14, నవంబర్ 2022, సోమవారం

శిశుపాలవధమ్ ఆరవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (11 - 20)

 ౧౧.

ఇదమపాస్య విరాగి పరాగిణీరలికదంబకమంబురుహాం తతీః ।

స్తనభరేణ జితస్తబకానమన్నవలతే వలతే౽భిముఖం తవ ॥

 

స్తనభరేణ, జితస్తబకనమన్నవలతే, (అత ఏవ) ఇదం, విరాగి, అలికదంబకం, పరాగిణీః, అంబురుహాం, తతీః, అపాస్య, తవ, అభిముఖం, వలతే 

 

సర్వంకష

అథకశ్చిత్ స్వయంగ్రహాశ్లేష సుఖార్థం ప్రియామళి పాత వ్యాజేన భత్సయన్ త్రిభిః కులకేనాహ ॥ ఇదమితి | స్తనభరేణ సాధనేన-జితాస్తబకాభ్యాం ఆనమంతీ. నవలతా యయాసా- తథోక్తా. తస్యాస్పంబుద్ధిః హేజితస్తబకానమన్నవలతే- స్తబకా నమన్న వలలో పమే ఇత్యర్ధః- అతఏవ- ఇదం విరాగి విరక్తిమత్ - అళికదంబకం - పరాగిణీః పరాగవతీరితి విరక్తిహేతుః - అంబురుహాం తతీ: అపాస్య- తవ అభిముఖం - వలతే చలతి- విశేషలతా భ్రమాదితి భావః- తథా భ్రాంతిమదలంకారో వ్యజ్యతే||

 

స్తనభరేణ = నీ పయోధరాల భారంతోజిత-స్తబక-నమన్-నవలతే;జిత = జయించిన; స్తబక = పూలగుత్తి గల; నమన్ = వంగిన; నవలతే = క్రొత్త తీవె గలదానా!  (అత ఏవ) ఇదం = ఈ; విరాగి = (కమలాలపై)విరక్తి పొందిన; అలికదంబకం = తుమ్మెదలగుంపు; పరాగిణీః = పుప్పొడితో నిండిన; అంబురుహాం తతీః = తామరపూల వరుసను; అపాస్య = విడచి; తవ = నీ; అభిముఖం = ముఖము వైపుకు; వలతే = కదలుచున్నవి.

 

(ఈ శ్లోకం మొదలు ౩ శ్లోకాల ఉద్దేశ్యం ఇది - ఓ విలాసుడైన పురుషుడు ప్రియురాలు తనంతట తానుగా వచ్చి కౌగిలించుకోవాలన్న (స్వయంగ్రాహలబ్ధి) నెపంతో, ఆమెపై తుమ్మెదల గుంపు వచ్చి పడుతుందని బెదరగొడుతున్నాడు. అలా ఆ భామ బెదిరి, ఈ విలాసుడిని అనుకోకుండా కౌగిలించుకుంటుందని ఆతని ఆకాంక్ష!)

 

పూలగుత్తితో వంగిన క్రొందీవెలను జయించిన స్తనములు గల పూబోడి! పరాగాలతో నిండిన ఈ కమలాలను విడచి విరాగులై తుమ్మెదల గుంపు నీ ముఖం వైపుకు వస్తున్నాయి.

(అమ్మాయి ముఖం కమలాలకన్నా విశిష్ఠమైన ఇంకేదో కుసుమం అని భ్రమరాలు అనుకుంటున్నట్టు కల్పన. - భ్రాంతిమదలంకారం.)

 

ఈ శ్లోకానికి తెనుగు సేత -

ఆ.వె.

ననలతతి భరమున నమ్రమగు నవల

తల నుసుగు కుచముల దాన! తేటి

దండిట విరిధూళి నిండిన కమలముల్

వదలి నీదు మోము వైపు పాఱె! 

౧౨.

