఘాః ప్రవిరలైః- అంభసాం- ప్రథమబిందుభిః శమిత తాపం. ఆపోఢమహీరజః నిరస్తధూళికం - న తు పంకితమితి భావః సుగంధమత్వాత్సేకాదుద్భూత సౌరభం - ఇహతదేకాంతత్వాదండస్వేత్వం అచలాంగణం రైవతకోత్సంగం - 'అంగణంచశ్వరాజిరే' ఇత్యమరః - అంగనాజనస్య సుఖే చ గచ్చత్యస్మిన్నితి సుగమ్- అంగనాజనానాం సుగం సుఖసంచారక్షమమిశ్యర్థః - సుదురోరధికరణే ఇతిగమేడ ప్రత్యయే టిలోపః నన చక్రిరే -  చక్రిరే ఇత్యర్థః ద్వౌ నఞౌ ప్రకృతమర్థం గమయతః ॥

 

అంబుముచః = మేఘముల నుండి;  ప్రవిరలైః =  దూరదూరముగా పడు; అంభసాం ప్రథమబిందుభిః  = తొలకరి వాన నీటి బిందువులచేత;   శమితతాపమపోఢమహీరజః = (పుడమియొక్క) వేడిమి చల్లారిన, అణగిన ధూళికణములచేత;  సుగంధి = తడిసిన మట్టి వాసన చేతనూ;  అచలాంగనం = పర్వతమున నివసించు జనపదస్త్రీల;  అంగనాజనసుగం = అనాయాసమైన నడకను;  న న చక్రిరే = కూర్చినది. ( న న - వ్యతిరేకానికి వ్యతిరేకము - ప్రకృతార్థమగును)

 

మేఘముల నుండి దూరదూరముగా పడు తొలకరి బిందువులు భూతాపమును చల్లార్చి దుమ్మును అడగించినవి. అట్టి నీటి బిందువుల చేతనూ, అడగిన దుమ్ము చేతను,  తొలకరి మట్టివాసన చేతనూ కాయకష్టము చేసికొను పర్వతప్రాంత స్త్రీల నడక సానుకూలమైనది.

౩౪.

ద్విరదదంతవళక్షమలక్ష్యత స్ఫురితభృంగ మృగచ్ఛవి కేతకమ్ |

ఘనఘనౌఘవిఘట్టనయా దివః కృశశిఖం శశిఖండమివ చ్యుతమ్ ||

 

ద్విరదదంతవళక్షం స్ఫురితభృంగమృగచ్ఛవికేతకమ్ ఘనఘనౌఘవిఘట్టనయా దివః చ్యుతం కృశశిఖం శశిఖండమివ అలక్ష్యతే ।

 

సర్వంకష

ద్విరదేతి ॥ ద్విరదదంతవళక్షం గజదంతధవళం -'వళక్షో ధవళోర్జున ఇత్యమరః' - భృంగోమృగ ఇవ భృంగమృగః, తస్యఛవిః. సాస్ఫురితా యస్మిన్ -తధోక్తం-కేతక్యాః పుష్పం కేతకం - 'పుష్పఫలమూలేషు బహుళ మిత్యణోలుకి నాది వృద్ధిః లుక్, తద్ధిత లుకీతి స్త్రీ ప్రత్యయ న్యాపిలుక్ - ఘనఘనౌఘవిఘట్టనయా నిబిడ మేఘసంఘోపఘాతేన-దివః అంతరిక్షాత్ - చ్యుతం - కృశశిఖం సూక్ష్మాగ్రం -శశిఖండమివ అలక్ష్యతే ఇతి ఉత్ప్రేక్షా।

 

ద్విరదదంతవళక్షం = ఏనుగు కొమ్ము వలే స్వచ్ఛమైన;  స్ఫురితభృంగమృగచ్ఛవికేతకమ్; స్ఫురిత = స్ఫురించు; భృంగమృగ = తుమ్మెద (యొక్క నలుపే) మృగముగాగల; చవి =  ప్రకాశమైన(రంగైన); కేతకం = మొగలిపువ్వు (అనునట్టు);   ఘనఘనౌఘవిఘట్టనయా = దట్టముగా కూడిన జలదముల సమూహముచేత కొట్టబడి;  దివః = అంతరిక్షము నుండి; చ్యుతం = రాలిన; కృశశిఖం = సూక్ష్మాగ్రము గల; శశిఖండమివ = నెలవంక అనునట్టు;  అలక్ష్యతే = అగుపించుచున్నది.

