వీఁడటే....
 
                                    శ్రీ కృష్ణుడు మొట్టమొదటి సారి పల్లె వదిలి నగరానికి బయలుదేరాడు. కంసుని పిలుపు మీద అక్రూరుని తోడుగా మధురానగరానికి బలరాముని జో డుగా సాగింది పయనం. నగరం చేరాడు. నగరంలో వింతలు విశేషాలు చూసుకుంటూ అన్నదమ్ములు వెళుతున్నారు. ఆ ఊళ్ళో అమ్మాయిలు కూడా అప్పుడే యౌవనంలో అడుగుపెట్టి మిసమిసలాడుతున్న మనవాడిని చూశారు.  కం ||  వీటఁ గల చేడె లెల్లను హాటకమణిఘటితతుంగహర్మ్యాగ్రములం గూటువలు గొనుచుఁ జూచిరి పాటించి విశాలవక్షుఁ బద్మదళాక్షున్.  రత్నాలు తాపడం చేసిన ఎత్తయిన బంగారుమేడలమీద బాల్కనీల నుండి                                     గుంపులుగా చేరి ఈ అందమైన కృష్ణు ణ్ణి  చూశారు ట.   ఇప్పుడే                                     అందిన వార్త .  “ పాటించి ”  చూశారుటండి. అంటే కళ్ళప్పగించి కాబోలు!  సీ ||  వీఁడటే రక్కసి విగతజీఁవఁగ జన్నుఁ బాలు ద్రావిన మేటిబాలకుండు | వీఁడటే నందుని వెలఁదికి జగతిని ముఖమందుఁ జూపిన ముద్దులాఁడు ! వీఁడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాఁపరీఁడు! వీఁడటే యలయించి వ్రేతల మానంబు సూఱలాడిన లోకసుందరుండు! గీ || వీఁడు లేకున్న పురమటవీ స్థలంబు వీనిఁ బొందని జన్మంబ...
 
 
 