సురభిణి శ్వసితే దధతస్తృషం నవసుధామధురే చ తవాధరే ।

అలమలేరివ గంధరసావమూ మమ న సౌమనసౌ  మనసో ముదే ॥

 

సురభిణి తవ శ్వసితే నవసుధామధురే (తవ) అధరే చ, తృషం దధతః, అలేః మనసః మమ ఇవ, గంధరసౌ, సుమనసౌ అమూ ముదే నాలమ్ ।

 

సర్వంకష

అధాళేస్తదభిముఖాగమనే కారణమాహ। సురభిణీతి ॥ తవ సురభిణి శ్వసితే నిశ్వాసమారుతే నవసుధావన్మథురే అధరే చ-తృషం తృష్ణాం - దధతః దధానస్య ఆళేర్భ్రమరస్య. మమేవ- అమూ ఉపలభ్యమానౌ- సుమనసాం పుష్పాణాం సంబంధినౌ సుమనసౌ-గంధరసౌ సౌరభ్యమాధుర్యే - మనసోంతఃకరణస్య ముదే- నాలం న పర్యాప్తా- అతస్త్వదన రసగంధ లోభాదాగచ్చతీత్యర్ధః - 'నమస్స్వస్తీత్యాదినా చతుర్ధీ' - అత్ర కాంతా కర్తృక స్వయంగ్రహాశ్లేషసుఖార్థినః ప్రియస్య తద్భయహేతోః ఆళేరేవాగమన - హేతుత్వేన - ఆత్మ దృష్టాంతే ముఖసౌరభరసలోభే సౌమనస గంథరస వైరాగ్మయోర్వర్ణయితు మౌచిత్యాద్యమకానుసారేణ విప్రక్ళష్టే నాపి మమశబ్దేనైవ ఇవ శబ్దస్య అన్వయః - 'వలతే౽భిముఖం తవ ఆళిభయాదివ సస్వజ' ఇత్యుపక్రమోపసంహారాభ్యామళేః ప్రకృతత్వే నోపమేయత్వావగమాత్ - అన్యథా మధ్యే మమాళే రివేత్యేతద్వైపరీత్యే నతద్విరోథాత్ - ఇత్యల మధివల్లభాధ్వ గమనేన - అఠోపమాణ ప్రాస యమకానాం తావద్విజాతీయానాం సంసృష్టిః స్పస్టేవ - తథా యమకానాం చ త్రయాణాం చతుర్థ పాదాదావేకస్మాదక్షరాద్యాభ్యాం త్రిభ్యశ్చ పరతో౽క్షరత్రయావృత్తి లక్షణానాం స్థితత్వాత్ సజాతీయ సంసృష్టి శ్చేష్టా ।

 

సురభిణి = సుగంధభరితమైన; తవ = నీయొక్కశ్వసితే = శ్వాసలోనవ-సుధామధురే = క్రొందేనె వలె తియ్యనైన; (తవ = నీయొక్క) అధరే చ = క్రింది పెదవియందు కూడా; తృషం = కాంక్షను; దధతః = పొందిన; అలేః మనసః = తుమ్మెద మనస్సు మమ ఇవ = నా వలెనేగంధరసౌ = పరిమళమాధురి యందు; (మరియు) సుమనసౌ = పుష్పసంబంధమైన మకరందమున; అమూ = ఆ రెండుముదే = సంతోషము; నాలం = కూర్చుటలేదు.

 

సుందరి! నీ సుగంధభరితమైన శ్వాస, క్రొందేనె వంటి తియ్యనైన నీ క్రింది పెదవి మీద కాంక్ష పెంచుకున్న తుమ్మెద మనస్సు - నా మనస్సు లాగానే పరిమళము, సుమమకరందము - ఈ రెండున్నూ సంతోషము కూర్చుట లేదు. (తీవ్రమైన తృష్ణను తీర్చుటకు ఆ రెండునూ అసమర్థములై ఉన్నవి.)  

 

౧౩.

