14, నవంబర్ 2022, సోమవారం

శిశుపాలవధమ్ ఆరవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (21 - 30)

 ౨౧.

అరుణితాఖిలశైలవనా మహుర్విదధతీ పథికాన్ పరితాపినః |

వికచకింశుక సంహతిరుచ్చకై రుదవహద్దవహవ్యవహశ్రియమ్ ॥

 

అరుణితాఖిలశైలవనా ముహుః పథికాన్  పరితాపినః విదధతీ ఉచ్చకైః వికచకింశుకసంహతిః దవహవ్యవహశ్రియం ఉదవహత్

 

సర్వంకష

అరుణితేతి || అరుణితాన్యరుణీకృతాని . అఖిలాని శైలవనాని యయా సా-ము హుః - పథికానధ్వగాన్ విరహిణశ్చ - పరితాపినః సంతాపవతః - విదధతీ- ఉచ్చైరేవోచ్చకైః ఉన్నతాః 'అవ్యయసర్వ నామ్నామక చాక్టరిత్యకచ్ ప్రత్యయః - వికచా వికసితా- యా కింశుక సంహతి పలాశ కుసుమరాశిః సా- దవహవ్యవహశ్రియం దవాగ్నిశోభాముదవహత్ - నిదర్శనాలంకారః|

- ఇతి వసంతవర్ణనమ్.

 

అరుణితాఖిలశైలవనా = పర్వతమున అరణ్యములకు కెంపు రంగును పథికాన్ = బాటసారులను; ముహుః = మరల మరలపరితాపినః = విరహిణుల పట్ల సంతాపవంతులనువిదధతీ = ఒనరించుచూఉచ్చకైః = సానువులందు; వికచకింశుకసంహతిః = వికసించిన మోదుగుపూల సమూహములుదవహవ్యవహశ్రియం = దవాగ్ని యొక్క శోభను; ఉదవహత్ = తాల్చెను.

 

పర్వతభాగమున అరణ్యములకు కెంపు రంగును, బాటసారులకు విరహిణులయెడ సంతాపమును పెంపొందింపజేయుచు, సానువులందు వికసించిన మోదుగుపూల వరుసలు దవాగ్ని వలే ప్రకాశించుచున్నవి.

(ఇంతటితో వసంతవర్ణనము సమాప్తము.)

 ౨౨.

రవితురంగతనూరుహతుల్యతాం దధతి యత్ర శిరీషరజోరుచః |

ఉపయయౌ విదధన్నవమల్లికాశ్శుచిరసౌ చిరసౌరభసంపదః ||

 

యత్ర శిరీషరజోరుచః రవితురంగతనూరుహతుల్యతాం దధతి అసౌ శుచిః నవమల్లికాః చిరసౌరభ సంపదః విదధన్ ఉపయయౌ ।

 

సర్వంకష

అథగ్రీష్మవర్ణణం సమారభతే ||

రవీత్యాది!! యత్రశుచౌ-శిరీషరజసాం రుచః కాంతయః- రవితురంగతనూరుహతుల్యతాం సూర్యాశ్వ రోమసావర్ణ్యం. దధతి-హరిద్వర్ణాః భవంతీత్యర్థః - ఆసౌశుచి గ్రీష్మః -' శుచిశుద్ధే౽నుపహతే శృంగారాషాఢయో స్తథా! గ్రీష్మే హుతవహేపి స్యాదితివిశ్వః  నవమల్లికాః 'పుష్పేజాతీప్రభృతయ స్స్వలింగా ఇశ్యమరః- 'పుష్పఫలమూలేషు బహుళమితి గ్రహణాల్లుప్ - లుపియుక్తవ ద్వ్యక్తివచనే భవతః - చిరచిరావస్థాయినీ - సౌరభ సంపత్ యాసాం తాః - స్థిరగంధా ఇత్యర్థః- విదధత్కుర్వన్నుపయయౌ ప్రాప్తః ।

 

ఇక గ్రీష్మఋతువర్ణనము (౩ శ్లోకములలో)

