14, నవంబర్ 2022, సోమవారం

శిశుపాలవధమ్ ఆరవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (1 - 10)

 శిశుపాలవధమ్

షష్ఠః సర్గః (ఋతు వర్ణనమ్)


అధ ఋతువర్ణనం ప్రస్తౌతి -

(పిమ్మట ఋతువర్ణనమునకు ఆరంభించుచున్నాడు)

౧.

అథ రిరంసుమముం యుగపద్ గిరౌ

        కృతయథాస్వతరుప్రసవశ్రియా ।

ఋతుగణేన నిషేవితుమాదధే

        భువి పదం విపదంతకృతం సతామ్ ॥

 

అథ, గిరౌ, రిరంసుం, సతాం, విపదంతకృతం, అముం, నిషేవితుం; స్వతరుప్రసవశ్రియా, కృతయథా;ఋతుగణేన;యుగపత్, భువి, పదం, ఆదధే.

 

సర్వంకష -

అథేతి || జథ సేనానివేశానంతరం- గీరౌ రైవతకే రిరంనుం రంతుమిచ్చుమ్ - రమేస్సన్నంతాదు ప్రత్యయః- ఏతేన ఋతువర్ణన ప్రవృత్తేః సముచిత చిత్తవృత్తి జ్ఞాన పూర్వకత్వముక్తిం - సతాం సాధూనాం -విపదంతకృతం విపదామంతం కరోతి తే విపదంతకృత్ - క్విపి తుగాగము- తం వపదంతకృతం. సేవ్యమితి భావః - అముం హరిం నిషేవితుం - స్వతరూన్ స్వస్వనియతవృక్షాన్ అనతిక్రమ్య యథా స్వతరు. యథార్థేరవ్యయీభావః- యథాస్వతరుస్థితా ప్రసవ శ్రీః పుష్ప ఫల సంపత్తిః - యథాస్వతరు ప్రసవ శ్రీః 'ప్రసవత్తు ఫలేపుష్పే' ఇత్యమరః- శాకపార్థివాదిషు ద్రష్టవ్యః సాకృతా యేన తేన - కృతయధా స్వతిరుప్రసవశ్రియా - యథా స్వతరుకృత ప్రసవ శ్రీయేత్యర్థః - ఋతుగణేన - యుగపత్-భువి పదం-ఆదధే ఆహితం-యుగపదృతుగణః ప్రాదుర భూదిత్యర్థః- నహ్యవసరం సేవకాశ్చిపన్తీతి భావః - ఆత్ర సర్గే సర్వత్రయమకం. శబ్దాలంకారః- తల్లక్షణం తూక్తం చతుర్ధసర్గే - అర్థాలంకారస్తు యథా సంభవమూహ్యః- అస్మిన్ సర్గే ద్రుత విలంబితవృత్తం'ద్రుత విలంబితమాహ న భౌ భ రా'వితిలక్షణాత్

 

అథ = సేనల విడిది తఱువాత; గిరౌ = రైవతకమందు; రిసంసుం = విహారాసక్తుడైన; (అత ఏవ) సతాం =  సాధువుల; విపదంతకృతం = ఆపదలను దూరము చేయు వానిఅముం = శ్రీకృష్ణుని; నిషేవితుం = సేవించుటకు; స్వతరు = ఆయా వృక్షముల; ప్రసవశ్రియా = పల్లవ,ఫల,పుష్పసంపదల చేత ; కృతయథా = ఒప్పియున్నదైన; ఋతుగణేన = ఋతువుల సమూహము చేత; యుగపత్ = ఒక్కసారిగాభువి = ఆ నేలపదం = అడుగు; ఆదధే = మోపబడినదైనది;  

 

ఆ రైవతక పర్వతప్రాంతాన సేనలవిడిది పూర్తయ్యింది. అటుపై విహారముపై ఆసక్తిగలవాడు, ఆపన్నప్రసన్నుడు అయిన శ్రీకృష్ణభగవానుని సేవించటానికి  పల్లవ, ఫల, పుష్పసంతతిని ఆయా తరువులలో నింపుతూ ఋతువులన్నీ ఒక్కపెట్టుగా ఆ నేలలో అడుగుమోపాయి.

 

విశేషాలు

శ్రీకృష్ణస్వామి రాకతో ఋతువులన్నీ తమ నియమములను విడచి ఒక్కసారిగా ఆ నేలకు వచ్చినవి అని భావం.

ఈ సర్గలో అడుగడుగునా యమకాలంకారం. చతుర్థసర్గలో 3 వ శ్లోకంలో యమకలక్షణాలు చర్చింపబడినాయి.

