14, నవంబర్ 2022, సోమవారం

శిశుపాలవధమ్ ఆరవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - (41 - 50)

 ౪౧. 

దదతమంతరితాహిమదీధితిం ఖగకులాయకులాయ నిలాయితామ్ |

జలదకాలమబోధకృతం దిశామపరథాప రథావయవాయుధః ||

 

రథావయవాయుధః అంతరితా హిమదీధితిం ఖగకులాయ కులాయ నిలాయితాం దదతం దిశాం అబోధకృతం జలదకాలం అపరథా ఆప. ।

 

సర్వంకష

అథ శరదృతు వర్ణనమారభతే దదత మిత్యాది! రథావయవాయుధః చక్రాయుధోహరి: అంతరితా హిమదీధితిం తిరోహితోష్ణాంశుం తథా- ఖగకులాయ పక్షి సంఘాయ - కులాయేషు నీడేషు నిలీయంత ఇతికులాయ నిలాయినః - కులాయో నీడమస్త్రియామిత్యమరః - తేషాం భావస్తత్తా- తాం-దదతం ప్రయచ్చంతం పక్షిసంచారం ప్రతిబధ్నంత మిత్యర్థః - 'నాభ్యస్తాచ్ఛతుః' ఇతి నుమ్ ప్రతిషేధః - దిశామితి కర్మణి షష్ఠీ అబోధకృతమబోధకారిణం- మేఘావరణేన ప్రాచ్యాదిదిగ్వివేకం లుంపంత మిత్యర్థః జలదకాలం ప్రావృట్కాలం. అపరథా ప్రాకారాంతరేణ ఆప ప్రాప మేఘోదయోపాధినా ప్రావృడ్వ్యవహారభాజం తమేవ కాలం మేఘాత్యయోపాధినా శరత్సంజ్ఞయా ఉపలేభే ఇత్యర్థః - కాలోహి ఏక ఏవ సన్ననేకోపాధి సంబంధాన్నానాత్వేనోపచర్యత ఇతి తద్విదః ॥

 

రథావయవాయుధః = సుదర్శనచక్రధారి అయిన శ్రీహరి; అంతరితా హిమదీధితిం = మేఘాలవెనుక దాగిన దివాకరునిఖగకులాయ = పక్షిసమూహములనుకులాయ నిలాయితాం = గూళ్ళలో నివసింపజేయుటను (నిర్బంధించుటను) దదతం = ఇచ్చు; దిశాం = దిశలనుఅబోధకృతం = (మేఘాచ్ఛాదన చేత) తెలియనివ్వని; జలదకాలం = వర్షఋతువు; అపరథా = అన్యరూపమును; ఆప = ప్రాపించెను.

 

వర్షఋతు వర్ణనానంతరము కవి శరదృతువర్ణనమారంభించుచున్నాడు.

అంతట సుదర్శనచక్రధారి అయిన శ్రీహరి - మేఘాచ్ఛాదితుడైన దివాకరుని, పక్షిసమూహములను గూళ్ళయందే ఉండుటకు  నిర్బంధించు, మరియు దిశలను తెలియంగ జేయని వర్షఋతువు యొక్క భిన్నరూపమును అందుకొనెను.

 

విశేషము -

శ్రీకృష్ణభగవానుని దర్శనంతో ఋతువులు ఒక్కొక్కటి వరుసగా ఏతెంచినట్లు కవి సర్గ ఆరంభంలో నిర్దేశించినాడు.ఇక్కడ శ్రీహరియే శరత్కాల రూపాన్ని పొందినట్లు నిమంత్రిస్తున్నాడు.

హరి తన రూపాన్ని తానే చూస్తున్నాడని మాఘకవి వ్యక్తీకరణ. నాలుగవ సర్గలోనూ కవి - పర్వతరూపంలోని తనను - తానే హరిణ్యగర్భుడిగా చూస్తున్నట్టు వర్ణించినాడు.

ఈ అద్వైత భావనలు మాఘకవి వివక్షితాలే అయి ఉండవలె.

