చిత్రభారతీ పంచకము - 5

స్వరములకు రాణి, వాణికి శంఖబంధపు నుతి.

శంఖ బంధము

కం||
ఖరకరచర సితనారీ!
స్ఫురతాధరసుమపరాగశోణా భూరీ!
స్వరధురధర హితకారీ!
బెరయున్ ధర,సురప రాగవీణాధారీ!

ఖరకరచర = ఖరకరుడు - సూర్యుడు, ఖరకరచర - సూర్యునివలె చరించు,
సితనారీ = సర్వశుక్ల యగు వనితా (సరస్వతి)
స్ఫురతాధర = తళతళమను మెఱయు అధరము(స్ఫురదధర శీధవే అని జయదేవుడు. స్ఫురతాధర తప్పుకాదనుకుంటున్నాను)

స్వరధురధర = స్వరములభారము మోయునది
బెరయున్ ధర = ఇలను సర్వాంతర్యామిగ వ్యాపించినయట్టి

శంఖ బంధములో ప్రతిపాదపు చివరి అక్షరం ఆవృత్తి కావాలి. అదే శంఖపు కన్ను.


ఈ పద్యము శంఖబంధమే కాక ఛురికా బంధము కూడా.

అలాగే ఈ పద్యము గోమూత్రికాబంధము కూడా.

సి నా రీ! స్ఫు రి తా సు రా శో ణా భూ రీ!
స్వ ధు హి కా రీ ! బె యున్ , సు రా వీ ణా ధా రీ!

 మూడు చిత్రములు కలిగినది కావున, ఇది త్రిచిత్ర పద్యమనబడును.

కామెంట్‌లు

  1. చిరంజీవీ! రవీ! శుభాశీస్సులు.
    నీ చిత్ర త్రయ బంధ కందాన్నిప్పుడే చూచాను. చాలా సమర్ధతతో వ్రాసిన నిన్నభినందిస్తున్నాను. ఇంకా ఇంకా చిత్ర; బంధ కవితలూ; రసస్పోరక ఖండికలూ వ్రాసి ఆంధ్రామృతాన్ని పొంగించి పదిమందికీ పంచగలవని ఆశిస్తున్నాను. శుభమస్తు.

    రిప్లయితొలగించండి
  2. మీ ఆశీస్సులతో తప్పక ప్రయత్నించగలను.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.