అర్థాలంకారాలు ఎడనెడ కానవస్తాయి.  ఈ సర్గలో అంతటా ద్రుతవిలంబితం అనే ఛందస్సు.

మహనీయులు అడుగుపెట్టిన చోట ఋతువులు కాలక్రమాన్ని విడచి ఒక్కపెట్టున వస్తాయని ప్రాచీన పారంపరిక విశ్వాసం.

 

అథలోకవేదయోః ప్రాథమ్య వ్యవహారాద్వసంతమాదౌ వర్ణయతి !

(పిమ్మట లోకవ్యవహారం ప్రకారం వసంతవర్ణన ఆరంభిస్తున్నాడు కవి.)

౨.

నవపలాశపలాశవనం పురః

స్ఫుటపరాగపరాగతపంకజమ్ ।

మృదులతాంతలతాంతమలోకయస్స

సురభిం సురభిం సుమనోభరైః ॥

 

సః, నవపలాశ పలాశవనం, స్ఫుటపరాగపరాగతపంకజం,మృదుల-తాన్త-లతాంతం,సుమనోభరైః;సురభిం, సురభిం, అలోకయత్.

 

సర్వంకష

నవేతి ! సహరిః- ఫురో౽గ్రే ప్రథమం వా- నవపలాశాని నూతనపత్రాణి - పలాశవనాని కింశుకవనాని యస్మిన్ తం నవపలాశపలాశవనం - బహువ్రీహి పూర్వపదోబహువ్రీహిః!'పలాశః కింశుకే పత్రే పలాశం' ఇతి విశ్వ:- స్ఫుటాని వికచాని పరాగై : రజోభిః - పరాగతాని వ్యాప్తాని- పంకజాని యస్మిన్ తం - స్పుటపరాగ పరాగతపంకజం - మృదు కోమలాః . ఆతఏవ తాంతాః - ఆతపసమయే కించిత్ మ్లానాః - లతాంతా పల్లవాః యస్మిన్తం - మృదులతాంతలతాంతం. సుమనోభరైః పుష్పసమృద్దిభిః సురభిం సుగంధిం - సురభిం వసన్తం ఆలోకయత్ ఆపశ్యత్  'సురభిశ్చంపకే స్వర్ణే జాతీఫలవసంతయోః సుగంధౌ చ మనోఞే చ వాచ్యవదితి విశ్వః - ఇహ ప్రతిపాద్య ప్రధమాక్షర ద్వయాత్పరతోక్షర యావృత్తి రూపయమక ప్రక్రమాచ్చతుష్పాదేపి తదేవ యమకం ఏకస్మాదవ్యపరమితి సజాతీయ సంసృష్టిః.

 

సః = మాధవుడు; పురః = యెదురుగా/ముందుగానవపలాశ = క్రొందలిరుటాకులతో కూడినది; పలాశ = మోదుగుపూలతో ఒప్పునది అయిన; వనం = ఉద్యానమును; స్ఫుటపరాగపరాగతపంకజం; స్ఫుట = వికసించిన;(మఱియు) పరాగ = పుప్పొడిచేత; పరాగత = ఆవరించిన; పంకజం = కమలములు గలది; మృదుల-తాన్త-లతాంత; మృదుల = కోమలమైన; తాన్త = యెండవేడిమికి కొంచెము వాడిన; లతాంతం = ఆకులు గలది; సుమనోభరైః = కుసుమముల సమృద్ధి గలది అయిన; సురభిం = పరిమళభరితమైన; సురభిం = వసంతమునుఅలోకయత్ = వీక్షించెను.

 

అప్పుడు - క్రిందలిరుటాకులు, మోదుగుపూలతో నిండింది, బాగా వికసించి పుప్పొడిపరాగం కప్పేసిన తామరపూలు ఉన్నది, ఎండవేడికి కొంచెం కమిలిన ఆకులు ఉన్నది, పూలతో నిండినది, పరిమళభరితమైనది అయిన వసంతాన్ని ఎదురుగుగా ఉన్న వనంలో మాధవుడు చూచాడు. 

 

విశేషాలు -

పలాశపలాశ; పరాగపరాగత, లతాంతలతాంత, సురభింసురభిం - అక్షరత్రయ ఆవృత్తియమకం.