ఇది గదంతమనంతరమంగనా భుజయుగోన్నమనోచ్చతరస్తనీ ।

ప్రణయినం రభసాదుదరశ్రియా వలిమయాలిభయాదివ సస్వజే ॥

 

ఇతి, గదంతం, అనంతరం, భుజయుగోన్నమనోచ్చతరస్తనీ, వలిమయా, ఉదరశ్రియా, అంగనా, అలిభయాత్ ఇవ, రభసాత్, ప్రణయినం, సస్వజే

 

సర్వంకష

ఇతీతి ! ఇతీత్థం - గదంతం- ప్రణయినం- అనంతరం భుజయుగస్య - ఉన్నమనేన- ఉచ్చతరావత్యున్నతౌ స్తనౌయస్యాస్సా 'స్వాంగాచ్చో పసర్జనాదసంయోగోపధాదితి జీష్' - వళి భయావళయః విద్యంతే యస్బాస్తయావళిమయా - తుందివళివటేర్బ ఇతి భ ప్రత్యయః - ఉదర శ్రియా మధ్యశోభయా - ఉపలక్షితో - అంగనా-ఆళిభయాదివ- రభసాత్ - సస్వజే ఆలిలింగ- వస్తుతో రాగాదేవేతి భావః స్వంగ పరిష్వంగే ఇతి ధాతోః కర్తరి లిట్ - నాయికామధ్యా | శ్లో ! లజ్జా మన్మథ మధ్యస్థా మధ్యేయం నాయికామతా!

(లజ్జామన్మథమధ్యస్థా మధ్యేవ నాయికా; ఈ నాయిక ముగ్ధ మధ్య ప్రౌఢ నాయికలలో మధ్య అను నాయిక.)

 

ఇతి గదంతం = ఇట్లు చెప్పిన;   అనంతరం = పిమ్మటభుజయుగోన్నమనోచ్చతరస్తనీ; భుజయుగ = రెండుభుజముల; ఉన్నమన = పైకి ఎత్తుట చేత; ఉచ్చతర = పెద్దవిగా కనిపించు; స్తనీ = పయోధరములు గలది; వలిమయా =  వలయములు గల; (తుందివలివటేర్మ - ఇతి మ ప్రత్యయః) ఉదరశ్రియా = నడుము యొక్క అందముతోఅంగనా = సుందరి; అలిభయాత్ ఇవ = తుమ్మెదల భయముతో వలే; రభసాత్ = వేగముగా; ప్రణయినం = ప్రేమికుని ; సస్వజే =కౌగిలించుకొనెను.

 

ఇట్లు ప్రియుడు చెప్పిన పిమ్మట భుజద్వయమును ఎత్తుటచే ఉన్నతమైన పయోధరములు కల్గినది, ముడుతలు కల్గిన నడుముతో శోభించునది అయిన సుందరి తుమ్మెదలభయమును నటించి ప్రేమికుని వాటేసుకున్నది.

౧౪.

వదన సౌరభలోభ పరిభ్రమద్ భ్రమర సంభ్రమ సంభృత శోభయా|

చలితయా విదధే కలమేఖలాకలకలో౽లకలోలదృశాన్యయా||  

 

వదనసౌరభలోభపరిభ్రమత్, భ్రమరసంభ్రమసంభృతశోభయా, చలితయాఅలకలోలదృశా, అన్యయా, కలమేఖలాకలకలః విదధే

 

సర్వంకష    

వదనేతి || వదనస్య ముఖస్య - సౌరభగంధేలోభేన - పరిభ్రమతా - భ్రమరేణ హేతునా- యస్సంభ్రమ:- తేన-సంభృతశోభయా సంపాదిత శ్రియా చలితయా అళిభయాత్ ప్రస్థితయా- అతఏవ- ఆలకై రలకపాతైః - లోలదృశా చంచలాక్ష్యా- ఆన్య యాస్త్రంతరేణ- కలః - మేఖలాయాఃకలకలః కోలాహలః - విదధే విహితః- ఆళిభయాదపసరంత్యాః కాంచీగుణ ధ్వనిః అజనీరిత్యర్థః - ఏతేన చకితత్వ ముక్తం- చకితం భయసంభ్రమః అత్రానుప్రాసయమకయోః సజాతీయశబ్దాలంకారయోః సంసృష్టిః స్పప్ష్టైవ తావత్తథా యమకయోశ్చ ద్వయోశ్చతుర్థపాదాదావేకస్మాదక్షరాద్ద్వాద్యాం చ పరతోక్షర త్రయీవృత్తి లక్షణయోః స్థితత్వాత్ జాతీయయోస్సంసృష్టిః ।

 