౪౨.

స వికచోత్పలచక్షుషమైక్షత క్షితిభృతోంకగతాం దయితామివ |

శరదమచ్ఛగళద్వసనోపమా క్షమఘనా మఘనాశనకీర్తనః ||

 

స అఘనాశనకీర్తనః వికచోత్పలచక్షుషం అచ్చం గళద్వసనోపమాక్షమఘనాం (అత ఏవ) క్షితిభృత అంకగతాం దయితామివ శరదం ఐక్షత ।

 

సర్వంకష

స ఇతి అఘానాం నాశనం నివర్తకం కీర్తనం యస్యసః - అఘనాశన కీర్తనః సహరి:-వికచం ఉత్పలమేవ చక్షుర్యస్యాస్తాం అచ్చం శుభ్రం గళతం స్రస్తమానం  యద్వసనం తస్యోపమా సాదృశ్యం - తస్యాః క్షమా యోగ్యాః ఘనా మేఘా యస్యాస్తాం అతఎవ క్షితి భృతః రైవతకస్వ-అంకగతాం ఉత్సంగగతాం దయితామిప స్థితాం ఇతి ఉత్ప్రేక్షా - శరదం ఐక్షత ॥

 

(శరదృతు వర్ణనము ౧౩ శ్లోకముల పర్యంతము కొనసాగును)

స అఘనాశనకీర్తనః = ఆ పాపవినాశ, పుణ్యకీర్తనుడగు హరి; వికచోత్పలచక్షుషం = పుండరీకముల వంటి కన్నులు గలదియునుఅచ్చం = శుభ్రమైనదియునుగళద్వసనోపమాక్షమఘనాం; గళద్వసనోపమా = క్రిందకు జారు వస్త్రములఁ బోలు; క్షమఘనాం = యోగ్యమేఘముల తాల్చిన(అత ఏవ = మఱియును) క్షితిభృత అంకగతాం = రైవతక పర్వతపు ఒడిని చేరినదయితామివ = అతివ వలేశరదం = శరత్కాలమును; ఐక్షత = దర్శించెను;

 

అంతట పుణ్యకీర్తనుడగు మధుసూధనుడు పుండరీకముల బోలు కన్నులుగలది,శుభ్రమైనది, మేఘములను వస్త్రములను క్రిందికి జార్చునది, రైవతకపర్వతరాజు ఒడిని చేరినది అయిన శరత్కాలమును వీక్షించెను.

౪౩.

జగతి నైశమశీతకరః కరైర్వియతి వారిదబృందమయం తమః |

జలజ రాజిషు నైద్రమదిద్రవన్న మహతామహతాః క్వ చ నారయః ||

 

అశీతకరః కరైః జగతి నైశం తమః అదిద్రవత్; వియతి వారిదబృందమయం తమః అదిద్రవత్; జలజరాజిషి నైద్రం (తదేవ) తమః అదిద్రవత్; (తథా హి) మహతాం అరయః క్వ చ న అహతా న ||

 

సర్వంకష

జగతీతి | అశీతకరః ఉష్ణాంశుః కరైః-స్వాంశుభిః - జగతి లోకే - నిశాయాం భావం వైశం | 'నిశా ప్రదోషాభ్యాం ఇతి వికల్పాదణ్ ప్రత్యయః - తమ స్తిమిరం అది ద్రవత్ ద్రావయతి స్మ-నిరస్తనానిత్యర్థః- 'ద్రు గతావితి ధాతో చఞ్యుపధాయా హ్రస్వః సన్వద్భావః "స్రవతి శృణోతి ద్రవతి ప్లవతి ప్రవతి చ్యవతీనాం వా" ఇతి అభ్యాసస్య వికల్పాదిత్వం- వియత్యాకాశే - వారిదబృందమయం మేఘసంఘరూపం-స్వార్థే మయట్ -తమః అదిద్రవత్ జలజ రాజిషు-నిద్రాం ఏవ నైద్రం నిమీలనం-తదేవ తమః తత్ - అది ద్రవత్ -తథా హి మహతాం మహాత్మనాం అరయః క్వ చ క్వ వా- నాహతా అహతా న - కింతు సర్వత్ర హతా భవంతీత్యర్థః ద్వితీయనిషేధ ప్రాపితస్య ప్రకృతార్థస్య హననస్య తృతీయేననిషేధః పునః క్వ ఇతి క్పశబ్ద సామర్థ్యాత్ ప్రకృతార్థ పర్యవ సానం- వైధర్మ్యేణసామాన్యాద్విశేషసమర్థనరూపో౽ర్థాంతర న్యాసః ।