సంస్కృతసాహిత్యంలోని మధురమైన శ్లోకాల్లో నిస్సందేహంగా ఇది అగ్రగణ్యమైనది. శ్లోకం అంతటా అల్పప్రాణాక్షరాలతో, అక్కడక్కడ వచ్చిన మహాప్రాణాక్షరాలనూ సరైన పాళ్ళలో మనోహరంగా తీర్చి మాఘుడు కట్టెదుట పరిమళభరితమైన వసంతాన్ని నిలిపాడు. ఇది సమత, అర్థవ్యక్తి గుణాలకు ఉదాహరణ.

శ్రీకృష్ణునికి గల నామాలలో మాధవః అన్నది ఒకటి. మాధవః అంటే వసంతఋతువు అని అర్థం ఉంది.

ఇక్కడ మాధవుడు మాధవమాసాన్ని అంటే వసంతాన్ని తిలకిస్తున్నాడు.

పైన మొదటి శ్లోకం లో మాధవునిరాకతో ఋతువులన్నీ ఆయనకు అర్ఘ్యం ఇవ్వటానికన్నట్టు ఏతెంచినట్లు కల్పించాడు కవి. ఆ తర్వాతనే ఈ శ్లోకం! ఇందులో ఆయన యెదుట పల్లవాలు, కింశుకాలు, పంకజాలు, తీవెలు వికసిస్తున్నట్టుగా శబ్దజాలంతోనే ప్రతీయమానం చేశాడు మాఘుడు. స్ఫుట అంటే వికసించిన అని అర్థం - ఇక్కడ మాధవుని కట్టెదుట వికసిస్తున్నట్టుగా, వర్తమానకాలప్రతీతిలోనే సహృదయునికి అర్థం ప్రకటితమవుతుంది.  

.

విలులితాలకసంహతిరామృశన్ మృగదృశాం శ్రమవారి లలాటజమ్

తనుతరంగతతిం సరసాం దలత్కువలయం వలయన్ మరుదావవౌ ॥

 

విలులితాలకసంహతిః, మృగదృశాం,లలాటజం, శ్రమవారి, ఆమృశన్, దలత్, కువలయం,సరసాం, తనుతరంగతతిం, వలయన్మరుత్, ఆవవౌ.

 

సర్వంకష

విలులితేతి ॥ విలులితాలక సంహతీ ! విధుత చికురనికరః యేన సః - మృగదృశాం లలాటజం శ్రమవారి స్వేదం- ఆమృశన్ పరిమృజన్ మంద ఇతి భావః - సరసాం కాసారాణం - తనుతరంగ తతీ, దళంతి వికసంతి - కువలయాని యస్మిన్న కర్మణి తద్య థా యథా వలయన్ చాలయన్ - శీతల ఇతి భావః - మరుత్ వసంత వాయుః ఆవవౌ ఆవాతిస్మ !

 

విలులితాలకసంహతిః ; విలులిత = కదలింపబడిన; అలక = ముంగురుల; సంహతిః = శ్రేణిగల; మృగదృశాం = హరిణలోచనుల; లలాటజం = నుదుట జనించిన; శ్రమవారి = చమటను; ఆమృశన్ = తొలగించుచు; దలత్ = వికసించిన; కువలయం = కలువపూలను (కలిగిన)సరసాం = సరస్సులయొక్క; తనుతరంగతతిం = పైభాగముననేర్పడు అలలను; వలయన్ =  త్రిప్పుచు; మరుత్ = వసంతపు చల్లగాలి; ఆవవౌ = వీచెను;

 

అంతట - లేడికనుల లావణ్యవతుల మూర్ధముపై గల ముంగురుల శ్రేణిని మెల్లగా కదల్చుచూ, వారి మూర్ధమున గల స్వేదమును పరిహరించుచు,వికసించిన కలువలు గల సరస్సులపై తరంగములను ఏర్పరచి, పెంపొందింపజేయుచు, వసంతపు పైరగాలి వీచింది.

 

ఇతరములు

వసంతకాలాగమనాన్ని సూచిస్తూ, వసంతవిలాసాన్ని తెలుపుతూ అలా అలవోకగా ఒక పిల్లతెమ్మెర వీచింది.

తెలుగు కవులలో మాఘకవి ఆవేశించిన కవిప్రవరుడు అల్లసానిపెద్దన. ఈయన తనకావ్యంలోని పురంధ్రీవర్ణన ఘట్టాన్ని శిశుపాలవధకావ్య ఘట్టంతో అనుసరించాడు..

పై శ్లోకం వసంతవిలాసాన్ని తెలిపితే, ఓ అప్సర విలాసాన్ని (చిరునామాను) తెలిపే పెద్దనగారి ఈ క్రింది పద్యంలో ఏదో మూల మాఘుడు తొంగిచూస్తాడు.