యత్ర = ఏ వేసవియందు; శిరీషరజోరుచః = దిరిసెన పూవు పరగాపు కాంతులురవితురంగతనూరుహతుల్యతాం = రవి = సూర్యునియొక్క; తురంగ = అశ్వముల; తనూరుహ = రోమముల; తుల్యతాం = సామ్యమునుదధతి = వహించెనో;  అసౌ = ఆయొక్క; శుచిః = గ్రీష్మమునవమల్లికాః = క్రొత్త మల్లెల; చిరసౌరభ సంపదః = సుగంధ సంపదను ఎల్లవేళలవిదధన్ = తాల్చుచూ; ఉపయయౌ = ఏతెంచినది ।

 

ఏ వేసవియందు శిరీషకుసుమముల ఆకుపచ్చని కాంతి, సూర్యాశ్వముల రోమజాలము యొక్క రంగుతో సమానముగా నున్నదో అట్టి గ్రీష్మము క్రొత్తమల్లెల సౌరభమును చిరముగా వహించుచూ ఏతెంచినది.

౨౩

దళితకోమలపాటలకుడ్మలే నిజవధూశ్వసితానువిధాయిని ।

మరుతి వాతి విలాసిభిరున్మదభ్రమదలౌ మదలౌల్యముపాదదే ॥

 

దళితకోమలపాటలకుడ్మలే నిజవధూశ్వసితానువిధాయిని ఉన్మదభ్రమదలౌ మరుతి వాతి (సతి) విలాసిభిః మదలౌల్యం ఉపాదదే ।

 

సర్వంకష

దళితేతి || పాటలాయాఃఅవయవాఃపాటలా:-లుప్ ప్రకరణే- 'పుష్ప ఫలమూలేషు బహుళమితి బహుళ గ్రహణాదలుక్ - తే చ తే కోమలా కుడ్మలాశ్చ దలితాః విభిన్నా:- కోమలపాటలకుట్మలాః యేన తస్మిన్- నిజవధూనాం. శ్వసితం నిశ్వాసం- ఆనువి ధత్తే ఆనుకరోతీతి తథోక్తే - తాదృశీత్యర్థః - ఉన్మదాః- భ్రమంతశ్చలయో యస్మిన్ తస్మిన్ ఉన్మదభ్రమదలౌ  - మరుతి గ్రీష్మానిలే - వాతి వహతి సతి - వాతేర్లట శ్శత్రాదేశః- విలాసిభిః విలాసనశీలైః కామిభిః. 'నౌకషల సేత్యాదినా ఘనుణ్ ప్రత్యయః - మదేన- లౌల్యం చాపల్యం ఉపాదదే స్వీకృతం మత్తైర్జాతమిత్యర్థః ।

 

దళితకోమలపాటలకుడ్మలే; దలిత = విచ్చిన; కోమల = సుకుమారమైన; పాటల = కలిగొట్టు పూవు; కుడ్మలే = మొగ్గ యందు (గలది); నిజవధూశ్వసితానువిధాయిని; నిజవధూ = తన ప్రియురాలి; శ్వసిత = ఊపిరిని; అనువిధాయిని = అనుకరించునది; (మరియు, ఎందులో) ఉన్మదభ్రమదలౌ; ఉన్మద = భ్రమించు; భ్రమదలౌ = తుమ్మెదలు యెగురుట గలదో;(అట్టి) మరుతి = గ్రీష్మకాలపు గాలి; వాతి (సతి) = వీయుచున్న వేళ; విలాసిభిః = విలాసినులమదలౌల్యం = కామవాంఛఉపాదదే = హెచ్చెను.

 

కోమలమైన కలిగొట్టు మొగ్గలను వికసింపజేయునదీ, తన ప్రియురాలి శ్వాసయందు గలది, మరియు తుమ్మెదలను కదల్చునది అయిన గ్రీష్మకాలపు గాలి వీయుచున్న వేళ విలాసుల కామవాంఛ పెట్రెల్లెను.

