పోస్ట్‌లు

జూన్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

క్రొందలిరుటాకులు

చిత్రం
  శిశుపాలవధం లో నాలుగవ సర్గ అనుశీలిస్తూ, కనుక్కున్నదేమంటే - మాఘుని కవిత్వం విస్తృతి నిష్టం. ఈ విస్తృతి ఛందోపరమైనది కావచ్చు, అలంకారసంబంధి కావచ్చు, శబ్ద సంబంధమైనది  కావచ్చు , విలక్షణమైన భావాలకు చెందినది కావచ్చు. ఇవి సాధారణ లక్షణాలు. అటుంచితే ఈ కవి యమకచపలుడని, కొన్ని సార్లువికటమైన భావాలను కూడా నిర్మొహమాటంగా కవిత్వంలో సంతరించటం ఉందని కనుక్కున్నాం. ఇవి విశిష్టలక్షణాలు. ఇట్టి లక్షణాల పర్యవసానంగా మాఘకవి - అనుశీలన అరణ్యప్రయాణం అని, ఇది శ్రమదాయకం, ఆసక్తిదాయకం, ఎంతో విభ్రాంతి గొలిపేది కూడానని ఊహించుకున్నాం. ఒక విస్తారమైన అరణ్యంలో ఆయాసపూర్వకమైన, గహనమైన భాగం దాటి అరణ్యమధ్యంలో వస్తే చిన్నచిన్న జనపదాలు, ఆ జనపదాల ప్రజలు అరణ్యమధ్యంలో సాగు చేసుకున్న మాగాణులు, చుట్టుపక్కల కొన్ని పూలచెట్లు, మనోహరమైన నదీప్రవాహాలు, పక్షుల కలరవాలు, అరణ్యజంతువుల పిలుపులు..ఇలా మనోహరమైన భాగం కనిపిస్తుంది. అరణ్యమధ్యంలో కొంతకాలం నివసించి అక్కడ భూభాగంతో మమేకం అయితే ఆ అనుభూతుల పరంపరయే వేరు. సరిగ్గా ఆ అనుభూతి ప్రపంచానికి మాఘుడు ఋతువర్ణన ద్వారా తీసికెళతాడు. ఈ ఘట్టంలో ఆయాసపూరితమైన భావాలు ఉన్నాయి కానీ గుణప్రధానమైన శ్లోకాల సం...