కం.

మృగమద సౌరభ విభవ

ద్విగుణిత ఘనసార సాంద్రవీటీ గంధ

స్థగితేతర పరిమళమౌ

మగువ పొలపుఁ దెలుపు నొక్క మారుత మొలసెన్. 

 

ఒకపాలు మృగమదము, అంతకు రెండుపాళ్ళు కర్పూరముతో కూర్చిన తాంబులపు సువాసన - ఈ పరిమళాన్ని కప్పెడుతూ ఓ సుదతి చిరునామాను తెలిపే విధంగా పిల్లతెమ్మెర ఒక్కటి వీచింది.

౪.

తులయతి స్మ విలోచనతారకాః

        కురబకస్తబకవ్యతిషింగణి ।

గుణవదాశ్రయలబ్ధగుణోదయే

        మలినిమాలిని మాధవయోషితామ్ ॥

 

కురవకస్తబకే, వ్యతిషింగణి, గుణవతః, లబ్ధ గుణోదయః, అలిని,మలినిమా, మాధవయోధితాం, విలోచనతారకాః, తులయతి స్మ

 

సర్వంకష

తులయతీతి | కురవకస్తబకే వ్యతిషంగిణి లగ్నే - అత ఏవ - గుణవతః శుక్ల గణస్య. కురవకస్తబకస్య - ఆశ్రయేణ లబ్దః గుణోదయో నిజనీలిమగుణోత్కర్షో యేన తస్మిన్ - ధవళే - నీలస్య స్ఫురణా దితి భావః -అలిని భ్రమరే మలినస్య భావః మలినిమా కృష్ణత్వం - మాధవ యోషితాం హరివధూనాం - విలోచనానాం - తారకాః 'తార కాక్ష్ణాః కనీనికాత్యమరః - తులయతి స్మ నమీచకార- తద్వద్భభౌ ఇత్యర్థః - తులాశబ్దాత్సాదృశ్యపర్యాయాత్ ;తత్కరోతీతి ణ్యంతాత్ 'లట్ స్మే' - భూతే లట్ - ఉపమాలంకారః

 

కురవకస్తబకే = గోరంటపూలగుత్తిపై; వ్యతిషింగణి = లగ్నమై; (అత ఏవ = మరియు), గుణవతః = (ఆ గోరంటపూల) గుణము (అయిన ధవళవర్ణము) లో; లబ్ధ గుణోదయః = పొందిన (నలుపురంగు) అను గుణోత్కర్షముగల; (ధవళవర్ణమునందు కాలవర్ణపు ఉత్కృష్టత  పెంపు గలదై);   అలిని = తుమ్మెద నందు; మలినిమా = నలుపు; (కృష్ణత్వము), మాధవయోషితాం = మాధవుని ప్రియురాండ్రయందు; విలోచనతారకాః = కనుపాపలు; తులయతి స్మ = సమానమగుచున్నవి కదా!

 

తెల్లని గోరంటపూలగుత్తిపై  నల్లని భ్రమరమొకటి వాలింది.  ఆ తుమ్మెద మేని రంగైన కాలవర్ణము, గోరంటపూలగుత్తి రంగైన తెలుపు వర్ణనేపథ్యంతో మరింతగా ప్రస్ఫుటమయింది. ఇది మాధవుని ప్రియురాండ్రయొక్క స్వచ్ఛమైన కనుల రంగు  నేపథ్యంతో కనుగ్రుడ్డు రంగైన నలుపు ఉత్కృష్టతను పొందుటకు సమానంగా శోభించింది.

 

విశేషములు -

గోపికల కనుపాపల రంగునకు తుమ్మెదల రంగు సదృశముగా చెప్పుట వలన ఉపమాలంకారము.

౫.

స్ఫుటమివోజ్జ్వలకాంచనకాంతిభిర్యుతమశోకమశోభత చంపకైః ।

విరహిణాం హృదయస్య భిదాభూతః కపిశతి పిశితం మదనాగ్నినా ॥

 

ఉజ్జ్వలకాంచనకాంతిభిః, చంపకైః, యుతం, స్ఫుటం,అశోకంభిదాభృతః, విరహిణాం హృదయస్య, కపిశితం, పిశితమ్.