వదనసౌరభలోభపరిభ్రమత్; వదన = ముఖముయొక్క; సౌరభ = పరిమళము చేత; లోభ = మోహమంది; పరిభ్రమత్ = చుట్టూ తిఱుగు; భ్రమరసంభ్రమసంభృతశోభయా; భ్రమర = తుమ్మెదల కారణము చేత; సంభ్రమ = గగురుపాటుతో; సంభృత శోభయా = ఒప్పారు సౌందర్యముతోచలితయా = కదలుట చేతఅలకలోలదృశా; అలక = ముంగురుల చేత; లోలదృశా = చలించు చూపులు గల; అన్యయా = ఇంకొక లావణ్యవతి చేత; కలమేఖలాకలకలః = కాలిగజ్జెలయొక్క రమ్య రవళి; విదధే = తాల్చబడినది;

 

ముఖపరిమళముచేత ఆకర్షింపబడి చెంతచేరిన తుమ్మెదల చేత సంభ్రమమంది మిగుల శోభతో కదలునది, ముంగురులు పడుటచేత చలించిన చూపులు గలది అయిన మరొక లావణ్యవతి కాలిఅందెల మధురరవమును తాల్చినది.  (అమ్మాయి వేగలుగా కదలుట చేత ఆమె కాలిగజ్జెలు మధురాలాపనములు గావించినవని తాత్పర్యము)

౧౫.

అజగణన్ గణశః ప్రియమగ్రతః ప్రణతమమప్యభిమానితయా న యాః ।

సతి మధావభవన్ మదనవ్యథా విధురితా ధురితాః కుకురస్త్రియః ॥

 

యాః కుకురస్త్రియః గణశః అగ్రతః ప్రణతమపి ప్రియం అభిమానితయా న అజగణన్ (తాః కుకురస్త్రియః) మధౌ సతి మదనవ్యథావిధురితా ధురి  అభవన్

 

సర్వంకష

అజగణన్నితి || యాః కుకురస్త్రియః యాదవాంగనాః గణశః బహుశః - 'బహ్వల్పాతర్ధాచ్ఛస్కారకా దన్యతరస్యామితి శస్ ప్రత్యయః'- అగ్రతః ప్రణతమపి - ప్రియం- జాతావేకవచనం-ప్రియానిత్యర్థః. అభిమానినీనాం భావోభిమానితా తయా -'త్వత లోర్గుణ వచనస్యే పుంవద్భావః వక్తవ్యః' - నా౽జగణన్ నగణయంతి స్మ - గణేశ్చోరాదికాణ్ణౌ చజ్ - ఈచగణ ఇత్యభ్యాసస్య పాక్షికమీత్వం- త్యా కుకురస్త్రియ:- మధౌ వసంతే సతి ప్రవర్తమానే 'మధుశ్చైత్రే వసంతే చేతి విశ్వ:'- మదనవ్యధయా-విధురితాః విహ్వలితాస్సత్య:- ధుర్యగ్రే అభవన్ అవర్తంత - స్వయమేవపుర ప్రవృత్తా ఇత్యర్థః ।

 

యాః కుకురస్త్రియః = ఏ యాదవాంగనలు; గణశః = పెక్కుమార్లు; అగ్రతః = యెట్టఎదుట; ప్రణతమపి = అర్థించిననూ; ప్రియం = ప్రియులను (జాతౌ ఏకవచనం); అభిమానితయా = అభిమానపాత్రులుగా; న అజగణన్ = లెక్కింపలేదు; తాః = అట్టి యాదవస్త్రీలు; మధౌ సతి = వసంతకాలమున; మదనవ్యథావిధురితా = మదనతాపము చేత విహ్వలురై; ధురి అభవన్ = ముందుకు వచ్చిన వారైరి.

 

యాదవాంగనలు అదివరకు మానవతులై తమ ప్రియులను లెక్కింపకున్న వారు కూడాను, వసంతకాలారంభమున మన్మథబాధకు లోనై, తమంతట తాముగా ప్రియులను చేరిరి.

౧౬

కుసుమకార్ముకకాముకసంహితద్రుతశిలీముఖఖండితవిగ్రహాః|

మరణమప్యపరాః ప్రతిపేదిరే కిము ముహుర్ముముహుర్గతభర్తృకాః ॥

 

గతభర్తృకాః అపరాః కుసుమకార్ముకకాముకసంహితద్రుతశిలీముఖఖండితవిగ్రహాః; మరణమపి ప్రతిపేదిరే ముహుః ముముహుః కిము?