౨౪

నిదధిరే దయితోరసి తత్క్షణస్నపన వారితుషారభృతస్స్తనాః |

సరసచందన రేణురనుక్షణం విచకరే చ కరేణ వరోరుభిః ||

 

వరోరుభిః తత్క్షణస్నపనవారితుషారభృతస్స్తనాః దయితోరసి నిదధిరే (అపి) చ పాణినా సరసచందనరేణుః అనుక్షణం విచకరే ।

 

సర్వంకష

నిదధిరే ఇతి ॥ వరోరుభిః స్త్రీభిః-తత్క్షణ స్నపనేన సద్యస్స్నానేన వారితుషారభృతో జలశీకరధారిణః 'తుషారౌ హిమశీకరావితి శాశ్వతః' - స్తనా:- దయితోరసి ప్రియవక్షసి - నిదధిరే నిహితాః - తేషాం సంతాపశాంతయే స్నానార్ద్రాంగాని ఏవ ఆలింగన్నిత్యర్థః. కించ కరేణ పాణినా- సరసః ఆర్ద్ర :- చందన రేణుః ఘృష్ట చందన పంకశ్చ అనుక్షణం. విచకరే వికీర్ణః - కిరతేః కర్మణి లిట్ - ఋచ్ఛత్యుతామితిగుణః 'కరేణు కరోరుభిః' ఇతి పాఠస్తు 'ఊరూత్తరపదాదౌపమ్యే' ఇత్యాదినా ఊడ్ ప్రసంగాద్దేయః ( ఇతి గ్రీష్మవర్ణనమ్)

 

వరోరుభిః = ఘనమైన ఊరువులు కలిగిన స్త్రీల చేత; తత్క్షణస్నపనవారితుషారభృతస్స్తనాః; తత్క్షణస్నపన = అప్పటికప్పుడు స్నానమాచరింపగా యేర్పడిన; వారి = జల; తుషారభృత = బిందువులను వహించిన; స్తనాః = పాలిండ్లు;   దయితోరసి = ప్రియుల వక్షస్స్థలములయందునిదధిరే = ఉంచబడెను;  (అపి) చ = మరియు; పాణినా = చేతుల చేత; సరసచందనరేణుః = ఆర్ద్రమైన చందనలేపనము; (వీపుపై) అనుక్షణం = ఎప్పుడున్నూ; విచకరే = పూయబడెను ।

 

గొప్ప ఊరువులు గల ప్రియురాండ్రు అప్పటికప్పుడు స్నానము చేసి వారి స్తనములపై ఏర్పడిన తుషారబిందువులతో ప్రియుల వక్షస్స్తలములను హత్తుకొనిరి. అట్లే ప్రియురాండ్రకు తమ చేతులతో చందనలేపనము గావించిరి.

౨౫

స్ఫురదధీరతటిన్నయనా ముహు ప్రియమివాగళితోరుపయోధరా!

జలధరావళిరప్రతిపాలితస్వసమయా సమయాంజగతీధరం ||

 

స్ఫురదధీరతటిన్నయనా, ముహుః,అగళితా, ఉరుపయోధరా, జలధరావళిఃఅప్రతిపాలితస్వసమయా, జగతీధరం, ప్రియమివ, సమయాత్  

 

సర్వంకష

అధవర్షఋతుమాహ! స్ఫురదితి! ముహుః - స్ఫురతీ - అధీరే చంచలే తటితౌ నయనే ఇవ తటిన్నయనే యస్యాస్సా - ఆగళితాః ఆరిక్తాః - ఊరుపయోధరాః మహా మేఘాః - యస్యాంసా - అస్యత్ర- ఊరూచ పయోధరౌ చ ఊరుపయోధరం - ప్రాణ్యంగ త్వాద్వంగ్వైకవద్బావః - తదగళితం ఆపతితం - యస్యాం సా జలధరావళి ర్మేఘపంక్తిః - ఆత్రజలధరావలేః పయోధరాణాంచ అవయవావయవిభావాత్పృథ్నిర్దేశ:- అప్రతిపాదిత స్వసమయాలనపేక్షిత నిజవేళా సతీ - ఏకత్రయౌగపద్యాత్ అన్యత్రాధైర్యాచ్చే తిభావః - జగతీథరం భూధరం రైవతకం-ప్రియమివ-సమయాత్ సమాగచ్ఛత్ - యాతేర్లజ్ - పయోజగతీశబ్దయోః పచాద్యజంతేన ధరశబ్దేన షష్టీసమాసః - ఆత ఏవ విశేషణమహిమ్నా జలధరావళౌ నాయికాత్వ ప్రతీతేస్సమాసోక్తిః - సతీ ప్రియమి వేత్యుపమ యాంగేన సంకీర్యతే॥