 

సర్వంకష

స్ఫుటమితి | ఉజ్జ్వల కాంచన కాంతిభిః శుద్ధ సువర్ణ ప్రభై : - చంపకైర్యుతమ్ । ప్రసూనమధ్యగతమిత్యర్థః -  స్ఫుటంవికచం- ఆశోకం అశోక పుష్పం భిదా భేదః 'షిద్బి ధాదిభ్యోజ్ఞ్', తాం బిభర్తి యత్తస్య - భిదాభృతః భిన్నస్య విరహిణాం - హృద యస్య హృదయ పిండస్యసంబంధి- మదనాగ్నినా కపశితం కపిశీకృతం పిశితం మాంసమివ - ఆశోభతేతి ఉత్ప్రేక్షా ।

 

ఉజ్జ్వలకాంచనకాంతిభిః = (భానుని తాపము చేత) శుద్ధమైన పసిడి కాంతుల; చంపకైః = సంపెంగపూల చేత; యుతం = కూడిన; (సంపెంగపూలనడుమనున్న అని భావం), స్ఫుటం = వికసించిన; అశోకం = అశోకపుష్పము; భిదాభృతః = భగ్నమైన; విరహిణాం హృదయస్య = విరహిణుల హృదయము (హృదయపిండము) యొక్క; మదనాగ్నినా = మదనతాపము చేత; కపిశితం = (మన్మథాగ్ని చేత అర్ధము కాల్చబడి) గోరోజనపు వర్ణము తాల్చినపిశితం = మాంసము వలే ఉన్నది.

 

రవితాపముచేత దగ్ధమై శుద్ధమైన పసిడికాంతుల చంపకసుమముల మధ్య వికసించిన అశోకపుష్పము - విరహిణుల హృదయపు కామాగ్ని చేత సగము కాల్చబడి, గోరోజనపు రంగు తాల్చిన మాంసము వలే ఉన్నది.(ఉత్ప్రేక్షాలంకారము)

౬.

స్మరహుతాశనముర్మురచూర్ణతాం దధురివామ్రవణస్య రజః కణాః ।

నిపతితా పరితః పథికవ్రజానుపరి తే పరితేపురతో భృశమ్ ॥

 

ఆమ్రవణస్య, రజః కణాః, స్మరహుతాశనః, ముర్మురచూర్ణతాం, దధుః, ఇవ,అతః పరితః, పథికవ్రజాన్, ఉపరి, నిపతితః (సా కణాః), తే, భృశం పరితేపుః

 

సర్వంకష

స్మరేతి॥  ఆమ్రవణస్య చూతవనస్య 'ఆమ్రశ్చూతో రసాలోసా'విత్యమరః - 'ప్రనిరంతశ్శర' ఇత్యాదినా వననకారస్య ణత్వం - రజః కణాః పరాగచూర్ణాః స్మరహుతాశనః కామాగ్నిః - సఏవ - ముర్మురస్తుఃషాగ్నిః 'ముర్మురర్తుషానలః' వైజయంతీ. తస్య చూర్ణతాం దధురివేత్యుత్ప్రేక్షా. ఆతో ముర్మురచూర్ణత్వాదేవ -పరితః ఉపరి నిపతితాః - తే రజః కణా పంధానం గచ్ఛంతీతి పథికాః 'పథ కన్నితి కప్రత్యయః- తేషాం ప్రజాన్- భృశం- పరితేపుః పరితాపయమాసుః ఆతోముర్మురచూర్ణత్వోత్ప్రేక్షణమితి భావః!

 

ఆమ్రవణస్య = మామిడితోట యొక్కరజః కణాః = పూత/మొగ్గల యొక్క పరాగపు రజను; స్మరహుతాశనః = మన్మథుడను అగ్నియే; ముర్మురచూర్ణతాం = (కొలిమిలో) రేగుచున్న నిప్పుకణములన్న భావమును, దధుః ఇవ= తాల్చినవన్నట్టు ఉన్నవి;అతః = అట్టి ఆ నిప్పుకణముల చేత; పరితః = చుట్టుప్రక్కల అంతటా; పథికవ్రజాన్ ఉపరి = బాటసారులపై; నిపతితః = పడిన; ( రజః కణాః = ఆ మామిడి పూతల రజను) తే = వారిని, భృశం = మిక్కిలి; పరితేపుః = బాధపెట్టినవి.

 

మామిడితోటలో మామిడిపూతలు రాలి -  కొలిమిలో రేగుతున్న మన్మథుడనే నిప్పుకణాలా అన్నట్టు ఉన్నాయి. ఈ రజను బాటసారులపై పడి, వారిలో తాపం యెక్కువయ్యింది.

౭.

