శిశుపాలవధమ్ ఆరవ సర్గ తెలుగు టీక, తాత్పర్యములు - ముగింపు (71 - 79)
౭౧. వపురంబువిహారహిమం శుచినా రుచిరం కమనీయతరా గమితా! రమణేన రమణ్యచిరాంశులతారుచి రంకమనీయత రాగమితా || శుచినా అంబువిహారహిమం రుచిరం వపుః గమితా (అత ఏవ) కమనీయతరా అచిరాంశులతారుచిః రాగమితా రమణి రమణేన అంకం అనీయత । సర్వంకష ఆథ ఏకేన గ్రీష్మమాహ। వపురితి || శుచినా గ్రీష్మేణ ప్రయోజక కర్త్రాన్ అంబువిహారేణ జలక్రీడయా- హిమం శీతం - అత ఏవ - రుచిర ముజ్జ్వలం వఫుర్దేహం -గమితా ప్రాపితా గతి బుద్ధీత్యాదినా ఆణికర్తుః కర్మత్వం ప్రధాన కర్మణ్యాఖ్యే యేలాదీనా హృత్ వికర్మణా మిత్యభిహితత్వం చ అత ఏవ - కమనీయతరా రమణీయతరా - అచిరాంశుః లతేవ అదిరాంశులతా విద్యుల్లతా తస్యాః రుచిరివ రుచిర్యస్యాస్పా- అచిరాంశులతారుచి రిత్యుపమాద్వయం తథా రాగమనురాగం-ఇతా ప్రాప్తా - ఇణి కర్తరి క్తః - రమణి - రమణేన ప్రియేణ-అంకముత్సంగం అనీయత నీత్వా నీతృ హృకృష్వహామితి నయతే ద్విర్ కర్మకతా - శేషం పూర్పవత్-తోటక వృత్తముక్తమ్ । శుచినా = గ్రీష్మఋతువు వలన ; అంబువిహారహిమం = జలక్రీడచే శుభ్రమై ; రుచిరం వపుః = అందమైన గాత్రమును ; గమితా = పొందినది ; ( అత ఏవ = మఱియు) కమనీయతరా = అధికముగా సొగసైన ; అచిరాంశులతా...