 

స్ఫురదధీరతటిన్నయనా; స్ఫురత్ = వెలుగులీను; అధీర = చంచలమైన; తటిత్ నయనా = మెఱుపులవంటి కన్నులు గలది; ముహుః = ఇంకనూ;

అగళిత =  వర్షింపని  ఉరుపయోధరా = ఘనమైన మేఘములతో కూడినది; (అగళిత = బిగువైన; ఉరుపయోధరా = పెద్దవైన పాలిండ్లు గలది)

అప్రతిపాలితస్వసమయా = (శ్రీకృష్ణస్వామి రాక చేత) సమయమును పాటింపనిది; (మదనతాపము చేత వేళలు పాటింపనిది)

(అయిన) జలధరావళిః = మేఘపంక్తి;, జగతీధరం = రైవతకపర్వతమును; ప్రియమివ = ప్రియుని వలే; , సమయాత్ = సమీపించెను.

 

(వర్షఋతు వర్ణనము ఇది మొదలు ౧౬ శ్లోకముల వరకూ.)

వెలుగులీను చంచలమైన మెఱుపుల చూపులు గలది, సమయము కాకనే శ్రీకృష్ణస్వామి రాక వలన ఏర్పడి, వర్షింపకయున్న మేఘములతో కూడిన మేఘపంక్తి - చంచలమైన మెఱుపు చూపులు గల ఘనమైన పాలిండ్లు గల యువతి వలే సమయాచారమును పాటింపక రైవతకపర్వతమును ప్రియుని వలే కలిసికొన్నది.

 

విశేషము

అభిసారికా నాయికా లక్షణము.

౨౬.

గజకదంబకమేచకముచ్చకై ర్నభసి వీక్ష్య నవాంబుదమంబరే |

అభిససార న వల్లభమంగనా న చకమే చ కమేకరసం రహః ॥

 

నభసి, అంబరే, గజకదంబకమేచకం, ఉచ్చకైః నవాంబుదం, వీక్ష్య, అంగనా, ఏకరసం, కం, వల్లభం, రహః, న చకమే, (తథా) న అభిససార చ?

 

సర్వంకష

గజేతి ॥ నభసి శ్రావణమాసే 'నభాః శ్రావణికశ్చ స ఇత్యమరః'- అంబరే వ్యోమ్ని- గజకదంబకమివ. మేచకం శ్యామలం 'కాలశ్యామల మేచకా' ఇత్యమరః - ఉచ్చ కైరున్నతం నవాంబుదం వీక్ష్య, అంగనాః- ఏక ఏకాయనః- రసో రాగో యస్యతం - ఏ కరసం-తిరస్కృతరసాంతరమిత్యర్థః - కం వల్లభం ప్రియం - రహః ఏకాంతే - న చకమే న కామయతే స్మ - తథా నాభిససార చ -  సర్వవల్లభం సర్వా పి తత్తదంగనా చకమే ఆభిససార చేతి- నవాంబుదస్యోద్దీపకత్వాదశయోక్తి:-ఇహ కామనావూర్వ కత్వాదభిసరణస్య తయోరర్థక్రమబలీయస్త్వ న్యాయేన యమకవశాదాయతపాఠక్రమబోధనే యోజనాత్యాస్యైవ ।

 

నభసి = శ్రావణమాసమందుఅంబరే = ఆకసమునగజకదంబకమేచకం = ఏనుగులగుంపు వలే నల్లనివైనఉచ్చకైః = ఉన్నతమైన; నవాంబుదం = తొలకరి మేఘములనువీక్ష్య = చూచి; అంగనా = యువతి; ఏకరసం = శృంగారరసమునొక్కదానిచే క్రమ్ముకొనబడినదై;, కం వల్లభం = ఏ ప్రియుని; రహః = ఏకాంతమున; న చకమే = చేరుకొనదు? (తథా = ఇంకనూ) న అభిససార చ = అభిసరింపదు?