 

అశీతకరః = ప్రభాకరుడు రవికరైః = కిరణములతో

జగతి = లోకముననైశం = రాత్రి యొక్క; తమః = చీకటినిఅదిద్రవత్ = తొలగించెను;

వియతి = అంతరిక్షమున; వారిదబృందమయం = మేఘసమూహముల; తమః = అంధకారమును; అదిద్రవత్ = తరిమివేసెను;

జలజరాజిషు = తామరపూలయందు; నైద్రం = వికసింపమి యను; (తదేవ = అట్లే) తమః = అలసత్వమును; అదిద్రవత్ = పోగొట్టెను;

(తథా హి = యుక్తమే) మహతాం = మహాసత్వుల యొక్కఅరయః = శత్రువులుక్వ చ = ఎచ్చటన అహతా న = నశింపకపోవుట ఉండదు? (నశించి తీరుదురని భావము)

 

ప్రభాకరుడు తన కిరణములతో లోకమున రాత్రి యొక్క చీకటిని తొలగించెను; అంతరిక్షమున మేఘసమూహముల అంధకారత్వమును తరిమెను; తామరలయందు వికసింపకపోవుట యను అలసత్వమును పోగొట్టి వికసింపజేసెనుఽది యుక్తమే. ఏలనన, మహాసత్వుల యొక్క శత్రువులు ఎచ్చట నశింపరు?

౪౪.

సమయ ఏవ కరోతి బలాబలం ప్రణిగదంత ఇతీవ శరీరిణామ్ |

శరది హంసరవాః పరుషీకృతస్వరమయూరమయూరమణీయతామ్ ||

 

'సమయ ఏవ శరీరిణాం బలాబలం కరోతి' ఇతి ప్రణిగదంతః ఇవ శరది హంసరవాః పరుషీకృతస్వరమయూరం రమణీయతాం అయుః |

 

సర్వంకష

సమయ ఇతి | సమయః కాల ఏవ సమయాశ్శపథాచార కాలసిద్దాంత సంవిద ఇత్యమరః - శరీరిణాం బలాబలే విప్రతిషిద్ధం చానధికరణ వాచీతి వికల్పాద్వంద్వైకవద్భావః । కరోతీతి - ప్రణిగదంతః ప్రతిపాదయంత ఇవేత్యుత్ప్రేక్షా - 'నేర్గదనద' ఇత్యాది నా ణత్వం- శరది-హంసరవాః పరుషీకృత స్వరాః నిష్ఠురీకృత నాదాః- మయూరాః యస్మిన్  కర్మణి- తత్పరుషీకృత స్వరమయూరం యథా తథా రమణీయతాం అయుః ప్రాప్తాః - యాతేః ర్లఞ్ - లఞ్ శ్శాకటాయన స్యైవేతి ఝేర్జుసా దేశః | 'ఉసృపదాంతాత్' ఇతి పరరూపతో. సంహితాయాం 'డృ లోపే ఫూర్వస్య దీర్ఘోణ' ఇతి దీర్ఘః - శరత్ ప్రావృషోర్హం సమయూరకూజిత మాధుర్యవిపర్యయదర్శనాత్ కాల ఏవ ప్రాణినాం బలాబలనిదానమితి వ్యక్తమభూదిత్యర్థః ॥

 

