రావణాసురుని ఆశ్చర్యం
ఉ ||
ఒచ్చెము గాదె నా పగతుడొక్కరుఁడీ జటి యన్న, నందునన్
జచ్చిన వారలందరును సత్తువ బోరిన కచ్చిపోతులే
అచ్చరలింటిగొంగ, వెనుకాడని నిద్దురవాఁడు నీటులే
చిచ్చరకంటిచెల్వుని పెను చెన్నగు కౌనులు ఏలనింకనో?
నా శత్రువు ఒక తాపసి! అందునా అతని చేత చచ్చిన వారందరూ రాక్షసకులం వీరులు! స్వర్గాన్ని జయించిన ఇంద్రజిత్, కుంభకర్ణుడూ వ్యర్థమైపోయారే! ఈశ్వరుని మెప్పించిన ఈ రావణుని భుజాలు ఎందుకిక? ధిక్....
ఒచ్చెము = అవమానము
అచ్చరలింటిగొంగ = అప్సరలున్న నెలవుకు శత్రువు = స్వర్గానికి శత్రువు = ఇంద్రజిత్తు
జటి = తాపసి
వెనుకాడనినిద్దురవాడు = కుంభకర్ణుడు
ఈటులు = వ్యర్థులు
చిచ్చరకంటిచెల్వు = నిప్పు కన్ను ఉన్నవానికి ఇష్టుడు = రావణుడు
కౌనులు = మూపులు
హనుమన్నాటకం అని ఒక ప్రాకృతనాటకంలో రావణాసురుడు రాముణ్ణి చూసి అలా అనుకొంటాడట. ఈ నాటకం ఇప్పుడు దొరికినట్లు లేదు, కానీ అక్కడక్కడా పద్యాలు వేరే కావ్యాలలో దొరుకుతున్నాయి.
ఇందులో చమత్కారం ఏమంటే - ఈ పద్యంలో ప్రతి నామవాచకమూ వ్యంజకమై కూర్చుందట. (అంటే ప్రతి నామవాచకానికి జాగ్రత్తగా చూస్తే మరో అర్థం కనిపిస్తుందని సూత్రకారుడు)
పైన నా (అచ్చ) తెనుగు సేత. (స్వేచ్ఛానువాదం. యథాతథానువాదం కాదు)
మూలం:
న్యక్కారో హ్యయమేవ మే యదరయస్తత్రాప్యసౌ తాపసః
సోऽప్యత్రైవ నిహన్తి రాక్షసకులం జీవత్యహో రావణః
ధిక్చక్రజితం ప్రబోధితవతా కిం కుంభకర్ణేన వా
స్వర్గగ్రామటికా విలుణ్ఠన వృథోచ్ఛూనైః కిమేభిర్భుజైః
ప్రాకృతం సంగతేమోగాని తెలుగు పద్యం భేషుగ్గా ఉంది. అచ్చరలింటిగొంగ అన్న ఒక్క ప్రయోగానికి ఇండియా పరిగెత్తుకొచ్చు నీతో కరస్పర్శ చెయ్యాలని ఉంది.
రిప్లయితొలగించండి