మేఘదూతంలో పూలు, మొక్కల ప్రస్తావనలు!

ఇదొక ఆసక్తికరమైన అంశం. మహాకవి కాళిదాస విరచిత మేఘదూత కావ్యంలో పేర్కొన్న వృక్షజాతులను గురించి ఒక జపాన్ అమ్మాయి పరిశోధించింది. అందులోభాగంగా ఆమె కనుగొన్న వృక్షజాతులు మచ్చుకు కొన్ని - అశోక, ఆమ్ర, కకుభ, కదంబ, కదళి, కందళి,కుటజ, శిరీష, సరళ...

ఈ వృక్షజాతులు ఏయే శ్లోకాలలో పేర్కొన్నారో, ఆ శ్లోకాలు, వాటి భావం, శ్రావ్యమైన ఆలాపనాసంయుక్తంగా పొందుపర్చిందామె. అంతే కాదు, ఆ పూల మొక్కల తాలూకు బొమ్మలు, వాటి గురించి క్లుప్త వివరణా కూడా ప్రత్యేకం.

ఇదుగో - ఇక్కడ చూడండి. (ఈ సైటు జపాను అక్షరాల కారణంగా ఒకవేళ మంటనక్కలో సరిగ్గా కనబడకపోతే, menu->view->character encoding->UTF-16 ఎంచుకోవాలి.)

ఒక్క జపాను అమ్మాయికి మన సాహిత్యం మీద ఇంత ఆసక్తి ఉంటే, మనకు ఎంత ఉండాలి?

********************************************************

చిన్న జపాను పాఠం. అక్కడ ఆ సైటులో

- The Plants of Kālidāsa's Meghadūta

ఆ వాక్యం కింద జపాను భాషలో ఏదో రాసింది కదూ. అది చదివితే - మేఘదోత నో శొకుపుత్సు

అందులో -
మేఘదోత - కతకాన
నో - హీరాగానా
శొకుపుత్సు - కాంజి.

జపాను భాష వ్రాయటానికి 3 లిపులు ఉపయోగిస్తారు. అవి, హీరాగానా, కాతాకానా, కాంజి.
హీరాగానా - జపాను వారిది
కాతాకానా - ఇతర భాషా శబ్దాలు జపానులో ఉఛ్ఛరించడానికి వాడే లిపి.
కాంజి - చైనీయుల నుంచి అరువు తెచ్చుకున్నది.

పాఠం సమాప్తం.

కామెంట్‌లు

  1. ఆసక్తికరమైన లంకె!

    >>ఒక్క జపాను అమ్మాయికి మన సాహిత్యం మీద ఇంత ఆసక్తి ఉంటే, మనకు ఎంత ఉండాలి?
    మనకి జపాను సాహిత్యం మీద ఎంత ఆసక్తి ఉండాలి అనేనా మీ ప్రశ్న :-)

    ఇంతకీ మీరు రెండిళ్ళ పూజారి అవ్వడం వెనక ఆంతర్యం? ;-)

    రిప్లయితొలగించండి
  2. >>మనకి జపాను సాహిత్యం మీద ఎంత ఆసక్తి ఉండాలి అనేనా మీ ప్రశ్న :-)

    కామేశ్వర్రావు గారు, మీరు ఓ అవధానిని అసందర్భ ప్రేలాపనలో అడగాల్సిన ప్రశ్న, నా లాంటి అర్భకుణ్ణి అడిగితే ఏట్లాగండి? :-). అయితే ఓ విషయం. నేను కొంతకాలం జపనీసు వెలగబెట్టాను. పరిస్థితులు అనుకూలించక, ఒక్క లెవెల్ (4 ఉంటాయి, జపాను భాష నేర్వడానికి)తో మానేయవలసి వచ్చింది.

    >>ఇంతకీ మీరు రెండిళ్ళ పూజారి అవ్వడం వెనక ఆంతర్యం? ;-)

    రెండు కాదు మూడు. నిజమైన పూజారి అవుదామనే. :-)

    రిప్లయితొలగించండి
  3. రవి,,
    ఈ డ్రమ్ము వెనకాల ఏదైనా కధాకమామీషు ఉందా???

    రిప్లయితొలగించండి
  4. లేదక్కా. కొరియా రాజధాని సియోల్ లో ఓ కోట ఉంది. దాని ఎదురుగా ఆ డ్రమ్మ. కలరెక్కువ, మోత తక్కువ. భావసారూప్యం కుదరడంతో, దానిపక్కన ఫోటో దిగాను.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Disclaimer

అశోకుడెవరు? - 1

ధ్రువనక్షత్రం - శింశుమారుడు