సీత సమాధానం
 కం||  ఉవిద! హృది సదా కరుణము  కవిస్మరణభాజి గాథ కమలాశ్రితమే,  అవికలసచ్ఛీలి యశము.  భువిద్విష! దురిత కరహిత ప్రోక్తులు చాలున్.   చ్యుతాక్షరి ఒక ప్రహేళిక. అంటే అక్షరాలతో ఆట.   రావణాసురుడు సీతతో అంటున్నాడు. (మొదటి మూడుపాదాలు)   అమ్మాయీ! నా హృది సదా కరుణతో ఉన్నది.  నా గాథ కవిస్మరణభాజి - కవులచే స్మరించదగినది, నా గాథ కమలాశ్రితము అంటే లక్ష్మీస్వరూపమైనది.  నా కీర్తి - అవికల - దోషాలు లేని,  సచ్ఛీలి = మంచి శీలము గలది.   దీనికి సీత సమాధానం  భువిద్విష = భూమికి శత్రువుగా అయిన వాడా!  దురితకర హిత = పాపం చేసే వారికి హితమైన  ప్రోక్తులు = ప్రసిద్దమైన పలుకులు  చాలున్ = చాలును.   దురితకరహిత - ఇక్కడ మరొక విధమైన శ్లేష కూడా ఉంది.   దురిత = పాపీ  "క" రహిత = నీవు పైన చెప్పిన మాటలలో "క" తీసివేస్తే వచ్చే  ప్రోక్తులు = పలుకులు  చాలున్ = చాలునులే.   క తీసివేస్తే ఏమి వస్తుందో చూద్దాం.  ఉవిద! హృది సదారుణము = అమ్మాయీ, నా హృదయము దారుణమైనది  విస్మరణభాజి గాథ మలాశ్రితమే  నా గాథ - విస్మరణభాజి = గుర్తుంచుకోదగ్గది కాదు.  నా గాథ మలాశ్రితము = నా కథ మలానికి ఆలవాలమైనది.  ఇక యశము  అవిలసచ్ఛీలి యశము.  అవిలసత్ శీలి...
