మేఘదూతంలో పూలు, మొక్కల ప్రస్తావనలు!
ఇదొక ఆసక్తికరమైన అంశం. మహాకవి కాళిదాస విరచిత మేఘదూత కావ్యంలో పేర్కొన్న వృక్షజాతులను గురించి ఒక జపాన్ అమ్మాయి పరిశోధించింది. అందులోభాగంగా ఆమె కనుగొన్న వృక్షజాతులు మచ్చుకు కొన్ని - అశోక, ఆమ్ర, కకుభ, కదంబ, కదళి, కందళి,కుటజ, శిరీష, సరళ... ఈ వృక్షజాతులు ఏయే శ్లోకాలలో పేర్కొన్నారో, ఆ శ్లోకాలు, వాటి భావం, శ్రావ్యమైన ఆలాపనాసంయుక్తంగా పొందుపర్చిందామె. అంతే కాదు, ఆ పూల మొక్కల తాలూకు బొమ్మలు, వాటి గురించి క్లుప్త వివరణా కూడా ప్రత్యేకం. ఇదుగో - ఇక్కడ చూడండి. (ఈ సైటు జపాను అక్షరాల కారణంగా ఒకవేళ మంటనక్కలో సరిగ్గా కనబడకపోతే, menu->view->character encoding->UTF-16 ఎంచుకోవాలి.) ఒక్క జపాను అమ్మాయికి మన సాహిత్యం మీద ఇంత ఆసక్తి ఉంటే, మనకు ఎంత ఉండాలి? ******************************************************** చిన్న జపాను పాఠం. అక్కడ ఆ సైటులో - The Plants of Kālidāsa's Meghadūta ఆ వాక్యం కింద జపాను భాషలో ఏదో రాసింది కదూ. అది చదివితే - మేఘదోత నో శొకుపుత్సు అందులో - మేఘదోత - కతకాన నో - హీరాగానా శొకుపుత్సు - కాంజి. జపాను భాష వ్రాయటానికి 3 లిపులు ఉపయోగిస్తారు. అవి, హీరాగానా, కాతాకానా, కాంజి. హీరాగానా...