పోస్ట్‌లు

మార్చి, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

భారతదేశ అస్తవ్యస్త చరిత్ర - మౌలిక ప్రాతిపదికలు - ప్రశ్నలు

చిత్రం
ప్రపంచ దేశాల్లో ఏ దేశానికైనా ఓ చరిత్ర ఉంటుంది. అది కాస్తో కూస్తో పదిలంగా, నిర్దుష్టంగా ఓ క్రమరూపాన్ని సంతరించుకుని ఉండటానికి ఆయా దేశ చారిత్రకులు శతాబ్దాలుగా పాటుపడ్డం చరిత్రలో జరిగింది.  దురదృష్టవశాత్తూ ఆధునిక భారతదేశంలో మాత్రం కనీసం రెండు (రెండున్నర అనవచ్చు) విభిన్నమైన, సమాంతరమైన చరిత్రలు ఏర్పడి ఉన్నాయి. ముఖ్యంగా క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం ఐదవ శతాబ్దం వరకూ ఏర్పడిన చరిత్ర విషయంలో ఈ సమాంతర చరిత్రలు నెలకొని ఉన్నాయి..  చిన్న ఉదాహరణగా కాళిదాసు కాలాన్ని పరిశీలిద్దాం. భారతదేశంలో పూర్వం కాళిదాసు అనే కవి ఉండేవాడు. ఆయనది ఖచ్చితంగా ఆరవ శతాబ్దానికి పూర్వం. ఎందుకంటే ఐహోళె (కర్ణాటక) లో బాదామి చాళుక్యుల నాటి శాసనంలో ఆయన పేరు పేర్కొనబడి ఉంది కాబట్టి. ఆ కవికి సంబంధించి భౌతికంగా కనిపించిన ఓ ఖచ్చితమైన ఆధారం అదొక్కటే కాబట్టి. ఈ నేపథ్యంలో  దొరికిన ప్రమాణాలను, తన్మూలంగా నిర్మించుకున్న భిన్న వాదాలను అనుసరించి కాళిదాసు యొక్క కాలాన్ని విభిన్నమైన చరిత్రలుగా వింగడించవచ్చు. క్రీ.పూర్వం ఒకటవ శతాబ్దానికి చెంది ఉండవచ్చు. - Version 1.  క్రీ.శ. నాలుగవ శతాబ్దానికి ఈవలి వాడు - Version...