 

ఏనుగు కొమ్ము వలే స్వచ్ఛమైనది, మధ్యభాగమున తుమ్మెద చిక్కుకొనుట చేత, ఆ అళి యొక్క నలుపే మృగలాంఛనముగా కలిగినది,  జలదముల సమూహముల రాపిడి చేత దివి నుండి నేల రాలిన వాడియైన కొన గల మొగలి రేకు వలే - నెలవంక తోచుచున్నది.

౩౫.

దళితమౌక్తిక చూర్ణ విపాండవస్స్పురిత నిర్ఝరశీకరచారవః ।

కుటజపుష్పపరాగకణాస్స్ఫుటం విదధిరే దధిరేణువిడంబనామ్ ॥

 

దళితమౌక్తికచూర్ణవిపాండవః స్ఫురితనిర్ఝరశీకరచారవః కుటజపుష్పపరాగకణాః స్ఫుటం దధిరేణువిడంబనామ్ విదధిరే ।

 

సర్వంకష

దళితేతి ॥  దళితమౌక్తికానాం నిష్పిష్టముక్తాఫలానాం. చూర్ణ ఇవ-విపాండవః అతిశుభ్రాః- స్ఫురితాః ఝర్ఝరాః నిర్ఝరాణాం-శీకరాః కణాస్త ఇవ చారవః కుటజపుష్పపరాగకణాః స్ఫుటం- దధిరేణువిడంబనాం దధిచూర్ణానుకారం విడధిరే చక్రిరే- తద్వద్బభూవురిత్యథఃః - పూర్వోపమానద్వయానుప్రాణితే యముపమేతి సంకరః||

 

దళితమౌక్తికచూర్ణవిపాండవః; దళిత = పగులగొట్టబడిన; మౌక్తిక = ముత్యముల; చూర్ణ = పొడి చేత; విపాండవః = స్వచ్ఛమైన;   స్ఫురితనిర్ఝరశీకరచారవః = నీటిప్రవాహపు సూక్ష్మాలబిందువుల వలే ఒప్పారు;  కుటజపుష్పపరాగకణాః = కొండమల్లెపూల పరాగపు ధూళి;  స్ఫుటం = స్పష్టమైన; దధిరేణువిడంబనామ్ = విడగొట్టబడిన పెరుగు కణముల వలే;   విదధిరే = ఆయెను ।

 

ముత్యములు విరిగి చూర్ణములై, ఆ పొడి నీటిప్రవాహపు సూక్ష్మజలబిందువుల వలే ఒప్పుచున్నట్లు కొండమల్లెపూల పరాగపు ధూళి ఎల్లెడల వ్యాపించి సూక్ష్మముగా విడగొట్టబడిన పెరుగు కణముల వలే అగుపించెను.

౩౬.

నవపయఃకణ కోమలమాలతీకుసుమ సంతతి సంతత సంగిభిః |

ప్రచలితోడునిభైః పరిపాండిమాః శుభరజోభరజో౽ళిభి రాదదే ||

 

నవపయఃకణకోమలమాలతీకుసుమసంతతిసంతతసంగిభిః (అత ఏవ) ప్రచలితోడునిభైః అళిభిః శుభరజోభరజః పరిపాండిమా ఆదదే ।

 

సర్వంకష

నవేతి। నవపయఃకణవన్న వోదకబిందువత్ - కోమలానాం మాలతీకుసుమానాం జాతీపుప్పాణాు సంతతిషు-సంతత సంగిభిర్నిరంతరాసక్తైః 'సుమనామాలతీజాతి' రిత్యమరః - అత ఏవ ప్రచలితోడునిభైః పరాగభూషణాత్సంచరన్నక్షత్రకల్పైరితి ఉత్ప్రేక్షా - అళిభిః శుభాత్ రజోభరాత్పరాగ పుంజాత్ -జాతః -శుభ రజోభ రజః-పరిపాండిమా ధవళిమా - ఆదదే స్వీకృత:!