'సమయ ఏవ = కాలము మాత్రమే; శరీరిణాం = జీవులనుబలాబలం = బలవంతులను, శక్తిహీనులనుకరోతి = చేస్తుంది; ఇతి = అని; ప్రణిగదంతః ఇవ = స్వనములు చేయుచున్నట్లుశరది = శరత్కాలమున; హంసరవాః = హంసలనాదములు; పరుషీకృతస్వరమయూరం; పరుషీకృత = నిష్ఠురమైన; స్వరమయూరం = నెమళ్ళక్రేంకారశబ్దముల; రమణీయతాం = సొగసును; అయుః = పొందెను;

 

"సమయమే ప్రాణుల బలాబలాలను నిర్ణయించును" - అని కలస్వనములు చేయుచున్నట్టు శరత్తున హంసల స్వనములు నిష్ఠురమైన నెమళ్ళ క్రేంకారవముల సొగసును జయించినవి.

 ౪౫.

తనురుహాణి పురో విజితధ్వనైర్ధవళపక్షవిహంగమకూజితైః |

జుగళురక్షమయేవ శిఖండినః పరిభవో౽రిభవో హి సుదుస్సహః ||

 

పురః ధవళపక్షవిహంగమకూజితైః  విజితధ్వనైః శిఖండినః తనురుహాణి అక్షమయా ఏవ జగళుః (యుక్తం చేత్) అరిభవః పరిభవః సుదుస్సహః హి  ।

 

సర్వంకష

తనురుహాణీతి || ఫురో౽గ్రే-ధపళ పక్ష విహంగమాః హంసపక్షిణ 'హంసాస్తు శ్వేతగరుత' ఇత్యమరః- తేషాం కూజితైః- విజితధ్వనైః శిఖండినో మయూరస్య తనురుహాణి బర్హాణి ఇగుపధలక్షణః క ప్రత్యయః- ఆక్షమయా హంసకూజిత ఈర్ష్యేణ యేవ - జగళుః గళంతి స్మ -కాలప్రయుక్తస్య బర్హగళనస్యాక్షమా హేతుకత్వముత్ప్రేక్షత ఇతి గుణహేతూత్ప్రేక్షా యు క్తం చేతదిత్యాహ - అరిభవః పరిభవః సుదుస్సహః ఆత్యంతాసహ్యో హి - పరాజయ దుఃఖితస్యాంగ సాదో యజ్యత ఇతి భావః - కారణేన కార్య సమర్థనరూ పోర్థాంతరన్యాసః సచాక్షమోత్ప్రేక్షయా సంకీర్యతే |

 

పురః = మునుపుధవళపక్షవిహంగమకూజితైః = హంసల కలరవము చేతవిజితధ్వనైః = జయించబడిన ధ్వనులు గల; శిఖండినః = నెమళ్ళచేత; తనురుహాణి = నెమలి ఈకలు; అక్షమయా ఏవ = అసూయ చేతనే; జగళుః = రాలినవి; (యుక్తం చేత్ =సబబే కదా) అరిభవః = శత్రువు చేత పొందిన; పరిభవః = అవమానముసుదుస్సహః హి = భరింపనలవి గాదు, నిక్కము.

 

ఇదిమునుపు హంసలకలస్వనము తమ ధ్వనులను జయించుట చేత నెమళ్ళు తమ శరీరమందు గల నెమలికన్నులను అసూయచేతనే వదల్చినవి. సబబే కదా! శత్రువు చేసిన పరాభవమును సహించుట మానధనులకు అత్యంత దుస్సహమే!

౪౬. 