రతిపతిప్రహితేవ కృతకృధః ప్రియతమేషు వధూరనునాయికాః ।

బకులపుష్పరసాసవ పేశలధ్వనిరగాన్నిరగాన్ మధుపావలిః ॥

 

ప్రియతమేషు, కృతకృధఃవధూరనునాయికాః, రతిపతిప్రహితాః, బకులపుష్పరసాసవ పేశలధ్వనిః , మధుపావలిః, అగాత్, నిరగాత్

 

సర్వంకష

రతిపతీతి ॥ ప్రియతమేషు విషయేషు - కృతక్రుధః  కృతరుణః -'ప్రతిఘా రుట్ కృధే స్త్రియామిత్యమరః - పధూరనునాయికాః - కుపిత స్త్రీరనునేష్యంతీ తుము ణ్వులౌ క్రియాయా క్రియార్థాయామ్' ఇతి భవిష్యదర్థే ణ్వులు ప్రత్యయః । 'ఆకేనోర్భవిష్యదాధమర్ణయోః' ఇతి షష్టీప్రతిషేధాత్ వధూరితి ద్వితీయా । రతిపతినా కామేన- ప్రహితా ప్రేషితేవ - తద్వాణీ శ్రవణానంతరమేవ తాసాం కోపత్యాగదర్శనాధియముత్ప్రేక్షా-వకుళపుష్పాణం రసోమకరందః స ఏవాసవః. తేన తత్పానేన- పేశలధ్వనిః నుధురస్వనా-మధుపావళిః-నగచ్చతీత్యగః తస్మాత్ అగాత్ వృక్షాత్ నిరగాత్ నిర్గమతా 'ఇణో గాలుడి ఇతి గా దేశః

 

ప్రియతమేషు = అనురాగవంతుల యందు; కృతకృధః = కినుక వహించిన; వధూరనునాయికాః  = నాయికను అనుసరించు దూతికలు; రతిపతిప్రహితాః = (ఆ దూతికల మాటల చేత కోపమును త్యజించుటకై) కాముని చేత అంపబడినవారో అన్నట్టు; బకులపుష్పరసా౽సవ పేశలధ్వనిః; బకుల = పొగడపూల; రసాసవ = మకరందపానము చేతపేశలధ్వని = మధురస్వరమును; మధుపావలిః = తేంట్లు;గాత్ = తరువుల నుండి; నిరగాత్ = వెలువరించుచున్నవి.

 

నాయకులపై అలిగిన నాయికలను సమాధానపరుచుటకు కాముడే స్వయముగా పంపిన దూతికల వలే పొగడపూల మకరందాన్ని త్రావి క్రొవ్విన తేంట్లు మధురమైన నాదాన్ని వెలువరిస్తూ ఆ తరువుల నుండి వెలువరిస్తున్నాయి.

ఇతరములు -

నాయకునిపై అలుక వహించి అతనిపై విముఖురాలైన నాయికను కలహాంతరిత అంటారు.

'కలహాంతరితా అమర్ధాద్ విధుతే౽నుశయార్తియుక్' - దశరూపకమ్.

క్రోధముతో నాయకుని వీడి ఆపై వగచేది.

అలా విముఖురాలైన నాయికను ప్రసన్నం చేసుకోవటానికి నాయకుడు దూతికను పంపడం ఉంటుంది. అలా వెళ్ళిన నాయిక మధురంగా సంభాషించి, అనునయంగా మాటలాడి నాయికను నాయకునికి సుముఖంగా చేస్తుంది.

పొగడపూల మకరందాన్ని త్రావి మధురమైన ఝుంకారనాదం చేస్తున్న తుమ్మెదలు - అలా కాముడే స్వయంగా పంపిన దూతికలా అన్నట్టు ఉన్నాయని కవి ఉత్ప్రేక్ష.

నాయికలు, దూతికలు, ఈ వ్యవహారం అంతా నాటకప్రక్రియలో భాగమైన విషయాలు.       

౮.

ప్రియసఖీసదృశం ప్రతిబోధితాః

        కిమపి కామ్యగిరా పరపుష్టయా ।

ప్రియతమాయ వపుర్గురుముత్సర

        చ్ఛిదురయా౽దురయాచితమంగనాః ॥

 

గురుమత్సరచ్ఛిదురయా;కామ్యగిరా, పరపుష్టయా,ప్రియసఖీసదృశం, కిమపి; ప్రతిబోధితాః, అంగనాః, ప్రియతమాయ, అయాచితం, వపుః . అదుః

 

