మయూఖము - 2
 అంగదుడు రావణుని వద్దకు సీతను అప్పగించమని రాయబారానికి వచ్చాడు. అంగదుడే ఎందుకు? ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో వాలి రావణుని బంధించి ముప్పుతిప్పలు పెట్టి మూడు సముద్రాలలోముంచాడు. అంతే కాదు ఆ రావణుని తలను తన బాహుమూలల్లో ఇరికించుకుని, తొట్టెలో ఆడుకుంటున్న తన శిశువు అంగదుడికి ఆటబొమ్మలా చూపించాడు. ఆ సందర్భాన ఆ శిశువు ఆ ఆటబొమ్మ (రావణుని తలను) తన చిట్టిపాదాలతో తన్ని ఉన్నాడు. (ఆ శిశువు ఇంకేదైనా చేశాడేమో కూడా. అది తెలీదు.)   చిన్నసైజు సీమ ఫాక్షనిజం కథలాంటి ఫ్లాష్ బ్యాక్. ఇంత ఉంది కాబట్టి అంగదుడు వచ్చాడు రాయబారానికి. ఆ సందర్భంలో శ్లోకం.   "రే రే రావణః! రావణాః కతి బహూనేతాన్వయం శుశ్రుమః  ప్రాగేకం కిల కార్తవీర్యనృపతేర్దోర్దండపిండీకృతమ్ |  ఏకం నర్తనదాపితాన్నకవలం దైత్యేంద్రదాసీజనైః  ఏకం వక్తుమపి త్రపామహ ఇతి త్వం తేషు కోऽన్యోऽథవా ||"   రే రే రావణః;  రావణాః = రావణులు;  కతి = ఎంతమంది?  వయం = మేము;  బహూన్ = అనేక పేర్లను  శుశ్రుమః = విన్నాను;   కార్తవీర్యనృపతేః = కార్తవీర్యుడనే ఓ రాజు చేత;  దోర్దండ = బాహువుల చేత;  పిండీకృతమ్ = చూర్ణం చేయబడినది;  ప్రాక్ ఏకం కిల = మునుపు ఒకటి (ఒక పేరు) అట;   ఏకం = మరొకటి...

 
 
రవి గారూ మీ బంధ కవిత్వాలు, చిత్ర కవిత్వములు చూసా. చాలా బాగున్నాయి.
రిప్లయితొలగించండిరవి గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతంగా ఉంది మీ కూపబంధం.
ఇది మఱొక రకమైన చక్రబంధంలా అనిపిస్తోందండీ. బాగుంది.
రిప్లయితొలగించండిరవీ! అత్యద్భుతంగా ఉంది నీ కూపబంధ ఆట వెలది.
రిప్లయితొలగించండిఅభినందనలు.ఇలాగే నీ రచనను ఆదర్శంగా తిసుకొని అనేకమంది రచయితలు తమ చిత్రరచనా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
చాలా బావుంది రవీజీ !
రిప్లయితొలగించండి