పోస్ట్‌లు

జూన్, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

పద్యసంభాషణ

ఒక సంస్కృతకవికీ అతని మిత్రునికీ సంభాషణ. "కస్త్వం భోః!" "కవిరస్మి" "కాప్యభినవా సూక్తిః పఠేతామ్" "త్యక్త్వా కావ్యకథైవ సంప్రతి మయా" "కస్మాదిదం శ్రూయతామ్" "యః సమ్యగ్వినక్తి దోషగుణయోః సారం స్వయం సత్కవిః సోऽస్మిన్ భావక ఏవ నాస్త్యథ భవేద్దైవాన్న నిర్మత్సరః." అతని ఏడుపు తెలుగులో అనువదిస్తే ఇలా ఏడిచింది. ఉ || "నీవెవడోయి?" "నే కవిని". "నిండుగ నొక్కటి కైత జెప్పుమో యీ?" "విడిపుచ్చినాను కవి యేయను మాటను." "ఎందుకోసమో?" "భావకుడైన దోషగుణ భావమెఱుంగెడు సత్కవెవ్వడో? దైవవశంబునట్టి కవి దక్కిన, మచ్చరి గాకనేరడే?"

రావణాసురుని ఆశ్చర్యం

చిత్రం
ఉ || ఒచ్చెము గాదె నా పగతుడొక్కరుఁడీ జటి యన్న, నందునన్  జచ్చిన వారలందరును సత్తువ బోరిన కచ్చిపోతులే అచ్చరలింటిగొంగ, వెనుకాడని నిద్దురవాఁడు నీటులే  చిచ్చరకంటిచెల్వుని పెను చెన్నగు కౌనులు ఏలనింకనో? నా శత్రువు ఒక తాపసి! అందునా అతని చేత చచ్చిన వారందరూ రాక్షసకులం వీరులు! స్వర్గాన్ని జయించిన ఇంద్రజిత్, కుంభకర్ణుడూ వ్యర్థమైపోయారే! ఈశ్వరుని మెప్పించిన ఈ రావణుని భుజాలు ఎందుకిక? ధిక్.... ఒచ్చెము = అవమానము అచ్చరలింటిగొంగ = అప్సరలున్న నెలవుకు శత్రువు = స్వర్గానికి శత్రువు = ఇంద్రజిత్తు జటి = తాపసి వెనుకాడనినిద్దురవాడు = కుంభకర్ణుడు ఈటులు = వ్యర్థులు చిచ్చరకంటిచెల్వు = నిప్పు కన్ను ఉన్నవానికి ఇష్టుడు = రావణుడు కౌనులు = మూపులు హనుమన్నాటకం అని ఒక ప్రాకృతనాటకంలో రావణాసురుడు రాముణ్ణి చూసి అలా అనుకొంటాడట. ఈ నాటకం ఇప్పుడు దొరికినట్లు లేదు, కానీ అక్కడక్కడా పద్యాలు వేరే కావ్యాలలో దొరుకుతున్నాయి. ఇందులో చమత్కారం ఏమంటే - ఈ పద్యంలో ప్రతి నామవాచకమూ వ్యంజకమై కూర్చుందట. (అంటే ప్రతి నామవాచకానికి జాగ్రత్తగా చూస్తే మరో అర్థం కనిపిస్తుందని సూత్రకారుడు) పైన నా (అచ్చ) తెనుగు సేత. (స్వేచ్ఛానువాదం. యథాతథా...