 

నవపయఃకణకోమలమాలతీకుసుమసంతతిసంతతసంగిభిః; నవపయః కణ = నూత్నజలబిందువుల వలే; కోమల = కోమలమైన; మాలతీకుసుమ = జాజిపూల; సంతతి = గుచ్ఛపు; సంతతసంగిభిః = నిరంతర స్పర్శ చేత; (అత ఏవ = ఇంకనూ ) ప్రచలితోడునిభైః = నక్షత్రరాశివలే ప్రకాశించు; అళిభిః = భ్రమరముల చేత;  శుభరజోభరజః = మనోహరమైన పరాగధూళితో కూడిన;  పరిపాండిమా = ధవళిమ;  ఆదదే = స్వీకరింపబడినది.

 

క్రొత్తనీటిబిందువుల వలే కోమలమైన జాజిపూలరాశి యొక్క నిరంతర సంసర్గము చేతనూ, చుక్కలవలే మిణుకుమను భ్రమరముల చేత, అందమైన పరాగధూళితో నిండిన తెలుపుదనము స్వీకరింపబడినది. (తుమ్మెదలు జాజిపూల పుప్పొడిధూళి క్రమ్ముకొని, మింట చుక్కలవలే ప్రకాశించుచున్నవని ఉత్ప్రేక్ష)

౩౭.

నిజరజ: పటవాసమివాకిరద్దృతపటోపమవారిముచాం దిశామ్|

ప్రియవియుక్తవధూజనచేతసామనవనీ నవనీపవనావళిః ||

 

ప్రియవియుక్తవధూజనచేతసాం అన్-అవనీ నవనీపవనావళిః ధృతపటోపమవారిముచాం దిశాం నిజరజః ఇవ పటవాసం అకిరత్.

 

సర్వంకష

నిజేతి|| ప్రియవియుక్త వధూజనచేతసాం-కర్మణిషష్ఠీ-అనవనీ అరక్షణీ-కింతు-హంత్రీత్యర్థః అవతేః కర్మణి ల్యుట్-టి శ్వాత్ జీప్ - నవనీపవనావళిః నవకదంబకాననపంక్తిః ధృతాః పటోపమాః పటకల్పాః - వారిముచో మేఘాః యాభిస్తా:- మేఘపటావృతా ఇత్యర్థః - తాసాం దిశాం-నిజరజః స్వపరాగ ఏవ-పటవాసఃపిష్టాతమివేత్యుత్ప్రేక్షా - పిష్టాతః పటవాసక ఇత్య మరః అకిరదక్షిపత్ -కిరతేః కర్తరిలజ్ సఖీవదితి భావః ॥

 

 ధృతపటోపమవారిముచాం = వస్త్రముల వలే ధరించినట్టు ఉన్న మేఘమాల గల;  దిశాం = దిశలను; ప్రియవియుక్తవధూజనచేతసాం = పతులనెడబాసిన స్త్రీజనములను; అన్-అవనీ = కరుణించని;  నవనీపవనావళిః = నూత్నకదంబపూల పంక్తి;  నిజరజః  = స్వపరాగమును ; పటవాసం ఇవ = సువాసితమైన చూర్ణము వలే వలే;  అకిరత్ = వెదజల్లెను.

 

వస్త్రముల వలే మేఘములను ధరించిన దిశలను- విరహిణులపట్ల దుఃఖదాయిని అయిన నూత్నకదంబపూల సమూహముల పంక్తి తన స్వీయ పరాగమును శోభావృతమైన చూర్ణము పులిమినట్టు వెదజల్లింది.