అనువనం వనరాజివధూముఖే బహుళరాగజవాధరచారుణి |

వికచబాణదళావళయో౽ధికం రురుచరే రుచిరేక్షణవిభ్రమాః ||

 

అనువనం బహుళరాగజవాధరచారుణి వనరాజివధూముఖే రుచిరేక్షణవిభ్రమాః వికచబాణదళావళయః అధికం రురుచిరే ।

 

సర్వంకష

అనువనమితి || అనువసం ప్రతివనం-బహుళో రాగోయస్యాస్సా చాసౌ జవా చ ఉడుపుష్పం - 'ఉడుపుష్పం జవా' ఇత్యమరః - పుష్పేషుజాతి ప్రభృతిత్వాత్స్వలింగతా- సైవాధరః- తేన చారుణి రమ్యే వనరాజిరేవ వధూః తస్యాః ముఖం ప్రాగ్భాగః-తదేవ-ముఖం వక్త్రమితి శ్లిష్ట రూపకం తస్మిన్ రుచిరాణాం ఈక్షణానాం - విభ్రమ ఇవ విభ్రమః శోభాః యాసాం తాః- వికచబాణదళావలయః నీలఝుంటీపత్ర ప జయః - 'బాణో౽స్త్రీ నీలఝింట్యాం చే'తి వైజయంతీ. అధికం రురుచిరే శుశుభిరే - ఉపనూనరూపకయో స్సంకరః ।

 

అనువనం = ప్రతి తోటబహుళరాగజవాధరచారుణి = మంకెనపువ్వులా బాగా ఎఱ్ఱని అందమైన పెదవి గలది;   వనరాజివధూముఖే = వనముల సమూహము అనే అతివ ముఖంలో; రుచిరేక్షణవిభ్రమాః = చంచలమైన చూపులు గలవికచబాణదళావళయః = వికసించిన నీలిగోరంటపూరేకులు; అధికం రురుచిరే = మిక్కిలి శోభించినవి;

 

మంకెనపువ్వులాంటి ఎఱ్ఱని పెదవులు, విడిగిన నీలిగోరంటపూరేకుల్లాంటి కళ్ళు, వనసమూహమనే ముఖము కలిగిన స్త్రీ - ఇక్కడ తోట తోట లోనూ ఎంతో మనోహరంగా ప్రకాశిస్తూంది.

 

విశేషముః

Barleria Christata - నీలిగోరంటపువ్వు. ఈ పూలు పొదల్లో విరివిగా పూస్తాయి. అందుకనే కాబోలు కవి చంచలమైన కనుల పోలిక తెచ్చాడు. మంకెన/దాసాన పువ్వు ఒక తీగకు ఒకటో రెండో తక్క ఎక్కువగా పూయదు. ాందుకని దీనితో అధరాన్ని పోల్చాడు. ఈ వర్ణన ఔచిత్యంతో శోభిస్తూంది.

౪౭.

కనక భంగపిశంగదళైర్దధే సరజసారుణ కేసర చారుభిః |

ప్రియవిమానిత మానవతీరుషాం నిరసనైరసనైరవృధార్థతా||

 

కనకభంగపిశంగదళైః సరజసారుణకేసరచారుభిః ప్రియవిమానితమానవతీరుషాం నిరసనైః అసనైః అవృతార్థతా దధే ।

 

సర్వంకష

కనకేతి|| కనకభంగాః స్వర్ణఖండాః ఇవ - పిశంగాని దళాని యేషం తైః - సహరజసా సరజసం 'అచతురేత్యాదినా సాకల్యార్థే అవ్యయీ భావః - సమాసాంత నిపాతః - బహువ్రీహ్యర్థే లక్షణయా తు-సరజస్కాత్యర్థః - ఆత ఏవ న సరజస మిత్యవ్యయీభావ ఇతి వామనః - ఆథవా-మహాకవిప్రయోగప్రాచుర్యాదవ్యయీభావదర్శనం ప్రాయిక మితి పక్షాశ్రయణాత్ బహువ్రీహ్యర్థో౽పి సాధురేవ-తథా చ - సరజసం సరజసా యే.అరుణ కేసరాః- వైశ్చారుభిః తథా ప్రియైః విమానితా అవమానితా మానవత్యః మానిన్యః తాసాం- యా రుషాం రోషాస్తాసాం నిరసనైః నిరాసకై:-అస్యతే కర్తరిల్యుట్ - అసనైః ప్రియక ప్రసూనైః 'సర్జకాసన బంధూకపుష్ప ప్రియక జీవకాః'ఇత్యమరః - అవృథార్థతా మాననిరాసకత్వాత్ -అస్యంతీత్యసనానీత్యన్వర్థ నామకత్వం - దధే దధ్రే-దధాతేః కర్మణి లిట్ ।

