పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

వాల్మీకి చూపిన శరత్తు

మా పెరట్లో బాదాం చెట్టు కుప్పలు కుప్పలుగా ఆకులు రాలుస్తూ యెండిపోతూ వచ్చింది కొన్నాళ్ళక్రితం. (రోజూ ఎండి రాలిపోయిన ఆకులు ఊడ్చుకోవడం పెద్దప్రయాస). ఇలా కొన్నాళ్ళు గడిచిన పిదప మొత్తం చెట్టంతా బోసిగా తయారయింది. చెట్టంతా కొమ్మలే. ఎక్కడో ఒకచోట ఒకట్రెండు ఆకులు.  రెండు రోజుల తర్వాత. మొత్తం చెట్టు ఆకుపచ్చ రంగుతో, తలిరుటాకులతో నిండిపోయింది. అదో గమ్మత్తు. చూడాలే కానీ, అధ్యయనం చెయ్యాలే కానీ ప్రకృతికన్నా గొప్ప కవిత్వం ఎక్కడ ఉంటుంది? ****** కిష్కింధకాండ చదువుతున్నాను. దీన్ని పారాయణం అనవచ్చో కూడదో నాకు తెలియదు.  పారాయణాలు, వ్రతాలు, దీక్షలు, పూజలు, ఉపవాసాలు - ఇవి నా ఒంటికి సరిపడవు. ఆ నెపంతో చదువుకోవచ్చు ఏదో కొంత.  ప్రతి రోజూ ఉదయం...అలా ఆరంభించినా...అప్పుడప్పుడూ కొన్ని చమక్కులు తప్ప పెద్దగా స్పందనల్లేవు. మొత్తం గా పరిస్థితి ఓ రోజు మారిపోయింది. ఆ ఒక్క శ్లోకం ఇదీ. విపక్వ శాలిప్రసవాని భుక్త్వా  ప్రహర్షితా సారసచారుపంక్తిః | నభస్సమాక్రామతి శీఘ్రవేగాః వాతావధూతా గ్రథితేవ మాలా|| నేలపై రాలిన బియ్యపు గింజలను ఆరగించి ఆనందంగా ఆకసానికి యెగిరిన కొంగలబారు...గాలికి బలంగా విసిరేసిన పూలదండలా ఉంది! ఆ శ్...