పోస్ట్‌లు

ఏప్రిల్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మయూఖము - 4

సంస్కృతకవులలో దండి, క్షేమేంద్రుడు, ఆనందవర్ధనుడు, జగన్నాథపండితుడు ఇత్యాదులనేకులు కవులే కాక లాక్షణికులు కూడానూ. ఆ మాటకొస్తే కవులందరున్నూ లాక్షణికులేననుకోండి. ఎంతో కొంత లక్షణలక్ష్యాలు తెలిస్తేనే కదా కవిత్వరచన అంటూ కొనసాగేది?  అయితే ప్రత్యేకంగా లక్షణగ్రంథాల్లో కవిత్వలక్షణాలు చెప్పటం వేరు, కవిత్వలక్షణాలను కావ్యంలో సందర్భానుసారంగా, ప్రాస్తావికంగా చెప్పటం వేరు. అప్పుడప్పుడూ కొందరు కవులు తమ కావ్యాలలో ’కవిత్వం’ గురించి ప్రస్తావించటం కద్దు. అలాంటి సందర్భం మాఘుని శిశుపాలవధమ్ ద్వితీయసర్గలో ఉంది.  చేదిదేశపు రాజైన శిశుపాలుడు యాదవులపాలిట, సన్మార్గుల పాలిట కంటకంగా అయినాడు. రావణాసురుడే తిరిగి ద్వాపర యుగాన శిశుపాలుడిగా జన్మించాడేమో అన్నంతగా విషమకృత్యాలు చేస్తున్నాడు. శిశుపాలుని ఏ విధంగా ఎదుర్కోవాలని వాసుదేవుడు బలరామునితోనూ, ఉద్దవునితోనూ మంత్రాంగం చేయనెంచినాడు. ఆతడిపై దండెత్తి జయించాలని, ఇదే తగిన సమయమని సారాంశంగా బలరాముడు చెప్పాడు. ఆపై ఉద్దవుని సంభాషణ సాగింది. శత్రువుల బలాబలాలను, సామర్థ్యాన్ని మొదట తెలిసికొమ్మని ఉద్దవుని సారాంశం. ఈ విషయాన్ని చెబుతూ, మధ్యలో ఉద్ధవుని ద్వారా కవి (మాఘుడు) చెప్ప...