 

కనకభంగపిశంగదళైః = పసిడితునకల్లాగా ఉన్న రేకులు గలదైసరజసారుణకేసరచారుభిః = పుప్పొడితో కూడిన కెంపు కేసరములతో ఒప్పారునదైప్రియవిమానితమానవతీరుషాం; ప్రియవిమానిత = ప్రియునితో తిరస్కృత అయి; మానవతీ= మానిని యొక్క; రుషాం = రోషమును;   నిరసనైః = దూరం చేయుదాని చేతఅసనైః = అసనము అనెడు బంధూకకుసుమము; అవృథార్థతా = వ్యర్థము కాని భావముతోదధే = వహించెను.

 

పసిడితునకల్లాగా రేకులు గలది, పుప్పొడితో కూడిన కెంపు కేసరములతో శోభించేది, ప్రియునితో తిరస్కరింపబడిన మానిని రోషాన్ని దూరం చేసేది అయిన మంకెనపువ్వు - తన పేరు అసన - అన్న దాన్ని సార్థకం చేసుకుంది. (రోషాన్ని నిర్-అసన చేస్తున్నది. అంటే అసన అన్న ప్రతిషేధార్థం ఈ కుసుమానికి శోభిస్తుందని తాత్పర్యం)

౪౮.

ముఖసరోజరుచం మదపాటలామనుచకార చకోరదృశాంయతః |

ధృతనవాతపముత్సుకతామతో న కమలం కమలంభయదంభసి ||

 

ధృతనవాతపం అంభసి కమలం యతః మదపాటలాం చకోరదృశాం ముఖసరోజరుచం అనుచకార అతః కం ఉత్సుకతాం  న అలంభయత్ ;

 

సర్వంకష

ముఖసరోజేతి । ధృతః నవాతపో యేన తత్ ధృతననాతపం- బాలాతపతామ్ర మిత్యర్థః అంభసి కమలం అంభస్థ కమలం అంభో గ్రహణం స్థలకమలనివృత్త్యర్ధం ఆమ్లానతా ద్యోతనార్థం వా యతో మదేన పాటలాం మదపాటలాం. చకోరదృశాం స్త్రీణాం ఘుఖసరోజరుచం ముఖారవిందశోభాం - అనుచకార అనుపకారాభ్యాం కృఞ్ ఇతిపరస్మైపదనియమః- అతో౽నుకరణాద్దేతోః కం పుమాంసం. ఉత్సుకతాం ప్రేయసీముఖావలోకనకొతుకతాం-నాలంభయత్ నాగమయత్ -సర్వం చాలంభయదేవ తత్ స్మారకత్వాదిత్యర్థ: ఏతేనౌత్సుక వస్తునా కార్యేణ కారణభూతా కమలదర్శనోత్థా ముఖస్మృతిః వ్యజ్యత ఇతివస్తునా౽లంకారధ్వని:- ఏతేన స్వయం స్త్రీ ముఖసదృశతయా కమలం స్వాధారేంభసి పుంసఉత్సుకతా మలంభయదితి రంగరాజ వ్యాఖ్యానం 'కాకస్య కార్ష్ణ్యద్దవళః ప్రాసాదః' ఇతి వదసంగతమితి మంతవ్యమ్ -  అలంభయదితి లభేణ్యంతా ల్లఞ్ లభేశ్చా ఇతి నుగాగమః - లభేశ్చాత్ర ప్రాప్త్యుపసర్జన గత్యర్థత్వాత్ 'గతివృద్ధి ఇత్యాదినా' ఆణికర్తుః కర్మత్వే ద్వికర్మకతా-గత్యుపసర్నజక ప్రాప్త్యర్థత్వే తు వైపరీత్యమిత్యుక్తం-సితం సితిమ్నా ఇత్యత్ర |