 

సర్వంకష

కుసుమేతి || గతభర్తృకాః వియోగిన్యః !!  నద్యృతశ్చేతికప్ ప్రత్యయః- అపరాః కాశ్చిదంగనాః కుసుమ కార్ముకస్య కామస్య- కార్ముకే  సంహి తై: సంయోజి ద్రుతైః జవనై : శిలీముఖైః శరైః ఖండితవిగ్రహాః పాటిత శరీరాస్పత్యః - మరణమపి. ప్రతిపేదిరే. ముహుఃపునః పునః - ముముహుః మూర్చురితి కిము వక్తవ్యమిత్యర్థః

 

గతభర్తృకాః = వియోగినులైన; అపరాః = మరికొందరు యువతులుకుసుమకార్ముకకాముకసంహితద్రుతశిలీముఖఖండితవిగ్రహాః; ; కుసుమకార్ముక = పూవిలుకాడైన; కాముక = మన్మథునిచే; సంహిత = సంధింపబడిన; ద్రుత = వేగమైన; శిలీముఖ = బాణములచేత; ఖండితవిగ్రహాః = తూట్లు పొడవబడిన శరీరము గలవారై; మరణమపి = చావునే; ప్రతిపేదిరే = పొందుదురు; ముహుః = మరల; ముముహుః = మూర్ఛనొందుట; కిము (వక్తవ్యమ్) = ఏల (చెప్పుట?)

 

(మునుపటి శ్లోకమునకు కొనసాగింపు)

విరహిణులైన మరికొందరు యాదవాంగనలు పూవిలుకాని తీవ్రమైన శరములచే శరీరాంగములయందు మదనబాధ కలిగి చావునే వరింపగలరు; అట్టి వారు మరల మరల మూర్చనొందుటలో వింత యేమున్నది?

౧౭.

ఆథకస్యాశ్చిత్ ప్రోషితభర్తృకాయాః బంధుజనాశ్వాసనం విశేషకేన త్రిభిః కులకేనాహ -

(పిమ్మట ఒకానొక ప్రోషితపతికను బంధుజనులు ఊరడించుటను మూడు కులకములలో చెప్పుచున్నాడు)

 

రురుదిషా వదనాంబురుహశ్రియః సుతను సత్యమలంకరణాయ తే ।

తదపి సంప్రతి సన్నిహితే మధావధిగమం ధిగమంగలమశ్రుణః

 

సుతను రురుదిషా తే వదనాంబుశ్రియః అలంకరణాయ సత్యమ్; తదపి సంప్రతి మధౌ సన్నిహితే అశ్రుణః అధిగమం అమంగలం ధిక్ ।

 

సర్వంకష

|| రురుదిషేతి || హే సుతను శుభాంగి! "అంబార్థనద్యో హ్రస్వ" ఇతిహ్రస్వస్త్వమ్ - దీర్ఘోత్తరపదో బహువ్రీహిః - అన్యధా గుణస్స్యాత్ - రురుదిషా రోదనేచ్ఛా-ఆశ్రువిమోచనమిత్యర్థః - రుదేస్పన్నన్ అంతాదు ప్రత్యయే టాప్ - తే తవ వదనాంబురుహశ్రియః - ఆలంకరణాయ- సత్యం- 'రమ్యాణాం వికృతిరపి శ్రియం తనోతీ'తి న్యాసాదితి భావః - మన్యమాన క్రియాపేక్షత్వాత్ చతుర్ధీ - తదపి తథాపి- సంప్రతి - మధౌ వసంతోత్సవే-సన్నిహితే సతి- అశ్రుణః- అమంగళం - అధిగమం అవాప్తిం - ధిక్ నిందతోత్యర్థః!! 'ధిజ్నిర్భత్సకాననిందయో'రిత్యమరః||  దిగుపర్యాదిషు త్రిష్వితి ద్వితీయా - ఆతో మా రుద ఇత్యర్థః ।

 