సర్వంకష

ప్రియసఖీతి || గురోర్మహతో మత్సరస్య ద్వేషస్య - ఛిదురయా ఛేత్ర్యా ' బిదిభిదిచ్ఛేదే కురచకామ్యగిరా గ్రాహ్యవాచా - పరపుష్టయా కోకిలయా ప్రియసఖ్యా సదృశం యథాతథా- కిమపి పరైర్దుర్భోధం- రహస్యం హితం - ప్రతిబోధితా ఉపదిష్టా ఆంగనాః- ప్రియతమాయ అయాచితమప్రార్థితమేవ - వపుర్నిజాంగం అదుః ఆర్పయామాసు:- దదాతేళ్లుజ్ 'గాతిస్థా ఇత్యాదినా సిచోలుక్' - కోకిలకూజిత శ్రవణానంతరమేవ ఆంగార్పణాదౌత్సుక్య హేతుకాద్యనంతరన్యాయేన తథా కిమపి బోధితా ఇత్యుత్ప్రేక్షా

 

గురుమత్సరచ్ఛిదురయా = విపరీతమయిన అసూయను భేదించునదికామ్యగిరా = మధురభాషిణి అయిన; పరపుష్టయా = కోకిలచేత;ప్రియసఖీసదృశం  = ఇష్టసఖి వలే; కిమపి = ఏదియో; ప్రతిబోధితాః = ఉపదేశింపబడిన వారలైన; అంగనాః = సుందరాంగులుప్రియతమాయ = ప్రియునికై; అయాచితం = అభ్యర్థన లేకుండగనే; వపుః = అందమైన గాత్రమును;అదుః = అర్పించిరి;

 

అసూయను తొలగించే మధురభాషిణి కోకిల కూతతో, ఇష్టసఖి ఏదో నచ్చజెప్పిన విధంగా సుందరాంగులు తమ లజ్జను వీడి మోహంతో అయాచితంగానే ప్రియునికి వశం అవుతున్నారు. (కోకిల కూజితం ఉపదేశం అని ఉత్ప్రేక్ష)

 

విశేషము -

అయాచితంగా ప్రియురాలు ప్రియునికి ఇచ్చే కౌగిలిని "స్వయంగ్రహము" అని అంటారు. ఈ శబ్దాన్ని కవులు అక్కడక్కడా ఉపయోగించారు. శిశుపాలవధమ్ ప్రథమ సర్గ లో కూడా ఈ శబ్దప్రయోగం ఉంది.

 

సముత్క్షిపన్ యః పృథివీభృతాం వరం వరప్రదానస్య చకార శూలినః ।

త్రసత్ తుషారాద్రి సుతా ససంభ్రమ స్వయంగ్రహాసుఖేన నిష్క్రియమ్ ॥ (౧. ౫౦)

 

ఈ స్వయంగ్రహ ప్రస్తావన ఇక ముందు శ్లోకాల్లో వస్తుంది.

౯.

మధుకరైరపవాదకరైరివ స్మృతిభువః పథికా హరిణా ఇవ ।

కలతయా వచసః పరివాదినీస్వరజితా రజితా వశమాయయుః ॥

 

మధుకరైః,అపవాదకరైరివ, పథికాః హరిణా ఇవ, పరివాదినీస్వరజితా,వచసః,కలతయా, రజితాః,సస్మృతిభవః వశమాయయుః

 

సర్వంకష

మధుకరైరితి | మధుకరైః కర్తృభిః - అపవాదం మృగవంచనార్థం ఘంటాది కుత్సితవాద్యం కుర్వంతీత్యపవాదకరా: వ్యాధాః - తైరివ పధికాః హరిణా ఇవ - పరివాదినీ స్వరజితా వీణావిశేషధ్వని జయిన్యా 'సప్తభిః పరివాదినీత్యమరః' - జేజిక్విపితుక్-వచ సంగీతస్య- కలకయామాధుర్యేణకరణేన- రజితాః రంజితాః-ఆకృష్టస్సంతః ఇత్యర్థః - రంజేర్ణ్యంతాత్ కర్మణి క్తః; రంజేర్ణౌ మృగరమణే -ఇతి ఉపధానకారలోపః- ఇహూపమాన మృగసాదృశ్యాదౌపచారికం మృగత్వం ఉపమేయేషు పధికేష్వప్యస్తీత్యవిరోధః- స్మృతిభువః స్మరస్య- మృగపాత చింతా విషయత్వాన్మృగగ్రహణగర్తదేశస్య చ - వశం ఆయయుః- యథా వ్యాధగానాసక్త్యా గర్తే మృగాః పతంతి తద్వన్మధుకరఝంకారాదాకృష్టాః పాంథాః స్మరపారవశ్యం భేజురిత్యర్థః- అనేకైవేయమువమా।

 

అపవాద - రవవాద అని పాఠాంతరము.

