పోస్ట్‌లు

అక్టోబర్, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

విజయనగర వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం ఎంత?

చిత్రం
“రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం” ఈ శీర్షికతో ఈమాట లో ఓ వ్యాసం వచ్చింది. ఆ విషయానికి సంబంధించి సోషియల్ మీడియాలో ఈ వ్యాసంపై చిన్న చర్చ వచ్చి ఈ విస్తృత వ్యాఖ్య వ్రాయవలసి వచ్చింది. కబాయి, కుళాయి అన్న రెండు వస్త్రవిశేషాలను పట్టుకుని, హిందూరాయసురత్రాణ శబ్దాన్ని వాడుకుని ఇస్లామీయకరణ అనే బరువైన శబ్దాన్ని వాడుతూ చివరికి విజయనగర సామ్రాజ్య అస్తిత్వమే మహమ్మదీయుల అనుమతితో నిలబడిందన్న ధ్వనితో వ్యాసకర్త చాలా తెలివిగా వ్యాసాన్ని అల్లారు. అబ్దుల్ రజాక్ క్రోనికల్స్ ఒక్కటే చరిత్ర చిత్రణకు ప్రామాణికం కాజాలదు. అయినా అతని పుస్తకం లోని ఒక ఉదంతాన్ని ఆకరంగా చేసుకుని ఈ వ్యాసకర్త మరిన్ని ఊహలు కట్టారు!  ఆశ్చర్యం. మతరహిత ఇస్లామీయకరణతో మొదలైన వ్యాసం, దుస్తుల వెనుక మతపరమైన కారణాలను అన్వేషిస్తూ, ఊహిస్తూ, చివరకు వచ్చే సరికి ఒక అనూహ్య ప్రతిపాదనకు దారితీసింది.  ఈమాట వ్యాసంలో కొన్ని అనుమానాస్పదమైన విషయాలను ప్రస్తుతం ఉటంకిస్తాను. మొదటగా కుళ్ళాయి గురించి. వ్యాసంలో రచయిత ఫిలిప్ వాగ్నర్ - కుళ్ళాయిని ఈ విధంగా నిర్వచించాడు. >>ఇస్లామీయకరణలో భాగంగా ఒక...