 

శ్రావణమాసమున మింట ఏనుగులగుంపువలే నల్లనివి, ఉన్నతమైనవి అయిన తొలకరి మేఘములను చూచి యువతి శృంగారము తప్ప ఇతరభావములను వర్జించి, ఏ ప్రియుని చేరికొనదు? ఏల అతనితో అభిసరింపదు?

 

విశేషము;

ఈ శ్లోకమున 'అభిససార న వల్లభమంగనా న చకమే చ కమేకరసం రహః ' - ఇచ్చట యువతి రసావిష్టురాలగుటకు ముందే అభిచరింపబూనుకొన్నదన్నట్టు 'అభిససార' శబ్దము సూచించును. అయిననూ, యమకాలంకారము (  న చకమే చకమేకరసం) కోసం కవి క్రమాన్ని పరివర్తింపజేయుట వలన తద్భిన్నముగా అర్థము చేసికొనదగును.

ఈ శ్లోకము కూడా సమతాగుణభరితము. ఇది మాఘుని పదలాలిత్యానికి మరియొక ఉదాహరణము. ఈ శ్లోకము జయదేవకవిని స్ఫురింపజేయును.

౨౭

అనుయయౌ వివిధోపల కుండలద్యుతివితానక సంవళితాంశుకం |

ధృతధనుర్వలయస్య పయోముచః శబలిమా బలిమానముషో వపుః ||

 

ధృతధనుర్వలయస్య పయోముచః శబలిమా వివిధోపలకుండలద్యుతివితానకసంవళితాంశుకం బలిమానముషో వపుః అనుయయౌ ।

సర్వంకష

అసయయావితి!! ధృతధనుర్వలయస్య ధృతేంద్రచాపమండలస్య - వయోముచో మేఘస్య- సంబంధి-శబలస్య భావశ్శబలిమా చిత్రతా-'పృధ్వాదిభ్యఇమనిజ్వా-వివిధాః నానావర్ణాః- ఉపలా మణయో యయోస్తయోః- కుండలయోః - ద్యుతివితానకేన కాంతిపుంజేన-సంవళితాః మిళితాః ఆంశవో నిజనీలభాసః - యస్యతత్ తథోక్తం - శేషాద్విభాషే త్రికప్రత్యయః - బలిమానముషో బల్యసురాహంకాహరస్య హరేః - వపుః అసుయయౌ అనుచకార తద్వద్భభావిత్యర్థః ఉపమాలంకారః ।

 

ధృతధనుర్వలయస్య = ఇంద్రచాపము కలిగిన; పయోముచః = మేఘము యొక్కశబలిమా = వర్ణవైచిత్రి; వివిధోపలకుండలద్యుతివితానకసంవళితాంశుకం; వివిధ = పలురకముల; ఉపల = మణుల; కుండల = కుండలముల; ద్యుతివితానక = కాంతిపుంజముల; సంవళిత = మిశ్రితమైన; అంశుకం = కిరణములనుబలిమానముషో = బలి అను రక్కసుని అహంకారమును నిర్జించిన వామనునివపుః = గాత్రమునుఅనుయయౌ = పోలుచున్నది.

 

మేఘము యొక్క ఇంద్రచాపము యొక్క వర్ణవైచిత్రి - వివిధమణులకుండలముల కాంతిపుంజముల కిరణముల చేత మిశ్రితమై, బలిరక్కసుని అహంకారమును నిర్జించిన వామనుని శరీరమును అనుసరించుచున్నది.

విశేషము

ఇక్కడ మేఘము చిక్కగా గాఢంగా నీలంగా ఉంది. ఇది బలి రాక్షసుని అహంకారానికి పోలిక.

హరివిల్లు - రంగురంగులతో వామనుని దేహంతో పోలిక.

రెండున్నూ ఉపమాలంకారాలు.