 

మధుకరైః = భ్రమరముల చేతఅపవాదకరైరివ = జింకలను వేటాడుటకు బోయలు చేయు డప్పుల మోతల చేత;హరిణా ఇవ= లేళ్ళ వలెపథికాః = బాటసారులు; పరివాదినీస్వరజితా = వీణాలాపమును జయించు; వచసః = గీతము యొక్కః,కలతయా = మాధుర్యము చేత; రజితాః = ఆకర్షింపబడినవారై; ,స్మృతిభువః = మదనునివశం = వశమును; ఆయయుః = ప్రాపించిరి;

 

జింకలను వేటాడుటకు వ్యాధులు చేయు శబ్దములకు మత్తములై జింకలు ఆ వేటగాండ్రకు వశమైనట్టు, వీణాలాపమును మించు మధురమైన కూజితములను చేయు తుమ్మెదలవలన బాటసారులు మదనుని వశమైనారు.

౧౦.

సమభిసృత్య రసాదవలంబితః ప్రమదయా కుసుమావచిచీర్షయా ।

అవినమన్న రరాజ వృథోచ్చకైరనృతయా నృతయా వనపాదపః ॥

 

ప్రమదయా, కుసుమావచిచీకీర్షయా, రసాత్. సమభిసృత్య, అవలంబితః, అవినమన్, వృథోచ్ఛకైః,వనపాదపః, అనృతయా, నృతయా, న రరాజ

 

సర్వంకష

సమభిసృత్యేతి - " ప్రమదయాకర్త్ర్యా  కుసుమానాం అపచిచీర్షయా అపచేతుం ఛేత్తుమిచ్చయా. రిరంసయేతి చ ధ్వనిః - చినోతేస్సన్నంతొ దు ప్రత్యయాదితి స్త్రీ యామకార ప్రత్యయః- 'విభాషా చేరితి వికల్పాత్కుత్వాభావః. రసాద్రాగాత్ - సమఖిసృత్య సమాగత్య. అవలంబితః హస్తేన గృహీతః - తథాప్య వినమన్ వశమగచ్ఛన్ అత ఏవ వృథా ఉచ్చకైః వ్యర్థమున్నతః వససాదపః - నతు నాగరిక ఇతధావః - స ఋతేత్యనృతా అసత్యా- తయా అనృతయా- నుర్భావో నృతా తయా పుంస్త్వేస-న రరాజ 'స్యుః పుమాంసః పంచజనాః పురుషాః పురుషా నరఇత్యమరః - యః కాంతాకర గృహీతోపి న ద్రవతి స నపుంసక ఏవ- లౌకికస్తు పుంస్త్వ వ్యపదేశో మిధ్యేవేతి భావః

 

 కుసుమావచిచీర్షయా = కుసుమములు సేకరించుటకుప్రమదయా = ముద్దరాలిచేత; రసాత్ = ఉత్సుకతతోసమభిసృత్య = చెంత చేరి;, అవలంబితః = (కొమ్మను) వంచబోయినా; అవినమన్ = క్రిందకు వంగనివృథోచ్ఛకైః = వ్యర్థముగా పైనున్న; వనపాదపః = అడవిచెట్టు; అనృతయా = కల్ల అయిన; నృతయా = పుంసత్వము చేతన రరాజ = శోభింపలేదు.

 

ఓ ముద్దరాలు ఓ పూలచెట్టు నుండి పూలు తెంపుకోవడానికి వెళ్ళింది. అయితే ఆ చెట్టు కొమ్మ బలంగా ఎత్తుగా ఉండడం వలన ఆ అమ్మాయి వంచబోయినా వంగలేదు. అందమైన ముదిత అనురాగంతో చెంత చేరి కరము తాకించినా, కరుగని వృక్షము (వృక్షః/పాదపః) పుల్లింగముగా కల్ల అయి శోభింపలేదు.

 

విశేషములు -

కుసుమావిచికీర్షయా - పాఠాంతరము

యః కాంతాకరగృహీతో౽పి న ద్రవతి స నపుంసక ఏవ లౌకికస్తు పుంస్త్వవ్యపదేశో మిథ్యా ఏవ ఇతి భావః

ఎవడు కాంత చేయి అందించినా ద్రవింపడో అట్టి వాడు లౌకికముగా పురుషుడైనా, నపుంసకుడకే. ఆతని పుంసత్వము మిథ్య - అని భావము. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.