పోస్ట్‌లు

జనవరి, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

మయూఖము - 6

చిత్రం
ఇంద్రచాపమనే ఈ బ్లాగును సంధించి చాలా రోజులయ్యింది. అసలు ఈ బ్లాగు, రాత, తాపత్రయమూ వదిలేసి పారేసేంత విరక్తి. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో చాపల్యం కుడుతుంది. నాలో లక్ష లోపాలు ఉండవచ్చు గాక. ఓ పది ఎన్నదగిన గుణాలు ఉండొచ్చునేమో కదా. అలా ఉంచితే సంస్కృతం ఎవరికీ కాబట్టని రోజుల్లో ఏదో ఆ భాష గురించి తెలిసినది రాస్తే, అది ఏదో పొద్దు ఎవరికైనా పనికొస్తుందేమో కదా అని.  అప్పుడే ఇలా భూత్ బంగళా గోడలపై బొగ్గుతో గీసిన రాతలాంటి రాత. ఈ మయూఖాన్ని ప్రసరింపజేసిన కవి ధర్మసూరి. ధర్మసూరి అన్న కవి వారణాసి వాస్తవ్యుడు. యజుర్వేదీకుడు. కాలం తెలియదు. ఆయన నరకాసురవిజయం అనే వ్యాయోగాన్ని రచించాడు. వ్యాయోగం అనేది దశరూపకాల్లో ఒకానొక రూపకభేదం. వ్యాయోగం - ఏకాంకిక అయి ఉండాలి. నాయకుడు ధీరోద్ధతుడు కావాలి. ధీరోద్ధతుడు అంటే వికత్థనుడు, (వికత్థనుడు అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాడు) అహంభావి. స్త్రీపాత్రలు తక్కువగా ఉండాలి. ఈ వ్యాయోగంలో పెద్దగా కథాభాగం ఏదీ లేదు. నాయకుడు శ్రీకృష్ణుడు. ఆయన సత్యభామతో కలిసి నరకాసురునితో పోరడం, అందులో గెలుపొందడం రూపక ఇతివృత్తం. తను చేయబోతున్న యుద్ధం తన సుతునితోనే అని భూదేవి అవతారమైన సత్యాదేవికి పాపం...