సమాసోక్తి అలంకారం
 
    "యత్ర ఉక్తౌ గమ్యతే అన్యః అర్థః సా సమాసోక్తిరుదితా" అని సమాసోక్తి లక్షణనిర్వచనమ్.       ఉక్తి - అంటే చెప్పిన మాట. అది ఇంకొక అర్థాన్ని ఆశ్రయిస్తే అది సమాసోక్తి అలంకారం.         ఉదా:- రాగ మెసఁగ చకిత రాణి నిశ ముఖము నందుకొనియె ఱేడు చందురుండు. రాలెనంతట తిమిరాంశుకమ్ము. చెలఁగి నిశయుఁ దానిని గమనింప దయ్యె. (నా అనువాదానికి మాతృక క్రింద) ఉపోఢరాగేణ విలోల తారకం తథా గృహీతం శశినా నిశాముఖమ్ | యథా సమస్తం తిమిరాంశుకం తయా పురోऽపి రాగాద్గలితం న లక్షితమ్ ||   -  నిశ అనేది అమ్మాయి పేరు. ఆమె మగని పేరు చందురుడు.చంద్రుడు ఆమె ముఖాన్ని  ముద్దాడాలని చేతిలోకి తీసుకోగానే పరవశంతో ఆమె నీలి మేలిముసుగు (నీలజాలికా  అన్న వస్త్రాన్ని నవోఢలు ధరిస్తారని కామశాస్త్రం) జారిపోయింది. ఆ అమ్మాయి  మైమరపుతో దాన్ని పట్టించుకోలేదు.     తిమిరాంశుకం = నల్లటి వస్త్రము అని ఇక్కడ అర్థము. ముఖము = మోము కానీ ఈ పద్యం చదవగానే స్ఫురించే అర్థం ఇలా ఉంటుంది. ఎఱుపు  రంగు చంద్రుడు రాత్రి ఆరంభంలో ఉదయించగానే ఆయన వెలుగుకు తిమిరంతో  మిశ్రితమైన నక్షత్రాలు చెదరినై. రాత్రి మాత్రం చందురుడు వచ్చిన ఆనందంతో ఆ  విషయం పట్టించుకోలేదు.     ఇక్కడ తి...