౨౮

ద్రుతసమీరచలైః క్షణలక్షితవ్యవహితా విటపైరివ మంజరీ |

నవతమాలనిభస్య సభస్తరోరచిరరోచిరరోచత వారిదైః ||

 

ద్రుతసమీరచలైః, వారిదైః, క్షణలక్షితవ్యవహితా అచిరరోచిః; (ద్రుతసమీరచలైః) విటపైః (క్షణలక్షితవ్యవహితా) నవతమాలనిభస్య నభస్తరోః మంజరీ ఇవ అరోచత ।  

సర్వంకష

ద్రుతేతి || ద్రుతసమీరేణ శీఘ్రమారుతేన-చలైః వారిదైః క్షణం లక్షితా చ వ్యవహితా చ క్షణలక్షితవ్యవహితా - క్షణికావిర్భావతిరోధానేత్యర్థః - స్నాతాసులిప్తవత్ - పూర్వ కాలైక ఇత్యాదినా నిత్య సమాసః- అచిరం రోచిర్యస్మాస్సా. ఆచిరరోచిః విద్యుత్ - ద్రుత సమీర చలైః విటపైశ్శాఖాభిః క్షణలక్షితవ్యవహితా నవతమాలనిభస్య నవతమాలేన సదృశస్య - తద్వన్నీలస్యేత్యర్థః- నిత్యసమాసః- సభస్తరురివ- తస్య నభస్తరోః మంజరీగుచ్ఛ ఇవ- అరోచత ఇత్యుపమాలంకారః - ఆత్రనభస్తరో ర్నభశ్రేష్ఠస్యేతి వ్యాఖ్యానాత్ తరుశబ్దస్య వ్యాఘ్రాదివత్ శ్రేషార్థ గోచరత్వాత్తమాల శబ్దేన విశేషవాచినా తన్నీలసామాన్యేన పౌనరుక్త్యమితి వల్లభః తమాలశబ్దస్యేంద్రనీలాదివన్న్యైల్యమాత్రోపమానత్వాత్తరుశబ్దస్య స్వార్థవృత్తిత్వేపి న పౌనరు క్త్యమిత్యన్యే ।

 

ద్రుతసమీరచలైః = ఝంఝామారుతము చేత చలించిన; వారిదైః = మేఘముల చేతక్షణలక్షితవ్యవహితా = లిప్తపాటున పుట్టి నశించినట్లున్న; అచిరరోచిః = మెఱుపు; (అపి చ = ఇంకనూ)

(ద్రుతసమీరచలైః = ఝంఝామారుతము చేత చలించిన) విటపైః = కొమ్మలచేత; (క్షణలక్షితవ్యవహితా = లిప్తపాటున పుట్టి నశించినట్లున్న;) నవతమాలనిభస్య = కానుగు చెట్టు కాంతి వలే నల్లనిదై; నభస్తరోః = అంతరిక్షమను చెట్టు యొక్క; మంజరీ ఇవ = పూగుత్తి వలేఅరోచత = ప్రకాశించెను.

 

తీవ్రమైన గాలి చేత చలించిన మేఘములు, ఆ మేఘముల మధ్య క్షణమాత్రమున పుట్టి కనుమరుగవుతున్న మెఱుపులు - అదే గాలిచే లిప్తపాటున గోచరించు చలించిన కొమ్మలు గల కానుగు చెట్టు లా నల్లని అంతరిక్షమనే చెట్టుకు పూచిన పూగుత్తి లా మెరుస్తున్నవి.

 

విశేషము

ఉపమాలంకారము.

నభస్తరోః = నభస్సు అనే చెట్టు యొక్క అని అర్థం. అదివరకే నవతమాల అన్న చోట (తమాల = కానుగు) కానుగు చెట్టును ప్రస్తావించటం జరిగింది. అచ్చట్ తమాల శబ్దం అంతరిక్షపు నీలకాంతికి ఉపమగా ఉపయోగించబడింది.

క్రూరమృగం - అంటే క్రూరజంతువు అని అర్థం. అయితే విశేషార్థం కోసం వ్యాఘ్రం అని వాడటం ఉంది.

అట్ల వ్యాఘ్రం అనే శబ్దాన్ని శ్రేష్ఠార్థంలో ఉపయోగించిన తీరునే నభస్తరోః - నభస్సు అనే వృక్ష'విశేషాన్ని' ఉద్యోతించాడు కవి.