 

(దిశలు (విరహిణుల్లా) దట్టమైన మేఘాలను చీరలుగా కట్టుకున్నాయి. అడవిలో అంతటా పరుచుకున్న, దయలేని కడిమిపూలు వాటి పరాగాన్ని ఆ దిశలపైన మంగళకరమైన చూర్ణంలా వెదజల్లుతున్నాయి).

౩౮

ప్రణయకోపభృతో౽పి పరాఙ్ముఖాస్సపది వారిధరారవభీరవః|

ప్రణయినః పరిరబ్ధుమథాంగనా వివళిరే వళిరేచిత మధ్యమాః ||

 

ప్రణయకోపభృతః పరాఙ్ముఖాః అపి సపది వారిధరారవభీరవః అథ అంగనాః ప్రణయినః పరిరబ్ధుం వళిరేచితమధ్యమాః వివళిరే ।   

సర్వంకష

ప్రణయేతి || ప్రణయకోపభృతః - అతఏవ పరాఙ్ముఖాః విముఖాః అపి, 'స్వాంగాచ్చోపసర్జనాదసంయోగోపధాది'తి వికల్పాదాకారః-సపది. వారి ధరారవేభ్యః మేఘగర్జితేభ్యః-భీరవః భీతాః స్త్రియః ఇతి శేషః. అనంతరం గర్జితాకర్ణనానంతరమేవ- ప్రణయిసః ప్రియాన్ పరిరబ్ధుమాలింగితుం వళిరేచితాని ఆలింగనార్థమంగ ప్రసరణాత్ త్రివళిరిక్తీకృతాని మధ్యమాన్య వలగ్నాని యాసాంతా స్సత్యః వవళిరే పరివృత్తాః - వలతేర్వకారాదిత్వాత్ 'న శసదదవాదిగుణానాం' ఇ త్యేత్వాభ్యాసలోప ప్రతిషేధః ॥

 

ప్రణయకోపభృతః =  ప్రణయకోపమును వహించిన (అతఏవ = మఱియు) పరాఙ్ముఖాః అపి = పెడమొగము గలవారు అయిననూ; సపది = ఇప్పుడు;  వారిధరారవభీరవః = మేఘఘర్జనచేత భయమందిన; అంగనాః = సుందరాంగులు;  అథ = పిమ్మట; ప్రణయినః = ప్రియులను; పరిరబ్ధుం = కావిలించికొనుటకు;  వళిరేచితమధ్యమాః = నడుము మధ్యభాగమున ముడుతలు గలవారు (ప్రియులు నడుమును అందికొనుటకు అనువుగా గలవారై) వివళిరే = ఉపక్రమించిరి ।   

 

ప్రణయకోపముచేత యెడమొగము వారైన ప్రేయసులు, మేఘఘర్జనకు బీతిల్లి అంతట ప్రియులు తమను కావిలించుకొనుటకు అనువుగా గల నడుముపై వళిత్రయము చేత ప్రియుల పరిరంభమునకు ఉపక్రమించిరి.

 ౩౯

విగతరాగగుణో౽పి జనో(నరో) న కశ్నలతి వాతి పయోదన్నభస్వతి|

అభిహితే౽ళిభిరేవ మివోచ్చకై రననృతే ననృతే నవపల్లవైః ||

 

పయోదనభస్వతి వాతి విగతరాగగుణో౽పి కః జనః(నరః) న చలతి? ఏవం అళిభిః ఉచ్చకైః అననృతే అభిహితే సతి నవపల్లవైః ననృతే ।

 

సర్వంకష

విగతేతి॥ ప్రయోదనభస్వతి మేఘమారుతే వాతి వహతి సతి - నాతేర్లటశ్శత్రాదేశః. విగతరాగగుణో౽పి విరక్తో౽పి  కో నర:- న చలతి? సర్వోపి చలత్యేవేత్యర్థః ఎవం అళిభిః-ఉచ్ఛకైస్తారం-అనృతమసత్యం న భవతీత్యననృతం తస్మైన్న ననృతే సత్యవచనే. అభిహితే సతి నవపల్లవైః - ననృత ఇవనృత్తం కృతమివేత్యుత్ప్రేక్షా-నృత్తేర్భావే లిట్ ।

