సంస్కృత సౌరభాలు - 20
మిత్రమపి యాతి రిపుతాం స్వస్థానాత్ ప్రచ్యుతస్య పురుషస్య | కమలం జలాదపేతం శోషయతి రవిర్న తోషయతి || స్వస్థానాత్ = తన నెలవు నుండి ప్రచ్యుతస్య = తొలగిన పురుషస్య = మనుజునికి మిత్రం అపి = మిత్రుడు కూడా రిపుతాం = శత్రుత్వమును యాతి = పొందును. రవిః = సూర్యుడు జలాత్ = నీటి నుండి అపేతం = వేరు చేయబడిన కమలం = పద్మమును శోషయతి = ఎండిపోయేలా చేస్తాడు. న తోషయతి = వికసింపజేయడు. (మిత్రం - నపుంసకలింగమైతే స్నేహితుడని, మిత్రః పుల్లింగమైతే సూర్యుడని సంస్కృతంలో అర్థం) ఈ పద్యానికి తాత్పర్యం ఇది. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ. తెలుగైనా, సంస్కృతమైనా నీతి అంటే అలా వెన్నతినిపిస్తున్నట్టు, అమ్మ చేతి గోరుముద్దలాగా, నాన్నచిటికెన వ్రేలి ఆసరా లాగా అనిపించాలి. వేప బెత్తం పక్కన బెట్టుకుని అయ్యవారు ఝళిపిస్తున్నట్టుగా ఉండరాదు మరి. ఇంకోరకంగా - అంటే పెద్దవాళ్ళ భాషలో చెప్పాలంటే - అల్పాక్షరరమణీయం యః కథయతి నిశ్చితం స వై వాగ్మీ | బహువచనమల్పసారం యః కథయతి విప్రలాపీ సః || ఎవడైతే తక్కువ అక్షరాలలో, రమణీయంగా మాటలాడతాడో ...