పోస్ట్‌లు

మే, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

శిశుపాలవధమ్ నాలుగవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - ముగింపు (61 - 68)

చిత్రం
౬౧. త్వక్సారరంధ్రపరిపూరణలబ్ధగీతిః అస్మిన్నసౌ మృదితపక్ష్మలరల్లకాంగః । కస్తూరికామృగవిమర్దసుగంధిరేతి రాగీవ సక్తిమధికాం విషయేషు వాయుః ॥   అస్మిన్ = ఈ పర్వతమందు ; త్వక్సారరంధ్రపరిపూరణలబ్ధగీతిః ; త్వక్సార = మురళి యొక్క ; రంధ్ర = చిల్లులను ; పరిపూరణ = నింపుట చేత ; లబ్ధగీతిః = పొందిన గానములు ; మృదితపక్ష్మల = మర్దించిన ఱెప్పలుగల ;  రల్లకాంగః  = కంబల మృగముల ; మరియు ; కస్తూరికామృగవిమర్దసుగంధిః ; కస్తూరికామృగ = పునుగుపిల్లి ; విమర్ద = సంస్పర్శ గల ; సుగంధిః = పరిమళము ; అసౌ = ఈ విధముగా పరిణమించిన ; రాగి ఇవ =  మోహమునొందినట్లు ; విషయేషు = జనపదములలో ; అధికాం సక్తిం = గొప్ప వ్యాప్తితో ; ఏతి = వెడలుచున్నది.   ఈ సానువుల జనపదములందు ఉన్మీలించిన కనులు గల కంబలమృగము ; మఱియు పునుగుపిల్లి శరీరమును తాకుటచే అలదుకున్న సుగంధమును వహించిన గాలి మురళి యొక్క రంధ్రములను పూరించిన వాయువు గీతిరూపము వొందినట్లు సరాగముతో అధికముగా వీయుచున్నది.   సర్వంకష - వంశే త్వక్సార కర్మాస్త్వచిసార తృణధ్వజాః - ఇత్యమరః రల్లకః కంబలమృగే కంబలే పరికీర్తితః - ఇతి వైజయంతీ విషయః స్యాత్ ఇంద్రియా...

శిశుపాలవధమ్ నాలుగవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (51 - 60)

౫౧. సవధూకాః సుఖినో౽స్మిన్ననవరతమమందరాగతామరసదృశాః । నా సేవేంతే రసవన్న నవరతమమందరాగతామరసదృశాః ॥ అస్మిన్ = ఈ కొండదాపుల ; అనవర-తమ-మందర-ఆగత-అమర-సదృశాః ; అనవరతమ = శ్రేష్ఠతములైన ; మందర-ఆగత = మందరపర్వతమునుండి యేతెంచిన ; అమర సదృశాః= దేవతలవంటివారు ; ఆమంద-రాగ-తామరస-దృశాః ; అమంద = స్నిగ్ధ ; రాగ= రక్తవర్ణ ; తామరస దృశాః = కమలలోచనులు ; సుఖినః = భోగులు ; సవధూకాః = ప్రియురాండ్రతో కూడినవారై ; ( సవధూకాః - తేన సహ ఇతి తుల్యయోగే బహువ్రీహిః(వధువులతో కూడి - బహువ్రీహి సమాసము) ); రసవత్ = కూరిమితో ; నవరతం =నూత్నశృంగారములను ; న సేవంతే = అవలంబింపరు ; ఇతి న = అని చెప్పుటకు వీలు లేదు. (ప్రతిషేధము). (నూతన శృంగారములనాచరించుట సామాన్యవిషయమని భావము) హరి! ఈ నగమున శ్రేష్ఠతములైన , మందరపర్వతము నుండి ఏతెంచిన దేవతలవంటివారును , ఎఱ్ఱని కనులవారును , భోగులును , ప్రియురాండ్రతో కలిసి కూరిమితో శృంగారసల్లాపముల జేయుట అత్యంత సామాన్యవిషయము. సర్వంకష - పంకేరుహం తామరసమ్ - ఇత్యమరః రసవత్ - గుణే రాగే ద్రవే రసః ఇత్యమరః ఉపమాలంకారము ఆర్యాగీతి ఛందస్సు. ౫౨. ఆచ్ఛాద్య పుష్పతటమేష మహాంతమంతరావర్తిభిః గృహకపోతశిరోధరాభైః । స్వాం...

శిశుపాలవధమ్ నాలుగవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (41 - 50)

చిత్రం
  ౪౧. అనతి చిరోజ్ఝితస్య జలదేన చిరస్థితబహుబుద్బుదస్య పయసో౽నుకృతిమ్ । విరలవికీర్ణవజ్రశకలా సకలామిహ విదధాతి ధౌతకలధౌతమహీ ॥ ఇహ = ఈ రైవతకమున ; విరలవికీర్ణవజ్రశకలాః ; విరల = యెడముగా ; వికీర్ణ = చిందరవందరైన ; వజ్రశకలాః = వజ్రపు రాల చూర్ణము ; ధౌతాః = శుభ్రమైనవి ; కలధౌతమహీ = రజతభూమి ; జలదేన = మబ్బులచేత ; అనతి చిరోజ్ఝితస్య = తత్కాలమున విముక్తమైన (నిర్మలమైన) ;  చిరస్థితబహుబుద్బుదస్య ; చిరస్థిత = చిరకాలముండు ; బహు = పెక్కు ; బుద్బుదస్య = బిందువులయొక్క ; పయసా = నీటి యొక్క ; సకలాం = తీరును ; అనుకృతిం = అనుకరించుచు ; విదధాతి = శోభించుచున్నది. ఈ పర్వతమందు యెడనెడ అల్లనల్లన వజ్రముల రజను వలే మెఱయు నేల - మబ్బుల నుండి ముక్తమై భూమిని జారు నిర్మలమైన అనేక జలబిందువులయొక్క తీరును అనుకరించుచూ శోభిల్లుచున్నది. సర్వంకష కలధౌతం రూప్య ఇతి హేమ్నోః - ఇతి విశ్వః కురకీరుతా వృత్తము - "కురకీరుతా నజభజైర్జలయుక్" - అని లక్షణము. ౪౨. వర్జయంత్యా జనైః సంగమేకాంతతస్తర్కయంత్యా సుఖం సంగమే కాంతతః । యోషయైవ స్మరాసన్నతాపాంగయా సేవ్యతే౽నేకయా సన్నతాపాంగయా ॥ ...