పోస్ట్‌లు

నవంబర్, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

వీచిక - 6

చిత్రం
అపశంకమంకపరివర్తనోచితాశ్చలితాః పురః పతిముపైతుమాత్మజాః | అనురోదతీవ కరుణేన పత్రిణాం విరుతేన వత్సలతయైష నిమ్నగాః || (శిశుపాలవధము - నాలుగవ సర్గ - 47) అపశంకం = నిశ్చింతగా, అంకపరివర్తనోచితాః = సహజముగ నొడిని తిరుగాడెడు, ఆత్మజాః = బిడ్డలు పురః = ఇప్పుడు, పతిముపైతుం = మగని చేరుటకునై, చలితాః = వెడలినవి (కాగా), కరుణేన = దుఃఖముతో, అనురోదతీ ఇవ = శోకించుచున్నట్టుగా , పత్రిణాం = పక్షుల, విరుతేన = కూజితములతో, ఏష నిమ్నగాః = ఈ శిఖరములు, వత్సలతః = వాత్సల్యముతో (స్థితాః = ఉన్నవి) తాత్పర్యము: తన ఒళ్ళో ఆడుకునే చిన్ని పిల్లలైన నదీనదులు పెరిగి పెద్దవై, మగడయిన సముద్రుని దగ్గరకు వెళ్ళిపోతుంటే అక్కడి పక్షులు కరుణతో దుఃఖిస్తుంటే వాత్సల్యంతో వాటిని చూస్తున్నట్టు ఉన్నవి రైవతక పర్వత శిఖరాలు. నా అనువాదం.   కం || ఒడి నడయాడెడు బిడ్డలు అడుగులిడి మగడు కడలిని యందగ బోవన్ వడిపడి విహగము లోయని సడులిడినట్టుగ అరిమిలి శైలములుండెన్.

సంస్కృత సౌరభాలు - 21

చిత్రం
సంస్కృతసాహిత్యంలో రామాయణ మహాభారతాదుల తర్వాత శ్రవ్యకావ్యాలకు ఒక ఒరవడి కల్పించినది కవికులతిలకుడైన కాళిదాసు అయితే కావ్యసాహిత్యాన్ని కొన్ని వందల సంవత్సరాలు, అనేక తరాలు తరచి తరచి చదువుకుని, ఆనందించి, ఇది మా దేశభాష, ఇలాంటి కావ్యం మరొక భాషలో సృష్టించడం కాదు కదా, దీనిని మరొక భాషలో ఇంతే భావసాంద్రతతో, ఇదే విధమైన ప్రౌఢిమతో, సున్నితత్వం తో అనువదించడం కూడా అసాధ్యమని చాటి, భరతవర్షం గర్వించేలా చేసిన మహానుభావుడు మాఘుడనే మహాకవి. ఈయన రచించిన కావ్యం పేరు శిశుపాలవధమ్. దీనినే మాఘం అంటారు. ఇది ఇరవై సర్గల సాహిత్య మృష్టాన్నభోజనం.  అగస్త్యుడు సముద్రాలను పుక్కిటబట్టినట్టు, ఈ మహాకవి సంస్కృతభాషను పుక్కిటబట్టాడంటే అతిశయోక్తి కాబోదు. "నవసర్గగతే మాఘే నవశబ్దో న విద్యతే" అని ఒక సూక్తి. అంటే తొమ్మిది సర్గలు మాఘం చదివిన తర్వాత సంస్కృతంలో కొత్త శబ్దం వినబడదట.  అంతే కాదు, ఈ కవి సంస్కృతభాషలో పలుపోకడలు చూపాడు. "ద" గుణింతంతో ఏకాక్షరశ్లోకం, చక్రబంధం, గోమూత్రిక ఇత్యాది బంధకవిత్త్వాదులూ, శబ్దచిత్రాలు మాఘంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రయోగించిన కవి ఈయన. "మాఘే మేఘే గతం వయః" అని కాళిదాస, మాఘ కావ్యాలకు ...