తమాల - చీకటిచెట్టు (సామాన్యార్థం), నభస్తరోః = నభస్సు అనే  చెట్టు (విశేషార్థం) - ఇలా చెట్టును రెండుసార్లు పేర్కొన్నందున ఇది పునరుక్తి దోషమని వల్లభుడనే వ్యాఖ్యాత పేర్కొన్నాడట!

 

అయితే తమాల శబ్దప్రస్తావనను నీలకాంతి కోసం, తరు వృక్షాన్ని కేవలం నభస్సుతో ఉపమించటం కోసం కవి ఉపయోగించాడని, అందువలన ఇది దోషం కాదని ఇతర వ్యాఖ్యానకారులు అన్నారట!

౨౯

పటలమంబుముచాం పధికాంగనా సపది జీవితసంశయమేప్యతీ!

సనయనాంబుసఖీజనసంభ్రమాద్విధుర బంధురబంధుర మైక్షత ||

 

పథికాంగనా సపది జీవితసంశయమేష్యతీ సనయనాంబుసఖీజనసంభ్రమాద్విధురబంధుః అంబుముచాం పటలం అబంధురం ఐక్షత ।

 

సర్వంకష

పటలమితి! పదికాంగనా కాచిత్ ప్రోషిత భర్తృకా-అతఏవ- సపది-జీవితసంశయం మరణం ఏష్యతి నిశ్చిత మరణేత్యర్థః -  'ఆచ్ఛీనద్యోనుమ్' ఇతి వికల్పాన్నుమభావః- అత ఏవ-సనయనాంబో స్సబాష్పస్య సఖీజనస్య సంభ్రమాత్ సంక్షోభాత్- విధురబంధుః సంభ్రమదర్శనాద్విహ్వలబంధుజనా సతీ అంబుముచాం పటలం అబంధురమశోభనం- సదైన్యరోషమితియావత్ - ఐక్షత - ఈక్షతే స్మ - లజ్ ఆటశ్చేతివృద్ధిః - ఇహ విరహవేదనాక్షమాయా నాయికాయాః మరణ సాధన మేఘపటలావేక్షణవర్ణనాయాం తదుద్యోగలక్షణా మరణావస్థా ఉక్తా-సా హి ద్వివిధా - తదుద్యోగస్తశ్చేష్టా ఇత్యాహుః 'దృజ్ మన స్పంగసంకల్పో జాగరః కృశతారతిః హ్రీ త్యాగోన్మాదమూర్ఛాం తాఇత్యనంగ దశాదశ - ఇశ్యవస్థా సంగ్రహః అత్రాప్యేకస్మాదక్షరాద్వాభ్యాం త్రిభ్యశ్చపరతో క్షర త్రయావృత్తి లక్షణం యనుక త్రయం సంసృష్టం ద్రష్టవ్యం!

 

పథికాంగనా = ఒకానొక ప్రోషితభర్తృక (భర్త చేత త్యజించబడిన నాయిక); సపది = ఇప్పుడుజీవితసంశయమేష్యతీ = మరణాసక్తురాలైనదిసనయనాంబుసఖీజనసంభ్రమాద్విధురబంధుః; సనయన = నయనములలో; అంబు = కన్నీరు నిండి; సఖీజన సంభ్రమాత్ = చెలికత్తెల నిశ్చేష్టత వలన; విధురబంధుః = దీనులైన బంధుజనము గలది; అంబుముచాం = = మేఘముల;   పటలం = రాశినిఅబంధురం = దీనము, రోషముల చేతఐక్షత = చూచినది.

 

ఒకానొక ప్రోషితభర్తృక శ్రావణమాసమునందు మరణవాంఛ కలిగినదై, కన్నీరునిండిన నయనములను చూచిన చెలికత్తెల మనమున నిశ్చేష్టత చేత దీనులైన బంధుజనము కూడగా, మేఘములరాశిని దీనత్వము రోషత్వము నిండిన మనముతో చూచినది.