సుతను = అంగనామణిరురుదిషా = శోకేచ్ఛ; తే = నీయొక్క; వదనాంబుశ్రియః = ముఖకమలమునకు; అలంకరణాయ సత్యమ్ = అలంకారము కోసమే, నిజము!; తదపి = అయిననుసంప్రతి = ఇప్పుడుమధౌ = వసంతము; సన్నిహితే (సతి) = సమీపించిన తరుణమునఅశ్రుణః = కన్నీరు; అధిగమం = వెలువడుటఅమంగలం ధిక్ = శుభము కానే కాదు; శోకింపకుము;

 

అంగనామణి! శోకేచ్ఛ నీ ముఖకమలమునకు అలంకారమే నిజము! అయిననూ ఇప్పుడు వసంతాగమనము. ఇట్టి సమయమున అశ్రువులు వెలువరించుట అమంగళము. ధిక్. ఊరుకొనుము.   

 

విశేషములు

మల్లినాథుడు వ్యాఖ్యానంలో పేర్కొన్న 'రమ్యాణాం వికృతిరపి శ్రియం తనోతి' - ఇది కిరాతార్జునీయ పద్యపాదము.

 

కాంతానాం కృతపులకస్తనాంగరాగే వక్త్రేషు చ్యుతతిలకేషు మౌక్తికాభః ।

సంపేదే శ్రమవిలోద్గమోవిభూషాం రమ్యాణాం వికృతిరపి శ్రియం తనోతి ॥ (కి. ౭.౫)

 

అప్సరసలకు స్తనములపై అలదుకున్న చందనము వారిదేహమున పొడమిన చమట కారణాన కరిగి, వారికి పులకింతలు కలిగించింది. నుదుటిబొట్టు చెదరి, స్వేదబిందువులు ముత్యాల్లా మెరిసినాయి.

అందగత్తెలకు వికృతి కూడా అందాన్నే కలిగిస్తుంది కదా!

 

ఈ భావం తెలుగులో -  'చక్కనమ్మ చిక్కినా అందమే' లాంటిది.

౧౮.

త్యజతి కష్టనుసావచిరాదసూన్ విరహవేదనయేత్యఘశంకిభిః ।

ప్రియతయా గదితాస్త్వయి బాంధవైరవితథా వితథాస్సఖి మా గిరః ॥

 

'అసౌ విరహవేదనయా అచిరాత్ అసూన్ త్యజతి కష్టం (బత)' సఖి! త్వయి ప్రియతయా అఘశంకిభిః బాంధవైః  గదితాః గిరః వితథాః మా వితథాః ।

 

సర్వంకష

త్యజతీతి | అసౌ బాలా - విరహ వేదనయా- అచిరాత్-అసూన్ ప్రాణాణ్- త్యజతిత్యక్ష్యతి- 'వర్తమాన సామీప్యే భవిష్యదర్థే లట్' - కష్టంబత- హేసఖి! త్వయి విషయే- ప్రియతయా ఇష్టతయా- ఇత్యేవం- అఘశంకిభిరనర్థోత్ప్రేక్షిభిః-"ప్రేమ పశ్యతి భయాని అపదేపి" న్యాయాదితి భావః- బాంధవై :- గదితాః ఉచ్చరితాః. గిరః ఉక్తీః-విగతంత ధాత్వంయాసాంతాః- అనృతాః  'వితధంత్వనృతం వచః' ఇత్యమరః-బహువ్రీహౌ విశేష్య లింగతా- బ్రాహ్మణాదిత్వాత్ హ్రస్వః- తతోనజ్ సమాసః - అవితధాస్స త్యాః- మావితథాః మాకృథా:- వృధాతిశోకేన మాకృధా ఇత్యర్థః- విపూర్వాత్తనో తేర్లుణి థాస్ 'తనాదిభ్యస్తథాసో'రితివిభాషానిచోలుక్ - అనుదాత్తోపదేశ ఇత్యాదినా అనునాసిక లోపః - నమాఞ్యోగ ఇత్యడాగమ వ్రతిషేధః

 