 

పయోదనభస్వతి = మేఘపు గాలులు; వాతి (సతి) = వీచెడు వేళ; విగతరాగగుణో౽పి = విరక్తుడైన;  కః జనః(నరః) = ఏ మనుజుడు; న చలతి? = చలింపడు? (ఎవరైనా చలిస్తారని భావం)  ఏవం = అట్లు; అళిభిః = తేంట్లచేత;  అననృతే = సత్యవచనము;  అభిహితే సతి = పలుకబడుట చేత; ఉచ్చకైః = ఎత్తుననున్న; నవపల్లవైః = చివురుటాకుల చేత; ననృతే = నృత్యమాచరింపబడినది;

 

"మేఘపు గాలులు వీచే వేళ విరాగి అయిన మనిషి కూడా చలింపకుండా ఉండగలడా?" - అని తుమ్మెదలు పలుకగా - ఎత్తుననున్న చివురుటాకులు నృత్యము చేసినవి.

 

("ఆ మేఘాల నుండి వీచే చల్లని గాలికి విరాగి అయిన మనిషే  అల్లల్లాడిపోడా?" - చిటారుకొమ్మన చివురుటాకుతో అంది తుమ్మెద. నిజమంటూ చివురుటాకులు అల్లల్లాడుతూ నృత్యం చేశాయి.)

౪౦.

అరనుయన్ భవనాదచిరద్యుతేః కిల భయాదపయాతుమనిచ్ఛవః |

యదునరేంద్రగణం తరుణీగణాస్తమథ మన్మథమంథరభాషిణః||

 

అథ అచిరద్యుతేః భయాత్ కిల భవనాత్ అపయాతుం అనిచ్ఛవః మన్మథమంథరభాషిణః తరుణీగణాః తం యదునరేంద్రగణం అరమయన్ 

 

సర్వంకష

అరమయన్నితి ।అథ అచిరద్యుతేః విద్యుతః భయాత్ కిల భయాదివ నతు తథా. కింతు - రాగాదేవేతి భావః కిలేత్యళీకే. భవనాత్ రమణగృహాత్ అపయాతుం నిర్గంతుం-అనిచ్ఛవః - భయవ్యాజాత్తత్రైవ స్థితా ఇతి ఖావః, 'బిందురిచ్ఛు రిత్యుప్రత్యయాంతో నిపాతః మన్మ థేన స్మరేణ - మంధరమలసం భాషంతం ఇతి మన్మథమంథర భాషిణః- కామపరవశా ఇత్యర్థః తరుణీగణాః తం ప్రకృష్ణం యదవ ఏవ నరేంద్రాః - తేషాం గణం- అరమయన్ రమయంతి స్మ-అత్ర భయేన రాగనిగూహనా న్మీలనాలంకారః-మీలనం వస్తునా యత్ర వస్త్వంతరనిగూహనమితిలక్షణాత్ - సోప్యాగంతుకేన భయేన సహజరాగతిరోధానాగాగంతుకేన సహజతిరోధానరూపః।

 

అథ = ఆ సమయంలో; అచిరద్యుతేః = మెఱుపుల యొక్క;  భయాత్ కిల = భయము వల్లనేను! (అన్న సాకుతో) భవనాత్ = రమణగృహము నుండి; అపయాతుం = వెనుకకు మరలుటకు; అనిచ్ఛవః = ఇష్టము లేక;  మన్మథమంథరభాషిణః = కామపరవశులు అయిన; తరుణీగణాః = ప్రేయసీమణుల సమూహము;  తం యదునరేంద్రగణం = యాదవనృపతులను; అరమయన్ = రమింపజేసిరి.

 

అప్పుడు - బయట మెఱుపుల భయముతో అన్న నెపముతో (ప్రణయవాంఛచేత కాదు అను మభ్యపెట్టి) రమణగృహమును వీడక కామపరవశులైన తరుణీమణులు యాదవనృపతులతో శృంగారమున ఆనందింపజేసిరి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.