 

ధృతనవాతపం = నీరెండ (చాయ) ను తాల్చిన; అంభసి కమలం = నీటి తామర; యతః = ఏ; మదపాటలాం = మత్తుతో వివశయైన; చకోరదృశాం = వాలుచూపుల వన్నెలాడి యొక్క; ముఖసరోజరుచాం = ముఖారవింద శోభ (అరుణిమ)ను; అనుచకార = అనుసరించెనో; అతః = అదే కారణంతో; కం = జతగాని; ఉత్సుకతాం = ఉత్కంఠను; న అలంభయత్ ? = అనుసరించలేదు? (కమలాన్ని చూచిన ప్రియుడు, అందులో ప్రేయసి ముఖపు శోభ కనిపించి ఉత్కంఠ పొందాడని భావం)   

 

శరత్తున ఉషోదయాన నీరెండ ఛాయను తాల్చిన నీటికమలం - (రాత్రి జరిగిన ప్రణయకార్యం చేత) కైపెక్కిన వన్నెలాడి ముఖపు రక్తిమను  అనుసరించి, ఎఱ్ఱగా వికసించింది.

అదే కారణంతో(కమలంలో తన ప్రియురాలి ముఖకాంతి కనబడి) - ప్రియుడు కూడా వికసించిన కమలాన్ని చూచి పరవశించిపోయాడు.

 

విశేషాలుః

కమలాన్ని చూడగానే ప్రియునికి అందులో ఎరుపు చూసి ప్రియ ముఖం కనిపించింది అని వస్తువు.

అంటే ప్రియురాలి ముఖం కమలం లా ఉంటుంది అని వ్యంగ్యం. వస్తుతః అలంకారధ్వని అని వ్యాఖ్యాత.

౪౯.

విరతసస్య జిఘత్సమఘట్టయత్ కలమగోపవధూర్నమృగవ్రజమ్ |

శ్రుతతదీరితకోమలగీతక ధ్వనిమిషే౽నిమిషేక్షణమగ్రతః ||

 

ఇషే కలమగోపవధూః శ్రుతతదీరితకోమలగీతకధ్వనిం (అత ఏవ) అగ్రతః అనిమిషేక్షణం విరతసస్య జిఘత్సం మృగవ్రజం న అఘట్టయత్ ।

 

సర్వంకష

విరతేతి || ఇషే ఆశ్వయుజే మాసి - 'స్యాదాశ్విన ఇషోప్యాశ్వయుజోపీ'త్యమరః - కలమగోపీ శాలిగోప్త్రీ సా చ అసావధూశ్చ కలమగోపవధూః, 'స్త్రియాఃపుంవదిత్యాదినా పుంవద్భావః - శ్రుతః ఆకర్ణితః తయా వధ్వా = ఈరితన్యాలాపితస్య-కోమలగీతకస్య మధురగానస్య-ధ్వనిర్యేనతం - శ్రుతతదీరితకోమలగీతకధ్వనిం - అత ఏవ - అగ్రతో౽గ్రే - న నిమిషతి విస్మయానందాభ్యామిత్యనిమిషం- ఇగుపధలక్షణః క ప్రత్యయః = తదీక్షణం యస్య తం అనిమిషేక్షణం-ఘత్తుం అత్తుం వా ఇచ్చా జిఘత్సా-ఘసేరదా దేశాద్వా సన్నంతాద ప్రత్యయాత్ స్త్రియామ ప్రత్యయః - సావిరతా యస్యతం - విరతసస్య జిఘత్సం-ఉపసర్జన హ్రస్వః మృగ వ్రజం నాఘట్టయత్ నా తాడయత్ -సిద్ధే సాధన ప్రయోగా యోగాదితి భావః అత్ర దండసాధ్యే మృగనివారణే కాకతాలీయ న్యాయేన-సుఖార్థస్య గానస్య కారణత్వ కథనాత్ సమాధిరలంకారః- 'కారణాంతరయోగాత్ కార్యసుకరత్వం సమాధి' రితి లక్షణాత్ ।