 

విశేషములు

ఈ శ్లోకములో -

"ప"టలమంబుముచాం "ప"థికాంగనా - ఏకాక్షర ఆవృత్తి (ప)

విధుర బంధుర బంధుర - ఇచ్చట అక్షర ద్వయ ఆవృత్తి. (ధుర)

ఇట్లు యమకము.

నాయిక విరహవేదనసాధనముగా శ్రావణమేఘపటలము వర్ణింపబడి, ఆ విరహవేదనయొక్క ఉద్యోగ సాధనముగా మరణము పేర్కొనబడినది.

విరహవేదనలో ౧౦ దశలు.

౧. చూచుట ౨. మనస్సు పోవుట ౩. కోరిక ౪. సంకల్పము ౫. నిద్రలేమి ౬. కృశించిపోవుట ౭. ఆశ లేకుండుట ౮. లజ్జను త్యజించుట ౯. ఉన్మాదము ౧౦. మరణము (మూర్ఛ)

ఇందులో నాయిక చివరిదశను చేరుకొనుట ఈ శ్లోకమున వస్తువు.

౩౦.

ప్రవసత స్సుతరా ముదకంపయద్విడళ కందళ కంపనలాలితః।

నమయతి స్మ వనాని మనస్వినీజనమనో నమనో ఘనమారుతః ॥

 

విదళకందళకంపనలాలితః మనస్వినీజనమనోనమనః ఘనమారుతః వనాని నమయతి స్మ ప్రవసతః సుతరాం ఉదకంపయత్

 

సర్వంకష

ప్రవసత ఇతి | కందళీ భూమికందళీ - 'ద్రోణపర్ణీ స్నిగ్గకందః కందళీ భూమికందళీ' ఇతి శబ్దార్ణవః-తస్యాః పుష్పాణి కందళాని 'ఫలే లుగి'త్యణో లుక్ విదళానాం వికచానాం కందళానాం కంపనేనావధూననేన- లాలిత ఉపస్కృతః-మనస్వినీజనస్య. మనసాం-నమనః నమయితా-మానినీ మానభంజన ఇత్యర్థః - కర్తరిల్యుట్ ఘనమారుతో మేఘవాయుః వనాని నమయతి స్మ । ప్రవసతః ప్రోషితాన్ - సుతరాం ఉదకంపయత్ ఉద్వేజిత వాన్ -మనస్వినీమానమర్దనస్య వన నమనం ప్రోషితకంపనం వా కియదితి భావః ।

 

విదళకందళకంపనలాలితః; విదళ = మొగ్గతొడిగిన; కందళ = కందళపుష్పములను ; కంపన = చలింపజేయుటకు; లాలితః = కూర్చబడినది; మనస్వినీజనమనోనమనః; మనస్వినీజన = మానినుల; మనోనమన = మనస్సును భగ్నము చేయునది; (అయిన)ఘనమారుతః = చల్లని గాలి; వనాని = అరణ్యములను; నమయతి స్మ = ఆహ్లాదపర్చినది; ప్రవసతః = విరహులను; సుతరాం = మిక్కిలి; ఉదకంపయత్ = ఉద్వేగభరితము చేసినది.

 

వికసించిన కందళపుష్పములను ఊగిసలాడించునది మానినుల మనస్సును భంజించునది అయిన మేఘముల నుండి వీయు గాలి వనములను ఆహ్లాదపర్చినది, విరహులను మిక్కిలి ఉద్వేగపర్చినది.

 

విశేషములు -

 

కందళము అంటే వ్యాఖ్యానకారుడు శబ్దార్ణవాన్ని చెప్పి - ద్రోణపర్ణి, భూకందళి అని పేర్కొన్నాడు.

అరటిపువ్వు లేదా పుట్టగొడుగు (వచ్చే శ్లోకంలో శిలీంద్రం అని పేర్కొనబడింది కనుక. శిలీంద్రం అంటే పుట్టగొడుగు) అని తోస్తుంది.

అయితే అవి కావు. కందళం అంటే - Crinum Viviparum అనే శాస్త్రీయనామం గల పువ్వు. ఈ పుష్పం పొదల్లో పెరుగుతుంది. దీని రేకులు కొంచెం గులాబి రంగులో ఉంటాయి.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.