'అసౌ = ఈ బాలవిరహవేదనయా = విరహవేదనతో; అచిరాత్ = సమీపకాలములోనే; అసూన్ = ప్రాణములను; త్యజతి = విడుచును; కష్టం (బత) = అయ్యో! కష్టము!; (ఇట్లు) సఖి = ప్రియురాలాత్వయి = నీయందు; అఘశంకిభిః = అశుభమును చింతించిప్రియతయా = ఇష్టులైన; బాంధవైః = బంధుజనులచేతవితథాః = వాస్తవముగా; గదితాః గిరః = చెప్పు మాటలు;   వితథాః మా = అసత్యము చేయుము. (నీవు శోకబాధ వీడి చిరకాలము జీవింపుము అని భావము)

 

'ఈ బాల విరహవేదనచేత కృశించి త్వరలో ప్రాణములు కోల్పోవునేమో, కష్టము సుమా' అని నీ యందు అశుభమును ఊహించి నీ బంధుజనులాడిన మాటలను అసత్యములు చేయుట నీ వంతు.

 

విశేషములు -

" ప్రేమ పశ్యతిభయాన్యపదే౽పి" - ప్రేమ అకారణంగా భయాన్ని శంకిస్తుంది. కిరాతార్జునీయంలో పేర్కొన్న న్యాయం.

 

మా గమన్మద విమూఢ ధియో నః ప్రోజ్జ్య రంతుమితి శంకితనాథాః ।

యోషితో న మదిరాం భృశమీషుః ప్రేమ పశ్యతిభయాన్యాపదే౽పి ॥ (కి. ౯.౭౦)

 

మద్యం యొక్క మత్తుతో మతి వశం తప్పిన - భర్తలు మమ్ములను వదలి మరియొక స్త్రీని వెళతారన్న శంకతో ముదితలు మదిరను ఎక్కువగా సేవించటానికి ఇష్టపడలేదు. నిజమే! ప్రేమ కారణం లేని చోట కూడా అకారణంగా భయాన్ని ఊహిస్తుంది.

౧౯.

నఖలుదూరగతో౽ప్యతివర్తతే మహమసావితి బంధుతయోదితైః|

ప్రణయినో నిశమయ్య వధూర్భహిస్స్వరమృతైరమృతైరివ నిర్వవౌ ||

 

(కిం చ) అసౌ దూరగతః అపి మహం న అతివర్తతే ఖలు ఇతి బంధుతయా ఉదితైః ఋతైః బహిః ప్రణయినః స్వరం నిశమయ్య వధూః అమృతైః ఇవ నిర్వవౌ ।

 

సర్వంకష

|| నేతి || కించ ఆసౌ తే ప్రణయీ దూరగతో దూరస్థో౽పి మహం వసంతోత్సవం || 'మహ ఉద్ధవ ఉత్సవ ఇత్యమరః'- నాతివర్తతే నాతిక్రామతి ఖలు - ఇతి బంధుతయా బంధుసమూహేన ' గ్రామజనీ బంధు సహాయేభ్య స్తల్' - ఉదితై రుక్తైః - వదేః కర్మణి క్తః- ఋతై స్సత్యవచనైః 'సత్యం తధ్యమృతం సమ్యగి'త్యమరః - బహిఃప్రణయినః దూరాదాగతస్య ప్రియస్య - స్వరం కంఠశబ్దం నిశమయ్య శ్రుత్వా "శము ఆదర్శనే ఇతి చౌరాదికాల్ల్యప్ 'మిత్వాత్ హ్రస్వః' ల్యపి లఘుపూర్వా'దిత్యయా దేశ:- అమృతై స్సు ధాఖిరివ. వధూః నిర్వహౌ నిర్వవార- వాతేర్లిట్ 'నిర్వాణం నిర్వృతి స్సుఖ' మితి ||

 

(కిం చ) అసౌ = (ఏలనన) నీ ప్రియుడుదూరగతః అపి = దూరదేశమునకేగి యున్ననూ; మహం = వసంతోత్సవమునున అతివర్తతే ఖలు ఇతి = అతిక్రమించడు కదా అనిబంధుతయా = స్వజనులచేతఉదితైః = చెప్పబడినఋతైః = సత్యవాక్యముల చేతబహిః ప్రణయినః = (అదే సమయమున) బయట ప్రియునిస్వరం = కంఠస్వరమును; నిశమయ్య = వినివధూః = వధువు; అమృతైః ఇవ = అమృతము వలేనిర్వవౌ = ప్రీతినందినది ।

 

ఏలనన నీ ప్రియభర్త ఎచ్చటికేగి యున్నను వసంతోత్సవసమయమునకు ఇచ్చటకు చేరుకోకమానడు - అని స్వజనులు చెప్పిన సత్యవాక్యముల చేతను, అదే సమయమున ఇంటిబయట ప్రియుని కంఠస్వరము వినుట చేతనూ, వధువు అమృతప్రాప్తి వలే సంతోషపడినది.