 

ఇషే = అశ్వీయుజమాసమునకలమగోపవధూః = ధాన్యరక్షకులైన కాపు వధువులుశ్రుతతదీరితకోమలగీతకధ్వనిం = తమకు వినవచ్చిన మధురాలాపనముల గీతికల నాదము గల;  (అత ఏవ = మరియు) అగ్రతః = ఎదుట; అనిమిషేక్షణం = రెప్ప వేయని కనులు గల; విరతసస్య జిఘత్సం = సస్యములపై  ధ్యాస నశించిన; మృగవ్రజం = మృగపరివారమునున అఘట్టయత్ = అదిలించలేదు;

 

అశ్వీయుజమాసమున కాపుయువతులు తమ చేలలో మధురాలాపములతో కూడిన గీతికలను గానము చేయుచుండగా, ఆ గానములను విని, మేతపై ధ్యాస నశించిన పశువులు రెప్పవేయక చూచుచుండినవి. అట్లు నిశ్చేష్టులైన మృగములను ఆ గోపస్త్రీలు అదిలింపరైరి.

౫౦.

కృతమదం నిగదంత ఇవాకులీకృత జగత్ త్రయమూర్జమతంగజమ్ |

వవురయుక్ఛదగుచ్చ సుగంధయః సతత గాస్తతగానగిరో౽ళిభిః ||

 

అయుక్ఛదగుచ్ఛసుగంధయః అళిభిః తతగానగిరః సతతగాః కృతమదం (అత ఏవ) అకులీకృతజగత్త్రయం ఊర్జమతంగజం నిగదంత ఇవ వవుః ।

 

సర్వంకష

కృతే । అయుజో విషమాశ్ఛదాః - యేషాం తే - అయుక్చదా స్సప్తపర్ణాః - తేషాం గుచ్ఛే స్తబకైః - సుగంధయః శోభనగంధాః-గజమదగంధిన ఇని భావః - ఆళిభిః భృంగైః తతా విస్తృతాః గానగిరోయేషాం తే - అళిభిః గీయనూనా ఇత్యర్థః :- సతతం గచ్చంతీతి సతతగాః సదాగతయః వాయవ ఇతి యావత్ - కృతమదం జనితమదం. అత ఏవ ఆకులీకృత జగత్త్రయం ఊర్జః -కార్తికికః -  బాహుళోర్జౌ కార్తికిక ఇత్యమరః స ఏవ మతంగజ ఇతి రూపకం-తం నిగదంత ఇన - అయమాగచ్చతీత్యావేదయంత ఇవ వవుః వాంతి స్మ మత్తమాతంగమనే౽ప్యేవంవిధవాయువహన సంభవాదియముత్ప్రేక్షా । రూపకం తు అంగమస్యాః ॥

 

అయుక్ఛదగుచ్ఛసుగంధయః = ఏడాకుల యఱటిచెట్ల తతుల (స్పర్శచే) పరిమళ భరితములుఅళిభిః  = తేంట్ల; తతగానగిరః  = సమూహముల మధుర నాదములతో కూడినవి అయిన; సతతగాః = గాలులుకృతమదం = మదించినవై; (అత ఏవ = ఇంకనూ) అకులీకృతజగత్త్రయం = మూడులోకములములను కలవరపరచు; ఊర్జమతంగజం = కార్తికమాసమను గజముయొక్క మదజలమునిగదంత ఇవ =  వెలువడుతున్నది అన్నట్టులువవుః = వీచినవి  ।

 

ఏడాకుల యఱటిచెట్ల వరుసల స్పర్శచే పరిమళ భరితములై; తేంట్ల ఝుంకారనాదాలచేత నిండి, పరవశత్వం కలిగించే చల్లని గాలులు, మూడులోకాలను కలవరపర్సుతూ, గజమదస్రావసమయమమిది యన్నట్టులు వీచినవి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.