౨౦.

మధురయా మధుబోధిత మాధవీమధు సమృద్ధి సమేధిత మేధయా|

మధుకరాంగనయా ముహురున్మదధ్వనిభృతా నిభృతాక్షరముజ్జగే ||

 

మధురయా మధుబోధితమాధవీ మధుసమృద్ధిసమేధితమేధయా ఉన్మదధ్వనిభృతా మధుకరాంగనయా ముహుః నిభృతాక్షరం ఉజ్జగే ।

 

సర్వంకష

మధురయేతి ! మధురయా మనోహరయా, మధునా వసంతేన- బోధితాః వికసితా: చ తా మాధవశ్చ- పుష్పధర్మైః పుష్పితాసూపచర్య తే - తాసాం మాధవీనామతిముక్తలతానాం 'అతిముక్తః పుండ్రక స్స్యాద్వాసంతీ మాధవీలతా' ఇత్యమరః - మధుసమృద్ధయా మకరంద సంపదా సమేధిత మేధయా సంవధికత ప్రతిభయా - అత ఏవ ఉన్మదయత్యున్నదో మదకరః- పచాద్యచ్ - తం ధ్వనిం బిభార్తీతి ఉన్మదధ్వనిభృత్ - తయా తద్భ్భతొ-మధుకరాంగనయా- ముహుః నిభృతాక్షరం అవ్యక్తాక్షరం - లక్షణ యా స్థిరనాద యధాతథేత్యర్థః- ఆథవా - సర్వశ్శబ్దోవ వర్ణాత్మక ఏవ వ్వంజకవిశేషాభావాదస్ఫుట ఇతి మతమాశ్రిత్య ఉక్తం - సర్వపధికాః కవయ ఇతి ఉజ్జగే ఉచ్చకైర్గీతం-గాయతే రవివక్షిత కర్మణత్వాద్భావే లిట్ 'బంధు వైషమ్య రాహిత్యం సమతా పదగుంఫనే' ఇతిలక్షణా త్సమతాఖ్యో గుణః!

 

మధురయా = మనోహరమైనమధుబోధితమాధవీ; మధు = వసంతము చేత; బోధిత = పూచిన; మాధవీ = మాధవీలతలలోమధుసమృద్ధిసమేధితమేధయా; మధుసమృద్ధి = మిక్కుటమైన తేనెలు ; సమేధిత మేధయా = సంబంధముగా గల పరాగపు సంపదచేత; ఉన్మదధ్వనిభృతా = మత్తెక్కిన ఝుంకారము గలమధుకరాంగనయా = తేంట్లచేత; ముహుః = మరలనిభృతాక్షరం = ఏదియో చెప్పరాని అందమైన గానముఉజ్జగే = వెలువడెను.

 

పిమ్మట మనోహరమైన వసంతకాలాగమనము చేతపూచిన మాధవీలతలందు మిక్కుటముగా పరాగము, తేనెలు నిండుట చేత వాటిని పానము చేసిన తుమ్మెదల యొక్క అవ్యక్తగానము ఆ పరిసరముల వెలువడెను.

 

విశేషములు -

 బంధు వైషమ్య రాహిత్యం సమతా పదగుంఫనే - ఇతి సమతా.

సంయుక్తాక్షరములు తక్కువగా ఉండుట, కఠినపదములు (మహాప్రాణాక్షరములు) అల్పముగా యుండుట - సమతాగుణము.

 

వసంతాగమమును కవులు ఎంతో మనోహరముగా వర్ణించియున్నారు. (లలనాజనాపాంగ వలదావసదనంగ...- ఇత్యాది) ఆ వర్ణనల యొక్క గుణములకు బహుశా ఈ శ్లోకము శ్రోతస్సు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.